Saturday, June 1, 2013

పోట్లాట ఆపటం ఒక 'కల' !!


 
ఆ మధ్య పోట్లాడు కుందాం రండి అంటూ 'ఉత్థిష్ఠ జాగృత ' అన్నట్టు పిలుపు నిచ్చి టపా కొడితే, కాలక్షేపం కబుర్లు శర్మ గారు, పోట్లాట ఒక కళ , దాన్ని మొదలు పెట్టడం చాలా తేలిక, ఎక్కడ ఆపాలో తెలిసుంటే నే  అన్నారు కామెంటు కాణీ  పెడుతూ .  . 
 
ఈ వాక్యం బాగుందండీ - పోట్లాట ఒక కళ  - అని దాని మీద ఒక టపా కొట్టండి అంటే, సత్తి బాబుని పిలుచు కొచ్చి ఓ బ్రహ్మాండ మైన టపా కొట్టేరు కాలక్షేపం కబుర్లు - అవి ఒట్టి కబుర్లు కావు, ఎక్స్పెరియన్స్ కా బుర్రలు!
 
ఇంతకీ ఈ మధ్య వరస బెట్టి టపాలు గట్రా రాస్తూ, అట్లా మా అయ్యరు గారికి పనులు అప్ప జెబ్తూ , అజామాయిషీ చేస్తూ, ఆఫీసు పనుల్లో 'జిలేబీ మేమ్  సాహేబు మళ్ళీ ఎందుకు ఉద్యోగం లో రీ తయారు  అయ్యింది రా బాబోయ్ అని మా ఆఫీసు వాళ్ళు తల బట్టు కునేటట్టు జుట్టు ఊడ బెరుక్కునేటట్టు టెర్రర్ అయి పోతే, ఓ శుభోదయాన డామ్మని మా అయ్యరు  గారు నా వాలకం జూసి, ఇదిగో జిలేబీ నిన్ను వెంటనే డాక్టరు దగ్గిరకి తోలు కెళ్లా లే అన్నారు నా వాలకం జూసి . 
 
నే అన్నా, ఆయ్ , మన శరీరం గురించి మనకు తెలీదా, ఇందులో ఇంజిను పని జెయ్యక బోతే మనకు తెలీదా, ఆ పాటి దానికి ఆ 'పని లేక' డాటేరు ' బాబులు ఎమ్దుకో అంటే, తట్ తట్  జాన్తా  నాయ్ అంటూ మా అయ్యరు గారు నన్ను డాక్టరు గారి ముందు నిలబెట్టేరు . 
 
చూద్దును గదా, ఈ డా టేరు బాబు అచ్చు మన పని లేక రమణ బాబులా ఉన్నారు. వామ్మో అని కళ్ళు నులుముకుని జూస్తే, మళ్ళీ రూపం చెదిరి వేరే ఎవరి లాగో అనిపించేడు . అంతా నా 'బ్లాగ్' 'భ్రమణం' వల్ల వచ్చిన చిక్కు అనుకుని నమస్తే అన్నా . 
 
య, అయాం  రమణ అన్నారు వారు. 
 
చచ్చాం బో అనుకున్నా. జీవితం లో మనకు ఇట్లా కో ఇన్సిడెన్స్ అయ్యే వి చాలా ఎక్కువగా ఉంటా యేమో  . 
 
మా అయ్యరు గారు నా గురించి చింతాక్రాంతులై వచ్చీ రానీ  తెలుగులో ఆ డాటేరు బాబు కి విశ దీకరించేరు - ఈ జిలేబీ నానాటికి బ్లాగు పక్షి అయి పోతున్నాది అండీ అని 
 
డా టేరు బాబు అచ్చు రమణ బాబు గారి టపా లా నన్ను విశ్లే 'చించి' ఇదిగో అయ్యరు గారు మీకు జిలేబీ దక్కా లంటే జిలేబీ ని ఆ కంప్యూటరు ముట్టుకో వద్దని జెప్పండి అన్నాడు . 
 
నేను ఒప్పుకుంటా నా ! పోట్లాట పెట్టు కున్నా ఆ డాటేరు  బాబు తొ. ఆయ్ , మనకు నచ్చింది మనం జేస్తే, అది మంచి హాబీ కదా ఆ పాటి దానికి నేనెందుకు నా వ్యాపకాన్ని ఆపు జేసు కోవాలి ? శ్రీపాద వారేం జెప్పారు ? అంటూ లెక్చరు పుచ్చు కున్నా ఆ డాటేరు  గారికి. 
 
డా టేరు  బాబుకి హార్ట్ అటేక్  వచ్చే సింది ! 'ఇదిగో అయ్యరు  గారు మీరు ఈవిడ్ని ఇక్కడ నించి తీసు కు వెళ్ళండి లేకుంటే నాకు టెన్షన్ వచ్చేస్తోంది అనడం దాకా వచ్చేసింది ఆయన పరిస్థితి !
 
వచ్చే దార్లో చెప్పా, అయ్యరు వాళ్ ' మన శరీరం గురించి మనకు తెలీదా అని నే  జెప్పా' గా అన్నా 
 
మా అయ్యరు గారు పోట్లాట పెట్టుకుని, ఇదిగో జిలేబీ ఈ బ్లాగు వ్యాసంగం మానేయ్ అంటే, పొతే పోనీ మీ కంటూ టపా ఒక్క నెల రాయ కుండా ఉంటా ! కాని కామెంటు 'మెంతులు ' బ్లాగ్ దియా భేటీ' స్  కి స్వచ్చమైన మందు అది మాత్రం మా నన్నా  !
 
నిజమే ! నువ్వు ఒక్క నెల టపా రాయకుండా మానేస్తా వటే  ? అన్నారు బుగ్గ గిల్లి .
 
ఛీ ఈ వయసులో ఇదేంటి అంటే ! 'హనీ మూన్ డేస్ ' గుర్తు కోచ్చేయి అనేరు !
 
ఔరా, కాళ్ళు కాటి కి లాగుతూంటే, హనీ గుర్తుకు రావటమేమిటి అను కుని  दांतों तले उंगली दबाया मैंने !!
 
అట్లాగే పట్టు బట్టి ఓ నెల రాయకుండా ఉన్నా ! మన సత్తా మనకు తెలీక పొతే గెట్లా  మరి !
 
రెండో రోజు నా చేతులు బ్లాగు రాయక జివ్వు మనటం  జూసి అయ్యరు  గారు పొతే పోనీ జిలేబీ నీకు చదవటానికో  మంచి పుస్తకం తీసుకొచ్చా అన్నారు !
 
తెచ్చిన పుస్తకం Deciphering the Cosmic Number by Arthur I Miller.
 
ఎంతైనా మా అయ్యరు గారు మా అయ్యరు గారే !  సో, ఈ ఒక్క నెలలో చదివిన పుస్తకం ఇదన్న మాట !
 
ఇంతకీ ఈ కాస్మిక్ నెంబర్ ఎమిటం టారా  ఒకటి మూడు ఏడు  ! 137 !  ఈ నెంబరు చూస్తె మీకు ఏమి గుర్తు కొస్తుంది ? సరే ఈ  పుస్తకం మీద తరువాత టపా రాస్తా , నా కనిపించిన విశేషాలు ఈ నెంబరు పై !
 
కాబట్టి, పోట్లాట ఆపటం ఒక కల ! కల కానిది నిజమైనది ! పోట్లాట లో ఉంది మజా అది అనుభవించితే తెలియునులే ! అంటూ .... 
 
 

 
 
 
శుభోదయం !
చీర్స్ 
జిలేబి 

1 comment:

  1. 137 is a prime number like 143 :) Ayyarji had remembered honey in moon :)

    ReplyDelete