Thursday, July 29, 2010

బందీ ఐన భగవంతుడు

ఆ పై వాడు ఈ ప్రపంచాన్ని సృష్టించినాడు
ఈ మన వాడు ఆ ప్రపంచం నాది అన్నాడు
నేను సర్వాంతర్యామిని అని చెప్పక చెప్పాడు ఆ పైవాడు
ఛత్- జానతా నై అని రాయిలో ఆ పైవాన్ని బందీ చేసాడు మన వాడు

పోనీ లే ఈ రాయిలోనే సెటిల్ అయిపోదామనుకున్నాడు ఆ పైవాడు
ఉండనివ్వలె మన వాడు-
ఊరూరా తిప్పి - ఊరేగించి బిజినెస్ చేసాడు మనవాడు
విష్ణు మాయ అనుకున్నాడు ఆ పై వాడు
నా హం కర్తా కర్తా హరిహి అని 'నీటి' వాక్యాలు రాసాడు మన వాడు!
యద్దామ పరమం మమ ?

చీర్స్
జిలేబి.

Saturday, July 3, 2010

వెంకన్నాస్ గోల్డ్ - గోల్మాల్ గోవిందా !

కొన్ని నెలల క్రితం - వెంకన్నాస్ గోల్డ్ గురించి రాసాను. మళ్ళీ ఇప్పుడు - రాయల వారి బంగారం గురించి - మా కొండ దేవర - తిరపతి వెంక టేశ్వర స్వామీ వారి ఆభరణాల గురించి వార్త !
ఐదు వందల సంవత్సరాల తరువాయి - రాయల కాలం నాటి కాళహస్తి గోపురం ధమాల్
ఐదు వందల సంవత్సరాల తరువాయి - రాయల బంగారు ఆభరణాల కానుకలు - గోవిందా గోవిందా -

వీటి గురించి చదువుతూంటే - మన జీవిత కాలం లో - డబ్బులకోసం, పదవులకోసం, కీర్తి కండూతి కోసం మనం చేసే కార్యాలన్నీ బేవార్సు - సుద్ధ పనికి మాలిన పనుల లాగ అనిపిస్తోంది. బాల్చీ తన్నేసాక - మనం కూడా బెట్టిన ధనం ఎ ఉండేలు దెబ్బకో హుష్ కాకి!

మా స్వామీ వారికే ఈ తిప్పలు తప్పనప్పుడు- నర మానవులం - మనం ఎ పాటి వాళ్ళం!

స్వామీ ఏడు కొండలవాడా - వెంకట రమణా - కుబేరుని కి నువ్వు పడ్డ బకాయి ఎప్పటికి తీరే టట్లులేదు.

ఈ బకాయి తీరనంతవరుకు నీవు - మా జిల్లాలోనే వుండవలె !

ఈ బకాయి తీర కుండా- మా దేశం వాళ్ళు - ఈ నగల్ని - ఆభారణాలని గాయబ్ చేస్తూ- నువ్వు మా జిల్లా లో నే - సదా నెలకొని ఉండేలా - చేస్తున్నందులకు - ఈ "గాయబ్" మేజిసియన్ లకి సలాములర్పిస్తూ-

కొండకచో - కొండ దేవర ఆశీస్సులు అందరికి దివ్యం గా వుండాలని కోరుకుంటూ-

చీర్స్
జిలేబి.

Wednesday, June 30, 2010

జ్యోతిష్యం ఎంత వరకు ఉపయోగం?

ఈ మధ్య తెలుగు యోగి శర్మ గారు వరుసగా జ్యోతిష్యం గురించి బ్లాగ్ ఆర్టికల్స్ రాస్తున్నారు. అది చదివిన తరువాయీ ఈ శీర్షిక - జ్యోతిష్యం గురించి ఆలోచిస్తుంటే - అసలు అంతా ఆల్రెడీ నిర్ణయించ బడి ఉంటె మన కర్మలు ఆల్రెడీ డిసైడ్ అయి పోయి ఉంటె- ఇక మానవ మాత్రులం మనం ఎందుకు కష్టించాలి? మనం ఎందుకు ప్రయత్నించాలి అన్న సందేహం రాక మానదు. ఈ ఒక్క లాజిక్ చాలు జ్యోతిష్యాన్ని తీసి పారేయడానికి. కాని దీనికి కారణం చెబ్తారు- జ్యోతిష్యులు- అంటే- మీ జాతకం లో - మీరు కష్టించి పైకి వస్తారని ఉంది కాబట్టి- మీ ఆలోచన ఆ పరిధి లోకి వెళ్లి మీరు అభివృద్ధి లోకి వస్తున్నారానో కాకుంటే- అధోగతి పాలవు తున్నారానో - దీనికి సమాధానం చెప్పుకొస్తారు.

సో, ఈ నేపధ్యం లో ఈ సబ్జెక్టు ఎల్లప్పుడూ వివాదాస్పదమే. కర్మ సిద్ధాంతం, మానవుని సంకల్పం, దైవ నిర్ణయం, ఇట్లా వేరు వేరు సిద్ధాంతాలు - కలగలపుగా ఉన్న మన దేశం లో - ఈ సిద్ధాంతాలు - ఒక దాని మీద ఒకటి పోటి గా మానవ మేధస్సుకి దాటీ గా - ఓ లాంటి చాలెంజ్ లేవదీస్తాయి - మనిషి మేధస్సుకి పరీక్ష పెడతాయి కూడా- వాదం, ప్రతి వాదం తార్కిక చింతన, ధ్యానం, నిర్వకల్పం, శరణాగతి, ఇట్లాంటి వేర్వేరు సిద్ధాంతాలతో - ఓ పాటి విలక్షణం గా ఉన్న భారత సంస్కృతి - ఓ విభిన్న ప్రకృతిని ప్రతిపాదిస్తున్దనడం లో సందేహం లేదు. ఎవరి ఆలోచన పరిధికి ఏది అందుతుందో అక్కడినుంచి వాళ్ళు - ఆ పై గతి కి ప్రయాణం సాగించ డానికి దోహద కారి అనిపిస్తోంది కూడా ఈ భారత చింతనా స్రవంతి !

చీర్స్
జిలేబి.

Monday, June 28, 2010

చిత్తూరు కోవా - కేరళ భామ

మన ఊరిగురించి ప్రక్క రాజ్యం వాళ్ళు ఓ ఎపిసోడ్ టీవీ లో చూపితే ఎవరికైనా చూడ బుద్దేస్తోంది. అదీను పొగడ్తల తో కాకుంటే ఓ మోస్తరు మనకు తెలిసిన విషయం గురించి షో పెడితే ఇంకా నచ్చుతుంది. అంతే కాకుండా అది ప్రక్క రాజ్యం గాకుండా ఇంకా కొంత దూరం లో ఉన్న రాజ్యం లో చూపెడితే - ఔరా మన ప్రదేశం గురించి ఇంత ముచ్చట గా చూపెట్టారే అని మరీ మురిసి పోవడం కద్దు. ఆ బాణీ లోనే ఈ కేరళ భామ ఫేవరెట్ ఇండియా షో - కైరలి టీవీ లో ఈ మధ్య చిత్తూరు గురించిన షార్ట్ ఎపిసోడ్ -

http://www.youtube.com/watch?v=RNUqGUAEtUM

లింక్:http://www.youtube.com/watch?v=RNUqGUAEtUM

చీర్స్
జిలేబి.

Sunday, June 20, 2010

కాలం - కలం - కల కలం

కాలం
కలం
సాయం కాలం
కల కలం
కలల కడలి కదలింది
కాలం - కారుణ్యం
కాలమై న కలల కలం
సుఫలాం సస్య శ్యామలాం అన్నది
మరి జీవనం జీవిత గమ్యం అయ్యిందా
కాకపొతే జీవితం జీవనం గమ్యం అయ్యిందా?
తెలుసా మీకేమైనా?

జిలేబి.