ఓ మారు ఓ చినీయుల గ్రామాన్ని ఓ భూతం పట్టు వదలని విక్రమార్కునిలా పట్టేసుకుని జనాల్ని సతాయించిందట. ఆ కాలం లో గ్రామ వాసులంతా దగ్గిరలో ఉన్న అడవి రాజు సింహం గారిని ప్రార్థించి "సింహం దేవరా మా మొర ఆలకించి ఈ భూతం గాడి భరతం పట్టించండి అని మొర బెట్టుకుంటే సింహం రాజ వారు హుష్ కాకి అని మనం కాకి ని తరిమే నిమేశంలో ఈ భూతం గాడిని గ్రామ పరిసరాల్లో నించి వెడల గొట్టేసారట. అప్పట్నించి సింహం వారు చినీయుల ఫేవరెట్ అయిపోయ్యేరని కథా కమామీషు.
ఆ తరువాయి మరో మారు మరో భూతం ఆ గ్రామస్తుల్ని పట్టేసుకుని సతాయిస్తూంటే ఈ మారు గ్రామస్తులు సింహం రాజ వారిని వెతికే ప్రయత్నం చేస్తే సింహం వారు అసలు కనిపించ కుండా పోవడం తో ఏమి చెయ్యాలో అని పాలు పోక ఆలోచనలో పడి ఉంటే అక్కడ ఉన్న కుర్ర కారు "పెద్దలు మేము సింహం వేషం కడతాము మీరు డంకా భాజాయించండి సుమీ " అని ఆలోచన ఇచ్చేరు. ఈ ఆలోచనేమో బాగున్నట్టున్దేనని వారు భావించి సింహం వేషం లో కుర్రకారు న్రిత్యం చేసి భాజా లో డంకా లో మ్రోగిస్తే ఆ మోతకి భూతం గారు నిజమ్గా సింహం వచ్చేసిందని భయపడి పోయి పరుగు లంకించు కోవడం తో అప్పట్నించి చెడుని పార ద్రోలదానికి ఈ సింహ నృత్యం చెయ్యబడుతుందని - సాంప్రదాయం అయిందని కథా పురాణం.
ఈ కోవలో చినీయుల నూతన సంవత్సరమప్పుడు ఈ సిమ్హ నృత్యం సాంప్రదాయ పద్దతి లో పాతని పార ద్రోలి కొత్తని ఆహ్వానించడం అన్న భావ వీచికగా మొదలయ్యి ఇప్పుడు ఈ సిమ్హ నృత్యం చెసేవాళ్ళు ఒక కళాకారులుగా గుర్తించబడెంతవరకు ప్రాచుర్యంలొ కి వచ్హింది.
ఈ కథా నేపధ్యం లొ ఇక్కడ ఒక అపురూపమైన సిమ్హ నృత్యం ఫోటో ఇచ్హాను. ఇది ఈ సంవత్సరం చినీయుల నూతన సంవత్సరం (ఈ సంవత్సరం వీళ్ళకి "ఎనుబొతు" సంవత్సరం) అప్పుడు శింగపూర్ వ్యాపార దృష్ట్యా వెల్లినప్పుడు తీసిన చిత్రం ! కనులవిందుగా ఉందని భావిస్తాను. ఇదే మొదటి మారు ఇలా కమ్మీల పై ఈ సింహ నృత్యం చూడడం నా వారకైతే. ఈ సింహ వేషధారులు కుర్రకారులు కళా కారులు.
జిలేబి.
మధుమేహం ( షుగర్ )
-
*నవంబరు 14 మధుమేహ నివారణా దినోత్సవం సందర్భంగా మధుమేహం గురించి ఓ చిన్న
కధనం...,, *
*మధుమేహం ( షుగర్ ) ఒక వ్యాధి కాదు అనేక వ్యాధుల సమ్మేళనం.మధుమేహవ్యా...
5 hours ago
No comments:
Post a Comment