రంగ నాయకమ్మ మహాభారత పరిచయం - జిలేబి వీర వాయింపు !
ఈ శీర్షిక మీద టపా కట్ట కూడదను కున్నా !
కానీ ఎవరికి వారు మన పురాణాల మీద (సో కాల్డ్ ఈ కాలం లో సులభం గా చెప్పే ఊత పదమైన 'పుక్కిటి' పురాణా ల మీద !) తమ తమ 'వికృతాభిప్రాయములను' తెలియ బరిచే టప్పు డు జిలేబి నువ్వు మాత్రం ఎందుకు తెలియ జేయ కూడదు నీ అభిప్రాయాలని అని మనస్సులో బీ లే జీ ని వదిలి పెట్టు అన్న ఒక 'సత్' సంకల్పం కలిగింది .
(సత్ సంకల్పం అంటే మంచి ఆలోచన అని అర్థం చేసు కోవచ్చు - ఇందులో 'హిందూ త్వం' ఏమీ లేదు - విధవా అంటే తిట్టూ, విడో అంటే పొగడ్త అనుకునే కాలం లో మనం ఉన్నాం కాబట్టి ఈ వివరణ!)
ఒక రామాయణా న్నో, ఒక మహా భార తాన్నో 'భరతం' పట్టిస్తా అని నిర్ణయిం చు కున్నప్పుడు దాని ఒరిజినల్ వెర్షన్ చదివి వీర వాయింపు చేస్తే అది స్వంతం గా ఆలోచించి స్వంతమైన అభిప్రాయాలని చెప్పినట్టు అవుతుంది .
చాలా కాలం మునుపు రామాయణ కల్ప వృక్షం వచ్చినప్పుడు దానికి రిటార్టు గా రామాయణ విష వృక్షం కూడా వచ్చింది .
ఓరీ మనావిడ, విష వృక్షం అంటోంది కదా సరే పోనీ చదివి ఏడుస్తామని నిర్ణయిం చేసు కుని చదివి ఏడిస్తే , యాక్కు అని వాంతి వచ్చే పని అయ్యింది
భూతద్దం పెట్టి మరీ ప్రతి మాట కి వికృతా ర్థం తీయాలంటే తీయ వచ్చు ! అట్లాంటి ఒక రచన గా నాకు ఈ రంగ నాయకమ్మ గారి సో కాల్డ్ వివరణ అనిపించింది .
ఆరుద్ర గారే ననుకుంటా రామాయణం రంకు, భారతం బొంకు అని అన్నట్టు గుర్తు .? ఎవరు అన్నారో కాదు గాని, ఆ స్టేట్ మెంట్ వారి 'way' of understanding that subject' అనుకోవాలి అంతే !
అట్లాగే ఇప్పుడు ఈవిడ , ఒక ఇంగ్లీషు అనువాదాన్ని, తెలుగు అనువాదాన్ని పెట్టేసుకుని తనదైన 'వికృత' స్టైల్ లో (విలక్షణ మైన శైలి అని మీరు భాష్యం చెప్పు కోవచ్చు !) దాన్ని విశ్లేషిస్తే చదవడానికి ఉత్సుకత ఉన్నవాళ్ళు, 'లా' పాయింటు లేవదీయాలని అనుకున్నవాళ్ళు చదవొచ్చు !
అట్లాగే, అందరూ టపాలు ఈ సబ్జెక్ట్ మీద కట్టేస్తున్నారు ,న నేను కూడా ఈ 'వికృత' పుస్తకం చదివి ఓ టపా కట్టేస్తే, కూసిన్ని కామెంటు మెతుకులు నాకూ పడతాయి కదా అని ఆనంద పడి పోయి, ఆశ పడి పోయి ఈవిడ గ్రంధ రాజాన్ని (రాజాన్ని అంటే మళ్ళీ ఎం సి పీ అనొచ్చు కాబట్టి ) గ్రంధ 'రాణి' ని చదివి తుస్సు మన్న , బుస్సుమన్న కస్సుమన్న ఓ ఇట్లాంటి టపా ఒకటి కట్టేయాలునుకున్నా !
"మనుషుల్ని పవిత్రులుగానూ- అపవిత్రులుగానూ విభజించే ఏ రచన అయినా, స్త్రీలని సజీవంగా కాల్చి వెయ్యడాన్ని పవిత్రధర్మంగా చెప్పే ఏ గ్రంథం అయినా " బాడ్ అన్నది ఈవిడ వ్యాఖ్యానం !
అసలు రాజా రామ్ మోహన్ రాయ్ లేకుంటే ఈ ఆచారం దేశం లో కొనసాగి ఉండేదే మరి ? ( బ్రిటీషు వాడు రాకుండా ఉంటె అసలు రాజా రామ్ మోహన్ రాయ్ కి విశాల దృక్పధం వచ్చి ఉండేదా ?)
అంటే, సతీ సహ గమనం ఆ కాలం లో ఉన్నదని ఆ కావ్యం లో ఉంటె, ఆ కాలాన్ని రచయిత నిర్ద్వందం గా ఎట్లాంటి భేష జాలకి పోకుండా చెప్పేడు అని భావం గాని, దాన్ని చెప్పేడు కాబట్టి ఇది సో కాల్డ్ బ్యాడ్ గ్రంధం ఎట్లా అవుతుందో ఆవిడకే మరి తెలియాలి !
ఉదాహరణ కి, ఈ కాలం లో చదువులు ఎక్కువై పెళ్లి పెటాకులు ముదిరే కాలంలో చేసుకుని , టాప్ మని విడిపోయే వారి గురించి రాస్తే, అట్లాంటి ఓ పుస్తకం రాబోయే కాలం లో నిలిచి వుంటే, ఆ కాలానికి 'విడాకులు' సో కాల్డ్ అర్థం కాని విషయమై ఉంటె , అప్పుడు ఆ రాబోయే కాలం లో ఇప్పటి కాలానికి ప్రతీక గా నిలచిన గ్రంధం బ్యాడ్ ఎట్లా అవుతుంది ?
ఏదో రాసేస్తే చదివి సెహ భేష్ అనుకునే వాళ్ళు ఉంటారను కోవడం ఈవిడ గారి కి అబ్బిన విద్య !
ఓ ముప్పై ఏళ్ల మునుపు విష వృక్షం రాసినప్పుడు కాల గతులు వేరు (మన దేశం లో ). అప్పు డున్న యువత కి ఇప్పుడున్న యు వత కి ఎంతో వ్యత్యాసం ఉన్నది . కాల గమనం లో ఇప్పుడున్న యువత ప్రపంచాన్ని చుట్టి వచ్చిన యువత . అంటే , విదేశాల్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, అందులో క్యాపిటలిస్ట్ కి, కమ్యూనిస్ట్ కి మూల వ్యత్యాసం ఏమిటి, ఏ సమాజం లో అవి 'విరాట్' రూపం లో ఉన్నవో అదే సమాజం లో అవి నేల బారు ఐనవి అని కూడా తెలుసు .
అట్లా గే, మన సమాజ వ్యవస్థ లో ఎట్లాంటి మూర్ఖత్వాలున్నాయి, వాటి వెనుక నిజం గా ఏదైనా సైంటిఫిక్ టెంపర్ మెంట్ ఉందా లేక just pooh pooh' తూ తూ మంత్రా లేనా అని కూడా అర్థం చేసుకో గలిగిన ఈ తరపు యువత .
ఇట్లాంటి ఒక కాల ఘట్టం లో పురాతన స్టైల్ లో నేనూ ఒక lopsided కుహనా విమర్శనా గ్రంధాన్ని రాస్తా , దాన్ని ఆ కాలపు విష వృక్షం లా జన సందోహం ఆదరిస్తుంది అనుకోవడం ఈవిడ గారికి కాలం చెల్లిన అభిప్రాయం మాత్రమె మరి .
ఇక ఆఖరి కామెంటు, ఈ పుస్తకం ధర సబ్సిడీ ని (వంద రూపాయల పుస్తకం ) గమనిస్తే రెండు విషయాలు అర్థం అవుతాయి .
ఒకటి ధర ఎక్కువైతే దీన్ని కొని చదివే వాళ్ళు అసలు ఉండరని(కొని చదివే 'నాధు' లు) వారి కి అనిపించి ఉండవచ్చు ,
కాలం చెల్లిన ఐడియా లకి కాణీ లు రాలవు-
కాకుంటే, ఏదైనా మత సంస్థలు దీని వెనుక ఉన్నాయి అనుకొవచ్చూ (ఈ నా ఊహ నిజం కాకూడ దని అనుకుంటా ! సర్వ విధాలా ఆశిస్తా.
కారాల మిర్యాల
జిలేబి
ఇలా రాస్తే కామెంట్లు రాలతాయా? అనగా రాలవేమోనని అస్మదీయుడి అభిప్రాయం. :)
ReplyDelete
Deleteపురాణ పండ వారు,
కొన్ని సార్లు మనకెందుకులే రాయకుండా ఉంటె పోలే అనిపిస్తుంది . కాని చట్ , వదులు నీరసత్వాన్ని వాయించు నీ 'గంటా' నాదాన్ని కూడా అని పిస్తుంది ! అట్లాంటి ఘర్షణే అప్పుడప్పుడు కారాలూ మిరియాలూ !!
జిలేబి
ఇంతకీ తిట్టేరా పొగిడేరా? :)
ReplyDelete
Deleteశర్మ గారు,
తిట్టిన తిట్టు తిట్ట కుండా తిట్టే నండీ !
పొగిడిన పొగడ్త పొగడ కుండా పొగిడే నండీ !!
జిలేబి
మీ బ్లాగులో చేసిన కామెంట్లు మాలికలో కనపట్టం లేదు, ముందది చూసుకోండి. శ్రీమద్రమారమణ గోవిందో హరి!
ReplyDelete
Deleteశర్మ గారు,
మాలిక లో కామెంట్లు కనబడక పోవడము గురించి చాలా మార్లు వాళ్ళ వద్ద వాపోయా !! ఫలితం శూన్యం !
ఆ మాలిక వారు 'సబ్' కా మల్లిక వారు కాదేమో మరి !!
జిలేబి
నేను తప్పు చేసి సమర్థించుకోవాలంటే తప్పుని ఎత్తిచూపేదాన్నే తప్పంటే పోలా... అదీ ఆవిడ నైజంలెండి. నియమ నిబద్ధతలు లేని విశృంఖల జీవితంలోనుండి వచ్చిన స్వభావమది ’పర్వర్టెడ్’ అనొచ్చేమో.. కానీ... జిలేబీ మృదుమధురంగా ఉండే సరదాతో జొప్పించిన టపాలే కాదు అవసరమైతే వేడి వేడి పాకంతో చెయ్యి మూతి కాల్చే లక్షణమూ పోలేదని చూపించినట్టున్నారు...
ReplyDelete
Deleteఅయ్యగారి నాగేంద్ర గారు,
నెనర్లు ! అప్పుడప్పుడు స్వీట్ జిలేబి ! అప్పుడప్పుడు హాట్ !
జిలేబి
అరే! 'జిలేబి ' లో బి లే జీ ఉన్నదని అది అప్పుడప్పుడు వదులుతుందని ఇప్పుడే...తెలిసింది. మీరింతకు ముందు విషవృక్షం చదివి, వాంతి వచ్చేపని అయిందన్నారు. ఇప్పుడిది కూడా చదివి వ్రాస్తే బాగుండేదేమో! రాజా రాం మోహన్ రాయ్ ఉదాహరణ ఇచ్చారు కనుక మీ అభిప్రాయాన్ని అర్ధం చేసుకోగలిగాను.
ReplyDelete
Deleteకొండల రావు గారు,
నెనర్లు మీ కామెంట్ల కి.
ఈ టపా ఇంత సావదానం గా రాయటానికి కారణం ఆ పుస్తకం చదివే రాయడం వల్ల !
(చదివిన డానికి పుణ్యమూ దక్కే లా కనిపించ డం లేదు !)
జిలేబి
ఈ తరం వాళ్ళ పరిభాషలో, టీవీ ఛానెళ్ళ భాషలో చెప్పాలంటే - "ఇరగదీసారు".
ReplyDelete
Deleteవిన్న కోట వారు,
నెనర్లు ! విరగ దీయటం మా ఇంటా వంటా ఆచార మే నండోయ్ ! మా బామ్మ గారి చలువ అది, జీన్స్ లో ఘాట్టి గా పట్టేసు కుంది !
నెనర్లు
జిలేబి
"కాలం చెల్లిన ఐడియా లకి కాణీ లు రాలవు"
ReplyDeleteకాలం చెల్లిన ఐడియా ల గురించి రాస్తే కామెంట్లు రాలవు!
Deleteజై, కొట్టి, ముక్కలు ముక్కలు గారు రాసేరు !!
జిలేబి
ఒక ఇంటర్వ్యూలో సీపీయం నాయకుడు బీవీ రాఘవులు గారు తనకిష్టమైన పుస్తకాల్లో మహాభారతం ఒకటని, తరచూ అది చదువుతూ ఉంటాననీ అందులోని రాజనీతి తనకి నచ్చుతుందని చెప్పడం నాకు గుర్తుంది.
ReplyDelete
Deleteసూర్య గారు,
మహాభారతం లో రాజనీతి , దండ నీతి ధర్మ నీతి పరాకాష్ట ద్రౌపది ప్రశ్న - తానోడి నన్నోడేనా ? నన్నోడి తానోడే నా ? దీనికి సమాధానం చెప్పడం ఎవరి తరం?
జిలేబి
ప్రస్తుత కాలంలో మెజారిటి ని ఆకర్షించడానికి ఇది ఒక అస్త్రం. అదే మన ఆర్ జి వి అనుసరించె టెక్నిక్ . ఆమెకి అప్పుడె తెలుసనుకుంట. మొత్తానికి మీ అభిలాష నెరవేరింది.
ReplyDelete
Deleteసుమ చామర్తి గారు,
మీ అభిలాష నెరవేరింది అన్నారు ! అంటే ఏమిటి ? జేకే !!
ఇక ఆర్ జీ వి తక్నీకులు ఈ కాలపు పంచ దశ లోకానికి పనికి రావు !
జిలేబి
అట్లాగే, అందరూ టపాలు ఈ సబ్జెక్ట్ మీద కట్టేస్తున్నారు ,న నేను కూడా ఈ 'వికృత' పుస్తకం చదివి ఓ టపా కట్టేస్తే, కూసిన్ని కామెంటు మెతుకులు నాకూ పడతాయి కదా అని ఆనంద పడి పోయి, ఆశ పడి పోయి .....
Deleteపురుషు లందు పుణ్యపురుషులు వేరయా!
ReplyDeleteవనిత లందు పుణ్యవనితలు వేరయా?
త్రావిన దేదియో అదియే వాంతి యౌను?!
Deleteహరి బాబు గారు,
అంతే అంతే ! త్రావినది తాటి కల్లు ఐన అదియే ఇంతి చేయు వాంతి అగును !!
జిలేబి
This comment has been removed by the author.
ReplyDeleteయూ జీ శ్రీ రాము గారు,
Deleteమీరు రాయదలచు కున్న దానిని మళ్ళీ నిక్షిప్తం చేస్తున్నా !!
యూ జీ శ్రీ నివాష్ ఉవాచ !
ఉండండి. మీరిలా రాశారని కామ్రేడ్ డా||శంకర శాస్త్రి కి చెప్పొస్తాను. ఇంతకి మీరు ఓడ్కావాదులు కారా? ఆశ్చర్యంగా ఉందే!! :)
చీర్స్
జిలేబ్
(ఓ 'డక్కా' వాదిని !)
ఇకపై వీలైనప్పుడల్లా, మీ టపాలకు కామెంటుతానని ఇందుమూలముగా ప్రతిజ్ఞ చేయుచున్నాను.
ReplyDelete
Deleteబోనగిరి వారు,
ప్రతిజ్ఞా భంగము గావించిన మీ శిరస్సు వ్రేయి 'వాక్కులు' అగును !!
జిలేబి
మీ ముగింపు వాక్యం సత్యమై ఉంటుంది. అమ్దువల్ల వాల్లకు కాణిలు రాలాల్సిన పనిలేదు. కావాల్సినది ప్రచారం
ReplyDelete
Deleteదుర్గేశ్వర గారు,
నా ముగింపు వాక్యం సత్యం కాకూడదనే నా అభిలాష !
జిలేబి
1. విధవా అంటే తిట్టూ, విడో అంటే పొగడ్త అనుకునే కాలం లో మనం ఉన్నాం
ReplyDelete2. అంటే, సతీ సహ గమనం ఆ కాలం లో ఉన్నదని ఆ కావ్యం లో ఉంటె, ఆ కాలాన్ని రచయిత నిర్ద్వందం గా ఎట్లాంటి భేష జాలకి పోకుండా చెప్పేడు అని భావం గాని, దాన్ని చెప్పేడు కాబట్టి ఇది సో కాల్డ్ బ్యాడ్ గ్రంధం ఎట్లా అవుతుందో ఆవిడకే మరి తెలియాలి !
----------------------------------------------------
ఆణిముత్యాలు
Deleteరావు ఎస్ లక్కరాజు గారు,
నెనర్లు - ఆణిముత్యాలు అని కామేంటి నందులకు !!
అవి 'ముచ్చటేసి రాసు కున్నవి !
జిలేబి
మహాభారత కాలం, రచనా ఏనాటివి అని ఇప్పటికీ ఇతమిత్థంగా తెలీదు. మాద్రి అనుసరించిన సహగమన ధర్మాన్ని అదే కాలంలోని కుంతియే అనుసరించలేదు. ఇంకా అనేకధర్మాలకు నాటికాలంలోనే వైరుద్ధ్యాలున్నాయి. ఇవన్నీ పెట్టుకుని మహాభారత ధర్మాలు శాశ్వతమని, అవి పాటించి అందరూ చెడిపోతున్నట్టూ, ఈమె అందరినీ ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్నట్టూ రాయడం కమర్షియల్ గిమ్మిక్ లా ఉంది.
ReplyDeleteఈమె నిజాయితీ మీద ఉన్న ఏ పాటి నమ్మకమైనా ఈ ముక్కతో తొలగిపోయింది.
Deleteరవి గారు,
మా బాగా చెప్పేరు !!
జిలేబి
It seems she is a Megalomaniac.
DeleteGuruji Meeru ela rasi mana Pani Leni Doctor Ramana Gariki Angry teppistiunnaru . Mana Doctor Garu Amma Garkiki mariyu Devdu ledu aney valla andariki Veera Abhimani. Meeku inka mana telugu yogi garitho class ippinchali, labam ledu. Itlu mee abhimani gottam govindaraju
ReplyDeleteశ్రిని గారు,
Deleteడా టే రు రమణ బాబు గారి దారే వేరు !
మాకు మేమే మీకు మీరే ! ఎందుకీ బుస బుస రుస రుస !
నెనర్లు
జిలేబి