"ఈ ఒక్క జన్మ చాలు" అనబడు - "యాదృచ్చిక జిలేబి" ఆత్మ ఘోష !
ఏమోయ్ జిలేబి బర బరా గీకి పారేస్తున్నావ్ అదీ చెమటలు కారి పోతున్నాయి . అడిగేరు మా అయ్యరు గారు .
హు అన్నా హా అన్నా !
అదేమండి అయ్యర్ వాళ్ ! పోయే కాలం వచ్చేసింది ఇక అందుకే నా ఆత్మ కథ ని రాసి దేశం మీద తోలేసి, తాంబూలా లిచ్చేసా తన్నుకు చావండి లెవెల్ లో నా ఆత్మ కథ రాసి పడేస్తున్నా చెప్పా మా అయ్యరు గారికి
ఎందుకోయ్ జనాల మీద అంత కోపం నీకు
హు అన్నా హా అన్నా !
కాకుంటే మరి, నా లైఫు లో ఇట్లాంటి దేశం లో పుట్టి నేనింత జబరదస్త్ గా దేశానికి సేవ జేస్తే అసలు దేశం నా కేమిచ్చింది హుంకరించా
అందుకని?
అందుకే , 'ఈ ఒక్క జన్మ చాలు ' అన్న నా ఆత్మ కథా ఘోషని దేశం మీదకి తోల బోతున్నా ! చెప్పా
నువ్వు చచ్చేది కాక ఆ పుస్తకాన్ని పబ్లిష్ జేసి ఎన్ని చెట్లని చంప బోతున్నావో మరి - మా అయ్యరు గారు నిట్టూర్చేరు .
చెట్ల ని మాత్రమె కాదండోయ్, నా జీవిత పథం లో వచ్చిన ప్రతి ఒక్కరి భాగోతం బట్ట బయలు జేస్తా . నా ఆత్మ ఘోష కి నేనే హీరోయిన్ కాబట్టి ఆ కథ లో ఒక్కరే సిన్సియర్ ఐన వారు - అది నేనే నేనే నేనే . మిగిలిన వాళ్ళంతా నా ఘోషకి హాం ఫట్ అవ్వాల్సిందే !
ఇంతకీ నా గురించి ఏమి రాస్తున్నావే జిలేబి ?
మీ గురించా ! మీరు నన్ను జిలేబి ని జేసినారని వాపోతా చెప్పా మరో వంద పేజీల ఘోష ని రాసి పడేసి కుదేసి !
శుభోదయం
జిలేబి
దేశం లో ఇప్పుడు ఆత్మ ఘోష ల కాలం - ప్రతి ఒక్కరు ఘోషిస్తున్నారు - ఇక నేను కూడా 'ఘోషా' యిస్తా !!