Saturday, February 7, 2009

సింహ నృత్యం - చీనా సాంప్రదాయం

ఓ మారు ఓ చినీయుల గ్రామాన్ని ఓ భూతం పట్టు వదలని విక్రమార్కునిలా పట్టేసుకుని జనాల్ని సతాయించిందట. ఆ కాలం లో గ్రామ వాసులంతా దగ్గిరలో ఉన్న అడవి రాజు సింహం గారిని ప్రార్థించి "సింహం దేవరా మా మొర ఆలకించి భూతం గాడి భరతం పట్టించండి అని మొర బెట్టుకుంటే సింహం రాజ వారు హుష్ కాకి అని మనం కాకి ని తరిమే నిమేశంలో భూతం గాడిని గ్రామ పరిసరాల్లో నించి వెడల గొట్టేసారట. అప్పట్నించి సింహం వారు చినీయుల ఫేవరెట్ అయిపోయ్యేరని కథా కమామీషు.


ఆ తరువాయి మరో మారు మరో భూతం ఆ గ్రామస్తుల్ని పట్టేసుకుని సతాయిస్తూంటే మారు గ్రామస్తులు సింహం రాజ వారిని వెతికే ప్రయత్నం చేస్తే సింహం వారు అసలు కనిపించ కుండా పోవడం తో ఏమి చెయ్యాలో అని పాలు పోక ఆలోచనలో పడి ఉంటే అక్కడ ఉన్న కుర్ర కారు "పెద్దలు మేము సింహం వేషం కడతాము మీరు డంకా భాజాయించండి సుమీ " అని ఆలోచన ఇచ్చేరు. ఆలోచనేమో బాగున్నట్టున్దేనని వారు భావించి సింహం వేషం లో కుర్రకారు న్రిత్యం చేసి భాజా లో డంకా లో మ్రోగిస్తే ఆ మోతకి భూతం గారు నిజమ్గా సింహం వచ్చేసిందని భయపడి పోయి పరుగు లంకించు కోవడం తో అప్పట్నించి చెడుని పార ద్రోలదానికి సింహ నృత్యం చెయ్యబడుతుందని - సాంప్రదాయం అయిందని కథా పురాణం.

ఈ కోవలో చినీయుల నూతన సంవత్సరమప్పుడు ఈ సిమ్హ నృత్యం సాంప్రదాయ పద్దతి లో పాతని పార ద్రోలి కొత్తని ఆహ్వానించడం అన్న భావ వీచికగా మొదలయ్యి ఇప్పుడు ఈ సిమ్హ నృత్యం చెసేవాళ్ళు ఒక కళాకారులుగా గుర్తించబడెంతవరకు ప్రాచుర్యంలొ కి వచ్హింది.
ఈ కథా నేపధ్యం లొ ఇక్కడ ఒక అపురూపమైన సిమ్హ నృత్యం ఫోటో ఇచ్హాను. ఇది ఈ సంవత్సరం చినీయుల నూతన సంవత్సరం (ఈ సంవత్సరం వీళ్ళకి "ఎనుబొతు" సంవత్సరం) అప్పుడు శింగపూర్ వ్యాపార దృష్ట్యా వెల్లినప్పుడు తీసిన చిత్రం ! కనులవిందుగా ఉందని భావిస్తాను. ఇదే మొదటి మారు ఇలా కమ్మీల పై ఈ సింహ నృత్యం చూడడం నా వారకైతే. ఈ సింహ వేషధారులు కుర్రకారులు కళా కారులు.

జిలేబి.

Friday, February 6, 2009

బ్లాగ్రాణి + బ్లాగ్రాజా = అంతర్జాల రాజ్యం

సాంబ్రాణి ధూపం కడ్డీ అన్న పదం లా ఉన్నదీ టపాలు శీర్షిక! బ్లాగ్లోకం లో నివసించే, బ్లాగ్మానవులకి ఏదైనా కొత్త పదం పెట్టాలని అనిపించడం తో ఈ శీర్షిక పై ఈ తపాలు!

రాజా రాణీ కథలు మనం చాలా చదివే ఉంటాం. బ్లాగ్లోకం లో కూడా రాజులు రాణులు ఉంటారా? ఉండవచ్చని నా ఊహ. ఈ మధ్య మాంద్యం సమయం లో చాలా మంది అభివ్రిద్ది చెన్దిన దేశాలలో అంతర్జాలానికి అంకితమై పోయి జీవిస్తున్నట్టు భోగట్టా. ఇట్లాంటి సమయం లో ఈ అంతర్జాల రాజ్యానికి ఎవరికీ వారే రాజులు రాణులు గా చలామణి అవుతున్న బ్లాగ్ రాజులు బ్లాగ్ రాణులు తస్మాత్ జాగ్రత్త గా ఉండడానికి ప్రయిత్నించాలి. ఎందుకంటే ఈ బ్లాగించడమన్నది వ్యసనం లా అయితే - ఒక్కో మారు నాకూ అనిపిస్తుంది ఈ బ్లాగడం నిజాంగా అవసరమేనా అని- ఇక నిజా జీవితంలో జీవించడం తగ్గిపోతూ వచ్చి మానవుడు అంతర్జాలం లో కి నెట్టబడి ఓ విధమైన మాయా లోకంలో వేల్లిపోతాడేమో నని కూడా సందేహం వస్తుంది. సో బ్లాగు సోదరీ సోదరులారా ఇది నా స్వంత అభిప్రాయం మాత్రమె. మీరే మంటారో అని కుతూహలం ?

మీ బ్లాగేశ్వరి
జిలేబి.

Tuesday, February 3, 2009

పది మంది గొప్ప వ్యక్తులు ఒక్క చోట - మనోహరం మనమోహనం


సింగపూర్ లో మధ్య ఆవిష్కరించిన "Ten Saints of the World" శిల్పారామం!
భారతీయ ఋషి తిరువల్లవర్ ని ఇక్కడ చూడచ్చు ఈ పదిమంది విశ్వ విఖ్యాత ప్రముఖులలో!
ఛీర్స్
జిలేబి.

Saturday, January 31, 2009

నా బ్లాగు పేరు తో సినిమా కూడా ఉందండోయ్!

బి వి రామానందం & ఆనందా పిక్తర్స్ వారి వరూధిని ప్రకటనా పత్రం!
ఇవ్వాళ కూడలి బ్రౌస్ చేస్తుంటే వరూధిని అన్న పేరుతో సినిమా కూడా ఉన్నట్టు తెలిసింది. తెలిపినవారు నవతరంగం వారు! వారి చలువ చే వరూధిని చిత్రం ఫోటో పెట్టాను ! వీక్షించగలరు!
ఈ చిత్రం గురించి మీ కే మైన విషయాలు తెలిస్తే తెలియ జేయ్యగలరు.
జిలేబి.

Friday, January 30, 2009

బ్లాగ్లోకం లో భామామణి

ఆయ్య బాబోయ్ నేను కొత్త సినిమా టైటిల్ కని పెట్టేసాను. బ్లాగ్లోకం లో భామామణి ఆ సినిమా టైటిల్ పేరు! ఈ మధ్య కొత్త కొత్త పేర్లు కనుక్కోవడం లో నేను మరీ ఎక్స్పెర్ట్ అయిపోయ్యానోచ్ అని నన్ను నేను మరీ పోగిడేసుకున్నా!

ఇంతకీ విషయం ఏమిటంటే శ్రీ తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం గారు ఈ బ్లాగు కి మునుపు టపాలో ఈ ప్రశ్న వెయ్యడం ఈ టపాకి మేటర్ అయ్యింది. శ్రీ తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం ( చాల పెద్ద పేరు కాబట్టి సంషిప్తం గా "తాలబాసు" గా పిలుస్తాను వీరిని ) గారు ఈ సందేహం లేవదీసారు!
తాలబాసు వువాచ:
"
అది సరే ! ఏమనుకోవద్దు. ఒక విషయం చెప్పండి. ఇంతకీ మీరు మగ బ్లాగరా ? మహిళా బ్లాగరా ? మీ ప్రవర (profile) లో ఏ వివరాలూ లేవు. అందుకని అడుగుతున్నానంతే !"

ఈ వ్యాఖ్య ని చదివాక ఈ టపా కి ఈ "బ్లాగ్లోకం లో భామామణి " కి అని నామకరణం చేసినాను. ఎందుకంటే వరూధిని అన్న పేరుతొ బ్లాగు స్టార్ట్ చేసిన తరువాయీ సిరిసిరిమువ్వ blaagaru గారు "ఏమనడోయ్ జిలేబి గారు మీరు నాపెరుతో బ్లాగు స్టార్ట్ చేసినారు. నా స్నేహితులు ఈ బ్లాగు నాదేనా అని అడుగుతున్నారు" అన్నారు!
ఇప్పుడేమో "తాలబాసు" గారు మీరు మగ బ్లాగర లేక మహిళా బ్లాగారా అని నిక్కదీసి ప్రశ్న వేస్తున్నారు!
తెలియక అడుగుతాను నేను చేసిన నేరమేమి తిరుమలేశా? అంతా విష్ణు మాయ లా ఉందండోయ్!
ఛీర్స్!
జిలేబి.

Thursday, January 29, 2009

నెనర్లు అస్సలు తెలుగు పదమేనా-2

నెనర్లుకి జేజేలు!
ఈ నెనర్లు అన్న పదం ఇంత వేడి టాపిక్ అని నాకు తెలియదు.
ఆంతే కాక ఇంత విశాల పరిధిలో చర్చించ బడ్డ లేక చర్చించదగ్గ విషయమని ఇప్పుడే తెలిసింది.
బ్లాగరు మిత్రులకు నెనర్లు/ధన్యవాదాలు/కృతజ్ఞతలు /!
నెనర్లు పేరుతో బ్ల్లాగు సెర్చ్ చేస్తే నెనర్లు.బ్లాగ్స్పాట్.కాం అస్సలు ఎవరు ఇంత దాక క్రియేట్ చేయ్యపోవకుండా ఉండిపోవడం ఆశ్చర్యమనిపించింది.
సో- ఈ నెనర్లు కి స్థానం కల్పించదలిచాను. భ్లాగు నెనర్లు పేరుతో ప్రారంభించాను. మిత్రులు గమనించి ప్రొత్సహించగలరు!
లింకు:
http://www.nenarlu.blogspot.com/

జిలేబి.

Monday, January 26, 2009

నెనర్లు అన్నది అసలు తెలుగు పదమేనా?

నాకో సందేహం వచ్చింది. ఈ నెనర్లు అన్నది అసలు తెలుగు పదమేనా అని. ఈ పదాన్ని మొట్ట మొదటి సారి నేను గమనించింది ఈ బ్లాగుల లోకం లోనే. ఇంతకుమునుపు ప్రింట్ మీడియా లోగాని నేను చదవిన తెలుగు పుస్తకాలో గాని ఈ పదాన్ని గమనించడం జరగలేదు. సాధారణంగా ధన్యవాదాలు లేక కృతజ్ఞతలు లాంటి పదాలు చూసాను గాని ఈ నెనర్లు అన్నది చూడటం బ్లాగులోకం లో నే.

ఈ పదమేమన్నా బ్లాగులోళ్ళ చే తెలుగులోకానికి చేర్చబడ్డ కొత్త పదమా? ఎవరైనా సందేహం తీర్చగలరు?

జిలేబి.

Sunday, January 25, 2009

జనార్ధన మహర్షి కొత్త పుస్తకం- గుడి

ఈ జనార్ధన మహర్షి అనబడే కందమూరి జనార్ధన రావు అనబడే మేము అతని కాలేజీ డేస్ లో ధనాధన్ అని పిలవబడే ఆసామి గురించి తీరికున్నప్పుడు రాస్తాను ప్రస్తుతానికి ఈ అబ్బాయి (ఇప్పుడు పెద్దవాడయ్యేడు కాబట్టి అబ్బాయి అని చెప్పకూడదేమో ?) వ్రాసిన "గుడి" పుస్తకం క్రింది స్థలం లో దొరుకుతుంది. ఈ జనార్ధన మహర్షి సినిమా ఫీల్డ్ లో కామెడి ట్రాక్ మూవీస్ లో ప్రసిద్ధులు. తనికెళ్ళ భరణి గోష్టి లో ప్రముఖులు.

గుడి
రచన: జనార్ధన మహర్షి
ప్రతులకు:రచయిత పేర, జి-2, కృష్ణ అపార్ట్మెంట్స్,
ఎల్లారెడ్డి గూడ , హైదరాబాద్- 500 073
pages: 151 Price: Rs.100/-

జిలేబి.

Saturday, January 24, 2009

ఈ మాట-ఎల్లలు లేని ప్రపంచానికి ఎలెక్ట్రానిక్ పత్రిక

ఈమాట తెలుగు పత్రిక చాలా రోజుల తరువాత చదవం జరిగింది. వెబ్ ప్రపంచం లో ఈ http://www.eemaata.com పత్రిక నిజం చెప్పాలంటే ఓ తెలుగు వెలుగు తేజం. చాలా మంచి వ్యాసాలూ కథలు కవితలతో రెండు నెలలకో సారి వెబ్ లో ప్రత్యక్షం అవుతుంది. ఎల్లలు లేని ప్రపంచానికి ఇది ఎలెక్ట్రానిక్ పత్రిక.
సావకాశం గా చదువుకోడానికి వీలుగా ఉన్న పత్రిక. వీలున్నప్పుడు చదవడానికి ప్రయత్నించండి. తెలుగు ని మనసారా ఆస్వాదించండి.

బ్లాగులోకంలో మీ
జిలేబి.

Tuesday, January 20, 2009

ది మాంక్ హూ బాట్ హిస్ బుల్లక్ కార్ట్

ఈ శీర్షికకి ప్రేరణ Robin Sharma పుస్తకం "The Monk Who Sold his ferrari". Bullack Cart కొనకుండా ఎట్లా ఫెర్రరి అమ్మడం? బుల్లక్ కార్ట్ ఎప్పుడో ఒకప్పుడు ఈ మాంక్ కొని అప్పట్నుంచి సాధించిన లేక సేకరించిన ధనం లేకుండా ఈ ఫెర్రరి అమ్మడం సులభం కాదని నా ప్రగాడ విశ్వాసం. ఎందుకంటారా మనిషి జీవనపథం లో ఎప్పుడో ఒకప్పుడు బుల్లక్ కార్ట్ నుంచే జీవితం మొదలెట్టేడు కాబట్టి.

బుల్లక్ కార్ట్ నుండి జీవితం మొదలెట్టి ఈ భూప్రపంచంలో ఈ మానవుడు ఇప్పుడు ఫెర్రరి స్టేజి కి వచ్చినా కూడా ఫెర్రారి ని వదిలి పెట్టనిదే మెంటల్ పీస్ లేకుండా పోవడం ఈ మానవ లోకం చేసుకున్న పుణ్యమో లేక ప్రారబ్ధ కర్మయో ఎవరు చెప్పగలరు? ఎంతైనా ఫెర్రారి కన్నా మెంటల్ పీస్ గొప్పదని మాంక్ గా మారిన ఆ అడ్వకేట్ ఆ కథలో చెప్పడం లో రాబిన్ శర్మ ఇండియన్ ఫిలాసఫీ ని వెస్ట్రన్ వరల్డ్ కి మళ్ళీ తీసుకు వెళ్ళడంలో సఫలీక్రుతులయ్యారని చెప్పవచ్చు.
జిలేబి.