సాంబ్రాణి ధూపం కడ్డీ అన్న పదం లా ఉన్నదీ టపాలు శీర్షిక! బ్లాగ్లోకం లో నివసించే, బ్లాగ్మానవులకి ఏదైనా కొత్త పదం పెట్టాలని అనిపించడం తో ఈ శీర్షిక పై ఈ తపాలు!
రాజా రాణీ కథలు మనం చాలా చదివే ఉంటాం. బ్లాగ్లోకం లో కూడా రాజులు రాణులు ఉంటారా? ఉండవచ్చని నా ఊహ. ఈ మధ్య మాంద్యం సమయం లో చాలా మంది అభివ్రిద్ది చెన్దిన దేశాలలో అంతర్జాలానికి అంకితమై పోయి జీవిస్తున్నట్టు భోగట్టా. ఇట్లాంటి సమయం లో ఈ అంతర్జాల రాజ్యానికి ఎవరికీ వారే రాజులు రాణులు గా చలామణి అవుతున్న బ్లాగ్ రాజులు బ్లాగ్ రాణులు తస్మాత్ జాగ్రత్త గా ఉండడానికి ప్రయిత్నించాలి. ఎందుకంటే ఈ బ్లాగించడమన్నది వ్యసనం లా అయితే - ఒక్కో మారు నాకూ అనిపిస్తుంది ఈ బ్లాగడం నిజాంగా అవసరమేనా అని- ఇక నిజా జీవితంలో జీవించడం తగ్గిపోతూ వచ్చి మానవుడు అంతర్జాలం లో కి నెట్టబడి ఓ విధమైన మాయా లోకంలో వేల్లిపోతాడేమో నని కూడా సందేహం వస్తుంది. సో బ్లాగు సోదరీ సోదరులారా ఇది నా స్వంత అభిప్రాయం మాత్రమె. మీరే మంటారో అని కుతూహలం ?
మీ బ్లాగేశ్వరి
జిలేబి.
సమస్య - 5006
-
18-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుమతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్”
(లేదా...)
“కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూ...
13 hours ago
సరిగ్గా చెప్పారు. మనిషి ఒంటరితనాన్ని పోగుట్టుకోవడానికి ఏదో ఒక అలవాటు చేసుకుంటాడు. అది కాస్తా వ్యసనమవుతుంది. ఆ విషయం ఎంత తొందరగా గ్రహిస్తే అంత మేలు.
ReplyDeleteఅవును, ఒక్కోసారి నిజజీవితంలో కంటే ఈ మాయా ప్రపంచంలో జీవించడం ఎక్కువయిపోతున్నట్టు నాకూ అనుమానంగా ఉంది. దీనివల్ల ఏదో రాస్తున్నామనే తుత్తి తప్ప, మరేమీ లాభం లేదు. పైగా ఇంటర్నెట్ ఖర్చొకటి!
ReplyDeleteఅయితే ఇంతకీ మీరూ "బ్లాగ్రాణే" అన్నమాట.
బ్లాగడం మీకు వ్యసనమైపోయిందా?. ఐతే మీరు "బ్లాగేశ్వర స్వామి దీక్ష" చేయవలసిందే. వివరాలకు క్రింది లింకును చూడండి.
ReplyDeletehttp://nagaprasadv.blogspot.com/2008/12/blog-post_4514.html
నిజంగా ఇది వ్యసనమే.
ReplyDeleteవ్యసనం కాదనుకుంటాను కానీ టపా వ్రాసిన తరువాత మన టపాకి నెగటివ్ రెస్పాన్సెస్ వచ్చాయో, పాజిటివ్ రెస్పాన్సెస్ వచ్చాయో తెలుసుకోవాలన్న ఆత్రుత ఎక్కువ ఉంటుంది. దాని వల్ల మాటి మాటికి బ్లాగ్ ఓపెన్ చేసి చూడాలనిపిస్తుంది. డిస్కషన్స్ బోర్డ్స్ వాడే రోజుళ్ళో కూడా అలాగే జరిగేది. నా ఫ్రెండ్ క్రియేట్ చేసిన http://srikakulamonline.com/blog లో కామెంట్స్ లాక్ చెయ్యడానికి కారణం ముందు జాగ్రత్తే.
ReplyDelete--- మార్తాండ
తప్పుగా అనుకోవద్దు..
ReplyDeleteవరూధిని ఎంత అందమయినపేరు..
'ఒక్కో మారు నాకూ అనిపిస్తుంది ఈ బ్లాగడం అన్నది "గుల" అని-'
మరి ఈ రాతలో కొంచం ఇబ్బందిగా లేదూ...
శ్రీనివాస్ గారు-
ReplyDeleteనెనర్లు. సవరణ చూపినందులకి.
జిలెబి.
బ్లాగరు స్నేహితులకి-
ReplyDeleteకామెంతినందులకి అలరారు ధన్యవాదాలు. నాగప్రసాద్ గారు మీ వ్రతం నిజంగా చాల భెషుగా ఉందండోయ్. అంతా బ్లాగెస్వర స్వామి మాయ!
జిలేబి.