దేవా కన రావా కరుణించి ... " ఓ కొత్త భక్తుడు ప్రార్థించడం మొదలెట్టాడు.
పైనున్న కనులు కనబడని, చెవులు వినిపించని దేవునికి హటాత్తు గా కళ్ళు కనిపించి, చెవులు వినిపించడం మొద లెట్టింది . హటాత్తు గా అనడం తప్పు. ఈ మానవ మాత్రుల తో 'లావాదేవీ లు మాట్లాడి మాట్లాడి ,దేవుడు కూడా బిజినెస్స్ అంటే ఏమిటో ఓ మోస్తరు అర్థం చేసుకున్నాడు . బిజినెస్స్ కి కావాల్సింది న్యూ బిజినెస్స్ అన్న సూత్రం అన్నది గ్రహించేడు . అంటే, తన బిజినెస్స్ బాగా నడవాలంటే , ఆల్వేస్ కొత్త బిజినెస్స్ ఉండా లన్నది ప్రాథమిక మౌళిక సూత్రం .
అందుకే కొత్త భక్తుడు ఎవడైనా కొంత గీ పెట్టినా చాలు - వెంటనే తన్ని కలవడానికి, తనతో భేటి ఇవ్వడానికి , అతను చెప్పే మాటలు విని వెంటనే వాడికి ఓ సౌలభ్యమైన 'సొల్యూషన్' ఇవ్వడానికి పై నున్న భగవంతుడు వెంటనే ఆతురత చూపిస్తాడు . అదే పాత భక్తుడైతే వాడు అరిచి గీ పెట్టినా అస్సలు పట్టించు కోడు - అట్లాస్ట్ దేవేరి ఏమైనా రెకమెండు చేస్తే , అప్పుడు పోనీ లే అని కొంత కరుణి స్తాడు !
తన ద్వార పాలకుణ్ణి పిలచి ఆ కొత్త భక్తుడి మొరని వినడానికి ఉద్యుక్తు డయ్యాడు
నీ పేరేమి నాయనా ! కరుణాంత రంగుడై అడిగాడు భగమంతుడు!
కొత్త భక్తుడు పేరు చెప్పాడు !
అరె, నా అవతారాల లో రెండు పేర్లు కలిపి పెట్తుకున్నావే ! మెచ్చు కోలు గా చూసేడు భగవంతుడు . ఈ బిజినెస్స్ టెక్నిక్ కూడా భగవంతుడు ఈ మానవ మాత్రుల వద్దనించే నేర్చుకున్నాడు - ఏదైనా సరే మొదటి అప్ప్రీ షిఎట్ చేయాలి ! కొంత పెప్పర్ కలిపి అనినా సరే యు ఆర్ హేండ్ సామ్ యు నో అనాలి !
కొత్త భక్తుడు చెప్పాడు - అది మా పేరెంట్స్ నాకు తగలెట్టిన పేరు - అసహ్యం గా ముఖం తిప్పేడు .
భగవంతుడు గతుక్కు మన్నాడు ! వీణ్ణి వదిలించు కోవటం బెటరు అనుకుని
భక్తా నీ కోరిక ఏమి ? అడిగాడు
దేవా, నేను దయ్యాల్ని నమ్మి కథలు గట్రా రాసేను . మొదట్లో సూపెర్ డూపెర్ అయ్యేయి అవి . ఆ పై అంతా ఫ్లాప్ షో ఐ పోయేయి . వీటికి కారణం నేను దెయ్యాల్ని నమ్మటం వల్లే నని నమ్మి , ఇక మీదట మారాలి అనుకుని నిన్ను నమ్మడం మొదలెట్టా చెప్పాడు భక్తుడు -- "నా కథలు, బ్లాగులు గట్రా సక్సెస్ అయ్యే మార్గం చెప్పు .
మళ్ళీ లావాదేవీయేనా భగవంతుడు దీర్ఘం గా ఆలోచించి చెప్పేడు -
భక్తా ! నీ మార్పు కి సంత సించి నాడను !
నీకూ దెయ్యాలకి ప్రారబ్ధ కర్మ అవశేషం ఇంకా తీరలేదు కాబట్టి నువ్వు దెయ్యాల గురించి ఇంకా ఇంకా రాస్తూనే ఉంటావు కాని ఇప్పుడు నన్ను నమ్మాలని వచ్చేవు కాబట్టి చెబుతా - ఇక మీదట దేవుణ్ణి నమ్మిన దెయ్యాల గురించి కథలు, బ్లాగు లు టపాలు గెలుకు అవి సూపేరు డూపెరు అవుతాయి
ధన్యోస్మి ధన్యోస్మి స్వామీ ! చెప్పేడు కొత్త భక్తుడు సంతోషం తో !
చీర్స్
జిలేబి