Thursday, November 26, 2015

బ్లాగ్దేశం లో ఉండాలంటేనే భయం గా ఉంది - దేశం విడిచి పోతా - జిలేబి


బ్లాగ్దేశం లో ఉండాలంటేనే భయం గా ఉంది - దేశం విడిచి పోతా - జిలేబి 

అయ్యరు ఖాన్ గారు నాకు బ్లాగ్దేశం లో ఉండాలంటే నే భయ్యం భయ్యం గా ఉందండీ జిలేబి రావు చెప్పింది అయ్యరు ఖాన్ తో .

అయ్యర్ ఖాన్ తన విశాలమైన చాతీ ని తడుముకోబోయి తానూ చాలా సీదా సాదా అయ్యర్ ఖాన్ మాత్రమె అని గుర్తు కొచ్చి

మై డియర్ జిలేబి రావు ! నా ప్యారీ పెండ్లామా ! మనమంతా సాదా సీదా బ్లాగ్ దేశ వాసులం ! మనం అట్లాంటి మాటలు చెప్పలేం " చెప్పారు అయ్యర్ ఖాన్ గారు .

మరి ఎట్లా ఈ బ్లాగ్ దేశం లో బతికేది ? రోజు రోజు కి వైషమ్యాలు కార్పణ్యాలు , భావాల మీద బావ ల మీద,  మాట మీద , సారంగం మీద వచ్చే కామెంట్ల చూస్తూంటే నాకు మరీ విపరీతమైన భయ్యం వస్తోందండీ !

జిలేబి ! ఇంతకు మునుపు ఇట్లాంటి కామింటులు అంటే సై అంటే సై అనే కామింటులు లేవా ?

ఉండే వండి ! ఒక వైపు వారు మాత్రమె ఎగ సెగ డోస్ ఇచ్చె వారు ! కాని ఈ కాలం లో సై అంటే సై అని కౌంటర్ వేయటం ఎక్కువై పోయిందండి !

సో కౌంటర్ వేయటం కొట్టొచ్చినట్టు కనబడు తోందన్న మాట ! సరే రేపు నాకు బ్లాగ్దేశం లో ని  మ్యాడ్ మీడియా వారి తో బ్లాగ్ముఖీయం ఉంది - దాంట్లో వీళ్ళ తాట వదిలిస్తా ! నీ తరపు గా నేను వాళ్లకి చెబ్తా ! మా జిలేబి రావు కూడా భయపడింది అని చెప్పాడు అయ్యర్ ఖాన్ !

జిలేబి రావు కళ్ళ లో కన్నీళ్లు సుళ్ళు తిరిగేయి ! ఈ బ్లాగ్దేశం ఎంత మారి పోయింది ! చ చ ! వేరే బ్లాగ్ దేశం కి వెంటనే వెళ్లి పోవాలి !

అయ్యర్ ఖాన్ తన సైజైన చాతీ తో జిలేబి రావుని అక్కునకి తీర్చుకున్నాడు !


చీర్స్
జిలేబి రావ్ కేర్ ఆఫ్ అయ్యర్ ఖాన్ !

19 comments:

  1. నేను చేస్తేనే ఏ సినిమా బాగుంటుంది
    నేను చెబితేనే ఈ దేశం వింటుంది
    తాను (మా ఆవిడ) చెబితేనే నిజమేదో తెలిసింది
    నాకింకా దేశంతో పని ఏముంది ... డోంట్ కేర్ ...

    ReplyDelete
    Replies

    1. ఆహా ఎన్ ఎం బండి రావు గారు,

      మీరు బండి ఇరుసు పట్టేసారు :)

      జిలేబి

      Delete
    2. హహ...ఆ ఇరుసుకి ఈ బండి ని భలే
      తగిలించేశారే >>>
      నా బ్రతుకు బస్టాండు చెయ్యకండి ప్లీజ్ ...
      :)

      Delete
  2. వెయ్యండో వీరతాడు జిలేబీరావుకి.

    ReplyDelete
    Replies

    1. ఒకే ఒక్క వీరతాడేనా శర్మ గారు ! వెయ్యండి వెయ్యి వీర 'తాడులు' జిలేబి రావు కి :)

      జిలేబి

      Delete
  3. మన దేశంలో కంటే తెలుగు బ్లాగ్దేశంలోనే అసహనం పెరిగిపోయింది.
    కామెంటోగ్రవాదులు ఒకో బ్లాగునూ ముట్టడి చేస్తూ, ధ్వంసం చేసుకుంటూ పోతున్నారు.

    ReplyDelete
    Replies

    1. బోనగిరి గారు ,

      అంతా రోహిణీశకట మహాత్మ్యం మన చేతుల్లో ఏమీ లేదు !

      జిలేబి

      Delete
  4. ఒక్కో బ్లాగునూ ద్వంసం చేస్తూ ఉంటే లాలిపప్ నోట్లో పెట్టుకుని చోద్యం చూస్తున్నారా ? గోదారి నీళ్ళల్లో పౌరుషం ఎక్కువే కదా ? ద్వంసం చేసేటపుడే నిలదీస్తే మళ్ళీ ఇంకొకడు ఆ ధైర్యం చేయడు కదా ?

    ReplyDelete
    Replies

    1. నీహారిక గారు కళ్ళు సరిగ్గా కనబడక ఆ లాలీపాప్ ని తాలీబాన్ గా చదివా ;)

      జిలేబి

      Delete
  5. మీరు నిజంగా భలేవారు జిలేబి గారూ...
    బోడి (జిలేబి) గుండు (బ్లాగ్దేశపు కారాలూ మిరియాలూ) ని తీసికెళ్ళి మోకాలు (అయ్యర్ ఖాన్) కు చిలిపిగా ముడిపెట్టేసి మేకు కొట్టేసారుగా (తన్నుకు చావమనకుండానే తాంబూలాలిచ్చేశారుగా). వామ్మో...ఆల్జీబ్రా జిలేబీ ఘాబరా అంటే ఇదన్నమాట ...
    :)

    ReplyDelete
    Replies
    1. కొంటె సరసపు గుబాళీయం
      కొంటె దొరలకు గుభేలీయం
      వైరి చెవులున గులాబీయం
      వహ్వారే భళిర భళి మన జిలేబీయం

      (ఈ సరదా సరదా సిగిరెట్టును సరదాగా
      ఏదో ఇలా వెలిగించనీయండి మేడం గారు)
      :)

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
    3. This comment has been removed by the author.

      Delete
    4. గులాబీయం ని మీ ఇష్టం వచ్చినట్లు వాడుకోకూడదండీ !గులాబీ మీద పేటెంట్ మాదే ! ఓరుగల్లూ మాదే గులాబీ మాదే !

      Delete
    5. @ నీహారిక గారు ...

      బ్లాగు తోటలయందు గు'లాబీలు' వేరయా
      బాగు బ్లాగది మేలు హితము తెలియా
      భాష ఒకటే కాని భావాలు వేరయా
      విశ్వదాభిరామ వినుర వేమా

      గులాబ్ గ్యాంగ్ కో నమస్కారం ...
      మీ పూల పేటెంట్ మీకే సొంతం ... సాంతం ...
      శాంతం ...
      :-)

      Delete

    6. ఎన్ ఎం బండి రావు గారు,

      సరదా గా పట్టినా సిగ' ను రైట్ గా పట్టేసారు :)

      జిలేబి

      Delete
  6. ఉండమ్మా బొట్టు పెడతా!

    ReplyDelete
    Replies

    1. సూర్య గారు,

      బొట్టు హిందూత్వం ! సారీ ఒద్దు :)

      జిలేబి

      Delete