Sunday, June 9, 2013

తెలుగు వీర లేవరా, తెలుగు తెగులు వదుల గొట్టురా !


ఈ టపా intentionally ఖాళీ గా వదుల బడింది . 
 
వీరులు , వీరాంగణలు ఈ టపా కంటెంటు పూర్తి చేయుదురని  
 
తద్వారా తెగులు వదులు నని ఆశిస్తూ ... 
 
 
జిలేబి ఉచితం !

 

4 comments:

  1. తెలుగు వీర కవుల వారసులం
    రాజ రాజ నరేంద్రుని కొలువున భారతాన్ని తెలుగించిన కవిత్రయానికి వారసులం ..
    పరభాష పాలకుని ఏలుబడిలో విరాజిల్లిన అష్టదిగ్గజాలకి వారసులం.....
    భాగవత కావ్యాన్ని దుష్ట పాలకునికి అమ్మక అమ్మ భారతికి కాటుక కంటి నీరు తుడిచిన వీర కవికి వారసులం..
    నాలుగు వందల ఏండ్ల పరాయి వారి పాలనలో కూడా తెలుగు భాషని పరిరక్షించి, విశ్వవ్యాప్తం చేసిన బ్రౌన్ దొర వారసులం మేము...
    స్వపరిపాలనలో ప్రజల చేత ప్రజల కోసం ఏర్పడిన స్వతంత్ర భరతావనిలో కూటి కోసం పర భాషా మోజులో శవ భాషని (మమ్మీ) ని తప్పని సరిగా ఇన్నాళ్ళు మోస్తున్నా... ఆధునిక పరిజ్ఞానంతో అంతరజాలములో ప్రపంచ తెలుగు వారిని ఒక్కటిగా చేసే సామాజిక బంధాన్ని (social network) ఏర్పరుచుకుని తెలుగు భాష తియ్యదనాన్ని, అమ్మ నేర్పిన భాష కమ్మతనాన్ని అందరికీ పంచుతూ, ఇతరుల పంచిన మధుర రసాలని అస్వాదిస్తూ అలౌకిక ఆనందాన్ని అనుభవిస్తున్న వీరులం.. అంతర్జాల వీరులం... వయసుతో పనిలెదు, వృత్తి తో పనిలేదు... లింగం తో పనిలేదు, అంతా ఒకటై మాతృ భాష పరిరక్షణలో వీర సైనికులమై వూపిరి వున్నంత వరకూ పోరాడుతూనే వుంటాం... ఆ తెలుగు తల్లి సాక్షిగా...


    ReplyDelete
    Replies

    1. ఆహా ఓలేటి వారు తెలుగు తేజం చూపించారు !

      ధన్య వాదములు!

      జిలేబి

      Delete
  2. తెనుగు నా మాతృభాష అని చెప్పుకోడానికి గర్వ పడతాను. నేను తెనుగు వాడిని, భాష నా జీవం. ఒత్తులు పొల్లులు పోకుండా, అక్కర లేని చోట ఇవ్వకుండా, నా మనోభావాలను తెనుగులో వ్యక్తీకరించడానికే ప్రయత్నం చేస్తా. నా అమ్మంటే నాకిష్టం, ఎన్ని భాషలొచ్చినా రానట్లే లెక్క, నా దృష్టిలో. ప్రతి మాట తెనుగులో ఉండాలనుకోను. ఉన్న తెనుగు మాటను వదలుకోను. రోడ్ ను మళ్ళీ బాటని చెప్పుకోను. దాన్ని నాదాన్ని చేసుకున్నా. మడికట్టుకోవద్దు. భాష సజీవమైనది, ఇతర భాషా పదాలు కూడా వాడుకుంటా, ఎందాకా? నా భాషను అవి మింగేయనంతదాకా!

    భాషపై నాది కారంకాని కారం ..మమకారం

    ReplyDelete
    Replies

    1. కష్టే ఫలే వారి తెలుగు తేజానికి వెయ్యండి వీరతాళ్ళు !!


      జిలేబి

      Delete