Wednesday, June 12, 2013

V.I.P - ఏడు కొండల పెరుమాళ్ళు !

కొండ దేవర ఉలిక్కి పడ్డాడు !

పంచ దశ లోకం లో శ్యామలీయం అనే భక్తుడొకాయన ఎవరో  V.I.P లకి V.I.P లడ్డులు వేరు గా ఇవ్వాలా అని ప్రశ్నిస్తే, టాం  అని వీరు 'ఆయ్  వేరే లడ్డూలు మాత్రమేమిటి  ఖర్మ వాళ్ళ కోసం V.I.P ఏడుకొండల దేవర దేవాలయం కట్టించ మని సలహా ఇచ్చేరు .

ఆ, ఇదేదో సలహా మరీ బాగుందే , అవునుస్మీ , మనకు ఈ అవిడియా  ఇంత దాక తట్ట లేదుసుమీ అని కొండ దేవర పాలక మండలి ముక్కు మీద వేలు వేసుకుని మరీ హాశ్చర్య పోయి, వెంటనే తీర్మానించేరు  'ఇక స్పెషల్ గా కొండ దేవరకి కొత్త గా V.I.P దేవాలయం ఒకటి కట్టి పడేసి, ఆయన్ని ఆ వచ్చీ పోయే V.I.P లకి కట్టి కుదెయ్యాలని  !

అదిగో ఆ ఆలోచనతో నే కొండ దేవర ఉలిక్కి పడ్డాడు !

పంచ భక్ష పరమాన్నం లో ఎప్పుడో ఒకప్పుడు పంటి క్రింద రాయి తగిలితే పొతే పోనీ అనుకొవచ్చు. అట్లాగే భక్త కోటి సమూహం లో అప్పుడప్పుడు వచ్చే V.I.P వాళ్ల  కష్ట నష్టాలు విని ఓస్ వీళ్ళది ఏమి బాధ , ఆ అశేష జన వాహిని బాధల కన్నా నా వీరి బాధ అని కొట్టి పారెయ్య వచ్చు !

ఇప్పుడు స్పెషల్ గా తను ఈ V.I.P ల కోసం పొద్ద స్తమాను కాళ్ళు అరిగి పోయేలా నిలబడి వేచి ఉండి  వాళ్ళు చెప్పే కష్ట నష్టాలు వింటూ ఊరుకోవలసిన దే నా !

ప్చ్ , తన కంటూ ఒక అభిప్రాయం ఉంటుందని, తన్ను కన్సల్ట్ చేసినారా ఈ కమిటీ వాళ్ళు ! ప్చ్ తాను  పేరుకి పెరుమాళ్ళు . తన మొర  వినే నాధుడు ఎవడూ లేదే మరి అని నిట్టూర్చాడు

అంత లో ఓ పరమ బికారి అంత సేపు జన వాహిని లో నిలబడి కాళ్ళు నొప్పెట్టి ఆ స్వామీ వారి ముందు వచ్చి తనకు స్వామీ వారిని చూసే ఆ ఒక్క క్షణానికి కలిగిన అదృష్టం  కలిగినందులకు  మహాదానంద భరితుడై గోవిందా గోవిందా అన్నాడు !
గోవిందుడి  ఆనంద భాష్పాలు ఆ బికారి కి తీర్థ మయ్యింది వాడు భక్తీ తో కళ్ళ కద్దుకుని మళ్ళీ గోవిందా అన్నాడు .

పొతే పోనీ లే , ఇట్లాంటి భక్తులకోసం తను మరో VIP గాడ్ అవతారం దాలిస్తే ఏముంది ! వీళ్ళు అట్లీస్ట్  సంతోష పడతారు అని తృప్తి  పడ్డాడు !

Very Intimate Perumaal కోవెల రూపు దిద్దు కో సాగింది !

కథ కంచికి మనం నిదురకి  !
గోల్ మాల్  గోవిందా !!

చీర్స్
జిలేబి
(శ్యామలీయం వారి ప్ర. జ. కామెంటు చదివాక !)

10 comments:

  1. వీఐపీ వెంకన్నకు వీఐపీలే ఎంతోకష్టం మీద తీరుబడి చేసుకుని జస్ట్ లైక్ దట్ విచ్చేసి దర్శనం ఇచ్చి (శాంతం‌పాపమ్!) బై చెప్పి వెళుతూంటారు. వారికి కావలసినది వారి హోదాలకు - ప్రోటోకాల్ వగైరా మర్యాదలకూ తగిన వసతి సౌకర్యాలూ వివిద పూజావిశేషాల పేరి తంతులూనూ. అక్కడ శ్రీవారు తమ ప్రతిమను అనుగ్రహిస్తే సరిపోతుంది. కానుకలు వగైరాలు స్వీకరించటం తితిదే వారు చూసుకుంటారు. శ్రీవారు మిధ్యాభక్తులకు యివ్వవలసింది యేమీ ఉండదు కాబట్టి వారు స్వయంగా యేతన్మూర్తిలో ప్రతిష్టితులై ఉండ నవుసరం లేదు కాబట్టి వారికి శ్రమ లేదు!

    ReplyDelete
    Replies

    1. శ్యామలీయం వారు,

      పాలక మండలి వారు ఈ వీ ఐ పీ దేవాలయానికి మిమ్మల్ని ఈ డీ గా వేయాలని ప్రతి పాదిస్తున్నా రండోయ్!!

      జిలేబి

      Delete
  2. శ్యామలీయం వారి సూచన బహుబాగున్నది. వి.ఐ.పిలకు వేరుగా స్వామి కోవెల ఏర్పాటు చేస్తే సామాన్యులకు బాధా తప్పుతుంది, వారెంత సేపున్నా ఇబ్బందీ ఉండదు. వారి ఆడంబరాలూ, హోదాలు ప్రదర్శించుకోవచ్చు, ఎటొచ్చీ చూసేవాడే ఉండడు, వారి డాబూ దర్పం :)

    ReplyDelete
    Replies

    1. కష్టే ఫలే వారు,

      పాలక మండలి మిమ్మల్నే ఈ విన్నూత్న ఆలయానికి స్వామీ వారి దేవాలయానికి ముఖ్య దీక్షితులు గా నియమించాలని చెబ్తునారు కూడాను మరి !

      జిలేబి


      Delete
  3. VIP లకు వేరుగా ఇంకో కోవెల/దేవాలయం కట్టాలని ప్రభుత్వం ప్రతిపదిస్తే, మళ్ళీ దానికి స్థల/కొండ సేకరణ కమిటి(శ్రీక్రిష్ణ) వెయ్యాలేమో?

    ReplyDelete
    Replies

    1. పానీ ఔర్ పూరీ ఉండగా కృష్ణ కమిటీ ఎందు కండీ మరీను ! మీరే దానికి స్థలం వెదకాలి మరి !!

      జిలేబి

      Delete
  4. శ్యామలీయం గారి ఐడియా అద్భుతః.
    ఆ Very Intimate Perumaal కోవెలని అసెంబ్లీకో, పార్లమెంటుకో దగ్గరలో కట్టించేస్తే VIPలకి సౌకర్యంగా ఉంటుంది.
    తిరుమల ప్రశాంతంగా ఉంటుంది.

    ReplyDelete
    Replies

    1. పాలక మండలి వారు దేవాలయాన్ని ఆదరాబాదరా నగరం లో బంజారా హిల్స్ లో పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారండోయ్ !!

      జిలేబి

      Delete
  5. Replies

    1. ఎస్ కే వీ రమేష్ గారు,

      మీకూ ఈ ఐడియా నచ్చినందులకు బహుత్ ఖుష్ హుయీ !!


      జిలేబి

      Delete