ఆయ్య బాబోయ్ నేను కొత్త సినిమా టైటిల్ కని పెట్టేసాను. బ్లాగ్లోకం లో భామామణి ఆ సినిమా టైటిల్ పేరు! ఈ మధ్య కొత్త కొత్త పేర్లు కనుక్కోవడం లో నేను మరీ ఎక్స్పెర్ట్ అయిపోయ్యానోచ్ అని నన్ను నేను మరీ పోగిడేసుకున్నా!
ఇంతకీ విషయం ఏమిటంటే శ్రీ తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం గారు ఈ బ్లాగు కి మునుపు టపాలో ఈ ప్రశ్న వెయ్యడం ఈ టపాకి మేటర్ అయ్యింది. శ్రీ తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం ( చాల పెద్ద పేరు కాబట్టి సంషిప్తం గా "తాలబాసు" గా పిలుస్తాను వీరిని ) గారు ఈ సందేహం లేవదీసారు!
తాలబాసు వువాచ:
"
అది సరే ! ఏమనుకోవద్దు. ఒక విషయం చెప్పండి. ఇంతకీ మీరు మగ బ్లాగరా ? మహిళా బ్లాగరా ? మీ ప్రవర (profile) లో ఏ వివరాలూ లేవు. అందుకని అడుగుతున్నానంతే !"
ఈ వ్యాఖ్య ని చదివాక ఈ టపా కి ఈ "బ్లాగ్లోకం లో భామామణి " కి అని నామకరణం చేసినాను. ఎందుకంటే వరూధిని అన్న పేరుతొ బ్లాగు స్టార్ట్ చేసిన తరువాయీ సిరిసిరిమువ్వ blaagaru గారు "ఏమనడోయ్ జిలేబి గారు మీరు నాపెరుతో బ్లాగు స్టార్ట్ చేసినారు. నా స్నేహితులు ఈ బ్లాగు నాదేనా అని అడుగుతున్నారు" అన్నారు!
ఇప్పుడేమో "తాలబాసు" గారు మీరు మగ బ్లాగర లేక మహిళా బ్లాగారా అని నిక్కదీసి ప్రశ్న వేస్తున్నారు!
తెలియక అడుగుతాను నేను చేసిన నేరమేమి తిరుమలేశా? అంతా విష్ణు మాయ లా ఉందండోయ్!
ఛీర్స్!
జిలేబి.
సమస్య - 5006
-
18-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుమతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్”
(లేదా...)
“కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూ...
13 hours ago
మీ బ్లాగుకు వరూధిని అని సిరిసిరిమువ్వ బ్లాగరి పేరు ఎందుకు వుంచారో వివరించగలరు. మీరు మహిళయో, పురుషుడో చెప్పటం ఇష్టం లేకపోతే, చెప్పవద్దు.
ReplyDeleteఅయ్యా సీ బీ రావు గారు-
ReplyDeleteఈ బ్లాగు కి వరూధిని అని పెరు ఎందుకొ పెట్టానో అన్న ప్రశ్నకి వివరణ నా మొదతి తపాలో ఇచ్హను. గమనించగలరు సీ బీ రావు గారు.
ఛీర్స్!
జిలేబి.
జిలేబీ గారు,
ReplyDeleteఅంటే వరూధిని గారు సిరి సిరి మువ్వ పేరుతో రాసినా ఆవిడ పేరు అందరికీ తెలుసు. నిజానికి నేనూ వరూధిని పేరుతో బ్లాగు పేరు చూసి ఆమే మరో బ్లాగు మొదలెట్టారనుకున్నాను. మీ బ్లాగు పేరు బాగుంది అందంగా!
మీరు స్త్రీ బ్లాగరైనా, పురుష బ్లాగరైనా రాసే రాతలను చూస్తాం గానీ మిమ్మల్ని కాదు కదా! (ఆనీ రాసేది ఆడదా, కాదా అని చూసి తిట్టాలనుకునే వారు కూడా ఉంటారనుకోండి).మీరు రాయలసీమ కబుర్లు బాగా చెప్తారని మీ బ్లాగు వల్ల తెలిసింది. మీ నుంచి మరిన్ని మంచి పోస్టులు ఆశిస్తున్నాం!
అన్నట్టు మీరు మీ మొదటి పొస్టులో వరూధిని ప్రవరాక్య అని రాశారు. అది ప్రవరాఖ్య..! వత్తు "ఖ"!
సుజాత గారు-
ReplyDeleteవ్యాఖ్యలకి ధన్యవాదాలు. మొట్ట మొదటి ఆ టపా రాయడానికి చాలా కుస్తీ పడి (అప్పటికి లెఖిని ఉందని తెలియదు!) హమ్మయ్య ఓ వాక్యం రాయగలిగానని సతొషపడి పొయ్యాను. సవరించినందులకి ధన్యవాదాలు.
రాయలసీమ గురించి అప్పుడప్పుడు రాస్తూంటాను - వీలైనప్పుడు బ్లాగుని చూడండి.
చీర్స్
జిలెబి