ఉండమ్మా బొట్టు పెడతా ! అన్నా ఆ వచ్చిన అమ్మాయి తో .
ఆంటీ , ఈ బొట్టు ఇట్లాంటి వి పెట్టు కుంటే పెళ్లి అయి పోయినట్టు లెక్క . నా కింకా పెళ్లి కాలేదు కాబట్టి వద్దు లెండి ' అందా పిల్ల.
ఆ! అన్నా
అదేమిటమ్మాయ్ , బొట్టు కాటుక ఆడవారికి అందం చందం కాదా ! అట్లా అంటా వేమిటి ? అన్నా బుగ్గ నొక్కేసు కుంటూ .
అట్లా అని మా మనవరాలి వైపు జూసా . ఏమిటే ఈ అమ్మాయి ఇట్లా అంటోంది అన్నట్టు జూసా .
మా మనవరాలు ఇబ్బంది గా నవ్వింది .
అది కాదే , మా ఫ్రెండు కి అమెరికా వెళ్ళా లని కొరిక. అందుకే ఇప్పట్నించే దానికి తయారి ' మా మనవరాలు మాట దాటేసింది .
నాకు ముచ్చటే సింది . ఈ మనవరాలు అచ్చు నా పోలికే మరి ! ఎట్లా ఐతే నాకు మా బామ్మ పోలికో అట్లాగే దీనికీను . నాజూకు గా ఆ అమ్మాయిని ఇబ్బంది నించి కాపాడే సింది . లేకుంటే నేనింకా నాలుగు మాటలు ప్రశ్నలు ఎక్కువ వేసి ఉందు నెమో మరి !
సర్లే, అమ్మాయి, ఇంతకీ అట్లా అని ఎవరు జెప్పేరే ? అడిగా ఆ అమ్మాయి తో
మమ్మీ బోలీ అంది ఆ పిల్ల.
వామ్మో, వామ్మో, ఈ మధ్య ఇంట్లో వీధిలో ఆఫీసుల్లో అన్ని చోట్లా జిలేబీ ల దే రాజ్యమాయె . అన్నీ సరికొత్త హంగులు దిద్దు కొంటోంది .
మా కాలానికి మేమే అడ్వాన్స్ ఐన వాళ్ళం అనుకున్నామ్. ఇప్పటి ఈ అమ్మాయిల్ని చూస్తోంటే మరి మేము నిజం గా నే అడ్వాన్స్ ఐన వాళ్ళ మెనా అన్న సందేహం గబుక్కున వచ్చేసింది .
కాల వాహిని లో ప్రతి తరమూ తానె ఒక రెవల్యూషనరీ అని అనుకుంటుందేమో మరి .
మరో తరం వచ్చి మరిన్ని సరి కొత్తదనాన్ని తెస్తే , అది మంచో చెడో దాని పర్యవసానం అప్పటికి తెలియక రాబోయే కాలం లో నే తెలుస్తుందేమో మరి !
అంతా విష్ణు మాయ కాకుంటే మరి ఏమిటి ? ఉండమ్మా బొట్టు పెడతా అన కుండా ఇక మీదట 'హాయ్ హేవ్ గుడ్ ఫన్ ' అని దీవించ డానికి అలవాటు పడాలి మరి !
చీర్స్
Jail లేని 'Bee'
చూసారా ఇలా అనకుండా.... ఉండమ్మా టాట్యూ వేస్తా అని ఉంటే....Hey aunty you are rocking అని ఉండేది:-)
ReplyDelete
Deleteపద్మార్పిత గారు,
వావ్ సూపెర్బ్ ఐడియా !
జిలేబి
హ హా...బాగుంది.
ReplyDeleteబొట్టూ, జిలేబీల కాలం ఎప్పుడో వెళ్ళి పోయింది మరి ;)
పద్మార్పిత గారన్నట్టు ట్యాటూ అంటేనే పనిచేస్తుందేమో!
Deleteచిన్ని ఆశ గారు,
మీరూ పద్మార్పిత పాయింటు కే ఓటు వేసే శారూ !!
జిలేబి
కాల వాహిని లో ప్రతి తరమూ తానె ఒక రెవల్యూషనరీ అని అనుకుంటుందేమో మరి .
ReplyDeleteఅవును, నిజం
Deleteకష్టే ఫలే వారు,
నిజం నిజం - old order changeth giving place to the new అని ఓ ఆంగ్ల కవి అన్నట్టు - సర్వం బ్రహ్మ మయం బ్రహ్మం వృత్తాకార స్వరూపం !!
జిలేబి
ఏ తరానికి కావలసింది ఆ తరం సమకూర్చుకుంటుంది!తరానికి తరానికి మధ్యన అంత రం ఉండక తప్పదు!ఎవరి కలలు వారివి!అయితే మన మూలాలు మరచిపోకూడదు!
ReplyDelete
Deleteసూర్య ప్రకాష్ గారు,
మా బాగా సెలవిచ్చేరు !! సెహబాష్ !!
జిలేబి
ఆ తరాంతరాలు లేకపోతే ఎలాగండి :-)
ReplyDelete
Deleteసృజన గారు,
అంతే కదా మరి ! తరాంతరాలు ఉండాల్సిందే మరి !!
జిలేబి
నిజమే. ఇప్పుడు కొంతమంది బొట్టు పెట్టుకుంటున్నారు కానీ బాగా క్లోజప్పులో చూస్తే కానీ పెట్టుకున్నట్టు తెలీదు. ఇంకోటి కూడా. జడలు వేసుకోవడం బాగా మానేసారు. గమనించారా?
ReplyDelete
Deleteభలే వారండీ అనూ గారు, గమనించ క పొవట మేమిటి ! మా నగరం లో తొంభై శాతం పై బాబ్డ్ హెయిర్ కట్ !!
జిలేబి
"వెయిట్ బేబీ.. పుట్టు టాట్టూ.." అనండి.
ReplyDelete
Deleteసూర్య గారు,
బేబీ, ట్యాటూ పుట్టో ! రైమింగ్ గా ఉందండోయ్ !!
చీర్స్
జిలేబి