Tuesday, January 21, 2014

'సడక్' ఆగ్రహం - అరవిందోద్యమం !

'సడక్' ఆగ్రహం - అరవిందోద్యమం !


కేజ్రీవాల్ క్రేజీ వాలా యా అని కష్టే ఫలే వారు ప్రశ్నించారు . కాదనుకున్నా ఎందు కంటే , గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లో పని జేసి బయటకి వచ్చిన మానవుడు కాబట్టి !

భారద్దేశ చరిత్ర లో ప్రప్రధమ 'ప్రజా' స్వామ్య 'గణతంత్ర' 'సడక్' ఆగ్రహం' అంటే కేజ్రీ వాల్ తప్పకుండా చరిత్ర లో చరితార్థులవుతారు !

సడక్ ఆగ్రహానికి అప్పోజిషన్ లో గాని పదవి లో గాని లేకుంటే ఒకటి నాలుగు నాలుగు క్రింద బుక్ చేసి బొక్కలో పెట్టొచ్చు !

ఒక రాష్ట్ర అధిపతి యే ఆ సడక్ ఆగ్రహాన్ని సరి కొత్త రీతి లో వెలిబరిస్తే !

కేజ్రీ వాల్ గారు నిజం గా మెచ్చు కోవాల్సిన వ్యక్తి ! అంత అసందిగ్ధ మైన పరిస్థితి లో కూడా ను సడక్ నించే తన ఆఫీసు వ్యవహారాలకు ఆటంకం రాకుండా చూసు కుంటూ పని జేసుకుంటూ టీవీ లో కనబడ్డారు !

'దుపట్టా'హాఫ్' !

సడక్ ఆగ్రహానికి అధికారం తోడైతే ఏమవుతుందో ఇప్పటి దాకా మనకు తెలీదు !
ఇప్పుడు తెలుసు కుంటున్నాం ! సడక్ ఆగ్రహం  ఈ కాలపు సత్యాగ్రహమా  మరి !

రాబోవు కాలమే తేల్చాలి నిర్ధారణ గా !


చీర్స్
జిలేబి

2 comments:

  1. All that glitters is not GOLD. It appears he is proving 2 b crazywal, escaping from so many things promised.

    ReplyDelete
  2. అర్థం లేని అగ్రహం. ఇలా రోడ్డెక్కితే సమస్యలు పరిష్కారమయిపోతే, ఆయన ముఖ్యమంత్రి అవడమెందుకు?
    ఆందోళనలతోనే ప్రజల సమస్యలని పరిష్కరించవచ్చు కదా!

    ReplyDelete