Tuesday, June 4, 2013

కామెంటిన కనకాంగి కోక కాకెత్తుకు పోయిన చందం !

కామెంటిన  కనకాంగి కోక కాకెత్తుకు పోయిన చందం ! ఓ రెండు సంవత్సరాల మునుపు రాసిన 'బ్లాగ్వెతలు  ఎంజాయ్ !!

నా కలలో పండిన ' బ్లాగ్వెతలు' !
 


కామెంటిన కనకాంగి కోక కాకి ఎత్తుకు పోయిందని ....

 
టపా టప టప టైపాడిస్తే చాలదు , కామెంట్లూ పండాలి


జగమెరిగిన బ్లాగరునికి సంకలిని ఏల ?

 
కానక కానక కామెంటు పెడితే , కరెంటు పోయిందట !

 
ఈ బ్లాగుకి ఆ బ్లాగు ఎంత దూరమో, ఆ  బ్లాగుకి ఈ బ్లాగు కూడా అంతే దూరం !

 
కొత్త బ్లాగరు 'కూడలి ' వదలడు, కొత్త బ్లాగిణి హారం వదలదు!

 
టపాలు రాసి కూడలి లో కామెంట్లకోసం దేబరించే మొహమూ నువ్వూను !

 
చీర్స్ సరిగ్గా చెప్పలేని  చెంచు లచ్చి , బ్లాగాడటానికి వచ్చిందట
 

 
చీర్స్
 జిలేబి.

12 comments:

  1. బ్లాగ్ సామెతలు, సూక్తులూ యమస్సూపరో సూపర్ :-)

    ReplyDelete
    Replies

    1. పద్మార్పిత గారు,

      బ్లాగ్వెతలు మీకూ నచ్చినందుల కు ధన్య వాద్ !!

      జిలేబి

      Delete
  2. చీర్స్ జిలేబీ జీ!

    ఇంతకీ మొట్టారా ? తిట్టారా?

    ఈ బ్లాగుకి ఆ బ్లాగు ఎంత దూరమో, ఆ బ్లాగుకి ఈ బ్లాగు కూడా అంతే దూరం Vs అట్టు పెట్టిన వారికి అట్టున్నర పెట్టాలి :)

    ReplyDelete
    Replies

    1. వనజ వనమాలీ గారు,

      మొట్టటం తిట్టటం మనకు జాన్తా నాయ్ ! ఏదో సరదా గా శారదా భావ లాస్య విహారం అంతే !!

      నెనర్లు

      చీర్స్
      జిలేబి

      Delete
  3. చక్కెర వ్యాధితుని మెడలో జిలేబీల హారం వేసినట్లుంది!రాయని భాస్కరుడు ఒక టపా రాయకూర్చుంటే టప్పున కరెంట్ కొండెక్కిందట!నా గొప్ప బ్లాగుకు రానేరాడుకాని ఆయన వెర్రిబాగుల బ్లాగుకు వచ్చి ఆదినాకు నచ్చినట్లు కామెంటమంటాడు ఒక మెంటలోడు!నా బ్లాగ్ వీపు నీవు గోకు నీ బ్లాగ్ వీపు నేను గోకుతా!అనామకుడితో బ్లాగాడి చాటి చాటింపువేసి కన్నెపిల్ల నీళ్లాడినట్లు!బాబోయి మీ ఒరవడిలో నేనున్నూ రాయబోతే నాకు చేతకాక గీత దాటుతున్నాయి కనుక టాటా వీడుకోలు ఇంకసెలవు!

    ReplyDelete
    Replies

    1. సూర్య ప్రకాష్ గారు,

      వామ్మో, మీరూ మరిన్ని జిలేబీ బ్లాగ్వెతలు చెప్పే సే రండీ మరి !!

      చీర్స్
      జిలేబి

      Delete
  4. మీరు మరిచిపోయారు, మళ్ళీ మేమే గుర్తుచేశామోచ్! కామెంటిన కనకాంగికోక కాకెత్తికెళ్ళినట్లు మీరే అనగలరు. అది మీదే మీదే అనుమానం లేదు.
    జిలేబీ గారికి అభిమాన సంఘం పెట్టేం.మరి మీదే ఆలస్యం, మీకు బ్లాగ్ భూషణ్ బిరుదుకు పోరాడుతాం...ఊం! ...దయుంచాలి ....చిల్లర...బిరుదులు ఊరికే వచ్చేస్తాయా మరి...:)

    ReplyDelete
    Replies

    1. కష్టే ఫలే గారు,

      ఇంతకీ జిలేబీ అభిమాన సంఘం ఏమైనట్టండీ మరి ? ఆ ఒక్క రోజు తరువాయి అభిమాన సంఘం ఎక్తివిటీ ఏమీ లేనట్టుందే మరి జేకే !!

      చీర్స్
      జిలేబి

      Delete
  5. jilebee garu mee blog saamethalu soooooooper

    ReplyDelete
    Replies

    1. కే ఎన్ మూర్తి గారు,

      నా ఈ బ్లాగ్వెతలు మీకూ నచ్చినందులకు నేనరస్య నెనరః !!


      చీర్స్
      జిలేబి

      Delete
  6. please visit my blog
    http://ahmedchowdary.blogspot.in/

    ReplyDelete
    Replies

    1. అహ్మద్ చౌదరి గారు,

      మీ టపా కి లింకు ఇచ్చేరు ! ఇక విజయం చేయాల్సిందే మరి తెలుగు బ్లాగ్ వాహినీ !!

      జిలేబి

      Delete