ఇక నేనూ నా బ్లాగు కొట్టు ని కట్టేస్తా !
ఇక మీదట నేనూ నా బ్లాగు కొట్టు ని కట్టేస్తా అయ్యర్ వాళ్ దీర్ఘం గా నిట్టూర్చి చెప్పా మా అయ్యరు గారితో .
జంబునాథన్ కృష్ణస్వామీ అయ్యరు గారు కనిపించని కళ్ళ తో కనిపించ డానికి ప్రయత్నం జేసే కళ్ళ జోళ్ళ తో దీర్ఘం గా నా వైపు చూసేరు .
వారి పెదవుల పై ము ము న .
ఎందుకు అట్లా ము ము న ? అడిగా ఉడికి పోతూ . ఈ మద్య సూరీడు మరీ చుర్రు మంటున్నాడు . ఆ పై బ్లాగర్లు కూడా మరీ మరీ చుర్రు చుర్రు మని పిస్తున్నారు .
ఇప్పటి కి ఇది ఎన్నో సారి జిలేబి ఇట్లా నువ్వు కొట్టు కట్టెయ్యటం గురించి చెప్పడం ? అడిగేరు అయ్యరు గారు .
వేళ్ళ తో లెక్క పెట్టడటం మొదలెట్టా ! నా తో బాటే కొట్టు కట్టేస్తా నని ప్రతినలు బూనిన వాళ్ళు ఒక్కరొక్కరు గా కట్టే సేరు టపా . ప్చ్ ప్చ్ నేను మాత్రం ఇదిగో అదిగో అంటున్నా !
లెక్ఖ తేలటం లే జెప్పా మా అయ్యరు గారితో .
ఈ మధ్య పని లేని రమణ బాబు గారు కూడా తమ టపా చాప చుట్టేసేరు చెప్పా మళ్ళీ .
పని లేక నే కదా ఏదో టీం పాస్ టైం పాస్ చెయ్యాలని టపాలు , బ్లాగులు గట్రా రాయటం మొదలెట్టేవు ? అడిగారు మా అయ్యారు గారు .
ఆయ్ ! పని లేక అని జెప్ప లేను గాని , పని ఎగ్గోట్టాలనే ఆలోచనలతో నే , అంటే వంటా వార్పూ గట్రా ఎగ్గొట్టా లనే 'సదుద్దేశం' తో, అంటే మరీ నేను బిజి బిజి సుమీ అని చెప్పు కోవాలనే అనుకుని మొదలెట్టా అని జెప్ప బోయి, బామ్మ గారు గుర్తు కొచ్చి, ఎంత తన 'మగ వాడైనా' స్త్రీ తన గుట్టు ని రట్టు చెయ్యకూడదు, జేస్తే మన వాల్యూ తక్కువై పోతుంది పిల్లా అని జెప్పిన బామ్మ వాక్యం వేద వాక్యం గుర్తు కొచ్చి
అబ్బే, అట్లా ఏమీ లేదు . ఏదో మనకు తెలిసిన విజ్ఞానం అందరికీ తెలియ బరుద్దా మని రాసా ' అని డబ్బా కొట్టాను .
అంటే ? ఇప్పుడు విజ్ఞానం అంతా అయి పోయినట్టా ? టపా చాప చుట్టే స్తా నంటు న్నావ్ ? అయ్యరు గారు రిటార్టు ఇచ్చేరు !
హమ్మో ! వీరు కాలికేస్తే మెడకి మెడకి వేస్తే కాలికి వేయ గలిగిన వారే అనుకున్నా లో లో పల .
దాన్ని గ్రహించి నట్టు ఉన్నారు అయ్యరు గారు - "ఇదిగో జిలేబి బ్లాగు మూట కట్టే య్యా లను కుంటే కట్టేయి . ఎవరూ ఏమీ బాధ పడరు లే ! జేప్పేరు .
ఎవరూ ఏమీ బాధ పడరా ? అడిగా బేల గా .
అవును నిఖార్సు గా చెప్పేరు అయ్యరు గారు .
అంటే నేను రాస్తూ ఉంటె నే వారికి బాధా మయం గా ఉంటుందా ? అడిగా ఈ మారు వారి కాలికేసే ముడి ఫార్ములా అప్లై జేస్తూ .
వారికి బాధో కాదో తెలీదు కాని కొంతటీం అండ్ టైం పాస్ జేయ్యడా నికి మరో శాల్తీ ఉంటుంది అంతే జేప్పేరు
సర్లెండి అయితే కొన్ని రోజులు టపా మూత బెట్టి ఆ పై తెరుస్తా జెప్పా .
జిలేబి అట్లా జేస్తే నీ గురించి జనాలు మరిచి పోతారేమో ? అయ్యరు గారు సందేహం లేవ దీసేరు .
అయితే దేశం లో ఉన్న పత్రికల్లో నించి రోజుకో 'కట్ పేస్ట్ మేటరు రాస్తూ పోతా ! అప్పుడు ఎవర్ గ్రీన్ గా ఉంటా ఈ మద్య గమనించిన కట్ పేస్ట్ స్పెషలిస్ట్ జ్ఞానం తో జెప్పా !
అప్పుడప్పుడు కట్ పేస్ట్ చేస్తే ఒకే ! అన్ని టపాలు కట్ పేస్ట్ చేస్తే నీ టపా లు ఎందుకు ? శుద్ధ దండగ కాకుంటే ? అయ్యరు గారు అడిగేరు .
అబ్బా ! తల పగిలి పోతోంది !
ఇంతకీ టపా చాప్ చుట్టేయ్యా లా వద్దా ? తేల్చి చెప్పండి అయ్యరు గారిని నిలదీల్సి అడిగా .
ఆకాశమంత నిశ్శబ్దం !
అబ్బా ఈ ప్రశ్న కి సమాధానం ఎవరిస్తారో ?
శుభోదయం
జిలేబి