Friday, May 23, 2014

ముఖ పుస్తకానందా వర్సెస్ బ్లాగ్ జిలేబి !


ముఖ పుస్తకానందా వర్సెస్ బ్లాగ్ జిలేబి !


ఆ కోమలాంగి ట్వీటరీ దేవి స్వామి వారి సన్నిధి కి వెళ్ళే దారిలో మరో ఇద్దరు ముగ్గురు 'స్వామీ' సోదరీ సోదరులను పరిచయం చేసింది జిలేబి కి ...

వీరు పరివ్రాజ జీమైలానందా  వారు- మన ఆశ్రమ ఉత్తర ప్రత్యుత్తరా లన్నీ వీరే చూస్తూ ఉంటారు 
ఈవిడ అక్షరాముద్రితమాయి,

ఈ 'యంగ్' అశ్రమ వాసి ఇవ్వాళే స్వామీ వారు ఈవిడకి దీక్ష ఇచ్చేరు - పేరు గేలక్సీ పంచముఖీదేవి !

అబ్బా స్వామీ ముఖ పుస్తకానందా వారికి ఎంత 'జ్ఞాన మో '! ఆ ట్వీ ట రీ దేవి నిజ్జంగా బుగ్గన వేలు పెట్టు కోవడం ఒక్కటే తక్కువ మరి !

జిలేబి అదిరి పడింది. తాను పొరబాటున మళ్ళీ అంతర్జాలం లో కి వచ్చేసిందా ? అన్నీ మరీ తెలిసిన పేర్ల లాగే ఉన్నాయే మరి ?

ఆ ఈ హిమాలయాల్లో అస్సలు సెల్ ఫోన్ పని చేయని ప్రాంతాల్లో అంతర్జాలం ఎట్లా ఉంటుంది ? తనది భ్రమ ! అంతా విష్ణు మాయ ఈ పేర్లన్నీ తనకు తెలిసినవి లా ఉండడం కూడా మాయే !

తను ఈ మాయాజాలం నించి బయట పడ డానికే గదా హిమాలయానికి ఈ ఆశ్రమానికి వచ్చింది !?

మాడరన్ డెన్ ధ్యాన గుహ లో స్వామీ ముఖ పుస్తకానందా వారు తన 'wall' మీద కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని చిరునవ్వులు చిందిస్తూ చిద్విలాసంగా కూర్చుని ఉన్నారు 

'ఆహా స్వామి వారి ముఖం ఎంత 'తేట తెల్ల' గా ఉన్నది జిలేబి అబ్బుర పడింది . కొద్దిగా మరింత గమనికగా గమనిస్తే ఫేషియల్ చేసుకుని ఉన్నారేమో అని పించింది కూడాను మరీ మేకప్ వేసుకుని ఏమైనా ఉన్నారా ? అబ్బే అంతా విష్ణు మాయ ! అసలు తన బుర్ర సరి లేదు !

స్వామీ ముపు ఆనందా వారు చిరు నవ్వు నవ్వేరు ! - జిలేబీ మీరు ఇక్కడి వస్తారని నాకు తెలుసు !  చెప్పెరాయన .

వామ్మో ! ఈ స్వామీ మరీ త్రికాలవేది లా ఉన్నాడే ! తన పేరు కూడా ఈయనికి తెలుసు !

'మీరు ఇక్కడి కి రావడం అంతా 'పరదేవత' ఇచ్చ !' స్వామీ వారు చెప్పేరు ' నిన్నే మా కేంపస్ నించి ఒక ఎనభై ఏళ్ల అమెరికన్ భక్తుడు - బ్లాగా నందా అమెరికా వెళ్లి పోయేడు
తనకు 'ఫాదర్ లేండ్' చూడా లని ఉందని ' అప్పుడే అమ్మ చెప్పింది-నో ప్రాబ్లెం ముఖ్ పుస్తక్ బేటా - ఒక  old lady జిలేబి రేపే నీ చెంతకు వచ్చును ' అని !

జిలేబి ఈ త్రికాల వేదాన్ని విని సంతోష పడ్డది గాని , తన్ని old lady అనడం నచ్చలే !

ప్చ్ ప్చ్ ఇట్లా ఓల్డ్ అయిపోతూ ఉంటే ఎట్లా !

స్వామీ వారు ట్వీ ట రీ దేవిని దగ్గరకి పిలిచి చెప్పేడు  -  'ఈ జిలేబి కి మన ఆశ్రమాన్ని చూపించి ఆ పై ఆ బ్లాగు రూములో సెటిల్ అయి పొమ్మని చెప్పు , నిన్నటి నించి అస్సలు మన ఆశ్రమ బ్లాగు అప్డేట్ లేకుండా పోయింది , ఇది మరీ అర్జెంట్ ' అన్నాడు .

ఆ దేవి తిరిగి వస్తూం టే మళ్ళీ పిలిచి ఏదో గుస గుసలాడేడు -- అవి గుస గుసలా లేక ముద్దు ముచ్చట్లా అని జిలేబి కి సందేహం వచ్చినా ఛీ ఛీ ఇవన్నీ విష్ణు మాయ అంశాలే అనుకుంది .

జిలేబి కి వయసు ఎక్కువైనా ఇంకా చెవులు పాము చెవులే  స్వామీ వారి చుంబన మాటలు విన బడ్డేయి  'ట్వీటర్ దేవి--> ఈవిణ్ణి ఆ బ్లాగు రూమ్ నించి బయటకు రాకుండా చూసుకో ! మన ఆశ్రమం 'వృద్ధాశ్రమం ' అని పేరు వచ్చే బోతుంది I dont want that to happen --> we are youngish you know!" అన్నాడు !

జిలేబి అదిరి పడింది. స్వామీ వారితో ఏదో చెప్ప బోయింది .  స్వామీ వారు చేయి గుమ్మం వైపు చూపిస్తూ , యు ఆర్ డిశ్ మిస్డ్ అన్నాడు --> తన అపెల్ 'లేపతాపమును ' ఓపెన్ చేస్తూ !


హా హత విధీ అని జిలేబి మూర్చ పోయి బోరు మంది !


చీర్స్
జిలేబి

2 comments:

  1. యద్భావం తద్భవతి :)

    ReplyDelete
  2. లేపతాపము - ?Laptap kichchina telugaization:vahavaa!

    ReplyDelete