Saturday, June 20, 2015

బ్లాగ్వాసుడి మోక్ష ప్రాప్తి (ఆఖరి భాగం)


బ్లాగ్వాసుడి మోక్ష ప్రాప్తి (ఆఖరి భాగం)

... రెండో భాగం ఇక్కడ


ఫోటో కర్టసీ : చందమామ 1992 ఏప్రిల్ నెల 


... "బ్లాగ్ పండితులారా ! పండితులైన మీకు అంత వివరణ అవసరం కాదను కుంటాను . శ్రీకాంతుడు వ్రాసిన ఈ పనికి మాలిన , పనిలేక వ్రాసిన టపాలని చదవడం రాక్షస జన్మ కంటే మరీ ఘొరమైనది ! అందువల్లనే ఏ ప్రయోజనమూ లేని ఈ చప్పిడి ఖబుర్లు విన్న బ్లాగ్రాజు ప్రవీణుడు రాక్షస రూపం నించి విముక్తుడయ్యాడు . మీ బ్లాగ్దేశ ప్రజలు తమ తమ ఖర్మ ఫలాన్ని అనుభవించ డానికి ఇక ముందు నా శాపాల తో అవసరం లేదు . 

ఇలాంటి పనికి రాని టపాలు చదివితే చాలు ! ఇక మీదటి నించి ప్రపంచం లో మునులూ వాళ్ళ శాపాలు ఉండవు ! వాటి బదులు ఇదిగో ఇట్లాంటి టపాలే ఉంటాయి అవే మీ ప్రజల కర్మ ఫలాన్ని అనుభవింప జేస్తాయి " అన్నాడు బ్లాగ్వాస మహాముని చిరు నగవులు చిందిస్తూ .

ఆ క్షణం లో నే బ్లాగ్ కవి పండిత కథకుల సాహితీ వేత్త లందరూ చూస్తూండగా ఆకాశం నించి యూ ఎఫ్ ఓ  ఒకటి దిగింది . అందులో ఉన్న అంతర్గ్రహ యాత్రీకులు  బ్లాగ్వాసుని ఆహ్వానించారు. బ్లాగ్వాసుడు అక్కడ ఉన్న వారితో " ఈ బ్లాగ్ టపాల ధర్మమా అని నా కర్మ ఫలం పూర్తయి మోక్షం పొందుతున్నాను . ఇక సెలవు " అంటూ ఆ యూ ఎఫ్ ఓ విమానం ఎక్కాడు . !


బ్లాగ్వాసుని అంతర్గ్రహ ప్రయాణం మొదలయ్యింది ! కథ ఇంతటి తో పరి సమాప్తం ! ఈ బ్లాగ్వాసుడి లా బ్లాగ్ రీడర్లూ,  మీ అందరి కర్మ ఫలమూ ఈ బ్లాగు లోకం లో ని టపాలు చదవటం మూలాన పరిపక్వత కు వచ్చి మీ కందరికీ కూడాన్నూ మోక్ష ప్రాప్తి 'కిట్ట' వలె నని మా ఏడు కొండల పెరుమాళ్ళని వేడుకొంటూన్నా !

జిలేబి జిందా బాద్ !

చీర్స్ 
జిలేబి 

గమనిక: సాయిన్సు ఫాంటసీ కథల గురించి మనం చదివి  ఉంటాం . ఈ కథ కి మూలం జొన్నలగడ్డ రామలక్ష్మి గారి (వీరు  మా కాలపు మరో జిలేబి!) 'నిర్వాసుడి మోక్ష ప్రాప్తి అన్న చందమామ కథ . ఏప్రిల్ 1992 నించి సంగ్రహింప బడింది . 

మూల కథ మన ఈ బ్లాగ్ లోకపు పోకడలను అచ్చు పోలి ఉండడం చదువుతూంటే ఔరా ! చందమామ కథ ఎంత మంచి సాయిన్సు ఫాంటసీ అనిపించింది .

దరి దాపుల్లో ఇరవై ఐదు సంవత్సరాల తరువాయి బ్లాగ్ లోకపు పోకడలను ఎంత సొబగుగా చెప్పింది అనిపించక మానలేదు !

జొన్నలగడ్డ రామలక్ష్మి గారి కాలానికి  అంతర్జాలం లో బ్లాగులూ గట్రాలు లేవు !

మా కాలపు జిలేబి జొన్నలగడ్డ రామలక్ష్మి గారికి ఈ  బ్లాగ్వాసుడి మోక్ష ప్రాప్తి 'పేరడీ' అంకితం !

చందమామ 1992 ఏప్రిల్ కథ లింకు ఇక్కడ

జిలేబి
 

16 comments:

  1. ఏంటి రాస్తున్నారూ అనుకున్నా. బాగుంది, నాటి రోజుల్లోనే నేటి కాలాన్ని ఊహించగలిగారు రామలక్ష్మిగారు, బాగా అనుకరించారు.

    ReplyDelete
    Replies

    1. శర్మగారు,

      నెనరస్య నెనరః !

      జిలేబి

      Delete
  2. శుభం - సర్వేజనా సుఖినో భవంతు:

    ReplyDelete
    Replies

    1. కొండల రావు గారు,

      భంశు !

      జిలేబి

      Delete
  3. జొన్నలగడ్డ రామలక్ష్మి గారు ‘వసుంధర’ జంట రచయితల్లో ఒకరు. వారి సంయుక్త బ్లాగు https://aksharajalam.wordpress.com/ చాలాకాలం నుంచే ఉంది.

    దీని చిరునామా ఈ మధ్య ఇలా మారింది... ttp://www.vasumdhara.com

    ReplyDelete
    Replies

    1. వేణు గారు,

      జొన్నలగడ్డ రామలక్ష్మి వారి చాలా మంచి లింకు ఇచ్చారు . అందులో వారి తో చిత్ర ముఖా ముఖి ఉంది కూడాను (వసుంధరా దంపతులు గా )

      జిలేబి

      Delete
  4. ఏమిటి ఇది కూడ కాపీయేనా?
    ఇంతకీ బ్లాగు లోకంలో శ్రీకాంతుడు ఎవరో అర్థం కాలేదు.

    ReplyDelete
    Replies

    1. బోనగిరి గారు,

      అంతా కాపీ కౌ పీ న మే !!

      జిలేబి

      Delete
  5. @ bonagiri గారు,

    ఎవరి పేరు చెపితే కమ్యూనిష్టులు గడగడలాడతారో, ఎవరి పేరు చెపితే స్త్రీ వాదులు రంగనాయకమ్మ వెనకాలకి పారిపోతారో, స్త్రీలతో సమానంగా పురుషులకూ భరణమూ, గృహహింస బిల్లూ ఉండాలని పురుష హక్కుల కోసం పోరాడే బ్లాగరే శ్రీకాంత్ గారు !!!!

    ReplyDelete
  6. ప్రవీణుడు స్త్రీ హక్కుల గురించి పోరాడుతుంటే శ్రీకాంతుడు పురుష హక్కుల కోసం పోరాడుతున్నారు. నీహారిక మానవహక్కుల కోసం పోరాడుతున్నది. ఎవరు విజయం సాధిస్తారో బ్లాగ్వాల్మీకి కే ఎరుక !

    ReplyDelete
  7. అప్పుడే ఆఖరి భాగమా? వరుసగా వంద టపాలతో మరో జిలేబీ శతకం కోరుకున్న అభిమానులకు ఆశా భంగం!

    బ్లాగ్మాతా బ్లాగు జగత్జననీ మీకు ఇది తగునా?

    ReplyDelete
    Replies

    1. జై గొట్టి వారు,

      మూడు టపాల కే చేతులు నొప్పి పుట్టే సేయి !!

      జిలేబి

      Delete

  8. హత విధీ !,

    నిజముగానే శ్రీకాంతుడనే బ్ల్గాగాత్మ ఉన్నారన్న మాట ! నేనేదో పేరు సౌలభ్యం కోసం కథ పరం గా వాడాను .

    ఆ హా ఇదియే కదా సాయిన్సు ఫాంటసీ అనగా ! ఊహించిన పేర్లు గల బ్లాగాత్మలు అదిన్నూ నీహారిక వారన్నట్టు ఫటాఫట్ బ్లాగాత్మలు పంచ దశ లోకం లో ఉండడం కాక 'టాలీ' యమా లేక క్వాంటం 'దైవ' మిక్సా :)

    బ్లాగాత్మా శ్రీకాంతుల వారికి వెల్కం బెక బెక

    రసగుల్లా కాని జిలేబి

    ReplyDelete
  9. నాకు తెలియకుండానే శ్రీకాంత్ గారిని ఇరికించినట్లున్నానే :p
    శ్రీకాంత్ గారు ప్రవీణ్ తో ఎక్కువ సార్లు వాదించడంతో శ్రీకాంత్ గారేనేమో అనుకున్నాను.
    జిలేబీ గారికీ,శ్రీకాంత్ గారికీ క్షమార్పణలు తెలియజేసుకుంటున్నాను.
    నేను తప్పు చేస్తే ఒప్పుకోడానికి ఎప్పుడూ సిద్ధమే ! మన్నించగలరు :))

    ReplyDelete
    Replies

    1. మన్నించే సాం !

      జిలేబి

      Delete