స్టాకు మార్కెట్టు 'గోవిందా' గోవిందా హే రాజన్ !!
ఇవ్వాళ పేపరు తిరగేస్తే ఉన్న మతి పోయేటట్టు మా అన్ని 'పేపరోళ్ళు రిజర్వ్ బ్యాంకు గవర్నరు రాజన్ మీద పడ్డారు !
పాపం ఆయన కూడా మానవ మాత్రుడే కదా ! జనాలు చేసే 'మార్కు' ఎత్తులకి ' దిగువ లకి ఆయనే పరిష్కారం చూపించా లంటే ఆయన మాత్రం ఏమి చేయగలడు !
స్టాకు మార్కెట్టు కి స్వామీ మోక్ష ప్రదాతవు అన్నట్టు అయి పోయింది 'హే రాజన్ ! పాహిమాం పాహిమాం ' అన్నట్టు !
అయినా గత శుక్ర వారం దాకా బుల్లిష్ అంటూ వాయ గొట్టిన అనలిస్ట్ లు శుక్రవారం మధ్యాహ్నం పై బడి 'we should walk cautiously' అనడం మొదలెట్టేరు !
అంతా విష్ణు మాయ కాకుంటే ఈ ప్రాబబలిస్టిక్ లోకం లో ప్రాబబిలిటీ వల్ల మార్కెట్టు కి పై కాలం దిగువ కాలం వస్తోం దా లేక మనుషులే ప్రాబబిలిటీ ని సృష్టి స్తారా అన్నది ఎల్ల కాలపు ప్రశ్నాయె మరి !
"The world has the beauty of making possibilities to happen as well it has the capacity to make the impossibilities as possible" అంటారు !
మరి ప్రోబబిలిటీ ఈ వారాంతం లోపు స్టాకు మార్కెట్టు ని ఏ వైపు తీసు కెడు తుందో మరి !
ఈ జనవరీ నెలని గమనిస్తే 2009 January నెల గుర్తు కోస్తోంది ! అప్పుడూ బెన్ బెర్నాంకె రోజుకో స్టేట్ మెంట్ ఇచ్చే వాడాయన !
సరిగ్గా శుక్రవారం వస్తే చాలు సరి కొత్త స్టేట్ మెంట్ ఇచ్చే వాడు ! సోమ వారానికి ఏషియా మార్కెట్లు ధమ ధమ అని ధమాల్ అనేవి !
సరే ఈ సంవత్సరమూ చూద్దాము !
చీనా దేశపు ఆచారం ప్రకారం జనవరి నెలాఖర్నించి ' గుర్రపు' సంవత్సరం మొదలవు తుందట !
గుర్రపు సంవత్సరం ముందే చైనా ఎకానమీ గురించి 'వాతలు' రావడం మొదలెట్టేయి !
ఇక మన ఇండియన్ రుపీ గురించి చూస్తే ఇవ్వాల్టికి అది డాలరు కి అరవై నాలుగు రూపాయలు అయ్యేటట్టు ఉన్నది
(ఇండియా రిపబ్లిక్ 63 సంవత్సరాలాయే మరి !)
సో ఇవ్వాల్టికి జిలేబీ 'వాతలు' పరి సమాప్తం !
చీర్స్ సహిత
జిలేబి !
wait nd the further crash of the market after feb-5th of 2014 yar.".chitthhuambaram" mahima nayana...
ReplyDeleteNow a days u r much interested in stock. The fall n raise in stock is chidambara rahasyam. :)
ReplyDelete