Wednesday, February 25, 2015

మానస 'రోవర్' !

మానస   'రోవర్' !
 
మానస సరోవరం లో
మునిగి తేలుతా మనుకుంటే
మానస 'రోవర్'
అయ్యింది !!
 
మా ,నస, రోవర్ !
 
 
 
శుభోదయం
జిలేబి

Monday, February 23, 2015

బింబం - ప్రతిబింబం

బింబం - ప్రతిబింబం
 
బింబాన్ని చూద్దామని
ప్రయత్నిస్తే
ప్రతిబింబం అడ్డు పడింది
పోనీ
ప్రతి బింబాన్ని చూద్దామని
ప్రయత్నిస్తే
మనః కల్లోలం లో
చెదిరి పోయింది !
 
పూర్ణమేవ పూర్ణ అవశిష్యతే ?
 
శుభోదయం
జిలేబి

Friday, February 20, 2015

భక్త అమర్ - జైన్ స్తోత్రం నించి ఒక స్తోత్ర గుళిక !

భక్తామర 
 
భక్త అమర్ - జైన్ స్తోత్రం నించి ఒక స్తోత్ర గుళిక !
 
భక్త అమర్ స్తోత్రం జైన్ ఆచార్య శ్రీ మానతుంగ ( 1100 AD around)  
 
త్వామవ్యయం విభుమచింత్యమసంఖ్యమాద్యం  
బ్రహ్మాణ మీశ్వర మనంతమనంగ కేతుమ్
యోగీశ్వరమ్ విదితయోగ మనేక మేకమ్ 
జ్ఞానస్వరూపమమలమ్ ప్రవదంతి సంతః !
 
 
త్వం అవ్యయం విభుం  అచింత్యం అసంఖ్యం ఆద్యం  
బ్రహ్మాణం ఈశ్వరం అనంతం అనంగకేతుమ్ 
యోగీశ్వరం విదిత యోగం అనేకం ఏకం 
జ్ఞాన స్వరూపం అమలం  (ఇతి) ప్ర వదంతి సంతః !!
 
त्वामव्ययं विभुमचिन्त्यमसंख्यामाद्यं
ब्रह्माणमीश्वरमनन्तमनगंकेतुम्|
योगीश्वरं विदितयोगनेकमेकं
ज्ञानस्वरुपममलं प्रवदन्ति सन्तः|24|
 
మొత్తం ఉన్నవి నలభై ఎనిమిది స్తొథ్రాలు. ఇందులో మధ్య నున్న ఇరవై నాలుగవ స్తోత్రం నాకు అనిపించిన హైలైట్ !
 
 
 
శుభోదయం 
జిలేబి 
 

Thursday, February 19, 2015

ప్రేమ సూత్రం !

ప్రేమ సూత్రం !
 
ప్రేమ అనే
నాజూకు  నూలు పోగుతో
నిన్నునాభీ కమలం గావిస్తే
మైకం వదిలి మమేకమై
ప్రేమా , సూత్రం,
నువ్వూ, నేనూ
అంతా గాయబ్ !!
 
 
శుభోదయం
జిలేబి

Wednesday, February 18, 2015

కదన కుతూహలం !

కదన కుతూహలం !
 
ధిమి తక ధిమి తక
అంటూ పదం పాదం  
కదం కదం తొక్కితే
కుతూహలం కోలాహలమై
హాలా హలమై మహార్ణవ మై
అంతరంగాన్ని హేల చేసి
బేల చేసి మనస్సుని
మాయ జేసి మదిని మేని చేసి
ఊయాలా జంపాలాలాడింది
 
!!!
 
 
శుభోదయం
జిలేబి  
 

Saturday, February 14, 2015

సన్నాసి బుట్టలో పడ్డాడు !। (వలంటీనోపాఖ్యానం)

సన్నాసి బుట్టలో పడ్డాడు !। (వలంటీనోపాఖ్యానం)
 
కాలా కాలం గా సన్నాసులు బుట్టలో పడటాన్ని కొనియాడే శుభ దినం సందర్భాన ఇవ్వాళ సన్నాసుల  వారి 'హార్నీ' కథా, బుట్ట బొమ్మ కథా తెలుసు కుందాం !

జిలేబీ పెళ్లి రోజు .

బుట్ట లో జిలేబీ ని పెట్టుకుని  వస్తూంటే , బుట్ట బొమ్మ లాంటి అమ్మాయి నాకు కాబోయే అర్ధాంగీ అని మురిసి పోయిన జంబు నాధన్ కృష్ణ స్వామీ అయ్యరు గారికి అవ్వాళ తెలిసి రాలే, బుట్టలో బొమ్మ పుత్తడి బొమ్మ కాదని, పేరు మాత్రమె జిలేబీ అని, తానె బుట్టలో బోల్తా పడ్డాడనీ నూ.

ఆ పై మూడు రాత్రుళ్ళు (ఈ మూడు రాత్రుళ్ళ ముచ్చట గురించి నేను చెప్పను బాబు మరీ సిగ్గు !) కానించిన తరువాయి శ్రీ అయ్యరు వారు 'జిలేబీ, మాంచి ఫిల్టరు కాఫీ ఒక్కటి పట్టుకు రావోయ్ " అంటే జిలేబీ బిక్క మొగం బెట్టి,
"అయ్యరు గారు,   మీకు వంట బాగా వచ్చనే బామ్మ నాకు చెప్పి నన్ను మిమ్మల్ని కట్టు కొమన్నారు " అని భాష్ప ధారా వాహినీ  మొగం పెడితే, వంశ పారంపర్యం గా వచ్చే అయ్యరు హోటలు వృత్తి ఇంట్లో కూడా వంట గాడేనా, గాదేనా నా గతీ , రాధా, నా జిలేబీ ఇది నీకు తగునా  సుమీ అని మా అయ్యరు వారు ఉసూరు మన్నారు !

ఈ మా పెళ్ళి ఈ సో కాల్డ్ యాదృచ్చికమో, కాక 'తాళీ' బలీయమో జంబూ వారికే తెలియాలి !

ఈ సన్యాసి బుట్టలో పడే కార్యక్రమము నే పెళ్లి దినాన అబ్బాయి వారి 'కాశీ యాత్ర ' గా  పరిగణించడం బట్టి తెలియ వస్తున్నది ఏమనగా, ఈ వాలం టీను దినం మన పూర్వ ప్రాచీన సాంప్రదాయ పద్ధతే అని,  దీనిని కాపీ క్యాటూ చేసి కాపీ లెఫ్టు చేసి  సంతు వాలం టీను దినము గా మార్చి వేసి నారని మనము విశ్వసించ వలె.  

అయ్యలారా, అమ్మలారా , ఇవ్వాళ సంక్తు వాలం  'టీన్' జరుపు కొనుడు అబ్బాయి లారా, అమ్మాయి లారా మీకందరికీ ఇదే శుభ కామనలు !

మీరు జంబూ అయితే, మీకు జిలేబీ ఖచ్చితం గా లభ్యమవు గాక!

తప్పి మీరు జిలేబీ అయితే, తప్పక ఎవడో ఓ సన్యాసి మీ బుట్టలో పడడం ఖాయం!

ఇంతటి తో ఈ సన్యాసి బుట్టలో పడ్డాడు అనబడు ఈ వాలంటీ 'నో' పాఖ్యానం పరి సమాప్తము !

ఇది చదివిన వారికి, వినిన వారికి చదివి వినిపించిన వారికందరికీ ఆ పద్మావతీ అలమేలు మంగా సమేత మా ఏడు కొండల పెరుమాళ్ళు (ఈయన రెండు మారులు బుట్టలో పడినట్టు ఉన్నాడు సుమీ !) సకల మంగళములు కలుగ జేయు గాక!

చీర్స్
ఫక్తు, జిలేబీ డే!

Friday, February 13, 2015

సూరీడు - తూరుపు - సూరీడు

సూరీడు - తూరుపు - సూరీడు
 
సూరీడు తూరుపున ఉదయిస్తాడా ?
తూరుపున సూరీడు ఉదయిస్తాడా ?
సూరీడు ఉదయించే దిక్కు తూరుపా ?
తూరుపు దిక్కు కాబట్టి సూరీడు ఉదయిస్తాడా ?
 
ఏకో న సత్ ?
ఏకో నః సత్ !
ఏకం సత్ ?
ఏకమేవ సత్ !!
 
శుభోదయం
జిలేబి

Thursday, February 12, 2015

స్వచ్చ అభియాన్ కి చీపురు తో స్వాగతం !




Photo Courtesy: The Hindu
 
స్వచ్చ అభియాన్ కి చీపురు తో స్వాగతం !

మోడీ గారిది దేశాన్ని శుభ్రం గా ఉంచాలన్న ది స్వచ్చ భారత్ అభియాన్ అయితే, డిల్లీ వారిది చీపురు తో దానికి శ్రీకారం చుడదామని సూపెర్బ్ మెజారిటీ తో అరవింద్ కేజ్రీ వాల్ ఆమ్ ఆద్మీ పార్టీ కి పట్టం గట్టి గెలుపు అందివ్వడం ఈ భారత దేశ అభ్యుదయాగ్రహ ప్రగతి పధం  లో మరో మలుపు - మరో నిర్ణయాత్మక ఘట్టం !

ఆమ్ ఆద్మీ తనకు వచ్చిన ఈ మరో అవకాశాన్ని, ప్రజలు విశ్వసించి ఇచ్చిన ఈ బాధ్యత ని పరిపూర్ణం గా నెరవేరుస్తా రని ఆశిస్తో

ఈ రాబోవు 'వాలంటీన్' దినం - అభ్యుదయ ప్రేమికుల దినం గా రాబోవు కాలానికి డిల్లీ అసెంబ్లీ పరిపూర్ణం గావిస్తుందని ఆశిస్తో


చీర్స్ సహిత
జిలేబి
 

Wednesday, February 4, 2015

అయ్యరు గారి తో కాఫీ విత్ జిలేబి !

అయ్యరు గారి తో కాఫీ విత్ జిలేబి !

పొద్దుట పెందరాళే లేచి చక్కగా సజాయించు కుని ఒద్దిక గా అయ్యరు గారి కాళ్ళ కి ముక్కోటి మార్లు మొక్కి వంటా వార్పూ కార్యక్రమం లో పడింది జిలేబి !

                                                        ఫోటో కర్టసీ గూగులాయ నమః !

అయ్యరు గారు నిద్ర లేచి 'కాలై కడంగల్' తీర్చుకుని సంధ్య వార్చి చేతిలో హిందూ పేపరు తెరిచిన ఆ క్షణా న జిలేబి నిండు ముత్తైదువ లా ముఖాన యాభై పైసల కుంకుమ్ బొట్టు తో చేతి లో ఘుమ ఘుమ లాడే కాఫీ కప్పుతో , అయ్యరు గారి ముందు ప్రత్యక్షమై 'స్వామీ' కాఫీ' అంది .

అయ్యరు గారు అదిరి పడేరు !

జిలేబి నువ్వేనా ! హాశ్చర్య పోయేరు !

అవును నాధా ! నేనే నేనే నేనే ముమ్మార్లు 'గణీల్' మని నొక్కి వక్కాణించి, జిలేబి, అయ్యరు గారి కాళ్ళకి మరో మారు నమస్కరించి , శ్రీ మహావిష్ణువు సమీపం లో లక్ష్మీ దేవేరి లా అయ్యరు గారి పక్కన ఆశీను రాలైంది .

స్వామీ !

ఏమీ ! ఈ వేళ ఏమైనా సూర్యుడు పడమట పొడిచినాడా జిలేబి ! అయ్యరు గారు మేళ మాడేరు !

స్వామీ ! నేటి నించి నేను మీ పద దాసీ ని . మీ పద పద్మ ముల చెంతనే నా జీవనము మళ్ళీ మరో మారు కాళ్ళకి మొక్కింది జిలేబి .

ఆహా ఏమి నా జీవన సౌభాగ్యము అని అయ్యరు గారు మురిసి , 'దేవీ జిలేబి ! ఏమి ఈ అకాల మార్పు ! పెళ్లి అయిన కొత్తల్లో ఎంత వినయ విధేయ తల తో నన్ను గోలిచినావో గుర్తు కోస్తోంది స్మీ ! అన్నారు అయ్యరు గారి తలని తలపై బొప్పిని తడివి చూసు కుంటూ ! అంతా కాల మహిమ !

స్వామీ ! నేను సతీ అనసూయ సావిత్రి వారల జీవన చరిత్రలను రేతిరి కి రేతిరి 'కాంతా' పాటం గా చదివా ! చెప్పింది జిలేబి మళ్ళీ స్వామీ వారి కాళ్ళకి మొక్క బోతూ !

అయ్యరు గారు అదిరి పడేరు ! ఇట్లా నిమిషానికి పదేసి మార్లు తన కాళ్ళకి ఈవిడ వందనాలర్పించు కుంటూ ఉంటె , తను ఎప్పుడు హిందూ పేపరు చదివేది !

స్వామీ ! ఇక మీదట నేను బ్లాగు లు గట్రా చదవను ! టపాలు వ్రాయను ! కామెంట్లు కొట్టను !" జిలేబి చెప్పింది !

జిలేబి నీలో ఇంత మార్పా ! అయ్యరు గారు నోరు వెళ్ళ బెట్టేరు .

అంతే స్వామీ అంతే! ఇక మీదట ఆ బ్లాగు లు గట్రా మీరే చదవండి మీ స్వరంలో వాటిని వింటూ నేను ఆనంద డోల లోఊయ లూగుతూ అట్లా పతి సేవలో తరి స్తాను ! కళ్ళ నిండు గా భాష్ప ధారా వాహిని అయి చెప్పింది జిలేబి . "అంతే కాదు స్వామీ , వాటి కి  కామెంట్ లు కూడా మీరే నా తరపున వ్రాయాలి "

వాట్ ! ఆ యూజ్ లెస్ బ్లాగులూ , పని లేక వ్రాసే వాళ్ళ బ్లాగు లు, కాలక్షేపం కోసం వ్రాసే కబుర్లు  నేను చదవాలా ! అయ్యరు గారు నిటారు గా అయ్యేరు ! - ఇట్లా నీకు బ్లాగు లు గట్రా నేను చదివితే , నేనెప్పుడు హిందూ పేపరు చదివేది ?

ఇక మీదట మీరు హిందూ పేపరు చదవద్దు స్వామీ నా కోరిక మీద ! మరో మారు కాళ్ళ కి నమస్కరిస్తూ విన్న వించు కున్నది జిలేబి .

అయ్యరు గారు ఈ మారు తటాల్ మని కాళ్ళు లాగేసు కున్నారు ఈ మారు ! ఆ మహా విష్ణువు లక్ష్మీ దేవేని సర్వ వేళ లా అట్లా కాలి దగ్గర ఎట్లా భరిస్తున్నాడో అని సందేహ పడి పోతూ .

అంతే కాదు స్వామీ ! ఇవ్వాల్టి నించి నేనే వంటా వార్పూ కూడా గమనిస్తా !

వాట్ మళ్ళీ అదిరి పడేరు అయ్యరు గారు . పెళ్లి కొత్తల్లో జిలేబి వంట రుచి ని గాంచి, సేవించి ఆస్పతాల్లో గడిపిన రోజులు వారి కళ్ళ ముందు కదులాడింది ! ఈ బాధ కన్నా వేరే ఏదైనా బాధ జీవితం లో ఉంటుందా మరి అనుకునేంత గా వారు బేజారై పడి పోయిన దినాలు కళ్ళ ముందు గిర గిరా తిరిగేయి !

జిలేబి ! నీ పతి ప్రాణములు నీకు వద్దా ! ఈ మారు సీరియస్ గా అడిగేరు అయ్యరు గారు !

అబ్బే, పతి ప్రాణములు ఎక్కడి పోతాయి స్వామీ ! మించి పోతే సతీ సావిత్రి లా ఆ యముడి తో నైనా పోరాడి మళ్ళీ నా కొంగు కి ముడి వేసేసు కోనూ ... రాత్రి చదివిన సావిత్రి కథ జోష్ లో రెండు వంద ల శాతం 'రాంభరోసా' తో  చెప్పింది జిలేబి .

వామ్మో ! ఏడు జన్మల్ బంధం  ఏడడు గుల బంధం అంటే ఇట్లా బందీ అవట మేనా ! అనుకుంటూ అయ్యరు గారు హటాత్తు గా వాలు కుర్చీ నించి లేచి కాషాయ వస్త్రాలు ధరించి హిమాలయం మార్గం పట్టేరు ఆ పాటి పెర్సనల్ స్పేస్ కూడా ఈ 'ఆండోళ్లు' మగాళ్ళ కి ఇవ్వకుంటా ఉంటె ఎట్లా అని ఆలోచిస్తో !

"స్వామీ ! స్వామీ ! పతియే ప్రత్యక్ష దైవం ! నేను మూడు పొద్దులా మీకు కాఫీ విత్ జిలేబి నైవేద్యం గావించి గాని పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టనని ఆన చేసేను ! నా బాస ఏమి గాను " అంటూ , గజేంద్ర మోక్షం ఘట్టం లో లక్ష్మీ దేవి లా అయ్యరు వెంట పడింది జిలేబి 'కాటి కి పోయినా నిన్ను నే వదలను స్వామీ' అంటూ !!



చీర్స్
జిలేబి

Tuesday, February 3, 2015

జిలేబి పురాణీ దేవీ యువతిహి !

జిలేబి పురాణీ దేవీ యువతిహి !

జిలేబి ఎవరు ?

జిలేబి వృద్ద మహిళ.

ఏమీ తోచక బ్లాగులో తచ్చట్లాడుతూంట్టుంది.

పనిలేక , పదవి విరమణ చేసిన పురుషులు,ఇంట్లో పెళ్ళానికి కూరలన్నా తరిగి ఉపయోగపడే పని చేస్తారు. జిలేబి ఇంట్లో పనులు ఎగ్గొట్టి బ్లాగులో కామెంట్లు ,టపాలు రాస్తుంది :)

అంతర్యామిన్ ఎక్కడ? బొటను వేలంత ఉన్నాడా? కొండంత ఉన్నాడా? చిటికెన వేలంత ఉన్నాడా? లోపల ఉన్నాడా? బయట ఉన్నాడా? తొంగున్నాడా? అని కాలక్షేపం పోస్ట్ లు రాస్తూంట్టుంది.

ఆవిడ లవకుశలో సూర్యకాంతం టైపు పతివ్రతా  శిరోమణి !!

మాతా (అప్పు తచ్చు - మాటా!) జిలేబి, భార్యకి భర్తే దైవము ! సతి సావిత్రి, సతి అనసూయ కథలు చదువుము !

మీ పక్కన ఉన్న అంతర్యామిన్ (అయ్యర్/భర్త)కాఫి అడుగుతున్నా పట్టించుకోకుండా,పస్తుబెడుతూ,సీరియస్ గా ఏడు భాగాల సీరిస్ రాస్తే ఏమి లాభం?

శ్యామలీయం, శర్మ,హరిబాబులు శ్వాస లెక్కలను కట్టి చెపుతూ కామెంట్లు రాయవచ్చు.

ఆహా, ఓహో అని మీపాండిత్యాన్ని మెచ్చుకోవచ్చు.

కాని మీకు మోక్షం కావాలంటే మాత్రం, పతియే ప్రత్యక్షదైవం అని సేవించుకోవటమే అన్నిటి కన్నా ఉత్తమమైన మార్గం.


ఇప్పటికైనా కళ్లు తెరచి,అయ్యర్ కి సేవలు చేసుకొని ఇహ పరాలను సాధించుకోతల్లి!

మొగుడికి సర్వస్య శరణాగతి అనుకొంటూ , ఎంత సేవ చేస్తే మోక్షానికి అంత దగ్గరగా వెళుతున్నట్లు అర్థం.

ఇకనైనా తక్కువగా బ్లాగి, భర్తకి ఎక్కువ సేవచేసుకొని మీ శేషజీవితాన్ని చరితార్ధం చేసుకో తల్లి! :)


చీర్స్
జిలేబి