Tuesday, May 29, 2012

మూడో మొగుడి నాలుగో పెళ్ళాం

సుభద్ర ఎట్లా శ్రీ కృష్ణుల వారికి చెల్లెలు అని అడిగారు జై గొట్టి ముక్కలు వారు.

దానికి సమాధానం టపీమని ప్రవీణ్ శర్మ చెప్పెసేరు (అబ్బాయి ప్రవీణుడు స్ట్రైట్ సమాధానం ఇవ్వడం ఇదే మొదటి సారి నేను చదవడం!) - వసుదేవ రోహిణి ల కుమార్తె సుభద్ర అని , సో, సుభద్ర శ్రీ కృష్ణుల వారి చెల్లెలు అని.

శ్రీ కృష్ణార్జునుల మైత్రి జగద్విదిత విషయం. ఈ విషయమై ఆలోచిస్తా ఉంటే ఫక్కున నవ్వు వచ్చింది.

చెల్లెలు సుభద్ర వివాహం అర్జునిని తో గావించడానికి శ్రీ కృష్ణుల వారి నాటకం (శ్రీ కృష్ణార్జున యుద్ధం లో రసవత్తరమైన ఘట్టాలు ఉన్న సన్నివేశాలు ఉన్నాయి మరి !- తపము ఫలించిన శుభ వేళ .. )

కథా పరం గా రక్తి కట్టించే అంశం ఏమిటంటే, 'సుభద్రా సహిత అర్జునుల' 'ఎలోప్మేంట్' సందర్భం లో సుభద్ర ని శ్రీ కృష్ణుల వారు రథాన్ని సారధ్యం వహించ మనడం, దానిని కారణం గా చూపి, అర్జునుడు సుభద్ర ని లేవ దీసుకు పోలేదు, సుభద్రే మనసు పడి అర్జునిని లేవ దీసుకు పోయింది కాబట్టి ఇందులో అర్జునిని తప్పేమి లేదు సుమీ అని అర్జునినికి శ్రీ కృష్ణుల వారు వకాల్తా పుచ్చు కోవడం !

ఎంతైనా అర్జునుని మీది అవ్యాజమైన ప్రేమ శ్రీ కృష్ణుల వారి ది మరి.

 మైత్రీం భజరే !

ఇక ఈ టపా శీర్షిక మూడో మొగుడి నాలుగో పెళ్ళాం ఎవరు అంటే సుభద్రా దేవే కదా మరి? అర్థం అయ్యిందా ? అర్జునిని ద్రౌపది, చిత్రాంగద, ఉలూపి తరువాయి సుభద్ర నాలుగో భార్య కదా మరి అర్జునుల వారికి ?

ద్రౌపది వరమాల తో అర్జునిని వరిస్తే, తల్లీ భిక్ష తెచ్చామని కుంతి తో ఐదుగురు కొమరులు అంటే, ఆ తల్లి భిక్షని సమంగా పంచుకొండీ అంటే, పాంచాలి పంచ భర్తృక అయ్యింది. అర్జునుడు ద్రౌపది కి మూడో మొగుడన్న మాట .

ద్రౌపది, చిత్రాంగద, ఉలూపి ల తో చేర్చి మువ్వురు భార్యలని అక్కున చేర్చుకున్న అర్జునినికి (మూడు మళ్ళీ!) సుభద్ర తన మనసుని దార పోసుకుని నాలుగో పెళ్ళాం అయ్యింది.


వీరి జీవితం లో ని మరో అపూర్వ సంఘటన అభిమన్యుని జననం. తండ్రి కై అభిమన్యుని మరణం, ఆ పై అభిమన్యు ఉత్తర ల పుత్రుడు పరీక్షిత్తు మొత్తం కౌరవ వంశానికి ఏకైక వారసుడు గా మిగలడం ఆ పై ఆతని మరణం తక్షకుని  ద్వారా ...  ఆ పై జనమేజయ వృత్తాంతం, ....

సో, జై గొట్టి ముక్కలు గారు, మొత్తం మీద, మీ ప్రశ్న కి సమాధానమూ, ఈ చిన్ని టపా అంతా మీ అమ్మాయి చిన్ని ప్రశ్న తో మొదలు !

చిన్ని బుర్రల ప్రశ్నల తోనే కదా పెద్దవాళ్ళు కూడా చదవడం నేర్చుకునేది మరి !

మీ ప్రశ్న కి సమాధానం ఏమిటబ్బా అని ఆలోచిస్తూ ఉంటే, గూగల్ ఘటోత్కచుడు (!) అట్లా ఇట్లా లాగించి మొత్తం మీద ఇండోనేషియా లో ని ఒక అపూర్వ మైన అర్జునిని విగ్రహాన్ని చూపెట్టేడు !



Raja Ravi varma - Arjuna Subadhra





ఎక్కడి నించో కథ ఎక్కడికో వెళ్లి పోయింది మరి !

చీర్స్
జిలేబి.

28 comments:

  1. Replies
    1. వావ్! కథ ఎక్కడికి వెళ్ళింది. !? బాగున్నది.
      చిత్రాలు చాలా బాగున్నాయి.
      ధన్యవాదములు..జిలేబీ గారు.. చీర్స్!
      అచ్చు తప్పులు వల్ల పై కామెంట్ డిలేట్ చేసాను.అంతే!

      Delete
    2. వనజ వనమాలీ గారు,

      ఆహా ! నెనరస్య నెనరః!

      జిలేబి.

      Delete
  2. చాలా బాగుంది. మీరూ మాలా అయిపోతున్నట్లుంది, చూడగా.

    ReplyDelete
    Replies
    1. కష్టే ఫలే వారు,

      అంతేనంటారా !

      జిలేబి.

      Delete
  3. ఉలూపి, చిత్రాంగద సిరీస్ లో ప్రమీల కూడా ఉందనే అనుకున్నానే నేను. ఆ సిరీస్ లోనే స్త్రీ సామ్రాజ్య చక్రవర్తిని ప్రమీలను కూడా చేసుకున్నాడు అనుకుంటాను. సుభద్ర ఐదు అయినా ఉండాలి లేక రెండు అయినా అయి ఉండాలను కుంటాను.

    తప్పులున్న క్షమించవలెను.

    ReplyDelete
    Replies
    1. బులుసు గారు,

      ప్రమీలా, చిత్రాంగద ఒక్కరే నేమో నండీ. బభ్రువాహనుడు అబ్బాయి అంటున్నారు కాబట్టి ఒక్కరే అనిపిస్తుంది వీరిద్దరూ.

      జిలేబి.

      Delete
    2. ప్రమీలవేరు. ప్రమీలకథ భారతయుధ్దం తర్వాత యుధిష్టిరులవారు అశ్వమేధయాగం చేసినప్పుడు వస్తుంది.

      Delete
  4. చాలా థాంక్సండి.

    ReplyDelete
    Replies
    1. ధన్యావాదాలండీ జై గొట్టి ముక్కలు వారు.

      జిలేబి.

      Delete
  5. ప్రమీల భారతయుద్ధం తర్వాత అశ్వమేథయాగ సందర్భంలో వస్తుంది.అదీ జైమిని భారతంలోనే.వ్యాసభారతంలో లేదు.అందువలన ద్రౌపది, ఉలూచి,చిత్రాంగద,తర్వాత సుభద్ర అర్జునిడికి నాలుగో భార్య అవుతుంది.

    ReplyDelete
    Replies
    1. కమనీయం గారు,

      ప్రమీలా, చిత్రాంగద ఇద్దరూ ఒక్కరేమో నండీ ?

      జిలేబి.

      Delete
  6. వామ్మో !
    ఏమి post జిలేబి గారు !

    :)

    సరే కాని
    ఇవాల్టి మా మధ్యాహ్న భోజనం లో హర్యానా జిలేబి పెట్టారు
    Haryana J(z)ilebi in @ Haryana
    అది తినేప్పుడు మీరు జ్ఞాపకం రాలేదు కాని
    మీ blog లో ఈ post చూస్తుంటే
    ఆ 3 జిలేబి లు జ్ఞాపకం వచ్చాయి
    నెనర్లు

    ఈ ముక్తి కాంత పూజను సహితం చూసెయ్యండి పనిలో పని

    http://youtu.be/loW4jszosME

    ?!

    ReplyDelete
    Replies
    1. ఎందుకో ఏమో గారు,

      ముక్తి కాంత అయినా, కంట పడిన కాంత యే కాంత !

      చీర్స్
      జిలేబి.

      Delete
  7. తేలవు మొగుళ్ల లెక్కలు
    తేలవు పెళ్ళాల లెక్క తీగ లాగితే
    చాలా డొంకలు కదులును
    పేలెను శీర్షిక జిలేబి ! పేలెను కథనమ్ .
    ----- సుజన-సృజన

    ReplyDelete
    Replies
    1. లక్కాకుల వారు,

      భేషో అని మా బాగా చెప్పేరు !

      జిలేబి.

      Delete
  8. ఈ టపా యొక్క ముఖ్య ఆశయం ఎంటో అర్థం కావట్లేదు..మహా భారతం లోని అర్జనుడు నాలుగో పెళ్ళం సుభద్ర అవడం వల్ల ఎవరికి నష్టం, ఎవరికి కష్టం?
    మన నాయకులు, మనల్ని పరిపాలించే బాధ్యతగల అధినేతలు ఎంతో మంది ఎన్నో పెళ్ళిళ్ళు అధికారికంగా, అనధికారికంగా చేసు కున్నారు.. వాళ్ళ గురించి రాయండి... (వుదా: నెహ్రూ, తివారీ, మున్నగు వారు..) నేటి భారత దేశపు సగం జనాభా అక్రమ సంతానమే కదా.. ఎవరికి పుట్టేరో తెలీదు..ఏమైపోతారో తెలీదు..

    ReplyDelete
    Replies
    1. వోలేటి వారు,

      మీరు మరీ ఎక్కువ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు !

      జిలేబీ ఖబుర్లన్నీ ఉత్తుత్తి ఖబుర్లే! వీటికి ఒక ఆశయం ఇట్లాంటి హై ఫై మాటల్లాంటివి ఏమీ లేవు!

      టైం పాస్ బటాణీ లన్న మాట రిటైర్మెంట్ టైం పాస్ అంతే



      చీర్స్

      జిలేబి.

      Delete
  9. నాడో చిన్న (అ)ధర్మ సందేహం (మా అమ్మాయి అడగలేదు లెండి).

    స్వయంవరంలో గెలిచింది అర్జునుడు కాబట్టి ద్రౌపదికి అర్జునుడు మొదటి భర్త కావాలా? పాండవులు అయిదుగురిలో మూడో వాడు కాబట్టి మూడో భర్త కావాలా?

    "నాలుగో పెళ్ళాం" రుజువు అయింది కాబట్టి "మూడో మొగుడు" విషయం కూడా తేల్చండి, thanks.

    ReplyDelete
    Replies
    1. jai గొట్టిముక్కల గారు,
      అర్జునుడు గెలుచుకున్నా మొదట పెళ్ళి చేసుకున్నది ధర్మ రాజు, తరువాత భీముడు, తదుపరి మూడవవాడుగా అర్జునుడు, ఇప్పుడు మీ సందేహం తీరిందనుకుంటా.

      Delete
    2. థాంక్సండీ, మీరు చెప్పిన కోణం (sequence of marriage) నాకు తట్టలేదు.

      Delete
    3. హమ్మయ్య!

      కష్టే ఫలే వారు సమాధానం ఇచ్చేరు కాబట్టి నాకో పని తగ్గింది!

      అర్జునుడు గెలిచిన వాడు. ద్రౌపది వరమాల తో అర్జునిని వరించింది. భిక్షకులకు అందిన భిక్ష ద్రౌపది. తల్లి మాట మీద బిక్ష ని పంచు కున్నారు. భిక్ష ఏమిటో తెలిసాక కుంతి మనసు బాధ పడ్డది. శ్రీ కృష్ణుల వారు అరుదెంచి, మళ్ళీ మరో కోణం లో దీన్ని (ద్రౌపది వివాహాన్ని ఐదు గురు భర్తలతో ) విశ్లేషించి, ఇది సరి అయినదే అని చెప్పేదాకా కుంతి మనసు దిటవు పడలేదు

      జిలేబి.

      Delete
  10. @కమనీయం గారు,

    అశ్వమేధ యాగ సందర్భం లో ప్రమీలార్జునుల పుత్రుడు బబ్రువాహనుడు అర్జునుడిని ఓడిస్తాడు అని విన్నాను. సినిమా కూడా చూసాను. అర్జునుడు తీర్ధ యాత్రలకి వెళ్ళినప్పుడే ప్రమీలని చేసుకున్నాడనే విన్నాను. ఏమో మరి.

    ReplyDelete
    Replies
    1. బులుసు గారు,

      చిత్రాంగద అర్జునుల కొమరుడు బభ్రువాహనుడు. ప్రమీలా చిత్రాంగద ఒక్కరే నేమో.

      రెండు, చిత్రాంగద మణిపుర దేశ వాసి (మణిపుర దేశ రాజు చిత్రాంగుని కుమార్తె) అని చెప్పబడు తుంది.

      తమిళ హరికథా శ్రేష్ఠులు టీ ఎస్ బాలకృష్ణ శాస్త్రి గారి హరికథ 'సుభద్రా కళ్యాణం'లో వారు చెప్పనది ఏమిటంటే, చిత్రాంగద 'మణగూర్' (ఇప్పటి అరవ దేశపు మదురై) వాసి అని. మదురై రాజు చిత్రాంగుని కుమార్తె చిత్రాంగద అని వారి కథనం.

      అర్జునుడు, తన తీర్థ యాత్రలలో గంగా తీరం లో ఉలూపి ని కలవటం, అక్కడి నించి దక్షిణ దిశ గా వచ్చి మదురై లో చిత్రాంగద నిపెళ్ళి యాడడం, ఆ పై పడమర దిశ గా వెళ్లి ద్వారక లో సుభద్ర ని వివాహం చేసుకోవడం ఇట్లా సాగుతుంది వారి హరి కథా ప్రవచనం.

      Delete
  11. ఇండోనేసీన్ అర్జునుడు అదుర్స్

    ReplyDelete
    Replies
    1. పీ క్యూబ్ గారు

      ధన్యవాదాలండీ

      జిలేబి.

      Delete
  12. మరేమోనండి మీరు పప్పులో కాలేసారండి. అర్జునుడు మూడోమొగుడేనండి కానీ మొదటి మొగుడు ధర్మరాజు కాదండి. అయ్. మరండి ధర్మరాజు ముందు పెళ్లచేసుకుంటే మిగిలిన వారికి వదిన అవుతుంది కదండి. మరేమోనండి వదిన అంటే తల్లిలో సమానమండి. ఆయ్ మరేనండి. అందుకనండి ముందుగా సహదేవుడు తాళికట్టాడండి, చివరకి ధర్మరాజు కట్టాడండి. ఇదండి ఇప్పటిదాకా నేను విన్న చదివిన కధండి. మరండి మీరు మరోసారి చూసుకోండి.

    ఇంకానండి ప్రమీల ప్రమీలేనండి, చిత్రాంగద చిత్రాంగదేనండి. ప్రమీల చిత్రాంగద కాదండి.

    ఆయ్ ఇదండి నేను చెప్పదలచుకున్నది.

    ReplyDelete