Friday, December 3, 2010

వికి లీక్స్ - ఫ్లాష్- 2G - Issue !!!

అమావాస్య కి అబ్దుల్ కాదర్ కి సంబంధం ఏమిటి అన్నది నానుడి. అట్లా వికి లీక్స్ కి 2G కి సంబంధం ఏమి ఉంటుందండి మీరు మరీను !

విషయం ఏమిటంటే - ప్రపంచ పత్రికా లోకం వాళ్ళు వికి లీక్స్ మీద గగ్గోల్ ఐపోతూన్నారు ఏదో గొప్ప విషయం సాదించి నట్టు. నాకైతే - మన తెలుగు ఇండియా మీడియా వాళ్ళు ఇంతకన్నా ఘనమైన లీకులు సర్వసాధారణం గా న్యూస్ ఐటెం క్రింద రాస్తూ ఉంటారు. వారి కన్నా గొప్ప వార ఈ వికి లీక్స్ వారు? కానే కారు ! మన మీడియా వాళ్ళని వదిలి ఉంటె - వికి లీక్స్ ఏమిటి కర్మ - మొత్తం అమెరికానే లీక్ కాకుంటే అమ్మకానికి పెట్టి ఉండే వారు ! ఏమంటారో మీడియా వాళ్ళు ఈ టపా చదివాక !

చీర్స్
జిలేబి.

Sunday, November 21, 2010

కొండాట్టమే కొండాట్టం

కొండాట్టం అన్నది అరవ పదం . తెలుగు లో ఐతే సెలేబ్రషన్ అని చెప్పవచ్చు. ( ఇదేమిటండి ఇంగ్లీష్ లో చెప్పి తెలుగు లో అంటారు అంటే - మేము తెలుగు వారము సుమండీ - అంగ్రేజీ పదం లేక పొతే మా తెల్గు వట్టి పోదూ మరి?)

ఈ కొండాట్టం పదం చిత్తూరు ( అరవ వాళ్ళ తెలుగులో) మాండలీకం క్రింద చేర్చాలని నా మనవి. ఎందుకంటే చాల అంగ్రేజీ పదాలు తెలుగు లో ఉన్నట్టు ఈ పదం కూడా తెలుగు లో పడి ఉండవచ్చు కదా? జాను తెలుగు - తేట తెలుగు తో బాటు - అరువు దేచ్చుకున్న తెలుగు కూడా ఒక భాగం గా చేర్చుకోవచ్చు అనుకుంటా!

ఏమి అమ్మాయ్ - కొండాట్టమే కొండాట్టం గా ఉండావు ? అని ఎవరి నైన అడిగితే చిత్తూరు అమ్మాయి ఐతే సిగ్గు పడి పోయి - ' అక్కోయి నాకు పెళ్లి కుదిరింది ' అని మెలికలు తిరిగి పోక మానదు. కొండాట్టం కాదంటారా మరి ఇది?

చీర్స్
జిలేబి

Wednesday, November 17, 2010

డాలర్ పెళ్ళాం - రూపాయ్ మొగుడు (ఈ  సినిమా టైటిల్ రిజిస్టర్ చెయ్య బడినది)

సొగసరి అత్తా గడుసరి కోడలు

జగదేక వీరుడు అతిలోక సుందరి

ఇట్లాంటి సినిమా పేర్ల కోవలో - నేను ఒక టైటిల్ కనిపెట్టేసాను - ఎవరికీ చెప్పకండి -ఈ టైటిల్ కూడా రిజిస్టర్ చేసు కోవాలని నా ప్లాన్ !

ఎవరికీ ఎరుక - రాబోయే కాలం లో నా ఈ టైటిల్ కావాలని ఎ నిర్మాత ఐన అడిగితె వచ్చిన డబ్బులకి టైటిల్ అమ్మేయాలని అనుకుంటున్నా ! (రిజిస్టర్ ఎలా చేస్తారో ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు - ఎంత ఖర్చు అవుతుంది? సలహా ఇచ్చిన వారికి రాబోయే కాలం లో నేను టైటిల్ ని అమ్మితే - ఆ నిర్మాత నాకు డబ్బులిస్తే - కమీషన్ ఇచ్చు కుంటాను - సలహా చెప్పిన వారికి )

ఇంతకీ నేపధ్యం ఏమిటంటే - ఈ మధ్య డాలర్ మరీ స్ట్రాంగ్ ఐపోతోంది ! దీని వెనుక రహస్యం ఆ పెరుమాల్లకే ఎరుక!
పెళ్ళాం ఎప్పుడు కూడా డిమాండే మగ రాజులకి ! -

సో - డాలర్ పెళ్ళాం - రూపాయ్ మొగుడు !

చీర్స్
జిలేబి.

Sunday, November 14, 2010

మానిటర్ జీవులు

డిజిటల్ అలారం మ్రోగింది.
మానిటర్ మానవుడు నిద్ర లేచాడు.
ఐఫోన్ ఆన్ చేసాడు
మానిటర్ లో మాటర్ చదివాడు
కాల కృత్యాల సమయం వచ్చింది
ఆటోమాటిక్ టూత్ బ్రష్
ఎలక్ట్రానిక్ షేవింగ్, గీసేర్ వేడి నీళ్ళు
డిజిటల్ ఫోటో లో రెండు నిమిషాల కో సారి మారే దేవుడికి నమస్కారం పెట్టేడు
టీవీ ఆన్ - ఛానల్ సర్ఫింగ్ - ఎ ఛానల్ కూడా ఒక్క నిమిషం మించి చూసే సమయం లేదు
మళ్ళీ ఐఫోన్ స్విచ్ ఆన్ ! న్యూస్ స్కాన్ చేసాడు.
ఎలెక్ట్రానిక్ బ్రెడ్ మెషిన్ బ్రెడ్ బ్రేక్ ఫాస్ట్
కాఫీ మెషిన్ - కాఫీ సేవనం
లిఫ్ట్ లో ముప్పైవ మిద్దమీంచి - కార్ పార్కింగ్ కి
ఎలెక్ట్రానిక్ కార్
జన రద్దీ - ఎలెక్ట్రానిక్ సిగ్నల్స్
ఆఫీసు ఎంట్రీ - స్వీప్ కార్డ్ ఎంట్రీ
మళ్ళీ మానిటర్ ఆన్
ఇంటర్నెట్ బ్యాంకింగ్ మానిటర్ లో మనీ ఇక్కన్నునించి అక్కడికి
ఓ పది జంక్ మెయిల్స్
ఓ నాలుగు ఆఫీసు మెయిల్స్
రెండు గీతల సాఫ్ట్వేర్
ఆరయ్యింది
మళ్ళీ పార్కింగ్ లాట్ - ఎలెక్ట్రానిక్ కార్
మానిటర్ మానవుని సాయం కాల జీవనం మళ్ళీ మొదలయ్యింది.
చాట్ ఛానల్ లో - మరో అవతారం దాల్చాడు
బ్లాగులలో - నాలుగు కామెంట్లు కామేంటాడు.
యూటూబ్ లో కొంత మోవీ చూసాడు
బర బర బ్లాగు టపా గీకాడు. గీకి అది పబ్లిష్ అయ్యిందో లేదో - వెంటనే అగ్రిగేటర్ ల లో కెళ్ళి తన
టపా వచ్చిందో లేదో చూసుకున్నాడు.
ఆకలి !
ఏదో అంత మెతుకు మేతికాడు.
మళ్ళీ బెడ్ మీద ఐఫోన్ లో ఫ్యాన్సీ తో చాట్ - ఆమె అమెరికా ఈతను ఆసియా !
నిద్ర - లో - మానిటర్ కలలు!

.... తెలవారింది. డిజిటల్ అలారం మోగింది ! మరో రోజు ప్రారంభం !

చీర్స్
జిలేబి.

Wednesday, November 10, 2010

పిచ్చి గీతలు - పచ్చి నిజాలు - 'బ్లాగోగులు'

పిచ్చి గీతలు పచ్చి నిజాలు అన్నది ఓ కవితా సంపుటి పేరు. రాసిన వారి పేరు గుర్తుకు రావడం లేదు సరిగా. మా చిత్తూరు జిల్లా వారు . ఆ మాత్రం తెలుసు. బంగారుపాలెం జమీందారు గారి కాకుంటే - బంగారు పాలెం వాస్తవ్యులనుకుంటా.

ఇంతకీ ఈ ప్రస్తావన ఎందుకంటే - అప్పు డప్పుడు మనమంతా ఏదో రాసే పిచ్చి గీతలు - అంటే ఈ బ్లాగు టపాలన్న మాట - ఎప్పుడైనా రాసే ' పచ్చి నిజాలు' - ఇవన్నీ వచ్చే జమానాలో - రాబోయే కాలం లో నిలిచి ఉంటాయా అన్న సందేహం వచ్చింది.

ఎందుకంటే - ఒక జమాన పూర్వ కాలం లో కవి అంటే - చేతిలో సారా బుడ్డీ - కదిలితే - సిరా కదలుతుంది అన్న దానికి ప్రతీక గా ఉండే వాడు. ఏదో వాడి మానానికి వాడు రాసుకున్నవి ఐతే ప్రసిద్ధి కాకుంటే - ఫ్లాప్ షో అయ్యేవి.

అట్లాగే - మన బ్లాగు కాలానికి - చేతిలో ఏముంటుందో తెలియదు - ఎందుకంటే - అంతా మిథ్యా ప్రపంచం కాబట్టి.
రాసే సమయం - రాసే పరిసరాలు - అంతర్జాతీయ - అంతర్జాలం ! మహేంద్ర జాలం ! - కట్ పేస్ట్ మేటర్ లేక స్వంత మేటారా అన్నది తెలియకుండా పొయ్యే కాలం !

సో, ఈ నేపథ్యం లో - మన బ్లాగు రాతలు - కాల గతిలో - ఎ తీరానికి చేరుతాయి ? వీటికి 'సాహిత్యం' లో స్థానం ఉంటుందా? ( సాహిత్యం అన్నది పెద్ద పదమైతే - క్షమించి - రాతకోతలలో - స్థానం ఉంటుందా అని చదువుకోగలరు!)

చీర్స్
జిలేబి.