Thursday, May 22, 2014

మోడీ (భూ) కంపం !




శ్రీమాన్ మోడీ గారి ఎలెక్షన్ వేవ్ మోడీ త్సునామి గా మీడియా వాళ్ళు వర్ణించారు . మోడీ త్సునామి ఏమో గాని మోడీ గారికి భూ కంపానికి దోస్తీ చాలా ఉన్నట్టు ఉన్నది .

మోడీ గారు గుజరాత్ అసెంబ్లీ ని తాకితే భూకంపం గుజరాత్ ని తాకింది .

ఇప్పుడు మోడీ గారు పార్లమెంట్ ని తాకితే భూకంపం దేశం లో మొదలయ్యింది

వీటి రెండింటి కనెక్షన్ ఏమిటి చెప్మా ?

భూ కంపానికి మోడీ కంపానికి సామీప్యత సారూప్యత  ఏమిటి ?

నిన్నటి రేతిరి  భూకంపాన్ని సునామి వార్నింగ్ సిస్టం కనబెట్ట లేక పోయిందని మీడియా ఉవాచ !

మోడీ త్సునామి దేశం లో కాంగ్రేసు రూపు రేఖ లని మార్చేస్తుందని మీడియా మాత్రం క్రితం సంవత్సరం కనబెట్ట గలిగిందా మరి ? ఈ సంవత్సరం లోనే కదా మీడియా నిద్ర లేచింది ?

చూద్దాం ఇంకా ఏమేమి వస్తాయో మరి

గుజరాత్ అసెంబ్లీ లో కాంగ్రేసు అధి నాయకుడు మోడీ గారికి రామ్ మందిరాన్ని కట్ట మని సెలవిచ్చారు ! ! ఆహా కాంగ్రేసు తిరకాసుల్లో ఇది మరోక్కటా మరి ?


జిలేబి 

Wednesday, May 21, 2014

మోడీ 'పరిశ్రమ యజ్ఞ' ముహూర్త బలం - May 26 2014 6.00 PM


మోడీ 'పరిశ్రమ యజ్ఞ'  ముహూర్త బలం - May 26 2014 6.00 PM

ఏమోయ్ జిలేబి , ఎలక్షన్స్ అయిపోయాయి గా , ఇంకా ఏమిటీ మరీ బిజీ గా ఉన్నావు ? అయ్యరు గారు ప్రశ్నించేరు .

ఆ ఏముంది లెండి అన్నా

ఏమీ లేక పోతే అట్లా సీరియస్ గా ఎందుకున్నావోయ్ ? మళ్ళీ ఎగ ద్రోపు

సర్లెండి .. మీకు మీరే మాకు మేమే చెప్పా

ఏమిటో ?

మోడీ గారు నిన్న పార్లమెంటు లో  మాట్లాడుతూ పరిశ్రమ యజ్ఞం అన్నారండీ !
ఆ పరిశ్రమ యజ్ఞానికి నాందీ గా MAY 26 2014 సాయంత్రం 6.00 గంటలకి పదవీ స్వీకారం చేస్తారట !

సరే ఐతే ఏమిటి ?

ఇంతకీ ఈ సమయానికి ముహూర్త బలం ఎట్లా ఉందొ చూద్దామని చూస్తున్నా !

దేశం అరవై ఏళ్ల పై బడ్డ ముదిత . నువ్వేమో దేశానికి దరిదాపుల్లో పోటీ పడుతున్నావు . మరి ఇట్లా ఈ హాఫ్ సెంచురీ దాటిన సమయం లో ఇట్లా ముహూర్త బలం చూస్తే ప్రయోజనం ఉంటుం దంటావా ? అయ్యరు గారు కొచ్చ నించేరు

ఏమిటో మరి మా చాదస్తం మాది చెప్పా ముహూర్తాన్ని ఢిల్లీ సమయానికి చూడాలా లేక దేశ సమయానికి చూడాలా అన్న  మీమాంస లో పడుతూ !

ఇంతకీ మీరేమంటారు ? ముహూర్త బలం ఎట్లా ఉందంటారు ?

శుక్ర మహా దశ దేశానికి 2013 నించి 2033 దాకా మరి !


శుభోదయం
జిలేబి 

Tuesday, May 20, 2014

మోడీ వర్సెస్ దీదీస్ !!


మోడీ వర్సెస్ దీదీస్ !!
 
నారీ నారీ నడుమ మురారి !
 
దాయమందున సముదాయమ్ముగా పందె
మొడ్డి మోదికి గెలు పొనరజేసి
తెలిసి తెలిసి తలను   దీదీల నెక్కించి
తివిరి చెక్కు పెట్టు దేశ మిద్ది !!
 
(కంది శంకరయ్య గారి పద్య రూపం!)
 
 
దాయమున పందెము కాచి 
సముదాయము మోదీ ని గెలిపించి 
దీదీ లను తల నెక్కించి 
సరి 'చెక్' పెట్టుకున్న దేశమిది  !
 
 
జిలేబి 
 

Sunday, May 18, 2014

Gujarath vs Gujarath!


What it means to be Gujarath?
 
What more India needs
 
from the Good Governance?
 
 
 
No Cheers
Zilebi

Saturday, May 17, 2014

300+ Cheers to Modi - मस्त - ON !


300+ Cheers to Modi - मस्त - ON !
 
భారత భాగ్య విధాత - వందే మాత 'రామ్' !

 
Photo Courtesy: The Hindu.com

 
చీర్స్
 
జిలేబి 

Friday, May 16, 2014

జిలేబి ల లెక్ఖ ఇవ్వాళ ఖరార్ - మోడీ దేశానికి జోడీ యా ?

జిలేబి ల లెక్ఖ ఇవ్వాళ ఖరార్ - మోడీ దేశానికి జోడీ యా ?

శుభోదయం

మోడీ సస్పెన్స్ కి  సెన్సేషన్ కి ఇవ్వాళ తెర తీయడం జరుగు తుంది ! మోడీ దేశానికి సరియైన జోడీ యా అన్నది ఇవ్వాళ్టి సాయంత్రం లోపు మనకు తెలియ వస్తుంది

దేశ పరిణామ అవస్థ లో మరో ఘట్టం మొదలయ్యే రోజు ఇవ్వాళ . దేశానికి సవాలే సవాల్ అని పించిన 'రాం' భరోసా ఎన్నికల ఫలితాలు  దేశ చరిత్ర ని తిరిగి రాయ బోతుందా ?

లేక ఇది మరో మీడియా డ్రామా యా అన్నదానికి ఇవ్వాళే మరి జవాబు దొరుకు తుంది

సరే సందులో సడేమియా , జిలేబి ఇవ్వాళ్టి మేళా కి ఒక టపా కొట్టి (కట్టి) పడెయ్యా లని ఎలక్షన్ ల హడావిడి లో బూతుల (పోలింగు) నిర్వహణ లో బిజీ ఐన హడావిడి లో నించి మళ్ళీ బయట పడి స్వంతం గా రాసుకుంటోంది

బ్లాగ్ దేశ వాసుల్లారా ! విజయం చేయండి జిలేబి టపా కి లైకు లు కొట్టండి !


శుభోదయం
మోడీయ జిలేబియం !

Tuesday, May 13, 2014

భావి భారత ప్రధాని నరేంద్ర మోడి - ఆధ్యాత్మిక ప్రసంగం

భాజపా ఉక్త భావి భారత ప్రధాని - నరేంద్ర మోడి - ఆధ్యాత్మిక ప్రసంగం 

ఆది భౌతికమే కాదు ఆధ్యాత్మిక ప్రసంగమూ 
'
నమో' కి కరతలామలకమే
 
సత్తే పే సత్తా అనిపిస్తున్న 

భావి భారత ప్రధాని నరేంద్ర మోడి
 
ఆధ్యాత్మిక ప్రసంగం -

మోడీ వారి

'శాస్త్రోపన్యాసం ' -

శస్త్రోపన్యాసం -
 
చాగంటి వారిని తలపిస్తున్న 

రామాయణ ఉపన్యాసం

 
శుభోదయం 
జిలేబి 

Saturday, May 10, 2014

అంతర్యామిన్ ఎక్కడ ఉన్నాడు - భాగం ఐదు


అంతర్యామిన్ ఎక్కడ ఉన్నాడు - భాగం ఐదు (అన్నపూర్ణోపనిషత్)

అన్నపూర్ణ ఉపనిషత్ ఇది కొంత పెద్దదైన ఉపనిషత్

ఇందులో ఐదు అధ్యాయాలు ఉన్నాయి.

మొదటి అధ్యాయం -->

నిదాఘ అనబడే యోగీంద్రుడికి ఋబు మహర్షి కి మధ్య ప్రశ్నోత్తర సంవాదం లా ఈ
ఉపనిషత్తు చెప్ప బడి ఉన్నది

నిదాఘ యోగీంద్రుడు ఎవరు ? ఋబు ఎవరు అన్నది పరిశోధించి తెలుసుకోవలసిన విషయం అని పిస్తుంది

నిదాఘుడు ఋబు మహర్షి కి నమస్కరించి --> ఆత్మ తత్వాన్ని గురించి తెలుపమని అడిగి ఆ పై
బ్రహ్మ తత్వాన్ని ప్రాప్తించు కోవడానికి ఏ లాంటి ఉపాసన చెయ్యాలో కూడా చెప్ప మని కోరుతాడు .


ఋబు అంటాడు --> నిదాఘ ఈ మహావిద్య మోక్ష సామ్రాజ్య దాయిని . నువ్వు కృతార్థుడవు . ఈ విద్య
సనాతన మైనది విను అంటూ మొదటి అధ్యాయంలో ఋబు ఈ 'మహా విద్య' గురించి చెబుతాడు . "దీని విజ్ఞానం మాత్ర చేతనే జీవన్ముక్తుడవు కాగలవు'

మహా విద్యాం మోక్ష సామ్రాజ్యదాయినీం - విద్యాం సనాతనీం

"మూల శృంగాట మధ్యస్థా బిందు నాద కళాశ్రయ
యస్యా విజ్ఞాన మాత్రేణ జీవన్ముక్తో భవిష్యసి " !


ఋబు మహర్షి తన తండ్రి చేత చెప్పబడి అన్నపూర్ణ దేవిని ప్రార్థించి అన్నపూర్ణ కటాక్షము గావిస్తే -- తల్లీ ఆత్మ తత్వాన్ని తెలుప మని ఆడుగు తాడు --> తల్లి తధాస్తు అంటే తద్వారా --> 'జగద్వైచిత్ర దర్శనమ్' తన మతి లో ఉత్పన్న మవుతుంది . ఆ తల్లి ఏదైతే నాకు తెలియ బరచినదో ఆదాఘ అదే నేను నీకు తెలియ బరుస్తున్నాను అంటాడు ఋబు ఆదాఘ తో

(అన్న పూర్ణ ఉపాసన తో తనకు కలిగిన అంతరజ్ఞానం ఋబువు ఆదాఘ కి తెలియ బరచినది గా అర్థం చేసుకోవచ్చు )

ఆ జ్ఞానం ఏమిటి ? -->

పంచ విధములైన భ్రమలు ఉన్నవి అన్నవి తెలుసు కోవడం ; అవి భ్రమలే అన్నవి అర్థం చేసుకోవడం ; తద్వారా డానికి పైనున్న స్థితి ని చేరు కోవడం

===============
(The following concepts appear really highly philosophical)

పంచ విధ భ్రమలు --> వాటిని ఎట్లా అర్థం చేసుకుని ఆ భ్రమలని నివృత్తి చేసుకోవడం ? 

ఒకటి --> జీవుడు ఈశ్వరుడు వేర్వేరు అన్నది మొదటి భ్రమ --> నివృత్తి --> ఇది బింబము ప్రతి బింబము అన్న 'దర్శనము' చేత ఇది నివృత్తి అవుతుంది ;

రెండు --> ఆత్మనిష్టం కర్త్రు గుణం వాస్తవం (?) --> ఆత్మ కి గుణములు ఉన్నవి అనుకోవడం(?) (attributes of agency dwelling in the Self appears to be real) రెండవ భ్రమ  ; దీనిని స్ఫటికలోహిత దర్శనము చేత నివృత్తి చేసు కోవచ్చు ( స్ఫటిక లింగాన్ని చేయడం లో సూక్ష్మత్వం ఇదేనా మరి ?)

మూడు --> జీవునికి తోడై మూడు శరీరములు ఉన్నవి అన్న భ్రమ (శరీరత్రయ సంయుక్త జీవః సంగీ) ; ఘటము లో ఉన్న ఆకాశం మహాకాశం (ఘటమటాకాశ దర్శనేన !) ఒక్కటే అన్న దర్శనము చేత ఈ మూడవ భ్రమ నివృత్తి 

నాలుగవది --> జగత్తు దాని కి కారణ మైనది మార్చ వచ్చు  అన్న భ్రమ (?--> world-cause (God) to be mutable) జగత్కారణ రూపస్య వికారిత్వం --> కనక రుచక దర్శనము చేత ఈ భ్రమ ని నివృత్తి చేసు కోవచ్చు ==> కనక రుచక దర్శనము అనగా ఏమిటి ? (ornaments of gold are nothing but forms of gold?)

ఐదవది --> కారణమునకు భిన్నమైనది జగత్తు అన్న సత్యం ఒక భ్రమ --> కారణాత్ భిన్న జగతః సత్యత్వం పంచమో భ్రమః!) రజ్జు సర్ప దర్శనము చేత ఇది నివృత్తి చేసు కోవచ్చు

============

ఇది విన్న నిదాఘుడు ఋబు నికి  ప్రణ మిల్లి ఈ బ్రహ్మ విద్య విజ్ఞానాన్ని తనకు తెలుపమని అడుగుతాడు . ఋబువు మళ్ళీ చెప్పడం మొదలెడతాడు .

మహా కర్తవై , మహాభోగివై , మహా త్యాగి వై స్వస్వరూప అనుసంధానం గావించి సుఖముగా జీవించు అంటాడు ! -->

నిత్యోదితం , విమలం, ఆద్యం అనత రూపం బ్రహాస్మి అన్న భావన తో ఉండు .

ఏది చూసినా అది అక్కడ లేదు అన్న భావన తో ఉండు ( నేతి నేతి !) (యదిదం దృశ్యతే తత్ తత్ న ఆస్తి ఇతి భావయ !) 

అంతే కాకుండా దేని నైతే చూడ లేవో (ఇంద్రియా లకి ఆవల ఉన్నది ) దానికై ప్రయత్నించు -->

అవినాశి , చిదాకాశం , సర్వాత్మకం, అఖండితం , నీరంధ్రం , భూరివాశేషం , ఇవన్నీ నేనే (తదస్మీ ఇతి భావయ !)
అన్న భావన తో ఉండు ;

ఎప్పుడైతే చిత్తము అభావ అంత్య భావన తో  నిండి ఉంటుందో  ( When the mind dwindles by the contemplation on that non-perceivable) అప్పుడది సామాన్య మైన చిత్తాన్ని అధిగమించి 'సత్' సమాన' చిత్త మవుతుంది

( The mind by contemplation on that infinite starts to become resembling that infinite?)  ;

ఆ పై సమాధి స్థితి ; అందులో నే ఐక్యమై ఉండటం జరుగు తుందని  తెలుసుకో !

అన్న పూర్ణ ఉపనిషత్ -- సంస్కృతం

అన్న పూర్ణ ఉపనిషత్ ఆంగ్లానువాదం


అఖిలం ఇదం అనంతం అనంతమాత్వ తత్త్వం !
దృఢ పరిణామిని చేతసి స్థితో అంతః !
బహిరూప శమితే చరాచర ఆత్మా
స్వయం అనుభూయత్ దేవ దేవః !!
 
 
శుభోదయం
జిలేబి




 

Thursday, May 8, 2014

విజయం మాదే ! - 'ఒన్ డే' మాత్రమే' !!

విజయం మాదే ! -
 
'ఒన్ డే' మాత్రమే' !!
 
 
చీర్స్
టు
జిలేబి

Saturday, May 3, 2014

అంతర్యామిన్ ఎక్కడ ఉన్నాడు ? - భాగం నాలుగు

 
అంతర్యామిన్ ఎక్కడ ఉన్నాడు ?  - భాగం నాలుగు - అద్వయ తారక ఉపనిషత్


ఈ అద్వయ తారక ఉపనిషత్ 'ఉపనిషత్ బ్రహ్మ యోగి' విరచితం అన్న వాక్యం తో మొదలవు తుంది

ఈ 'ఉపనిషత్ బ్రహ్మ యోగి ఎవరు అన్నది పరిశోధించి తెలుసు కోవలసిన విషయం

ఇక ఈ ఉపనిషత్ కి శ్రీమద్ అప్పయ శివాచార్య అనే వారు భాష్యం వ్రాసి ఉన్నారు . ఈ అప్పయ శివాచార్య ఎవరు ? అప్పయ దీక్షితులు గారా అన్నది తెలియదు ( స్వామీ శివానందా - డివైన్ లైఫ్ సొసైటీ సంస్థాపకులైన స్వామీ శివానందా వారి పూర్వులు  అప్పయ దీక్షితులు అనబడే వారు ఒకరు ఉన్నారు  ) ఒక చోట ఈ అప్పయ శివాచార్యుల వారు , సుందరేశ్వర తాతాచార్యుల వారి శిక్ష్యులని ఈ ఉపనిషత్ భాష్యం లో ఆఖరులో చెప్ప బడి ఉన్నది .


ఈ అద్వయ తారక ఉపనిషత్ శుక్ల యజుర్వేదం లోనిది

జితేంద్రియాయ శమాది షడ్గుణ పూర్ణాయ !

(జితేంద్రియ ములు --> శమ, దమ ఉపరతి, తితీక్ష , సమాధాన , శ్రద్ధ )

(The six virtues praised in Vedantic circles are quiescence (shama), restraint (dama) of the senses, cessation (uparati) of desire or worldly activity, endurance (titiksha), collectedness (samadhana), and faith (shraddha))

ద్వైతాసంభవ విజ్ఞాన సంసిద్ధాత్ అద్వయ తారకం !

రాజయోగ సర్వస్యాన్ని ప్రకటించే ఉపనిషత్ ఇది  ( రాజ యోగ సర్వస్వం ప్రకటయంతి )

యత్ర్హ స్వాతిరేకేణ ద్వయం న విద్యతే తత్ అద్వయం బ్రహ్మ --- ద్వయం దాటితే అద్వయ బ్రహ్మ !


"భ్రూదహరాత్ ఉపరి సచ్చిదానంద తేజః కూటరూపం పరం బ్రహ్మ"

భ్రూదహరాత్  ఉపరి --> భ్రువోర్ ఉపరి --> భ్రు పైన --> (chit lake?)

కూట రూపం లో  పరంబ్రహ్మ సచ్చిదానంద తేజం తో కంటి రెప్పల పై భాగం (ఫాల బాగం) లో ఉన్నట్టు అను కోవచ్చు .

అద్వయ తారక పదార్థౌ గర్బజన్మ జరామరణ భయాత్ సం తారయతి తస్మాత్ తారకం ఇతి !
జీవేశ్వరౌ మాయికావితి విజ్ఞాయ సర్వ విశేషం నేతి నేతి ఇతి విహాయ యద్ అవశిష్యతే తత్ అద్వయం బ్రహ్మ !

By way of negation --> by principle of Neti--> What remains is advaya brahma


ఈ అద్వయ బ్రహ్మ ని సాక్షాత్కరించు కోవడానికి మూడు విధాలు (లక్ష్య లక్షణములు )  ఉన్నాయి

దేహ మధ్యే బ్రహ్మ నాడి సుషుమ్న సూర్యరూపిణి పూర్ణ చంద్రాభా వర్తతే

దేహ మధ్యమం లో సుషుమ్న అనబడే బ్రహ్మ నాడి సూర్య రూపిణి అయి పూర్ణ చంద్రుని ప్రకాశం తో ఉన్నది 

సా తు మూలాధార దారాభ్య బ్రహ్మ రంధ్ర గామిని భవతి !

ఆ సుషుమ్న నాడి మూలాధారం నించి బ్రహ్మ  రంధ్రం దాకా ఉన్నది

తన్మధ్యే తటిత్కోటి సమాన కాంత్యా మృణాల సూత్రవత్ సుక్ష్మాంగీ కుందలిని ఇతి ప్రసిద్ధా ఆస్తి !

దాని మధ్య లో - తటిత్కోటి సమాన కాంతుల తో -->
తామర తూడు (మృణాల సూత్రవత్ --> Fibre of a lotus stalk ) వలె,
అణువు  రూపం లో (సుక్ష్మాంగీ )
కుండలిని అని ప్రసిద్ధముగా పిలువ బడేది ఉన్నది

(సంస్కృతం లో కుందలిని --> కు ణ్ణ దలిని అని ఉన్నది --> తెలుగు లో ఈ కు ణ్ణ దలిని కుండలిని అయ్యిందనుకుంటా )

ఈ కుండలిని మనసులో చూడ గలిగితే ఆ మానవుడు ముక్తి ని పొందు తాడు !

ఫాల ఊర్ధ్వ గల లాట విశేష మండలే నిరంతరం తేజః తారక యోగ విస్ఫురణేన  పశ్యతి చేత్ సిద్దో భవతి !

ఫాల భాగ మండలం లో తేజస్సుని నిరంతరం చూడ గలిగిన వాడు సిద్ది కలిగిన వాడవు తాడు

తర్జన్యగ్రోన్మిలిత కర్ణ రంధ్ర ద్వయే తత్ర ఫూత్ కార శబ్దో జాయతే
తత్ర స్థితో మనసి చక్షుర్మధ్యగత నీల జ్యోతి స్థలం విలోక్య అంతః దృష్ట్యా నిరతిశయ సుఖం ప్రాప్నోతి !
ఏవం హృదయే పశ్యతి ఏవం అంతర్ లక్ష్య లక్షణం ముముక్షుభిరూపాస్యాం !


రెండు కర్ణ రంద్ర ముల మధ్య 'ఫు' కార శబ్దం ఉన్నది అక్కడ ఉన్న మనస్సు రెండు కన్నుల మధ్య
ఉన్న నీల జ్యోతి ( blue colored) స్థలాన్ని అంతర్ దృష్ట్యా చూసినవాడు నిరతిశయ సుఖాన్ని
పొందుతాడు -->

హృదయం లో దానిని చూడ గలుగుతాడు (ఈ హృదయే పశ్యతి అన్నది --> ఇదేదో మధ్యలో ఇరికించిన విధం గా అని పిస్తున్నది  !)

ఈ పై మూడు లక్ష్య లక్షణములు అంతర్ లక్ష్య లక్షణ ములు గా చెప్ప బడి ఉన్నది

ఈ ఉపనిషత్ లో మరో రెండు లక్ష్య లక్షణములు కూడా చెప్ప బడి ఉన్నది అవి ; బహిర్; మధ్య లక్ష్య లక్షణములు
మధ్య లక్షణ లక్ష్యముల లో ఆలోచింప దగ్గవి కొన్ని ఉన్నాయి .

బహిర్ ప్రపంచం లో ఉన్న సూర్య చంద్రుల రూపం మన కంటి లో ప్రతి బింబమై ఉన్నవి 

 బ్రహ్మాండం లో ఉన్న సూర్య చంద్రులు పిండాండ మైన శరీర శిరస్సులో ఉన్న ఆకాశం లో కూడా 'రవీందు' మండలం గా ఉన్నాయి

పరంబ్రహ్మ గురించి -->

తత్ బ్రహ్మ మనః సహకారి చక్షుషా అంతర్ దృష్ట్యా వేద్యతే !
ఏవం అమూర్తి తారక మపి !
మనోయుక్తెన చక్షుషైవ దహరాదికం వేద్యం !

In esoteric దహర is from the root dah meaning "to burn." It probably refers to the miniscule space at the heart, which from ancient times has been considered a locus of the effulgent transcendental Self. This dahara is also mentioned in the Kshurika Upanishad (10). 


అద్వయ తారక ఉపనిషత్ - సంస్కృతం

అద్వయ తారక ఉపనిషత్ - ఆంగ్లానువాదం

ఈ ఉపనిషత్తు లో గురువు యొక్క శబ్దార్థం ఉన్నది --> గు అనగా అంధకారం  రు అనగా నిరోధించడం --> అంధకారాన్ని (నిరోధించు వాడు ) పోగొట్టు వాడు గురువు అని చెప్ప వచ్చు

గురు శబ్దస్త్వ అంధకారః స్యాత్ రు శబ్దః తన్నిరోధకః 
అంధకార నిరోధిత్వాత్ గురిరిత్యాభిదీయతే !!



శుభోదయం
జిలేబి
అంధకార నిరోధిత్వాత్ గురిరిత్యాభిదీయతే !!