Tuesday, February 28, 2017

కలహంసిని నారదీయ కమలనయనియౌ :)


 
 
కలహంసిని నారదీయ కమలనయనియౌ :)
 
 
వలపుల మోజున పడకే
పలుకుల మోహము జిలేబి వలదే వలదే
చిలకల కొలికికి సఖియౌ 
కలహంసిని నారదీయ కమలనయనియౌ :)
 
 
జిలేబి 




Monday, February 27, 2017

నక్షత్రమాలికల మధ్య నడక

 
నక్షత్రమాలికల మధ్య నడక !
 
నడుస్తున్నా.
ఆకాశంలోని నక్షత్రాలు
దిగి వచ్చేస్తోన్నాయి
 
అరె ! ఇంత దగ్గిరా !
అరె అరె అరె !
 
నా పక్కే ఉన్నాయ్ అన్నీ !
మధ్య లో నే నడుస్తున్నా !
 
అరె ఇంత మధ్య !
అరె అరె అరె !
 
ఓహ్! నక్షత్రాలే అన్నీ
అన్నీ నాలా ఉన్నాయే ! 
నేనెక్కడ ?
 
అరె ఇంత లోనేనా !
అరె అరె అరె !
 
కల చెదిరింది
నక్షత్రాలూ మాయం
నేనూ మటు మాయం !
 
అరె అంతలోనే ?
అరె అరె అరె!
 
 
శుభోదయం
జిలేబి

Sunday, February 26, 2017

మత్తకోకిల మత్తకోకిల మత్తకోకిలయే సుమా




మత్తకోకిల మత్తకోకిల మత్తకోకిలయే సుమా
 
మెత్తగానిట మెత్తగానిట మేలురీతిని గాంచితిన్
పొత్తమేలర పొద్దుగూకుల పొత్తుగానుర మంచిదే
చిత్తరీతిని రాయరాయగ చేర్పుగూర్తురు కోవిదుల్ !
మత్తకోకిల మత్తకోకిల మత్తకోకిలయే సుమా



చీర్స్
జిలేబి





Wednesday, February 22, 2017

మీట్ మై మీట్ మై బాయ్ ఫ్రెండ్ :)


మీట్ మై మీట్ మై బాయ్ ఫ్రెండ్ :)

గత దిన (దివగత :)) తెలుగు మాతృభాషా దిన మహోత్సవ వేడుకల సందర్భం గా, అచ్చ తెనుగు మాచన , హిందీ తెలుగు బండి వారలు జరిపిన "పాటల్ రాయ గలరా జిలేబి" అన్న చాలెంజ్ గీతా సారము గ్రహించి , జిలేబి చేసిన చిరు 'అల్ ఇన్ తెలుగు' పాట !

అరవం వాడు తమిళ్ (ழ) మొళి (ழி) అని వాడి సొంత మైన ఒక అక్షరాన్ని పేర్చి  అందంగా తనదైన తమిళం లోను , 'భాష' కున్ను అద్దేసు కున్నాడు ఎవ్వరూ చెయ్యలేని విధంగా.

ఆంగ్లం వాడేమో ముచ్చట గా మదర్ టంగ్ అని అనేసుకున్నాడు.

తెలుగు వాడు ఆరేసుకో బోయి మాతృభాష అన్న సంస్కృత భూయిష్ట మైన పదాన్ని అరువు తెచ్చేసు కున్నాడు.

భాషను అచ్చ తెనుగులో ఏమందురు ? అనెడి నారదోపాసన తో నేటి జిలేబి 'ఆల్ ఇన్ తెలుగు పాట; దీనికి మూలం అరవం పాట అని చెప్పాల్సిన అవసరం లేదను కుంటా :)

****

గూగుల్ గూగుల్ చేసి చూసా
వీడి లాంటి పుల్లాయ్  పుట్టిందే లేదూ !
యాహూ యాహూ చేసి చూసా
ఎక్కడాను వేరోక్కడు దొరక లేదూ
 
డేటింగ్ అంటే వాచీ చూసి ఓకే చెప్తాడే
షాపింగ్ అంటే ఈబేయ్ లో కుదేస్తాడే 
మూవీ అంటే యూట్యూబ్ అండ్  పాప్కార్న్ అంటాడే
చూస్తే వీడూ అయ్యో పాపం అమ్మేస్తడే ఊర్కే ఊర్నే
 
మీట్ మై మీట్ మై బాయ్ ఫ్రెండ్
మై స్మార్ట్ అండ్ సెక్సీ బాయ్ ఫ్రెండ్
మీట్ మై మీట్ మై బాయ్ ఫ్రెండ్
మై స్మార్ట్ సెక్సీ బాయ్ ఫ్రెండ్
 
గూగుల్ గూగుల్ చేసి చూసా
వీడి లాంటి బడుద్దాయ్ పుట్టిందే లేదూ !
యాహూ యాహూ చేసి చూసా
ఏ గ్రహము లోనూ వేరొకడు దొరకలే

వీడి డేటింగ్ డిన్నర్ కెళ్తే స్టార్టర్ నేనే లే
తనతో షాపింగ్ కెళ్తే హ్యాపీ  ట్రాలీ నేనేలే
మూవీ కెళ్తే కన్నీళ్ళ సీన్ కర్చీఫ్ ఔతాలే
చూట్టానికి ఇలా ఉంటాడే కాని ఆలా అలా
 
మీట్ మై మీట్ మై గార్ల్  ఫ్రెండ్
మై హాట్ అండ్ స్పైసీ గార్ల్  ఫ్రెండ్
మీట్ మై మీట్ మై గార్ల్  ఫ్రెండ్
సో హాట్ అండ్ స్పైసీ గార్ల్ ఫ్రెండ్
 
హే గైస్ మై గార్ల్స్ ఇంట్రో టైం
యిది ఎవత్తో చెబ్తా విన్కో
దూదిపింజ అంటే పంజా విసురుద్ది
హెల్మెట్ వేస్కో   సేఫ్టీ సేఫ్టీ
హే షుగర్ ఫ్రీ, హే హే హే
హే షుగర్ ఫ్రీ పలికితే స్వీటూ
దీని ఫేట్ ఫ్రీ ఒంట్లో టన్స్ ఆఫ్ ఫేటూ
నవ్వితే నగ్మా కసిగా చూస్తే కాష్మోరా
అందానికి తనే ఫార్ములా ఐ లవ్యూ డా :)
 
హే కమాన్ గర్ల్స్ ఇట్స్ ఇంట్రో టైం
వీడెవడో చెబ్తా చూస్కో

హేండ్ షేక్ చేస్తే అమ్మాయిల్ వస్తారే
బులెట్ లా ఆమడ దూరం దూస్కెళ్తాడే
మిలట్రీ కటింగ్ స్టైల్ ఓ మిల్లీ మీటర్ స్మైల్
ఆల్మోస్ట్ ఎవరే ఊర్లో ఎవరే
వీడిలా వీడిలా గుడ్డీ గుడ్డీ గుడ్డీ 
 
మీట్ మై  మీట్ మై బాయ్ ఫ్రెండ్
మై స్మార్ట్ అండ్ సెక్సీ బాయ్ ఫ్రెండ్
మీట్ మై మీట్ మై బాయ్ ఫ్రెండ్
మై స్మార్ట్ అండ్ సెక్సీ బాయ్ ఫ్రెండ్
 
నా ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకోడే
నా స్టేటస్ మార్చమని పోరెట్టడే
దాపుకొచ్చి హాయ్ అంటే ట్విట్టర్ లో తల పెట్టేస్తాడే
ఇస్తాడే స్వీట్ కిస్సూ సైడ్ లో ట్వీటూ 
రోమాన్స్ కొంచెం, థ్రిల్లర్ కొంచెం
గాలిలో తేలేను మై మై మదియేను
 
తను ఓహో తను ఓహో తను ఓహో ఇదీ ఓహో !
దాని సెల్ఫోన్ రెంట్లోనూ కాల్సే కాల్సూ
బాక్అప్ బాయ్ ఫ్రెండ్స్ ఫోర్ అండ్ ఫోరూ
గొంతంతా అసూయా పేరేమో అనసూయా
నా కేమో ఇస్తుందీ జిలేబీల్  యా :)

అమ్మాయిల నంబర్ నా ఫోన్లో చూస్తే
సైలంట్ గా గోకేస్తుందీ  రాకీస్తూంది పీకేస్తుందే
టౌన్ ని ఫ్రీ సైట్ కొడితే దుమారం లేపేస్తాదీ
లిమిట్  కిక్కూ లిమిటెడ్ ఫైరు
నా గుండె డబ్ డబ్ డబ్ డబ్
 
మీట్ మై మీట్ మై గార్ల్  ఫ్రెండ్
మై హాట్ అండ్ స్పైసీ గార్ల్  ఫ్రెండ్
మీట్ మై మీట్ మై గార్ల్  ఫ్రెండ్
సో హాట్ అండ్ స్పైసీ గార్ల్ ఫ్రెండ్
 
గూగుల్ గూగుల్ చేసి చూసా
వీడి లాంటి పుల్లాయ్  పుట్టిందే లేదూ !
యాహూ యాహూ చేసి చూసా
ఎక్కడాను వేరోక్కడు దొరక లేదూ
 
డేటింగ్ అంటే వాచీ చూసి ఓకే చెప్తాడే
షాపింగ్ అంటే ఈబేయ్ లో కుదేస్తాడే 
మూవీ అంటే యూట్యూబ్ అండ్  పాప్కార్న్ అంటాడే
చూస్తే వీడూ అయ్యో పాపం అమ్మేస్తడే ఊర్కే ఊర్నే
మీట్ మై  మీట్ మై బాయ్ ఫ్రెండ్

మై స్మార్ట్ అండ్ సెక్సీ బాయ్ ఫ్రెండ్
మీట్ మై మీట్ మై బాయ్ ఫ్రెండ్
మై స్మార్ట్ అండ్ సెక్సీ బాయ్ ఫ్రెండ్
 
 
చీర్స్
జిలేబి
పరార్ నారదా!
అం కిం టం :)
బండన్న మాచన్న వారలకు  
 
 
 

Tuesday, February 14, 2017

ఒకటి ప్లస్ ఒకటి వెరసి బ్లాగాయ నమః :)


ఒకటి ప్లస్ ఒకటి వెరసి బ్లాగాయనమః :)
 
 

నిన్న  అగ్రిగేటర్ చూస్తా ఉంటె ప్రక్క ప్రక్క ఉన్న ఈ బ్లాగ్ టైటిల్స్  కనిపించాయి :) సరదా గా శారద :)


దత్త రమేష్ - పవన్ ని "ఇడియట్" అని తిట్టిన చిరంజీవి ! ఎందుకో తెలుసా ?
పాటతో నేను :   ఒక్కోసారి ఓ ముద్దు...


***
భక్తి సాగరం :   వామన వైభవం
కష్టేఫలి :  జీవిత సమరం తొలిరోజులు


***
చిత్రకవితా ప్రపంచం :   కప్పను జూడఁగఁ బాము గడగడ వడఁకెన్
శ్యామలీయం :   అవనిపై నుండు వా రందరు నిటులే


***
 మహి 'మ్యూజింగ్స్' :   హత్య అంటే ?
కబుర్లు కాకరకాయలు :   మహిళా సాధికారత...!!


***
పాటతో నేను :   ఇటు రార ఇటు రార...
మేధా జ్యోతిష్యం -  12. ది న ఫలితం


***
కష్టేఫలే(పునః ప్రచురణ)-మనలో పరమాత్మ ఎక్కడున్నాడు?
మగాళ్లతో సంబంధాలు.. డైరెక్టర్ మనోవేదన!


***
శ్రీచమన్ :   కాలాలీత క‌విత‌లు
పుస్తకం :   రాజకీయ బీభత్స దృశ్యం – చీకటి రోజులు


***
 సరిగమలు... గలగలలు :   వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా
చాకిరేవు - రోజా, రోత మాటలు ఆపి అప్సరా రెడ్డి గురించి తెలుసుకో


***
 సాహితి :   ఘుమ ఘుమల మసాలావడ
బ్లాగ్ లోకం :   తెలుగు ఛానల్స్ లో ప్రోమో టెర్రర్స్


***
సమస్యల'తో 'రణం ('పూ'రణం) :   కాంతుని సేవించు నాతి గయ్యాళి కదా.
Padmarpita... :   జన్మసార్థకత..


***
కష్టేఫలి :   సాలెగూట్లోంచి తప్పించుకున్న ఈగ
నా ఆలోచనలు ... నా ప్రపంచం... :   మాఘమాసపు పూర్ణచంద్రుని అందం


***
Shocking facts | మోనాలిసా గురించి షాకింగ్ నిజాలు
Dr. Acharya Phaneendra-ఆంధ్ర సాహిత్యంలో నా బిరుదులు!


చీర్స్
జిలేబి

Monday, February 13, 2017

అంతా ఉన్నాడట !


 
 
 
అంతా ఉన్నాడట !
 
చిక్కడేంటి ?
 
చిక్కగ  చిక్కునో ?
 
శుభోదయం 
జిలేబి 

Saturday, February 11, 2017

మోడోయిన చెట్టు !


మోడోయిన 
చెట్టొకటి 
సూరీడు వైపు
చూస్తొంది 
పచ్చదనం కోసం



శుభోదయం
జిలెబి

Saturday, February 4, 2017

మహిత హితంబగు జిలేబి మాలిక లిడుదున్ !



మహిత హితంబగు జిలేబి మాలిక లిడుదున్
 
 
 
సహనము, నేర్పుగ   యత్నం
బహరహము గనుచు పదమ్ము పలుకు మధురిమల్ 
నిహతంబై, వాణిశ్రీ!
మహిత హితంబగు జిలేబి మాలిక లిడుదున్
 
 
శుభోదయం 
జిలేబి