Saturday, November 28, 2015

గర్భిణి ఘంటపు ఊకదంపుడు :)


గర్భిణి ఘంటపు ఊకదంపుడు :)

బలపం బట్టి భామ ఒళ్లో అ ఆ ఇ ఈ నేర్చుకున్నా అని మావయ్య పాట వ్రాసి పోయేడు ! కామ్రేడ్  "సిరివెన్నల" (అదేనండీ సిరి వెన్నెల వారు )  వారు సొగసుగా రాసేసు కున్నారు !

దాన్ని మా బాలూ కూడా యమహా నగరి లా పాడి రంజింప చేసాడు !

కవి వరుల చేతి లో పదాలు పాదాలు పదనిసల తో పట్టు పరికిణీలు వేసుకుని పరి పరి మనలను పరిమళింప జేస్తాయి !

వారి పద పొందులు వాటి అందాలు వారికేలా వస్తుందబ్బా అని హాశ్చర్య పోవడం మాత్రమె జిలేబి వంతు !

ఈ మధ్య ప్రజ వారు తెలుగు వ్రాత లో ఇన్నేసి అక్షరాలూ ఉండాలా అని ప్రశ్నించేరు !

అక్షరాలూ ఎన్నేసి ఉన్న నేమి ? వాటిని ఎట్లా ఉపయోగిస్తున్నామో అన్నదాన్ని బట్టి అవి వాడుకలో ఉంటాయా లేవా అన్నది రూడి ( ఇక్కడే ఒక ఒత్తు పోయే! )

ఈ మధ్య ఆంగ్లం లో LOL అని రాయ బోయి లోల అని వ్రాసేనన్నారు  బండి రావు గారు . ఆహా కొత్త పదం కని పెట్టేరు అని మరొక  మా 'సార్' తిరగేస్తే శర్మ గారు వారి కి తాడులు వేసేరు !

బండి ర ఎట్లా వ్రాయాలో తెలీటం లేదు :)

ఆ మధ్య ఒక కార్టూన్ చూసా రిక్షా బండి వాడి ని రావయ్యో అనడానికి కార్టూనిస్టు ఒక్క పదం లో అంటే బండి ర తో కార్టూన్ వ్రాసేసేరు ! అదీ కవి పదపు పదును !



శ్రీపాద వారు శ్రీ రాముల వారిని అంటే వనవాస కాలపు శ్రీ రాముల వారిని విప్రలంభపు శృంగార యోగి అని వర్ణించేరు ! పదముల పొందిక అది !

                                                       "మన దగ్గిర చుట్టమైన రాముడు
మహావీరుడూ ,
ప్రకృతి సౌందర్య పిపాసీ ,
దుష్టశిక్షకుడూ ,
శిష్టరక్షకుడూ,
ముఖ్యం గా విప్రలంభ శృంగార యోగిన్నీ !"

గోదావరి వాళ్లకు ఆ తెలుగు అట్లా ఎట్లా వస్తుందేమో తెలీదు గాని, కష్టే ఫలే వారి టపాల్లో రెండు వాక్యాల్లో ఒక వాక్యం నానుడి తో ఉంటుంది !

శ్యామలీయం వారి టపాల్లో పద్యాల పై నున్న వెరైటీ , వారు రాముల వారి పై రాశి పోసిన పద్యాలు , (అంతే కాదు సై అంటే సై అని జిలేబి కామెంట్లు పోటీ గా వ్రాసిన జిలేబి శతకం కూడాన్ను ) - తెలుగు బ్లాగు వెలుగులు ఇంతింత కాదయా అని చెప్పుకొనక తప్పదు !


మా అరవ దేశం లో క్రేజీ మోహన్ అని ఒక రచయిత ఉన్నారు . వారి చేతిలో పదాల విరుపు ఇంతా అంతా అని చెప్పలేము ! పదాలు నాజూగ్గా విడి పోయి హాస్యాన్ని పండిస్తాయి !



బ్లాగులోకం లో నిరవధికం గా సంవత్సరాల తరబడి సమస్యాపూరణం నడుపుతున్న కంది వారు వారి టీము ఒక ఎత్తైతే ( మేమంతా హరిబాబు వారి లా పేజీ ల కొద్ది టపాలు వ్రాస్తాం - ఒక్క కామెంటూ పడదు - కంది వారేమో ఒకే ఒక్క వాక్యం వ్రాస్తారు టప టప మని ఓ నలభై కామెంట్లు ఒట్టి కామెంటులు కావు మేటరు ఉన్న మేలైన నేటి కి ఏ నాటికీ నాలుగు కాలాల పాటు నిలిచి పోయే పదాలు పద్యాలు పడతాయి ! అబ్బ మరీ ఈ జిలేబి కి  కా 'మంటలు' అంటే అంత 'ఇది' యేమో తెలీదు గాని :))  - మరో ఎత్తు నెమలి కన్ను మురళి గారు  - దేశం ఉన్న గొప్ప గొప్ప వాళ్ళని అందర్నీ కలగలిపి గోదారి లాక్కెళ్ళి పోతారు :) జేకే !

కాలక్షేపం కబుర్లు , బాతాఖానీ కబుర్లు , అరుగు కబుర్లు !

సంస్కృత మకరందాలు -
బ్లాగాడిస్తా వారి చమక్కులు -
పద్మార్పిత వారి పడుచుపదాలు-
ఆంధ్రామృతం వారి అద్బుత 'అరంగేట్ర' సమాచారాలు-
ఈ టైటిల్ చదివితే ఈ టపా మనవు గారిదే నబ్బా అని కళ్ళు మూసుకుని చెప్పెలాంటి టైటిల్ పెట్ట గలిగిన మనవు గారు -
సుజన సృజన లతో పదనిసల్ని మోహనం గా ఆలాపించే లక్కాకుల వారు-
బ్లాగు బర్త డే కి టపాలు రాసే స్టేజీ కి వచ్చేసిన ఒకప్పటి ఇల్లు అలకటం మరిచి పోయిన ఈగాజ్యోతీలు - అప్పుడప్పుడు శర్కర పంచె శర్కరీలు -
కౌముది కి అంకిత మై పోయిన బ్లాగిణి మణులు (మధుర వాణీ గారు వింటున్నారా ?) -
పనిలేక పిపీలిక మైన మా డాటేరు బాబు రమణ గారు -
తేటగీతి అంటూ తేటతెల్లంగా 'అటుకుల' బొంత ని స్వాహా గావిస్తున్నవారు :) -
పాటతో నేను అని సైలెంట్ గా సినీ పాటల ఒక ఖజానాని పెట్టి వాటికి లిరిక్స్ జోడించి జోహార్ అని పించే లా ఉన్న వేణూ శ్రీకాంత్ గారు -
అమృత మధనం తో దేశాన్ని మధిస్తూ బుద్ధునికి మురళి కి సంజౌతా 'ఎక్స్ప్రెషన్' ప్రయత్నిస్తున్న మా జర్నలిస్ట్ బుద్దా వారు -
పద గోళీ లాడుతో సమస్యల తో 'పూ' రణం గావిస్తున్న మా గోలీ హుమచ్చాస్త్రీ వారు - (హనుమ కీ స్త్రీ కి పొత్తు ఎట్లా అవుతుంది సినబ్బా అని హాశ్చర్య పోయా మొదట వారి పేరు చూసి !) -
మా కథా మంజరి అయ్యవారు పద్యాలు పెట్టి టపాలు గట్టి  సెహ భేషు గా బ్లాగ్ విహారం గావిస్తున్న వారు -( వారి బ్లాగు టెంప్లేటు సరిగ్గా లేక నేను కామెంట లేక పోయిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి - టెంప్లేటు మార్చండి మహాప్రభో అని చెప్పినా ప్రయోజనం లేక పోయే :)
రమ్యంగా కుటీరాన అంటూ గులాబీ 'ఔట్లు' కూడా కావాల్సి వస్తే పెలుస్తాం అంటూ అలుపెరుగక ఉన్న నీ , మా , హారిక గారు :)
కన్నీటి కథ ల తో కడివెడు కహానీ లతో సమ సమాజానికి అద్దం పట్టే వనజ వనమాలీ గారు -
దేశ విదేశాల్లో ని సంక్షోభ పరిస్థితుల కి చరమ గీతం గ్రహాల భ్రమణం తో ఆలాపిస్తున్న మా భ్లాగ్జ్యోతిష్ శర్మ గారు -

ఇట్లా ఊకదంపుడు వ్రాసుకుంటూ జిలేబి కూడా ఎనిమిది సంవత్సరాలు దరిదాపుగా కలగా పులగం గా , ఈ ఒక్క సబ్జెక్టే నేను తాకుతా అనుకోకుండా అట్లా అందరిని గెలుకుతూ , అప్పుడప్పుడు డక్కా మొక్కీలు తింటూ , కొండొక చొ ఐ డోంట్ లైక్ లతో చీవాట్లు తింటూ కాలం గడిపేస్తోంది :)

ఇంతకీ ఈ టపా టైటిల్ ఏమిటి ? ఈ టపా ఏమిటి ? అంతా గందర గోళం గా ఉందిస్మీ :)

షురోదయం :) షురూ, ఉదయం :)

జిలేబి




 

11 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. zilebi:మేమంతా హరిబాబు వారి లా పేజీ ల కొద్ది టపాలు వ్రాస్తాం - ఒక్క కామెంటూ పడదు

    haribabu:
    ఇదివర్లోమాలిక నిండా మీ బ్లాగు కామెంట్లేనుస్మీ అని గోల చేశారు?
    ఇప్పుడేమో ఇలా హరికాలం దగ్గిర కామెంట్లు పడట్లేదంటున్నారు!
    మళ్ళీ దూకుడు పెంచుతా,
    చిచ్చరపిడుగులా రెచ్చిపోతా - తస్మాత్ జాగ్రత్త?!

    ReplyDelete
    Replies

    1. చిచ్చర పిడుగులంటే నాకు మరీ భయ్యం :)

      జిలేబి

      Delete
  3. ఆ పాట వ్రాసింది పొయిన మావయ్య కాదండి. బతికున్న అన్నయ్యే! (శాస్త్రి గారు మీకు తమ్ముడేమో!)

    వార్షికోత్సవ అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. వామ్మో వామ్మో ఎంత తప్పై పోయింది : సిరివెన్నల వారిదా ఆ పాట!
      పాట గమనం పదాల కూర్పు చూసి పోయిన మావయ్యే అనుకున్నా! నెనర్లు సరిజేసి నందులకు !

      జిలేబి

      Delete
    2. సిరి వెన్నెల దా?
      సిరి వెన్న లదా?

      Delete
    3. బోనగిరి గారు,

      'ఆండోళ్ళకి' తెలిసింది వెన్న, నెయ్యి గట్రా :) కాబట్టి వారు సిరి 'వెన్న' లే :) (Gold Butter :))

      వెన్నెల గట్రా మగవారికే ఎరుక! మిస్సమ్మ లో రామారావు రావోయి చందమామా అని అనలేదుస్మీ :)

      జేకే ! అప్పు తచ్చు !
      చీర్స్
      జిలేబి

      Delete
    4. ఈ రెండు లైన్లతో మీరొక టపా వ్రాయగలరు, వ్రాయగలరు. అంతే.

      Delete
  4. @జిలేబి గారు ...

    మీరింత క్రేజీ గా ఉంటానికి కారణమైన మోహనవేర్లు (మోహన్ రూట్స్) తెలిసిపోయినయ్యోచ్ ...

    "రాముల వారి పై రాశి పోసిన పద్యాలు , (అంతే కాదు సై అంటే సై అని జిలేబి కామెంట్లు పోటీ గా వ్రాసిన జిలేబి శతకం కూడాన్ను ) - తెలుగు బ్లాగు వెలుగులు ఇంతింత కాదయా అని చెప్పుకొనక తప్పదు ! "
    అదియిదియని లేదనుచూ యెదియైననూ ... తమరికి చమత్కార వాచకమే సుమీ!

    గజముజబుజకబు..న్య్.. స్వామి గజిబిజి ఉదంతం, వామ్మో... పొట్టకు నెర్రిచ్చింది. (మధ్యలో ఎన్టీఆర్గుడిగంటల ప్రసహనం-come on yaar). డాక్టర్ రమణ గారికి మీరుగానీ రికమెండ్చేస్తే కుట్లేయించుకొనొస్తా.
    మీ అరవ వీడియో లోని ముఖ్య నటులిద్దరూ హావభావాలతో కుమ్మేశారు. ముఖ్యంగా ఆవిడ.
    అవకాశం ఉంటే అనువాదం కూడా ఇస్తే మీవలెనే పూర్తిగా ఆస్వాదిస్తాము గదా!

    మీరు ఒకే లైన్ వ్రాసినా మెలిక లేకుండా ఉండదు. మాకు హాస్యపు పులక(రింత) లేకుండా ఉంచరు.

    జిలేబి పలకరింపే ఒక నవ్వుల పలవరింత.
    లోల ...

    ReplyDelete
    Replies
    1. @ జిలేబి గారు ...
      బండి రావు గారు అని రాసుకుంటూ పోయి
      "బండి ర ఎట్లా వ్రాయాలో తెలీటం లేదు :) "...
      అని వ్రాయడంలోని మీ అంతర్యాన్ని
      చమత్కారాన్ని కనుగొనటానికి నాకిన్నాళ్ళు పట్టిందే!
      ఔరా! ఇంత మందబుద్దులు ఈ కాలంలో కూడా ఉన్నారా !!
      అయినను పెద్దల గౌరవించవలె ...

      ఇట్లు...
      బండి ఱవు.
      (దీర్ఘం తీయలేనందుకు /
      నా వల్ల కానందుకు క్షమాపణలు).
      లోల (lol) :-)

      Delete
  5. మీ బ్లాగు పుట్టినరోజా ? అందరినీ పలకరించినందుకు ధన్యవాదాలతో శుభాకాంక్షలు !

    ReplyDelete