Friday, June 26, 2015

బోడిగుండుకి బట్టతలే శిక్ష ! (పని లేక రమణ - వెల్కం బెక బెక )


బోడిగుండుకి బట్టతలే శిక్ష !
one of the very impressing post from
initial years of blogging !
 
సంచలనాత్మక టపా
 
పని లేక రమణ గారు - మీరు మళ్ళీ మీ బ్లాగు మూత ని తెరిచి నందులకు
వెల్కం బెక బెక !!!
ఎప్ప్లటి లాగే మళ్ళీ మీరు టపాల తో తెలుగు బ్లాగు లోకాన్ని అలరింప జేస్తారని
ఆశిస్తూ
జిలేబి ప్రెజెంట్స్
 
 


తలనీలాలు ఇచ్చారు. ఏ దేవుడుకి సార్?". ఓ అతికుతూహల పేషంట్ యొక్క అనవసరపు వాకబు.
             
"డాక్టర్ గారు, మీరు చాలా పధ్ధతిగల మనిషండీ. ఈ రోజుల్లో చదువుకున్నవారిలో ఇంత భక్తిభావం అరుదుగా కనిపిస్తుంది!" ఓ ముసలి పంతులుగారి అతిమెచ్చుకోలు.
            
'ఓ ప్రభువా! ఈ పాపిని రక్షించు!'
             
రాన్రాను నెత్తిమీద కేశరహిత ప్రదేశం పెరుగుట వలన.. జయసూర్య, బ్రూస్ విల్లిస్ మొదలగువారి గుండు నుండి స్పూర్తి పొంది.. నేను కూడా బోడిగుండు చేయించుకొని.. ఫేషన్ గురు వలే పోజ్ కొట్టిన మొదటిరోజు అనుభవమిది!
             
మనది కర్మభూమి. ఇచ్చట బట్టతల వాడి ఫాషన్ గుండునీ, దేవుడి భక్తిగుండునీ ఒకేగాట గట్టే అజ్ఞానులే ఎక్కువ. భగవంతుణ్ణీ భక్తుణ్ణీ అంబికా దర్బార్ బత్తి ఎంత అనుసంధానం చేస్తుందో నాకు తెలీదు కానీ బోడిగుండు మాత్రం ఖచ్చితంగా చేస్తుందని చెప్పగలను.


మానవునికి తన జుట్టు అందానికీ, అహంకారానికీ చిహ్నం. ఈ రెండూ ఆ దేవుడికి సమర్పించడం త్యాగానికీ, భక్తికీ కొలబద్ద అని అంటాడు అన్నయ్య. అటులనే కానీండు. మరి గుండు దాచడానికి టోపీ ఎందుకు పెట్టుకుంటారో!
              
అయినా నా బట్టతలకో కథ ఉంది. నాకు మెడిసిన్ సీటొస్తే గుండు చేయిస్తానని మా అమ్మ తన ఇష్టదైవమైన ఆ తిరపతి వెంకన్నకి మొక్కుకుంది. కానీ నేను ససేమిరా అన్నాను.


నాకు జుట్టుపై ప్రేమకన్నా.. కష్టపడి సాధించిన మెడికల్ సీటుని దేవునిఖాతాలో వెయ్యడానికి మనసొప్పలేదు. అంచేత ఏంచేయ్యాలో తోచని అమ్మ మధ్యేమార్గంగా అర్భకుడైన రెండేళ్ళ మా అక్కకొడుక్కి గుండు కొట్టించింది. 


ఈ ఎడ్జస్టుమెంట్ గుండు ఆ దేవుడికి నచ్చినట్లు లేదు. అప్పటినుండీ వెంకటేశ్వరస్వామి నా మీద పగబట్టి.. నా నెత్తిమీద కల తనదైన బాకీ (జుట్టు)ని.. వాయిదాల పధ్ధతిన శాస్వితంగా తీసేసుకున్నాడు. ఫైనాన్స్ వ్యాపారివలే దేవుడు కూడా బాకీ వసూలు దగ్గర ఖచ్చితంగా ఉంటాట్ట! అమ్మ చెప్పింది.


'దేవుడు జుట్టునే బాకీగా ఎందుకు వసూలు చేసుకోవడం? ఏకంగా మెడిసిన్ సీటే వెనక్కి లాక్కోవచ్చుగా?' ఈ సందేహానికి అమ్మ దగ్గర రెడీమేడ్ ఆన్సర్ ఉంది.


'ఆ తిరపతి వెంకన్నకి అదెంతసేపు పని! కానీ ఆయన అలా చెయ్యడు. నువ్వు తన భక్తురాలి కొడుకువి! అంచేత ఏదో మందలించి వదిలేసినట్లు బట్టతల అనే తక్కువ శిక్ష వేశాడు. సంతోషించు.' అంటూ అమ్మ బల్ల గుద్దుతుంది. నమ్మక తప్పదు!


అంచేత మీకు చెప్పొచ్చేదేమనగా.. యుల్ బ్రిన్నర్, బ్రూస్ విల్లిస్, అమ్రిష్ పూరీ, గిబ్స్ మొదలైన బోడిగుండు వీరులంతా కూడా.. వారి తల్లులు మొక్కిన పాతమొక్కుల తాలూకా బాకీలు తీర్చే క్రమంలో బట్టతలల బారిపడ్డారని! అప్పుడేకదా మా అమ్మ 'గుండుమొక్కులు - బట్టతల థియరీ' కరెక్టయ్యేది.


ఈమధ్య ఓ తోటి బట్టబుర్రవాడు బట్టతల మేధావిత్వానికీ, మగతనానికీ ప్రతీకలనీ.. ఇంకా ఏవో చాలా చెప్పాడు.

కానీ వాడు తన బట్టతల గూర్చి తీవ్రంగా వ్యాకులత చెందుతూ.. ఆ భాధ తప్పించుకోడానికి మాత్రమే ఈరకమైన వాదనలని తలకెత్తుకున్నాడని అర్ధమైంది.
              
నాకు మాత్రం నా జుట్టులేమి మీద అంత ఆత్మన్యూనతా భావమేమి లేదు. 'ఉంటే మంచిదే.. ఉండకపోతే మరీ మంచిది!' లాంటి ఉదాసీనవైఖరి తప్ప!

*య రమణ*

చీర్స్
జిలేబి

12 comments:

  1. ఈమధ్య ఓ తోటి బట్టబుర్రవాడు బట్టతల మేధావిత్వానికీ, మగతనానికీ ప్రతీకలనీ.. ఇంకా ఏవో చాలా చెప్పాడు

    ఇది మాత్రం నిజం.అమ్మాయిలను చూడగానే తలదువ్వుకునేవాళ్ళు ఎక్కువ, బట్టతల అయితే ఇతర అమ్మాయిలపై ఆలోచనలు తగ్గిపోయి మేధావి అయిపోతారు. మేధావులైతే అమ్మాయిలు ఎలాగూ వెంటపడతారు.

    జుట్టు ఉన్నవాళ్ళు యతిరాజులవుతారు !
    బట్టతల ఉన్నవారు మేధావులవుతారు !

    ఏ రాయి అయినా ఒకటే....

    (అర్జెంటుగా నా ముక్కూ చెవులని ఇన్సూరెన్స్ చేయించుకోవాలి)

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. అమ్మా నీహారికగారూ,

      ఉ. రాముడు లక్ష్మణుండు నిటు రారుగదా యొక చుప్పనాక కిం
      కేమి భయంబు వచ్చుటకు నెల్లరు వచ్చుచు నుండి నట్లుగా
      నేమి పఠింపనైన మరి యేమి పఠింపగజేయనైన బ్లా
      గ్భూముల గ్రుమ్మరంగ నగు పుట్టదు కష్ట మొకింత యేనియున్.

      అందుచేత మీ ముక్కునీ చెవులనీ ఇన్సూర్ చేయుంచుకోవలసిన పని లేనేలేదు.

      Delete

    3. వా హ్ వా హ్ !!

      జిలేబి

      Delete

  2. రామజన్మభూమి గురించి నేను మాట్లాడిన మాటలు ఏ పత్రికలోనూ రాలేదు కానీ ఇత్తెమాద్ డైలీలో వచ్చాయి. ఉర్దూ ఎవరికీ అర్ధం కాదు(నాక్కూడా) కాబట్టి ఎవరూ మాట్లాడలేదు. నన్ను తెలుగులో తిట్టలేక ఇంగ్లీష్లో తిట్టి తమ ప్రతిభని చూపించుకున్న వీరాధివీరులు కూడా నేడు ముఖం చాటేసారు.గరీబీ హఠావో అని గొంతు చించుకున్నవాళ్ళు కూడా అడ్రెస్ దొరక్కుండా తిరుగుతున్నారు.ఎదుటివాడి వీక్నెస్ గమనించి వెక్కిరించడం కన్నా, నాలుగు పద్యాల అర్ధాలు వారికర్ధమైయ్యే భాషలో అరిచి చెప్పినా తాము నేర్చుకున్న పాండిత్యానికి విలువా గౌరవమూనూ !!
    ఘర్ వాపసీ కాకుండా "ఘర్ ఆజా" అని పిలిచే వారినే రాముడు కరుణిస్తాడు కానీ నన్ను చూడు నా పాండిత్యం చూడు రామా అని వెయ్యిన్నొక్క పద్యాల్లో స్తుతించినా వినిపించుకోడే ?

    దేశాన్ని శుభ్రం చేసేముందు ఈ "పండితమన్యుల" బుర్రలు శుభ్రం చేయాలి !

    ReplyDelete
    Replies
    1. నీహారికగారూ,

      >ఘర్ వాపసీ కాకుండా "ఘర్ ఆజా" అని పిలిచే వారినే రాముడు కరుణిస్తాడు.
      మంచిమాట చెప్పారు.

      > ఈ "పండితమన్యుల" బుర్రలు శుభ్రం చేయాలి !
      అలాగే.

      >నాలుగు పద్యాల అర్ధాలు వారికర్ధమైయ్యే భాషలో...
      నేను సరదాగా ఒక్కటే చెప్పానండీ. మీకు నచ్చక ఫైర్ అవుతున్నారన్నమాట,

      Delete
    2. నచ్చక కాదండీ నిజంగా అర్ధం కాలేదు ! రాముడూ లక్ష్మణుడూ రాకపోతే తెలంగాణా పోలీసులు ఊరుకుంటారేమిటి ?

      Delete

    3. వా హ్ వా హ్

      జిలేబి

      Delete
  3. జిలేబి జీ,

    'పని లేక.. 'ని గుర్తు చేసుకున్నందుకు ధన్యవాదాలు.

    ramanayadavalli.blogspot.in

    ఇది నా కొత్త బ్లాగ్.

    వీలు చూసుకుని ఓ లుక్కేస్తే సంతోషిస్తాను.

    థాంక్యూ!

    ReplyDelete
    Replies
    1. రమణగారు నాకు చెప్పకపోయినా, నేనూ ఒక లుక్కేశాను జిలేబిగారూ.

      Delete

    2. పని లేక రమణ బాబు గారు,

      వెల్కం బెక బెక !

      సర్ప్రైజ్ ! నయా బ్లాగు నయా అప్పీల్ అన్న మాట !

      ఆల్ ది బెష్ట్ !!

      మొదటి టపా యే సుడి గుండాల తో మొదలెట్టేరు ! :)

      ఇక మీదట మీ ఈ నయా పిపీలికం బ్లాగు ని ఫేవరైట్ క్రింద చేర్చుకోవాలి మీరు అగ్రిగేటర్ కి కలప కూడదన్న నిర్ణయం చదివాక :

      అగ్రిగేటర్ కి కలిపితే చదవటానికి, 'కా' 'మంటలు' కి కొద్ది ఆజ్యం పొయ్యడానికి వీలుగా ఉండును :) జేకే !!

      మీ టపాలు మళ్ళీ చదవగలగడమే గొప్ప విషయం ! ఇప్పటికి సర్దుకు పోతాము ! కొన్ని రోజుల తరువాయి అయినా అగ్రిగేటర్ లకి కలుపుతారని ఆశిస్తా :)

      చీర్స్
      జిలేబి

      Delete

    3. శ్యామలీయం వారు,

      ముదావహమైన విషయం ! మళ్ళీ రమణ గారు టపాలు వ్రాయటం బ్లాగు లోకానికి , తెలుగు బ్లాగు లోకానికి మళ్ళీ ఊపొచ్చింది :)

      జిలేబి

      Delete