ఓరీ బ్లాగార్భకా ! నీ పేరు జెప్పి శరణు వేడరా :)
ఈ మధ్య ఒకటి కని పెట్టా !
మనకి ఎక్కువ కామింటులు రావా లంటే అణా కి కొరగాని అనానిమస్సులకి పని జెప్పాలి !
అంటే మన బ్లాగు టపాలో అనానిమస్సు వారలకు ఆస్కారం కలి గించాలి !
(అట్లా అనా ని మస్సు లకి బ్లాగు టపా ఓపెన్ జేసి ,వాళ్ళు కామింటులు కొడితే, వాళ్ళని బట్టు కుని వీర వాయింపు వాయించాలి పూర్వ కాలం లో అయితే దీన్ని అడుసు తొక్క నేల కాళ్ళు కడుగ నేల అని హిత వాక్యములు జేప్పెదరు ! ఈ అంతర్జాల కాల వాహిని లో దీని కి సరి అయిన నిర్వచనం అది మరో 'ఆపెరేటింగ్ మోడల్ ' యూ నో :)
కాబట్టి బ్లాగు వీరు లారా, పేరు తో టే టపా కి కా మింటు పెట్టాలన్న రూల్ కి స్వస్తి వాచకం పలకాలని జిలేబి ఇదే అందరికి విన్నపాలు
అన్నా అనానిమస్సు మీ వేల్యు ఈ బ్లాగు లోకం గుర్తించడం లేదు : ) ఇదే జిలేబి నీ కిచ్చు బ్లాగ్ మర్యాద : నీ మీద ఒక టపా కట్టి ఇవ్వాళ్టి సరంజామా కట్టే స్తా ! నేటి కి మరో టపా కట్టేసా అన్న ఆనందం తో హాయిగా కాఫీ తాగేస్తా :)
అదేమిటో ఈ బ్లాగ్ లోకం లో అనానిమస్సు లంటే అంత చీత్కారం :)
ఒకా నొక కాలం లో పాపులర్ ఐన బ్లాగ్ రచయిత య రమణ గారి స్వకీయం ఉదాహరణ కి :
- Y.V.RamanaApr 22, 2013, 4:49:00 PM
- జిలేబి జీ,
టపాలకే కాపీరైట్ లేదు. 'కాపీరైట్ అనగా కాపీ కొట్టే రైట్' అని ముళ్ళపూడి (అనుకుంటా) అన్నాడు. ఇంక కామెంట్లకి కూడా కాపీరైటా!
(అయితే బ్లాగ్రాతలకి కామెంట్లు అత్యంత విలువైనవి. కొన్నిసార్లు కామెంట్ల కోసమే టపాలు రాస్తుంటాం. అదో తుత్తి!)
అట్లాంటి కామింట్ లు అనా ని మస్సులు కొడితే వోయ్ పేరు జెప్పి శరణు వేడవోయ్ అని చాలంజీ విసురుతాం !
పేరు జేప్పితే అంత ఫ్రీ గా 'ఒపీనియన్' వ్రాయలేమోయ్ అని అనా నిమస్సు వ్యధ చెందును :)
అందమైన రాక్షసి
రేతిరి కల లో కనబడ్డది !
మనకేమైనా
భయ్యమ్మా ?
కామెంట్ల కత్తి తో
దాన్ని కస మిస పొడి చేసా !
చీర్స్
జిలేబి