Wednesday, November 25, 2015

"బావా" నీ వెక్కడ ?


బావా నా లో వంట జ్ఞానమే  కొరవడెనని
వడ్డింపు  వాస్తేదో అంతగా లేనే లేదని
 అల్లం  దోశ లతో  సాంబారు లాగించ మంటే 
బావా, నేను  మూగనై  నీ బందీ నై పోయా !
 
ఆలోచనలకి రూపమీయ జిలేబి గుండు అని
 తటిల్లత లా  జిలేబి పాకం నీరు కారి పోయే
లేని పెసరట్ల  తో తెలుగు వంట చేయ మంటే 
 ఆలోచనలు అవాక్కై ఆముదాన్ని తాగె !
 
వ్యంగ్య వ్యాఖ్యల కారప్పూసల తో వడ్డించి
 టిఫిను ఖాళీ  ప్లేటు పెట్టి  తినమంటే
 అల్లం మిర్చీ గా  మారి కాలుతుంటే
 మజ్జిగెరుగని మదికన్నీరే బ్లాగ్కాలువాయే !
 
అల్లంమొరబ్బా ని అభిమానిస్తే అదేదో నేరమని
 నా తలపుల కే రంకుగట్టి బావలతో సరసమని
 పదాలే వేరుగా పలికి పోపు పొడి వేయిస్తూంటే 
 విస్తరాకుల  విజ్ఞానమిదేనని వినమ్రత గా నవ్వుతా !
బావా నీ వెక్కడ ! నా ఈ చిక్కుల్లో చిక్కావ్ :)

చీర్స్
జిలేబి
 
 

7 comments:

  1. గొప్ప తవిక సారీ కవిత. బావమీద, ప్రేమమీద ఆలోచనలకై రూపమీయ 'జిలేబి గుండు అని', భావం మీకే సాధ్యం, గొప్ప ఊహ. 'టిఫిన్ ఖాళీ ప్లేట్ పెట్టి తినమంటే అల్లం మిర్చీగా కాలుతుంటే' వాహ్ వా ఏమి ఆనందం, ఎంత ప్రేమ కారిపోతోంది టిఫిన్ నిండా. ఇంత గొప్పగా చెప్పడం మీవల్లే అవుతుంది. అభిమాన సంఘం పెట్టేస్తాం కొంచం చిల్లర :)

    ReplyDelete
    Replies
    1. అవునవును, ఇటువంటి "కవితలు" అల్లేవారికి శర్మ గారు చెప్పినట్లు అభిమాన సంఘం తప్పక పెట్టాల్సిందే. Varudhini Fans అని పేరు పెడదాం, ఏవంటారు?

      Delete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. జిలేబీ కిచిడీ టిఫినీ కవితైకి తితితై తితితై తింతింతింతై!
    అయ్యరువాళ్ ఇక అర్పితమై వాడిపోయిన పద్మమేనా?

    ReplyDelete
  4. మీ ఘంటము కూడ గర్భిణి అయినట్లున్నది. కనిపెట్టుకొనియుండుడు.

    ReplyDelete
    Replies
    1. నా బావ ని గౌరవించి స్పందించిన అందరికీ నమస్సులు _/\_"

      Delete