బలపం బట్టి భామ ఒళ్లో అ ఆ ఇ ఈ నేర్చుకున్నా అని మావయ్య పాట వ్రాసి పోయేడు ! కామ్రేడ్ "సిరివెన్నల" (అదేనండీ సిరి వెన్నెల వారు ) వారు సొగసుగా రాసేసు కున్నారు !
దాన్ని మా బాలూ కూడా యమహా నగరి లా పాడి రంజింప చేసాడు !
కవి వరుల చేతి లో పదాలు పాదాలు పదనిసల తో పట్టు పరికిణీలు వేసుకుని పరి పరి మనలను పరిమళింప జేస్తాయి !
వారి పద పొందులు వాటి అందాలు వారికేలా వస్తుందబ్బా అని హాశ్చర్య పోవడం మాత్రమె జిలేబి వంతు !
ఈ మధ్య ప్రజ వారు తెలుగు వ్రాత లో ఇన్నేసి అక్షరాలూ ఉండాలా అని ప్రశ్నించేరు !
అక్షరాలూ ఎన్నేసి ఉన్న నేమి ? వాటిని ఎట్లా ఉపయోగిస్తున్నామో అన్నదాన్ని బట్టి అవి వాడుకలో ఉంటాయా లేవా అన్నది రూడి ( ఇక్కడే ఒక ఒత్తు పోయే! )
ఈ మధ్య ఆంగ్లం లో LOL అని రాయ బోయి లోల అని వ్రాసేనన్నారు బండి రావు గారు . ఆహా కొత్త పదం కని పెట్టేరు అని మరొక మా 'సార్' తిరగేస్తే శర్మ గారు వారి కి తాడులు వేసేరు !
బండి ర ఎట్లా వ్రాయాలో తెలీటం లేదు :)
ఆ మధ్య ఒక కార్టూన్ చూసా రిక్షా బండి వాడి ని రావయ్యో అనడానికి కార్టూనిస్టు ఒక్క పదం లో అంటే బండి ర తో కార్టూన్ వ్రాసేసేరు ! అదీ కవి పదపు పదును !
శ్రీపాద వారు శ్రీ రాముల వారిని అంటే వనవాస కాలపు శ్రీ రాముల వారిని విప్రలంభపు శృంగార యోగి అని వర్ణించేరు ! పదముల పొందిక అది !
"మన దగ్గిర చుట్టమైన రాముడు
మహావీరుడూ ,
ప్రకృతి సౌందర్య పిపాసీ ,
దుష్టశిక్షకుడూ ,
శిష్టరక్షకుడూ,
ముఖ్యం గా విప్రలంభ శృంగార యోగిన్నీ !"
గోదావరి వాళ్లకు ఆ తెలుగు అట్లా ఎట్లా వస్తుందేమో తెలీదు గాని, కష్టే ఫలే వారి టపాల్లో రెండు వాక్యాల్లో ఒక వాక్యం నానుడి తో ఉంటుంది !
శ్యామలీయం వారి టపాల్లో పద్యాల పై నున్న వెరైటీ , వారు రాముల వారి పై రాశి పోసిన పద్యాలు , (అంతే కాదు సై అంటే సై అని జిలేబి కామెంట్లు పోటీ గా వ్రాసిన జిలేబి శతకం కూడాన్ను ) - తెలుగు బ్లాగు వెలుగులు ఇంతింత కాదయా అని చెప్పుకొనక తప్పదు !
మా అరవ దేశం లో క్రేజీ మోహన్ అని ఒక రచయిత ఉన్నారు . వారి చేతిలో పదాల విరుపు ఇంతా అంతా అని చెప్పలేము ! పదాలు నాజూగ్గా విడి పోయి హాస్యాన్ని పండిస్తాయి !
బ్లాగులోకం లో నిరవధికం గా సంవత్సరాల తరబడి సమస్యాపూరణం నడుపుతున్న కంది వారు వారి టీము ఒక ఎత్తైతే ( మేమంతా హరిబాబు వారి లా పేజీ ల కొద్ది టపాలు వ్రాస్తాం - ఒక్క కామెంటూ పడదు - కంది వారేమో ఒకే ఒక్క వాక్యం వ్రాస్తారు టప టప మని ఓ నలభై కామెంట్లు ఒట్టి కామెంటులు కావు మేటరు ఉన్న మేలైన నేటి కి ఏ నాటికీ నాలుగు కాలాల పాటు నిలిచి పోయే పదాలు పద్యాలు పడతాయి ! అబ్బ మరీ ఈ జిలేబి కి కా 'మంటలు' అంటే అంత 'ఇది' యేమో తెలీదు గాని :)) - మరో ఎత్తు నెమలి కన్ను మురళి గారు - దేశం ఉన్న గొప్ప గొప్ప వాళ్ళని అందర్నీ కలగలిపి గోదారి లాక్కెళ్ళి పోతారు :) జేకే !
సంస్కృత మకరందాలు -
బ్లాగాడిస్తా వారి చమక్కులు -
పద్మార్పిత వారి పడుచుపదాలు-
ఆంధ్రామృతం వారి అద్బుత 'అరంగేట్ర' సమాచారాలు-
ఈ టైటిల్ చదివితే ఈ టపా మనవు గారిదే నబ్బా అని కళ్ళు మూసుకుని చెప్పెలాంటి టైటిల్ పెట్ట గలిగిన మనవు గారు -
సుజన సృజన లతో పదనిసల్ని మోహనం గా ఆలాపించే లక్కాకుల వారు-
బ్లాగు బర్త డే కి టపాలు రాసే స్టేజీ కి వచ్చేసిన ఒకప్పటి ఇల్లు అలకటం మరిచి పోయిన ఈగాజ్యోతీలు - అప్పుడప్పుడు శర్కర పంచె శర్కరీలు -
కౌముది కి అంకిత మై పోయిన బ్లాగిణి మణులు (మధుర వాణీ గారు వింటున్నారా ?) -
పనిలేక పిపీలిక మైన మా డాటేరు బాబు రమణ గారు -
తేటగీతి అంటూ తేటతెల్లంగా 'అటుకుల' బొంత ని స్వాహా గావిస్తున్నవారు :) -
పాటతో నేను అని సైలెంట్ గా సినీ పాటల ఒక ఖజానాని పెట్టి వాటికి లిరిక్స్ జోడించి జోహార్ అని పించే లా ఉన్న వేణూ శ్రీకాంత్ గారు -
అమృత మధనం తో దేశాన్ని మధిస్తూ బుద్ధునికి మురళి కి సంజౌతా 'ఎక్స్ప్రెషన్' ప్రయత్నిస్తున్న మా జర్నలిస్ట్ బుద్దా వారు -
పద గోళీ లాడుతో సమస్యల తో 'పూ' రణం గావిస్తున్న మా గోలీ హుమచ్చాస్త్రీ వారు - (హనుమ కీ స్త్రీ కి పొత్తు ఎట్లా అవుతుంది సినబ్బా అని హాశ్చర్య పోయా మొదట వారి పేరు చూసి !) -
మా కథా మంజరి అయ్యవారు పద్యాలు పెట్టి టపాలు గట్టి సెహ భేషు గా బ్లాగ్ విహారం గావిస్తున్న వారు -( వారి బ్లాగు టెంప్లేటు సరిగ్గా లేక నేను కామెంట లేక పోయిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి - టెంప్లేటు మార్చండి మహాప్రభో అని చెప్పినా ప్రయోజనం లేక పోయే :)
రమ్యంగా కుటీరాన అంటూ గులాబీ 'ఔట్లు' కూడా కావాల్సి వస్తే పెలుస్తాం అంటూ అలుపెరుగక ఉన్న నీ , మా , హారిక గారు :)
కన్నీటి కథ ల తో కడివెడు కహానీ లతో సమ సమాజానికి అద్దం పట్టే వనజ వనమాలీ గారు -
దేశ విదేశాల్లో ని సంక్షోభ పరిస్థితుల కి చరమ గీతం గ్రహాల భ్రమణం తో ఆలాపిస్తున్న మా భ్లాగ్జ్యోతిష్ శర్మ గారు -
ఇట్లా ఊకదంపుడు వ్రాసుకుంటూ జిలేబి కూడా ఎనిమిది సంవత్సరాలు దరిదాపుగా కలగా పులగం గా , ఈ ఒక్క సబ్జెక్టే నేను తాకుతా అనుకోకుండా అట్లా అందరిని గెలుకుతూ , అప్పుడప్పుడు డక్కా మొక్కీలు తింటూ , కొండొక చొ ఐ డోంట్ లైక్ లతో చీవాట్లు తింటూ కాలం గడిపేస్తోంది :)
ఇంతకీ ఈ టపా టైటిల్ ఏమిటి ? ఈ టపా ఏమిటి ? అంతా గందర గోళం గా ఉందిస్మీ :)
బ్లాగ్దేశం లో ఉండాలంటేనే భయం గా ఉంది - దేశం విడిచి పోతా - జిలేబి
అయ్యరు ఖాన్ గారు నాకు బ్లాగ్దేశం లో ఉండాలంటే నే భయ్యం భయ్యం గా ఉందండీ జిలేబి రావు చెప్పింది అయ్యరు ఖాన్ తో .
అయ్యర్ ఖాన్ తన విశాలమైన చాతీ ని తడుముకోబోయి తానూ చాలా సీదా సాదా అయ్యర్ ఖాన్ మాత్రమె అని గుర్తు కొచ్చి
మై డియర్ జిలేబి రావు ! నా ప్యారీ పెండ్లామా ! మనమంతా సాదా సీదా బ్లాగ్ దేశ వాసులం ! మనం అట్లాంటి మాటలు చెప్పలేం " చెప్పారు అయ్యర్ ఖాన్ గారు .
మరి ఎట్లా ఈ బ్లాగ్ దేశం లో బతికేది ? రోజు రోజు కి వైషమ్యాలు కార్పణ్యాలు , భావాల మీద బావ ల మీద, మాట మీద , సారంగం మీద వచ్చే కామెంట్ల చూస్తూంటే నాకు మరీ విపరీతమైన భయ్యం వస్తోందండీ !
జిలేబి ! ఇంతకు మునుపు ఇట్లాంటి కామింటులు అంటే సై అంటే సై అనే కామింటులు లేవా ?
ఉండే వండి ! ఒక వైపు వారు మాత్రమె ఎగ సెగ డోస్ ఇచ్చె వారు ! కాని ఈ కాలం లో సై అంటే సై అని కౌంటర్ వేయటం ఎక్కువై పోయిందండి !
సో కౌంటర్ వేయటం కొట్టొచ్చినట్టు కనబడు తోందన్న మాట ! సరే రేపు నాకు బ్లాగ్దేశం లో ని మ్యాడ్ మీడియా వారి తో బ్లాగ్ముఖీయం ఉంది - దాంట్లో వీళ్ళ తాట వదిలిస్తా ! నీ తరపు గా నేను వాళ్లకి చెబ్తా ! మా జిలేబి రావు కూడా భయపడింది అని చెప్పాడు అయ్యర్ ఖాన్ !
జిలేబి రావు కళ్ళ లో కన్నీళ్లు సుళ్ళు తిరిగేయి ! ఈ బ్లాగ్దేశం ఎంత మారి పోయింది ! చ చ ! వేరే బ్లాగ్ దేశం కి వెంటనే వెళ్లి పోవాలి !
అయ్యర్ ఖాన్ తన సైజైన చాతీ తో జిలేబి రావుని అక్కునకి తీర్చుకున్నాడు !
బావా నా లో వంట జ్ఞానమే కొరవడెనని వడ్డింపు వాస్తేదో అంతగా లేనే లేదని అల్లం దోశ లతో సాంబారు లాగించ మంటే బావా, నేను మూగనై నీ బందీ నై పోయా !
ఆలోచనలకి రూపమీయ జిలేబి గుండు అని తటిల్లత లా జిలేబి పాకం నీరు కారి పోయే లేని పెసరట్ల తో తెలుగు వంట చేయ మంటే ఆలోచనలు అవాక్కై ఆముదాన్ని తాగె !
వ్యంగ్య వ్యాఖ్యల కారప్పూసల తో వడ్డించి టిఫిను ఖాళీ ప్లేటు పెట్టి తినమంటే అల్లం మిర్చీ గా మారి కాలుతుంటే మజ్జిగెరుగని మదికన్నీరే బ్లాగ్కాలువాయే !
అల్లంమొరబ్బా ని అభిమానిస్తే అదేదో నేరమని నా తలపుల కే రంకుగట్టి బావలతో సరసమని పదాలే వేరుగా పలికి పోపు పొడి వేయిస్తూంటే విస్తరాకుల విజ్ఞానమిదేనని వినమ్రత గా నవ్వుతా !
ఎరక్క పోయి వచ్చాను ఇరుక్కు పోయాను అని సినీ కవి పాట . ! నిజంగానే అట్లా అయ్యింది జిలేబి పరిస్థతి ! మొన్న శర్కరి వారు సత్యనారాయణ వ్రతం గురించి గరికపాటి వారి ప్రసంగం వీడియో పెట్టి మనకు తెలిసిన సత్య నారాయణ వ్రతం కోరికలను ఈడేర్చేది . మరి గరిక పాటి వారేమో సత్యం గురించి మాట్లాడు తున్నారు మరి అంటే , అబ్బే మగరాయుళ్ళ కి ఆండోళ్ళ కి తెలిసినంత గా వీటి గురించి తెలీదండీ అని వ్రాయటం తో మొదలెట్టి ఆ పై గరిపాటి చేయని సత్యాని కి ఇంత విలువా ! ఇంత బిల్డ్ అప్ కూడానా అని వ్రాస్తే విన్న కోట వారు ఆయ్ మీరు గరిక పాటి వారి పాండిత్యాన్ని గరిక పోచ తో పోల్చడం సుతరామూ బావోలేదు సుమీ అని ధక్కా ఇచ్చారు ! శ్యామలీయం వారేమో పొరపాటు మాటన్నారు జిలేబిగారు అన్నారు ! అదిరి పడ్డా ! ఎరక్క పోయి కామేంటాను ఇరుక్కు పోయాను అనుకున్నా ! మరీ శర్కరి వారి కామింటు బాక్సు నింపడం కన్నా మనకు ఒక టపా వ్రాసేందుకు ('టపా' కట్టేందుకు ) అవకాశం దొరికింది సుమీ అని సంతోష పడి పోయా ! సత్యాన్వేషణ అన్నది కాలా కాలం గా ప్రతి జమానా లో నూ జరుగుతున్నదే. అయితే ఏది సత్యం అన్నది , ఇదే సత్యం అన్నది నిర్ధారణ గా , చెప్పలేనిది. ఇదే సత్యం అంటే అప్పటికి అదే సత్యం కాని దాని ఆవల మరో సత్యం ఉన్నది అన్నదే న ఇతి ! ఈ క్షణం సత్యం అనుకుంటే ఈ క్షణం మాత్రమె సత్యం ఆ పై క్షణం సత్య దూరం. మార్పు చెందనిది సత్యం అనుకుంటే మార్పు లేనిదే ఈ విష్ణు మాయ లేదు. గరిక సత్యం పాటి అవ్వొచ్చు నెమో గాని సత్యం గరిక పాటి కాలేదు. అది అయితే ఇక సత్యం వేరే ఉన్నట్టే లెక్ఖ . గరిక పాటి వారు చెప్పినది 'సత్యమైన' మాట - సత్య వ్రతం చెయ్య మనడం . సత్య మేవ జయతే అనటం తో ఋక్కు ఆగలేదు - మరో తోక తగిలించు కున్నది నానృతం అని కూడాను. ఋతగుం సత్యం పరం బ్రహ్మ అంటుంది ఋక్కు . ఇందులో సత్యానికి మరో తోక కూడా ను "ఋ" త ఎందుకా తోక ? ఇప్పటి దాకా నాకైతే అనుభవైక వేద్యం కాలేదు ( పుస్తక జ్ఞానం కాకుండా) ! నారాయణ సూక్తం 'నీవారశూకవత్తన్వీ పీతా భాస్వత్యణూపమా' అంటుంది ఆ 'పరం బ్రహ్మ' గురించి చెబుతూ ఎండిపోయిన గరిక మొనన ఉన్న పీత వర్ణ రంగులో అణు మాత్రమై అంటూ . క్వాంటం ఫిసిక్స్ గాడ్ పార్టికల్ వైపు పరుగెడు తోంది . ఇట్లాంటి నేపధ్యం లో ఒక్క వాక్యం లో వ్రాసినది ఆ వాక్యం . ఆ గరిక పాటి అన్నది బాగా అక్కడ కుదురుకున్న మాట అయి పోయింది ! సత్యం గరిక పాటి చేయదు. చేస్తే అది సత్యం కాదు. మరి ఏ పాటి చేస్తుంది ? తెలీదు ; ఈ పాటి చేస్తుంది అని తెలిస్తే అది సత్యదూరం. జిలేబి (హమ్మయ్య ! నేటికి ఒక టపా కట్టేసా:)
కృష్ణా జీ హౌ ఆర్ యు ? అడిగింది సత్య ! భామ వైపు చూసేరు శ్రీ కృష్ణుల వారు . ఈ సత్య అప్పుడెప్పుడో కాలం లో నరకాసురుడి ని సంహారం గావించి సత్యాన్ని నిలబెడితే జన వాహిని దీపావళీ తో ఆనంద పడి పోయేరు ! అప్పటి నించి జనవాహిని ప్రతి ఏటా ఈ దినాన్ని కాపీ కొట్టేసు కుంటూ దీపావళీ జరిపేసు కుంటోంది . ఈ కలియుగం లో అగర్వాల్ భాయీ లు , శ్రేష్ఠులు కలిసి దీపావళీ సమయాన్ని బిలియన్ డాలర్ మార్కెట్ గావించే సేరు కూడాను ! కాపీ కి ఇంత మహాత్మ్యం ఉంది ! అందరూ శ్రీ కృష్ణా రామా నీ లా నన్ను చేయ వయ్యా అని దండాల మీద దండాలు పెట్టేసు కుంటున్నారాయే ! ఈ జమానా లో అంతా కాపీ మాయం మయం ! కాపీ లేని జీవితం ఎట్లా ఉంటుంది స్మీ :) దీపావళీ భళీ 'జిలేబీయం ! అందరికీ దీపావళీ 'కాఫీ' కాంక్షల తో ! చీర్స్ జిలేబి
ఈ జమానాలో జనాలకి కాలక్షేపం కబుర్లు, బాతాఖానీ బటానీలు ఎందుకు కావాలి ?
మా మీ మన అందరి 'రోలు కర్ర' శ్యామలీయం బ్లాగ్ మాష్టారు ( వీరిది వృత్తి పరంగా మాష్టారు ఉద్యోగం కాదు - మేధా జీవి ) ఓ కామెంటులో - ... ఈ రోజుల్లో జనానికి వినోదం కావాలి ... కాలక్షేపం సరుకు తప్ప మరేమీ పట్టని వారి సంఖ్యాబలం కారణం గా అలా కాలక్షేపం సరుకుల్ని పంచేందుకు తాపత్రయ పడే వారే ఎక్కువ (ఎడిట్)"
ఈ వ్యాఖ్య చదివాక - ఎందుకు ఈ కాలం లో ఎక్కువ మంది కాలక్షేపం కబుర్లు, సరదా గా సాగి పోయే విషయాలు తప్పించి కొద్ది పాటి సీరియస్ మేటర్ ని చదవటానికి ఉత్సుక చూపించడం లేదు ? అని పించింది .
మా అయ్యరు గారి తో ఈ మాటే అంటే ... జిలేబి నీ వయసు రోజుల్లో (అబ్బ వయసు రోజుల్లో అంటే నే జిలేబి కి చెక్కిళ్ళ గుబాళింపు ఎక్కువై పోతుంది మరి :)) రేడియో లో కూసింత ఏడుపు కథ లు వస్తే నే నీ కళ్ళ లో కన్నీరు జర జరా రాలి పోయేది గుర్తుందా ? అడిగేరు .
ఆలోచించా . అవును ఆ కాలం లో అన్నీ ఉమ్మడి కుటుంబాలు . కష్టాలు నష్టాలు ఎట్లా ఉన్నా గృహ వాతావరణం లో ఉత్సుకత , హిందీ లో చెప్పాలంటే ఉమంగ్ భరీ లైఫ్ ! ఉమ్మడి కుటుంబాలలో ఉన్న మజా ఆ కాలం వారికే తెలుసు నెమో !
అంతే గాక ఇప్పటి బిజీ లైఫ్ బ్యాక్ ప్యాక్ బకరా బేబీ లైఫ్ అప్పట్లో ఎక్కడ ? ఉద్యోగమో సద్యోగామో గానిస్తే ఆ తరువాయి బాతాకానీ కి ఇంటి నిండా జనాలు ఇంటి చుట్టూతా వున్నవారంతా బంధువులే బాంధవ్యాలే. జీవన గతి , సరళి సుళువు గా సాగి పోయే రోజులు . రేడియో లలో నో మీడియా (అప్పటి కి లేదు కాబట్టి , పేపర్ల లో నో ) వినోదం కన్నా కన్నీ టి కధ లే ఎక్కువ . కాంట్రాస్ట్ బాగా కుదిరి పోయేది !
జీవన గతి లో కన్నా మిన్నగా కన్నీటి కథలు ఉంటె మన జీవితమే బెటరోయి అని పించే లా ఆలోచింప జేసేవి .
మరి ఇప్పటి మాట ఏమిటి ?
జీవనం హై ఫై లైఫ్ ! సిటీ వారి కథలు ఇంక వేరే చెప్పాల్సిన అవసరం లేదు. పరు గె పరుగు . నిలబడి తీరిగ్గా ఆలోచించ టైం ఎక్కడ ?
ఇట్లాంటి జీవన గతి లో సో కాల్డ్ 'రిలేక్సేషన్ ' కోసం తపించి పోయే , విష్ణు మాయ లో పడి పోయిన మానవుడు !
ఆ ఉన్నంత కూసింత టైం వినోదానికి కాలక్షేపానికి ఏదన్నా ఉందా అని చూస్తున్నాడు .
మా ఏడు కొండల వెంకన్న లైఫ్ ని బిజి బిజీ చేసి, గజి బిజి చేసి పారే సాడు :) (విష్ణు మాయ మా వెంకన్న దే కదా మరి :)
సో , ఇట్లా ఆలోచిస్తే ఈ కాలపు మానవుడికి, బ్లాగ్ దర్శకులకు కావల్సినిది కాలక్షేపం ఖబుర్లు, బాతా ఖానీ బటానీ లు . ( ఈ టైటిల్లో మీకు ఎవరి బ్లాగు టపా అయినా గుర్తు కొస్తే అది జిలేబి ఊహాత్మకం గా పెట్టిన పేర్లే గాని వ్యూహాత్మకం గా పెట్టినవి కావు అని గుర్తు పెట్టు కోవాలి ! జేకే !)
సో ప్రియ బ్లాగ్ బాంధవుల్లారా ! మీ అభిప్రాయమేమిటి ఈ విషయం మీద ?
ఫుట్ నోట్ : జిలేబి కి అర్థం కాని విషయం ఒకటుంది ఈ కాలం లో కూడా కన్నీటి కుండల, వైషమ్యాల టీ వీ సీరియళ్ళు ఈ జిలేబి లని ఎందుకంత మరీ టీ వీ పెట్టె ముందు బందీ చేసి పారేస్తున్నాయి ? బ్లాగ్ లోకం లో ఉదాహరణ - వనజ వనమాలీ గారి కథలు )
మనసు--సమస్య
-
*మనసు--సమస్య*
*మనసు సమస్యను సృష్టించుకుంటుంది. సమస్య పరిష్కారం కాలేదని బాధపడుతుంది.
సమస్యను మొదటిలోనే తుంచేస్తే సమస్య లేదు. *
*ఎలా? అన్నది ప్రశ్న.*
...
శర్మ కాలక్షేపంకబుర్లు-పాలకోసం రాళ్ళుమోయడం !
-
Posted on ఏప్రిల్ 30, 2013 24 పాలకోసం రాళ్ళు మోయడం. “పాలకోసం రాళ్ళు
మోయడం”అనే నానుడి తెనుగునాట విస్తృతంగా వాడతారు. దీని అర్థం విస్తృత ప్రయోజనం
కోసం కష్టపడట...
శర్మ కాలక్షేపంకబుర్లు- పనసకాయ దొరికినప్పుడే………….
-
పనసకాయ దొరికినప్పుడే….……… పనసకాయ దొరికినప్పుడే తద్దినం పెట్టమన్నారు అని
నానుడి.. ఇదేంటో నాకు అర్ధంకాలేదు నిన్నటి దాకా. ఈ మధ్య భాగవతం మూలం చదువుతూ
పోతనగారు ...
శర్మ కాలక్షేపం కబుర్లు-1- గురు, దైవ వందనం
-
*— శర్మ కాలక్షేపం కబుర్లు—*
*Posted on సెప్టెంబర్ 23, 2011 *
*గురు, దైవ వందనం*
కన్న తల్లి తండ్రులకు సాష్టాంగ దండ ప్రణామాలు. పెంచిన తల్లి తండ్రులకు
సాష...
పెహ్లాజ్ నిహలాని సాబ్! యువార్ గ్రేట్!
-
మన్ది పవిత్ర భారద్దేశం, ఈ దేశంలో పుట్టినందుకు మనం తీవ్రంగా గర్విద్దాం (ఇలా
గర్వించడం ఇష్టం లేనివాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు). మన్దేశంలో ప్రజలే
పాలకుల...
ఒక సినిమా జ్ఞాపకం (స్వాతిముత్యం)
-
అవి మేం చదూకునే రోజులు. మాకు సినిమాలే ప్రధాన కాలక్షేపం. సినిమా
బాగుంటుందా లేదా అనేది ఎవడికీ పట్టేది కాదు, సినిమా చూడ్డమే ముఖ్యం.
అవ్విధముగా - ప్రవాహంలో ...