ఏమోయ్ జిలేబి పాత భోషాణా లన్నీ వెతుకు తున్నావ్ ? అడిగేరు మా అయ్యరు గారు
ఆయ్ నేను ఉద్యోగం లో చేరేటప్పుడు బిఏ ప్యాసని చెప్పా . నాకిప్పుడు సందేహం వస్తోంది . బీయే పాసయ్యానా లేదా అని అంటూ కనబడని కళ్ళ జోళ్ళ తో కనిపించీ కనిపించని కళ్ళ తో వెతకటం మొదలెట్టా .
మిస్సమ్మ కథ లో ఎస్వీ రంగారావు గారి కోరిక గుర్తు కొచ్చింది . బీయే ప్యాసైన భార్యా భర్తలు తన స్కూలికి కావాలని ఆ కాలం లో నే ఖరా ఖండి గా చెప్పేరు ! అంటే బీయే ఎంత గొప్ప చదువో మరి !
సర్లేవోయ్ , ఈ నీ వయసు లో ఆ ప్యాసో ఫెయిలో దాంతో నీకేమిటి ? అయ్యరు గారి పృచ్చ !
అరె, నేను ఇంకా రెండు మూడు సంవత్సరాల లో రిటైరు అయిపోతా . అప్పుడు నువ్వు బీయే ప్యాసు అయినావని ప్రూఫ్ తీసుకురా నీ పించను మంజూరు చేస్తామని చెబ్తే నా గతేం కాను ? మీరేమో హాయిగా ఇడ్లీ వ్యాపారం - హోటలు వ్యాపారం పెట్టేసుకుని బతికేసు కుంటూ ఉన్నారు . మరి నా మాట అట్లా కాదు కదా మరి ? ఇంకా ఈ సర్టిఫికేటు కానరాదేమిటి చెప్మా మరి ? అన్నా అయ్యరు గారితో
సర్లేవోయ్ , అవన్నీ వదిలి పెట్టు దర్శకేంద్రుడు రాఘవేంద్రుడు బీయే అని పెట్టు కుంటాడు కదా ? తను బీయే నా కాదా అని ఎవరైనా అడిగారా మరి ? ఆ పాటి దానికి నిన్నెవరు అడుగుతారు చెప్పు జిలేబి ? అయ్యరు గారు మళ్ళీ అడిగేరు
ఆ దర్శకేంద్రులు బీయే అయితే నేమి కాకుంటే ఏమి - నాభ్యాద్యంతం ఆయన కి వెన్న తో బెట్టిన విద్య - మన బడుగు జీవితాలు అలా కావే మరి చెప్పా
సర్లేవోయ్ బ్రాకెట్లో బీయే అని పెట్టేసు కో ! జిలేబి (బీయే) అని పెట్టేసు కో మరి సందేహం ఎవ్వరికీ రాదు మరి ! అయ్యరు గారు ఓ ఉచిత సలహా పారేసేరు.
అబ్బా ఇరాని కొట్లో చాయ్ లా మరీ బాగుందండోయ్ మీ ఈ సలహా ! చెప్పా - ఎంతైనా మా అయ్యరు గారి లా తెలివైన వాళ్ళు ఈ భూమి లో మరెవ్వరు లేరు సుమీ అని మురిసి పోతో !
సర్లేవోయ్ జిలేబి, ఈ నీ జిలేబి మాటల కేమి గాని కూసింత మా మొహాన కాఫీ పడెయ్య రాదూ అడిగేరు అయ్యరు గారు .
ఇకమీదట కాఫీ గీఫీ జాన్తా నయ్ అయ్యర్ వాళ్ ఓన్లీ ఇరానీ చాయ్ అంతే మరి చెప్పా !!
జిలేబి యా మజాకా మరి ! జిలేబి బ్రాకెట్లో బీయే మరి !!
జిలేబి