Saturday, October 16, 2010

భుజించు - ప్రార్థించు- ప్రేమించు !

ఇది ఏదో జే హో వా వ్యాఖ్యానం అనుకోవద్దండి. !

ఈట్ ప్రే అండ్ లవ్ - జూలియా రోబెర్ట్స్ చిత్రం పేరు తెలుగులో రాసానంతే! కాకుంటే ఆంగ్లం లో విన సోంపు గా ఉన్నది. తెలుగులో కొంత ఎకసక్కం గా ఉన్నట్టుంది నాకైతే. మీ కేమైనా మంచి పేరు తడితే చెప్ప వచ్చు.

! ఆ పేరుతొ వ్రాయబడ్డ నవల ప్రాతిపదికగా తీయబడ్డ చిత్రం !

ఇటలీ ఇండోనేసియా ఇండియా - ఈ మూడు దేశాల సంస్కృతి సమ్మేళనం గా - వైవిధ్యమైన చిత్రం.

వీలయితే - కాకుంటే వీలు చేసుకుని చూడగలిగితే చూడండి !

చీర్స్
జిలేబి.

Monday, October 4, 2010

షష్టి పూర్తి ఐతే చాలా ? తాతగారి కి శతాభిషేకం అవ్వాలి కదా?

మారుతీయం గారి సమస్యకి షష్టి పూర్తి చదివితే నవ్వొచ్చింది.

మా ఇంట్లో తాతగారి కి షష్టి పూర్తి ఐతే అందరం సంతోషపడి - తాతగారి శతాభిషేకం ఇంకా ఘనం గా జరపాలని - ఆ పై ఆయన ఇంకా వంద సంవత్సరాల పై బడి మాతో ఉండాలని చాలా చాలా అభిప్రాలయాలని ఆశలని తెలియబరచాం.
ఆ పాటి ఆశ, మా ఈ 'తాత' గారి సమస్య కి కూడ మేం పెట్టుకోవాలి కదా మరి?

కనీసం శతాభిషేకం అయినా కావాల్సిందే.

కాకుంటే - రెండు జమానాల జనానికి నౌకరి కల్పించిన మా తాత గారు - మరో ఒక జమానా కైనా కనీసం నౌకరి పోషించవలె కదా మరి?

కాకుంటే మా కోర్టులు వట్టి పోవూ? అక్కడ పని చేసే వాళ్ళ గతి ఏమి గాను?

పేపర్ల వేల కొద్దిగా తీర్పులు రాయ వలసిన మా జడ్జీల నౌకరి ఏమి గాను?

వారి టైపిస్ట్ ల ఉద్యోగాలు ఏమి గాను?

వారి పెళ్ళాం పిల్లల జీవిత బాగోగులని కోరి - మా తాత గారి శతాభిషేకం కనీసం గా వించ వలసినది గా
అందిరికి విజ్ఞప్తి!

పుర జనులార - ఈ దేశం లో ఆల్రెడీ నిరుద్యోగం ఎక్కువగా ఉన్నది. ఇంకా నిరుద్యోగాన్ని పెంచకండి! (నిరుద్యోగి గా ఉంటె పర్లేదు- ఉద్యోగి గా ఉండే వాడు నిరుద్యోగి ఐతే - అదీ కోర్టు వాళ్ళు నిరుద్యోగులైతే - మీ మా జన జీవనానికి కీడే గా ని మేలు గాదని నా ప్రగాఢ విశ్వాసం! - దార్న పోయే వాణ్ని పిలిచి చంకన వేసుకున్న సామెత ఉండనే ఉన్నది. వాళ్ళ మానాన వాళ్ళు - ఎవరికీ అర్థం కాని గీతాల్ని రాతల్ని రాసుకుంటూ - వారి లోకం లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళని డిస్టర్బ్ మనం చెయ్య కూడ దండోయి ! )

చీర్స్
జిలేబి.

Friday, September 24, 2010

అస్సాం రోజులు - జ్ఞాపకాలు

మధ్య తరగతి తెలుగు అమ్మాయికి గాని అబ్బాయికి గాని ఆంద్ర దేశం దాటితే అంతా విచిత్రం గానే ఉంటుంది. అట్లాంటిది ఏకం గా మూడు వేల కిలో మీటర్ దూరం లో అస్సాం వెళ్ళ వలసి వస్తే ఎలా ఉంటుంది? అదీను అస్సలు హిందీ రాకపోతే అసలు నువ్వు నార్త్ లో జీవితపు బండి నడప లేవు అని ఎవరైనా ఇంకా బెదర గోడ్తే మన ధైర్యం అంతా హుష్ కాకి అయి పోతుంది!

అట్లాంటిది ఓ మోస్తరు హిందీ కూడా అంతగా చలామణి కాని దేశం కాని దేశం లాంటి అస్సాం లో అదీ పీక్ భజరంగ్ భళి ఆపరేషన్ పిరియడ్ లో కాలు పెట్టడం జరిగింది.

వెళ్ళడం ఏప్రిల్ నెల లో . సూర్యోదయం పొద్దు ఐదు గంటలకు పై చూసే అలవాటున్న 'సో కాల్డ్ మద్రాసీ' లకు (సౌత్ వాళ్ళంతా నార్త్ వాలాకి మద్రాసీ లే - మన రామా రావు గారు వచ్చాకే - ఓహో - ఆంధ్ర దేశం ఒకటి ఉన్నదని వాళ్లకి తెలిసి వచ్చిందంటే అతిశయోక్తి గాదు ! ) అక్కడ సూర్యోదయమ్ మూడు మూడున్నర గంటల మధ్య చూడడం ఒక లాంటి 'భయాన్ని' కలిగించడం సర్వ సాధారణం !

నాకైతే అంత పొద్దే సూర్యోదయం చూడడం భయాన్నే కలిగించింది ( అప్పటి వాతావరణం - ఆ నలభై ఎనిమిది గంటల రైలు లేటు తో రైలు గువాహతి చేరడం దానికి కారణమై ఉండ వచ్చానుకుంటా) వార్నీ ప్రపంచానికి ఏదో అయ్యిందన్న మాటే - సూర్యుడు ఇంత పొద్దునే ఊడి పడ్డా డంటే అనుకున్న!

(ఇది మన telugu యోగి sarma గారి బ్లాగులు చదివి అలా కిటికీ నించి చూస్తె మామూలుగా ఎగిరే పక్షి కూడా ఏదో అవాంతరం ముంచుకొచ్చే పరిస్తితులలో ఉందేమో అన్నటు వంటి సందేహం కలగడం లాంటి దన్న మాట !)

ఆ తరువాతే తెల్సి వచ్చింది - కాకుంటే అర్థం అయింది మన 'కాల గీత' మధ్య భారత దేశం లో వెళ్ళడం వల్ల నార్త్ ఈస్ట్ కి ఓ కనీసం ఒకటిన్నర గంటల వ్యత్యాసం ఉండవచ్చు అన్న విషయం !

అట్లాగే చలికాలం లో సాయంత్రం నాలుగు గంటలకే నక్షాత్రాలు ఆకాశం లో కనిపిస్తే మరో వింత ! (భయం కొద్ది పోయి వింత ప్రవేసిన్చందన్నమాట ఆ ఆరు నెలల కాల వ్యవధి లో )

ఇక భోజన విషయానికి వస్తే - అన్నం, కాసిన్ని పచ్చి మిరపకాయ లు , అంత ఉప్పు , ఒక చేప బస్ ఫుల్ మీల్స్ అయినట్టే!

ఇట్లా చెప్పుకుంటూ పోతూంటే జ్ఞాపకాలు పొర్లుతూ వస్తాయి. రాయడానికి ఓపిక తెచ్చుకోవలంతే!

ఈ టపా రాయడానికి కారణం యధేచ్చ గా ఇంటర్నెట్ లో అస్సామీ ఇంటర్నెట్ రేడియో తటస్త పడటం! ఆ అస్సామీ పాటలు వింటుంటే - యాద్గారే రావడం ! (ఆ పై శర్మ గారి బ్లాగు చదవడం - భయ భ్రాన్తులకి లోనవడం - అది వేరే విషయం అనుకోండి!!- )

చీర్స్
జిలేబి.

Thursday, September 23, 2010

ఆ (సైన్స్) చంద్ర 'తారా' ర్కం !

అసైన్స్ గురించి రాస్తారు
జ్యోతిష్యం గురించి అ సైన్స్ గా రాస్తారు
బ్లాగులలో తారా జువ్వలా కామెంటు తారు
తర్కం సూటి ఘాటు ! కొందరు 'డు' కలిపి 'తారడు' అన్నారు
వెరసి
ఆ (సైన్స్) 'చంద్ర' తార' తర్కం !

చీర్స్
జిలేబి.

Tuesday, September 21, 2010

శంభో హర హర - మార్కెట్ హో 'జయ జయ'

ఇండియా స్టాక్ మార్కెట్ జయహో జయహో అంటోంది!
ఆసియా లో ఇండియా తలమానికం
జై భారత్ - జై నిఫ్టీ -జై బీ ఎస్ ఈ

అంతా బాగుంది గాని - నా దో సందేహం ( సందేహం మొదలు పుట్టి మీరు ఆ తరువాయి పుట్టారనకండి) -
ఇందు లో ఏదన్న తిరకాసు ఉన్నదా? ఎవరైనా కొత్త 'మెహతా ' హ్యాండ్ ఏమైనా ఉన్నదా?
విష్ణు మాయ లోగుట్టు పెరుమాళ్ళకె ఎరుక !
ఎప్పుడు తెలియ వలసి వస్తే అప్పుడే జనములకి మాయ విసదీకరించును !

చీర్స్
జిలేబి.