మాది ఏక చత్రాధి 'పైత్యం' కాదు అన్నారు మేడం గారు
సెహబాష్ అని అనాలని పించింది !
భారద్దేశం లో దేశం లెవెల్ నేతలు తగ్గి పోతున్నారా అనిపించింది .
ఒక దేశాన్ని కట్టి పడేసే నేతలు మనకు అవసరమా అని కూడా అనిపించింది
ఒక్కడు ' ఒక్కరే' దేశాన్ని ముందంజ వేయ గలుగు తారా అని కూడా ప్రశ్నించ వచ్చు!
భారద్దేశం ప్రజాస్వామ్య దేశం అనడం కన్నాఎక్కువగా ప్రజా 'సౌమ్య' దేశం అనవచ్చు !
ఎందు కంటే దేశం లో ఏమి జరిగినా మనం 'సౌమ్యం' గా సౌకర్యం గా మరిచి పోయే వాళ్ళం కాబట్టి .
దీనికి మరో కారణం నా కనిపిస్తున్నది ఏమిటంటే , దేశం లో ప్రజలకి రోజువారి దినసరి సరకులకే, దినసరి జీవితానికే తమ సమయం వెచ్చించా ల్సి వస్తోంది .
ఇక మిగిలిన సమయం లో మన మీడియా (మీడియా గురించి ఎంత తక్కువగా చెబితే అంత మంచి దేమో మరి !) ఇరవై నాలుగు గంటలు బ్రేకింగ్ న్యూస్ ఇస్తూ, 'పండంటి' కాపురాల సీ 'రీళ్ళు' కుమ్మరిస్తూ , సినెమా పాటల హోరుల తో, నాయకుల భీకర హ్రీంకార ఘీం కారాల తో ప్రజల్ని కట్టి పడేస్తో ఉంటుంది
ఇక ప్రజలకి తీరు బాటు ఎక్కడ ? తింకింగ్ పవర్ ఎక్కడ మరి ?
సరే, మరి ప్రజా స్వామ్యం గుత్తాధి 'పైత్యం' కాదు అనుకుంటే , మరి దేశం ఎప్పుడో ఈ 'గుట్టా' ధి పైత్యం నించి విడివడి
ముందంజ వేసి ఉండాలి కదా !
అబ్బా అన్నీ ప్రశ్నలే ! జవాబు లెక్కడ మరి ?
ఏమిటో పొద్దస్తే ఈ భేషజం !
"జిలేబి టపా కట్టి కిచను కెళ్ళి కూసింత కాఫీ నీళ్ళు నా ముఖాన పడెయ్య కూడదు ?" అయ్యరు వెనుక నించి 'హోమ్' కారం !
కూసింత నిదానించి టపా రాద్దా మన్నా సమయం లేకుండా పోయిందేమి మరి బీలేజీ జిలేబి ???
చీర్స్ సహిత
జిలేబి (బీలేజీ)
ఏళ్ళుగా బాధ్యతలేని అధికారం ఎంత చమ్మగా ఉందో!
ReplyDeleteఅంతే అంతే కదండీ కష్టే ఫలే వారు !
Deleteఏక చత్రాధి 'పైత్యం' - SUPER
ReplyDeleteమీరు ఈనాడులో పని చేసారా?
Deleteబోన గిరి గారు,
నెన 'రసయుత' నెనరః !
జిలేబి
"జిలేబి టపా కట్టి కిచను కెళ్ళి కూసింత కాఫీ నీళ్ళు నా ముఖాన పడెయ్య కూడదు ?" అయ్యరు వెనుక నించి 'హోమ్' కారం !
ReplyDeleteకాఫీలు, టిఫినీలు, భోజనాలు అన్నీ అయ్యారు గారి డ్యూటి కదా? కొత్త సంవత్సరంలో జిలేబీ గారు వంటగదిలోకి వెళ్ళడం మొదలు పెట్టారా ఏంటీ!
Deleteజై గొట్టి ముక్కలు గారు,
అందుకే కదండీ ఆ ఆఖరి బోరున ఏడుపు గొట్టు వాక్యం మరి !_-
>>>కూసింత నిదానించి టపా రాద్దా మన్నా సమయం లేకుండా పోయిందేమి మరి బీలేజీ జిలేబి ???
>>>
జిలేబి
కాఫీలు, టిఫినీలు, భోజనాలు అన్నీ అయ్యారు గారి డ్యూటి కదా?nenu ade anukunnaa,
Delete'సౌమ్యం' గా సౌకర్యం గా మరిచి పోయే వాళ్ళం కాబట్టి ...
ReplyDeleteమాత్రమే కాదు...
'సౌమ్యం' గా సౌకర్యం గా అమరి పోయే వాళ్ళం కూడా ...
ఒక దేశాన్ని కట్టి పడేసే నేతలు మనకు అవసరమా అని కూడా అనిపించింది...
నేననుకోవడం ఈ దేశాన్ని వేరే దేశం తో కట్టిపడేసినా
సౌమ్యంగా సౌకర్యంగా చక్కగా అమరిపోతామేమోనని...
ప్రక్క దేశాలు ఆ ప్రయత్నం ఎప్పుడైనా ప్రక్కనబెడితే గదా...
చైనా పాకిస్తాన్ లకు మన నాయకుల గురించి
మనకన్నా బాగా తెలుసు ...
పై కామెంట్స్ లో ఏం వ్రాశారో తెలుసుకునే అవకాశమేమైనా???
నిన్నటి దాకా నా కామెంట్ పైన ఏదో ఆరబిక్ టైపు
Deleteభాషలో 3 కామెంట్స్ కనబడినాయి...
ఈ రోజు అవి మాయమైనాయ్...
వాటి గురించే నేను ఎంక్వయిరీ చేసింది...