Thursday, May 21, 2020

రిలయన్స్ షేర్ 1200 వందలకు కొనుక్కోవడం ఎలా ?



రిలయన్స్ షేర్ 1200 వందలకు కొనుక్కోవడం ఎలా ? 

ఈ మధ్య రిలయన్స్ షేరు మార్కెట్టు లో టాక్ ఆఫ్ ది టవున్ అయిపొయింది. మా తాత గారు కూడా అబ్బో నాకు ఆ రైట్స్ షేరు కావాల్సిందే నేనా షేరు ౧౨౫౦ రూపాయలు పెట్టి కొనే కొంటాను అని మంకు పట్టినారు. 

ఈ మంకు చూసి ముచ్చటేసి తాతగారు ౧౨౫౦ రూపాయల కెందుకు కొన్ని రోజులు ఆగండి ౯౯౯ రూపాయలకే మార్కెట్టు లోకి వచ్చును ! అప్పుడు జీ భర్ కొనేసు కోవచ్చంటే సుతరామూ కుదర దంటారు. నాకిప్పుడే కావాలె అంటూ మంకు ! 

వాడేమో జూన్ నెలలో ఇవ్వ బోతాడు. కాబట్టి జూన్ నెలలో రిలయన్స్ షేరు ఎట్లా ౧౨౦౦ రూపాయలకు కొనుక్కోవడం ? అన్న దాని మీద ఈ టపా అన్న మాట. !

ముఖ్య గమనిక- మీరు నిజంగానే ౧౨౦౦ రూపాయలకు కొనుక్కోవాలె అనుకుంటే నే ఈ మార్గాన్ని ఎంచుకోండి :)  

Advices are subject to market risk and all risk on your own. Zilebi has no liability what soever 

అనెడు పూర్వ నో పూచీ కత్తు టపా ఇది. 

ఏమి చెయ్యాలె ? 

డబ్బులు సరాసరి ఓ రెండు లకారాలు మీ బ్రోకింగ్ అకౌంట్ లో పెట్టేసు కోండి. మిగిలిన నాలుగు లకారాలు మీ బ్యాంకు అకౌంటు లో వుండే టట్టు చూసుకోండి. ఉల్టా పుల్టా అయి మీరు నిజం గానే ౧౨౦౦ కొనవలసి వస్తే కొనుక్కోవడానికి . 


ఆ తరువాయి  

మార్కెట్టు స్లయిడింగ్ దినాన  రిలయన్స్ షేరు జూన్ ౧౨౦౦ పుట్ ఆప్షన్ కనీసం  ఓ యాభై రూపాయలైనా  పలికే రోజు ౧౨౦౦ జూన్ పుట్ ఆప్షన్ ఓ కాంట్రాక్టు ( ఒక కాంట్రాక్టు ౫౦౫ షేర్లు ) అమ్మండి. ఇలా అమ్మడం ద్వారా ప్రీమియం మీకు ౫౦౫ * ౫౦ రూపాయలు వస్తుంది అంటే ౨౫,౨౫౦ రూపాయలు. 

ఇప్పుడు జూన్ నెలాఖరు ఆప్షన్ ఎక్పైరి కి వైట్ చేయండి. ౧౨౦౦ వందలకు వస్తే  అప్పటికి మీకా యావ స్టాకు కొనుక్కోవాలే అని ఇంకా ఉంటే ఆప్షన్ డబ్బులు పోను మిగతా డబ్బులు పెట్టి కొనుక్కోండి. 

లేదూ రాలేదూ అంటే ఆ ఇరవై ఐదు వేలు దక్కిందే లాభం అనుకోవడమో దానితో ఆ నాటికి ఎన్ని షేర్లు ముఫత్ లో వస్తే కొనుక్కోవడమో చేసుకోండి :) 


ఇట్లు 

జిలేబి 

జాం బజారు జగ్గు నా సైదా పేట్టై కొక్కు :) 

Friday, May 15, 2020

కొంత హాయిగా నవ్వుకుందామా


ఎంజాయ్ !




చీర్స్
జిలేబి

Saturday, March 14, 2020

God on the Hill ( ఏడు కొండల సామి)


God on the Hill


You are just about as much as one imagines you to be.
As they say, the more dough, the more bread.

From God on the Hill
by Velchuri Narayana Rao
Annamayya keertana - Entha Mathramuna Evvaru Talachina...




జిలేబి

Friday, March 13, 2020

Oh My Nifty! Oh My Sensex!


Oh My Nifty!
Oh My Sensex!


Dow Tanks nearly 10%!
What next ?
Welcome Friday the 13th!
Oh my Nifty! Oh my Sensex :)

ఓ నిఫ్టీ! సెన్సెక్సూ!
మీ నాట్యము చూడగాను మేవడి తోడై
లేనా దేనా బ్రోక
ర్లీ నాడదె వేచినారు లేవండర్రా :)



Friday the 13th :)
శుభోదయం
జిలేబి

Saturday, February 29, 2020

జిలేబి వివరములు


పేరు - జిలేబి

తదితర వివరములు


ఇట్లు
జిలేబి

Thursday, February 20, 2020

నక్షత్రాల కిటికి





నక్షత్రాల కిటికి

ఆకాశం 
నక్షత్రాల కిటికీ 
వెనుకనుండి
జిలేబి తో కనులు 
కలుపుదామని చూస్తోంది

జిలేబి ముసుగు తన్నుకొని
జోగుతోంది.



శుభోదయం
జిలేబి 

Sunday, February 16, 2020

స్కందా నిను మరువలేనయా!



కల్పనవైనను కటిక శిలవైనను
స్కందా నిను మరువలేనయా

అద్భుతమైన అత్యంత తేజోమయా
ఆ వేదమే నిను వెతికేను కరుణాసముద్రా

నిలకడయై యున్నది నడయాడేది నీవల్లనే
తలచినది  సాగేది నీవల్లనే

నేర్చినదంతయు నీ మధురవాణియే
చూచినదంతయు నీ కనుసన్నమెలగులే

కల్పనవైనను కటిక శిల వైనను
స్కందా నిను మరువలేనయా





కర్పనై యెన్డ్రాలుమ్ కర్చిలై యెండ్రాలుమ్ ...

వాలి టమిల్ సాంగ్ 

స్వేచ్ఛానువాదం
జిలేబి

Saturday, February 15, 2020

జాల్రా అనగా యేమి :)



జాల్రా అనగా చైంచిక్ :)



Thursday, January 9, 2020

పదేన్వేలు అక్కౌంటులో పడినాయ్ ( అను విశ్వరూపము )


జై జగనన్నా ! 

పదేన్వేలు అక్కౌంటులో పడ్నాయ్ (ట)





చేయు నతడె చెప్పంగన్ !
మాయా మర్మము లెరుగని మనిషి జగనుడోయ్!
చేయూత నిచ్చె తల్లుల
కే యావత్తు జనులున్ సుఖీభవ యనగా !


జాల్రా
జిలేబి

Friday, December 13, 2019

గొల్లపూడి లేరిక.



Which hat has he not worn?


All round personality no more.

Andhra Prabha Chittoor days,

AIR, Theatrical Dramas, Cinemas, literary feats,

his transformation into Blog world, social media,

his Daily weekly columns,

his shows on TV...

Interviews ....

remarkable memory of events of the past and people ...


The list goes on
..


Photo courtesy The Hindu

Tribute by కౌముది.



A tribute by


మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి


బూరెబుగ్గల వాడు ముద్దుమాటలవాడు
కూరిమిగలవాడు గొల్లపూడి!
తెలుగు చలనచిత్ర తేజోవికాసమౌ
గొప్ప నటుడు మన గొల్లపూడి!
ఆనందమైన శోకాభి నయమ్మైన
నెల్లర మెప్పించు గొల్లపూడి!
మాతృభాషకు తాను మధుర రూపమ్మన
గురుతుగా నిలిచెడి గొల్లపూడి !

పాత్రికేయుడు రచయిత బహుముఖీన
ధీ ప్రపూర్ణుడు నేడు(12-12-2019  11.10 a.m. ) గతించెననగ
ఆంధ్రదేశమ్ము దుఃఖాబ్ధినందు మునిగె!
ఆర్య! మారుతీరాయ ! జోహారులయ్య.!!



మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి


*****

నివాళి
జిలేబి