ఈ జమానాలో జనాలకి కాలక్షేపం కబుర్లు, బాతాఖానీ బటానీలు ఎందుకు కావాలి ?
మా మీ మన అందరి 'రోలు కర్ర' శ్యామలీయం బ్లాగ్ మాష్టారు ( వీరిది వృత్తి పరంగా మాష్టారు ఉద్యోగం కాదు - మేధా జీవి ) ఓ కామెంటులో - ... ఈ రోజుల్లో జనానికి వినోదం కావాలి ... కాలక్షేపం సరుకు తప్ప మరేమీ పట్టని వారి సంఖ్యాబలం కారణం గా అలా కాలక్షేపం సరుకుల్ని పంచేందుకు తాపత్రయ పడే వారే ఎక్కువ (ఎడిట్)"
ఈ వ్యాఖ్య చదివాక - ఎందుకు ఈ కాలం లో ఎక్కువ మంది కాలక్షేపం కబుర్లు, సరదా గా సాగి పోయే విషయాలు తప్పించి కొద్ది పాటి సీరియస్ మేటర్ ని చదవటానికి ఉత్సుక చూపించడం లేదు ? అని పించింది .
మా అయ్యరు గారి తో ఈ మాటే అంటే ... జిలేబి నీ వయసు రోజుల్లో (అబ్బ వయసు రోజుల్లో అంటే నే జిలేబి కి చెక్కిళ్ళ గుబాళింపు ఎక్కువై పోతుంది మరి :)) రేడియో లో కూసింత ఏడుపు కథ లు వస్తే నే నీ కళ్ళ లో కన్నీరు జర జరా రాలి పోయేది గుర్తుందా ? అడిగేరు .
ఆలోచించా . అవును ఆ కాలం లో అన్నీ ఉమ్మడి కుటుంబాలు . కష్టాలు నష్టాలు ఎట్లా ఉన్నా గృహ వాతావరణం లో ఉత్సుకత , హిందీ లో చెప్పాలంటే ఉమంగ్ భరీ లైఫ్ ! ఉమ్మడి కుటుంబాలలో ఉన్న మజా ఆ కాలం వారికే తెలుసు నెమో !
అంతే గాక ఇప్పటి బిజీ లైఫ్ బ్యాక్ ప్యాక్ బకరా బేబీ లైఫ్ అప్పట్లో ఎక్కడ ? ఉద్యోగమో సద్యోగామో గానిస్తే ఆ తరువాయి బాతాకానీ కి ఇంటి నిండా జనాలు ఇంటి చుట్టూతా వున్నవారంతా బంధువులే బాంధవ్యాలే. జీవన గతి , సరళి సుళువు గా సాగి పోయే రోజులు . రేడియో లలో నో మీడియా (అప్పటి కి లేదు కాబట్టి , పేపర్ల లో నో ) వినోదం కన్నా కన్నీ టి కధ లే ఎక్కువ . కాంట్రాస్ట్ బాగా కుదిరి పోయేది !
జీవన గతి లో కన్నా మిన్నగా కన్నీటి కథలు ఉంటె మన జీవితమే బెటరోయి అని పించే లా ఆలోచింప జేసేవి .
మరి ఇప్పటి మాట ఏమిటి ?
జీవనం హై ఫై లైఫ్ ! సిటీ వారి కథలు ఇంక వేరే చెప్పాల్సిన అవసరం లేదు. పరు గె పరుగు . నిలబడి తీరిగ్గా ఆలోచించ టైం ఎక్కడ ?
ఇట్లాంటి జీవన గతి లో సో కాల్డ్ 'రిలేక్సేషన్ ' కోసం తపించి పోయే , విష్ణు మాయ లో పడి పోయిన మానవుడు !
ఆ ఉన్నంత కూసింత టైం వినోదానికి కాలక్షేపానికి ఏదన్నా ఉందా అని చూస్తున్నాడు .
మా ఏడు కొండల వెంకన్న లైఫ్ ని బిజి బిజీ చేసి, గజి బిజి చేసి పారే సాడు :) (విష్ణు మాయ మా వెంకన్న దే కదా మరి :)
సో , ఇట్లా ఆలోచిస్తే ఈ కాలపు మానవుడికి, బ్లాగ్ దర్శకులకు కావల్సినిది కాలక్షేపం ఖబుర్లు, బాతా ఖానీ బటానీ లు . ( ఈ టైటిల్లో మీకు ఎవరి బ్లాగు టపా అయినా గుర్తు కొస్తే అది జిలేబి ఊహాత్మకం గా పెట్టిన పేర్లే గాని వ్యూహాత్మకం గా పెట్టినవి కావు అని గుర్తు పెట్టు కోవాలి ! జేకే !)
సో ప్రియ బ్లాగ్ బాంధవుల్లారా ! మీ అభిప్రాయమేమిటి ఈ విషయం మీద ?
ఫుట్ నోట్ : జిలేబి కి అర్థం కాని విషయం ఒకటుంది ఈ కాలం లో కూడా కన్నీటి కుండల, వైషమ్యాల టీ వీ సీరియళ్ళు ఈ జిలేబి లని ఎందుకంత మరీ టీ వీ పెట్టె ముందు బందీ చేసి పారేస్తున్నాయి ? బ్లాగ్ లోకం లో ఉదాహరణ - వనజ వనమాలీ గారి కథలు )
చీర్స్
జిలేబి
(శ్యామలీయం వారి కామింట్ చదివాక )
ఇండియాలో గృహిణులకు టీవీ లేదా బ్లాగులే కాలక్షేపం. కొంతమందికి ఏడుపుగొట్టు సీరియళ్ళు,ఏడుపుగొట్టు బ్లాగులు నచ్చుతాయి. కొందరికి సరదా బ్లాగులు, పాటల ప్రోగ్రాములు నచ్చుతాయి. లోకోభిన్నరుచి అన్నారు కదా ఎవరు ఏది కోరుకుంటే వారికది దక్కుతుంది.
ReplyDeleteనిజమే. నేను మహేష్‌బాబు సినిమాల గురించి వ్రాసినప్పుడు మూడు, నాలుగు వందలమంది చదివారు.
ReplyDeleteస్వఛ్చ భారత్ గురించి వ్రాస్తే యాభైమంది కూడ చూడలేదు.
మీరు మీ బ్లాగుకి జిలేబి పేరు తీసేసి అల్లమో, మిరియమో అని పెట్టండి, ఒక్క చీమ కూడ ఇటువైపు రాదు.
మీ ఫుట్‌నోట్‌కి జవాబు: బ్లాగుల్లో ఆడవాళ్ళు తక్కువ. టివిల ముందు ఆడవాళ్ళు ఎక్కువ.
నా బ్లాగే నయం. అందులో ఒక పోస్త్‌ని వంద మందైనా చదువుతారు.
Deleteనా శ్యామలీయం బ్లాగు టపాలు చదివేవారు పదుల్లో కూడా ఉండరు సాధారణంగా.
Deletehttps://www.imageupload.co.uk/image/cr8R
ReplyDeleteSpiceandhra online తెలుగు న్యూస్ పొర్టల్ ఎప్పటికప్పుడు వస్తున రాజకియ వార్తలు, సినీమ వార్తలు, జాతీయ, అంతర్జాతీయ అదించటంలొ ముందు వుటొంది.
ReplyDeleteజిలేబీ గారు ... ఏమిటో.. నా బ్లాగ్ లో కథల గురించి ... మీ వ్రాతలలో చూసాను.
ReplyDeleteఅర్ధం కాలేదు. అప్పుడప్పుడు ఇలా బ్లాగుల్లో తొంగి చూసినప్పుడు నాలుగైదు బ్లాగుల్లో మీ బ్లాగ్ ఉంటుంది. ఇక్కడ ఇలా కనబడ్డాను నేను . :)
బ్లాగ్ దర్శకులకు కావల్సినిది కాలక్షేపం ఖబుర్లు, బాతా ఖానీ బటానీ లు . ( ఈ టైటిల్లో మీకు ఎవరి బ్లాగు టపా అయినా గుర్తు కొస్తే అది జిలేబి ఊహాత్మకం గా పెట్టిన పేర్లే గాని వ్యూహాత్మకం గా పెట్టినవి కావు అని గుర్తు పెట్టు కోవాలి ! జేకే !)
ReplyDeleteఆహా ఏమి శలవిచ్చితిరి :)