కలహంసిని నారదీయ కమలనయనియౌ :)
వలపుల మోజున పడకే
పలుకుల మోహము జిలేబి వలదే వలదే
చిలకల కొలికికి సఖియౌ
కలహంసిని నారదీయ కమలనయనియౌ :)
పలుకుల మోహము జిలేబి వలదే వలదే
చిలకల కొలికికి సఖియౌ
కలహంసిని నారదీయ కమలనయనియౌ :)
జిలేబి
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
ReplyDeleteభగభగ మండిన గూడన్
సిగబట్టకనౌ జిలేబి చింతన గనుచున్
నగజాత మరియు యమరా
పగ గల్గినవాఁడె సౌఖ్యవంతుఁడు జగతిన్.
జిలేబి
తగ దురద గతుల రగడల
Deleteజగడ జనక నారదీయ జజ్జనకలతో
బుగులొందు మనసు పరు గా
పగ గల్గినవాడె సౌఖ్యవంతుడు జగతిన్ .
ReplyDeleteపదిలము గా దాచుకొనుము
వదినా, నీ కందఁ జేతు, స్వర్గసుఖమ్ముల్
కుదురును, భాగవతమిదియె
చదువదగిన పొత్తమమ్మ సమరసముగనన్ !
జిలేబి
ముదితా ! యోడిరి జూదమందు వరుసన్ ముమ్మూర్తులా నీపతుల్
Deleteతుదకున్ నిన్నును నోడినా రిపుడు నీదున్ భర్త నేనే యికన్
కధలింకేటికి రమ్మటం చిటులనెన్ గాంధారి సూనుండు ద్రో
వది ! నాకౌగిట జేర్చుకొందు నిను నే స్వర్గంబు జూపించెదన్ .
Deleteకవిరాజుగదా లక్కా
కు వర్యులు జిలేబి! రావు గూర్పుల పదముల్
నవరసము లొల్కి నడయా
డి వచ్చు రమణీ లలామ డిగనుఱుకువలెన్ !
జిలేబి
Deleteరాజారా వుల పద్యమెల్లె నవతా రాగంబు లొల్కంగ జో
రై జాల్వారుగదా జిలేబి గగనా రామంబు లన్ దేల్చుచున్
పూజాద్రవ్యములై వెలుంగు సుమకర్పూరంబు వూదొత్తులన్
రోజాపుష్పముతావియూరు జయహో రుస్తుంబహార్రాజసా !
జిలేబి
ధన్యవాదములు .
Delete' డిగ నుఱుకు వలెన్ ' తా వచ్చెడి రమణి యెవ
రబ్బ ! యెంత యోజించిన రాదు గుర్తు ,
ములగ చెట్టెక్కి చూతునా ? మూతి వగులు ,
కొమ్మ విరుగుట తథ్యమ్ము , కోయిలమ్మ !
ReplyDeleteఈ చర్చ దేనికి మొదట
తా చంకనిడెను ? జిలేబి తా నిర్ణయమున్
బ్రోచెన్నెవరికొరకు హా!
గోచీల కొరకు గురువుల గోళీ లాటల్ !
జిలేబి
ఇదే కొంటెతనమంటే! చూసి ఊరుకోవచ్చుగా :)
Delete
Deleteశర్మ గారు
అబ్బే ! ' అట్ట ' యెట్టా అవుతుందండీ :)
జిలేబి
ReplyDeleteకెలకెడ మెందుకు మొదటన్
పలువురు టపటప పలికిన పలుకుల పబ్లిష్
కులుకుతు చేయన్నేల
న్నలజడి మొదలవ సమాప్త మననేల గురో !
జిలేబి
ReplyDeleteమీసూక్ష్మగ్రాహ్యతయున్
మీసూచీముఖములెల్ల మిక్కిలి మోద
మ్మౌ !సూటిగ యెట్లు గనిరి
యాసుందరియౌ యనానిమస్సని నార్యా ! :)
జిలేబి
ReplyDeleteహి దటీజ్ ది లేడి ! యూనో!
హి దేర్ షి గోస్!యట్ట లేడి! హీ దట్జ్ హర్ ! యై
సీ ! దేర్ ద డెవిల్ గోస్ ఓహ్ !
దేర్ దేర్ షీ గోస్ ! జిలేబి దైనేమ్ లేడీ :)
జిలేబి
ReplyDeleteవెంకట రాజారావు లక్కాకుల
పరమామ్నాయములందు జెప్పబడి , హృద్పద్మంబు పైనిల్చి , చి
చ్చర , విద్యుద్ద్యుత లిప్త చాలనలతో చైతన్య మిచ్చేటి ఆ
పరమాత్మన్ జగదేక మోహనుని రూపంబింత సూక్ష్మాతి సూ
క్ష్మ రమా రమ్యమ ? చిత్రమియ్యది కదా ! మర్మంబు వీడెన్ గదా !
తనలోని దేవదేవుని
గనలేక కబోది రీతి గనలుచు వెదికే
ఘనులగు నాబోటి జడుల
మనసున కెక్కంగ వ్రాసె మహితాత్ముడిటుల్ .
-వెంకట రాజారావు లక్కాకుల
ReplyDeleteఅమ్మా! నవ్వుల గని ! పె
ద్దమ్మా! వలదే జిలేబి దడదడ లాడె
న్నమ్మా మాగుం డియలిట
బామ్మా వలదే పదముల బాదుళ్ళికనౌ :)
జిలేబి
ReplyDeleteఏదో కాస్తా నోట్లో
యాదర బాదరగ కుక్కి యావద్జనులు
న్నీధర ణిలోన ముక్కును
చీదుతు నీల్గుతు బతికెడు జీవులు గదవే !
జిలేబి
ReplyDeleteమంచి విషయంబు లన్ చ
ర్చించు సమయమందు బాధ రివ్వున గలిగెన్
కించితు చింతన లేకన్
దంచగ సందర్భములను దలుపక వారుల్ !
జిలేబి
ReplyDeleteరుస్తుం బహారు రాజా!
మస్తుగ చెప్పితివిగాద మత్తేభమునన్
విస్తా రంబై న మన వి
తస్త కతలనెల్ల సూక్ష్మ తరముగ నిచటన్ !
జిలేబి
ReplyDeleteతెలివిలేనివాడు తరుణికి మగడౌత
బలిమి లేని దొంగ బలుపు గలిగె
చెయ్యి కరిచి చక్క చేవిడుపుగనియె
విశ్వ కథల యొజ్జ విస్మయ ఝరి !
జిలేబి
ReplyDeleteరాపాడిన తీరు గనన్
ద్రౌపది సీతయును నొక్క తండ్రికి సుతలే,
గాపాడవలసిన పతులు
వేపుకుని తినిరి జిలేబి వేకరమువలెన్ !
జిలేబి
రూపింప కురుక్షేత్రము ,
Deleteఆపగిది లవకుశ లోను నద్భుత రీతుల్
చూపించిన నటులిద్దరు
ద్రౌపది సీతలును నొక్క తండ్రికి సుతలే .
ReplyDeleteముసుగుల మాటున విద్యా
ర్థి చాటుమాటు కలహమ్ము రించోళీలన్
యిచట జనావళి దస్కము
కసాబు సంస్మరణ సభలకా వితరణలౌ ?
జిలేబి
ReplyDeleteమదిలో మెదిలే భావము
సదిజేయక తూగుచుండె చక్కని కవనం
బది, యక్షరమ్ములై యల
ర దర్శన మగును జిలేబి రాగమలరుచున్ !
జిలేబి
ReplyDeleteపదసంపద లేల జిలే
బి దరువులన బేర్చు మోయి బిగిబిగి పదముల్
బెదరకు చెదరకు వదరకు
కుదురుగ వచ్చునట పద్య కుముదిని సఖియై !
జిలేబి
ReplyDeleteబాలకుమారా! వినుమో
యీ ! లోలకము వలె తిరుగు యింతులకు కడున్
మాలోకంబై చుట్టెడు
స్త్రీలకు మ్రొక్కినఁ ధనమును, శ్రేయముఁ గలుగున్
జిలేబి
ReplyDeleteవారికి కోపం బొచ్చిన
నౌ రిమ్మ తెగులు విడువగ నాణ్యమగు టపా
యోరీ జోగీ యంటూ
సారింతురు సుమ్మి,యక్కజముగ జిలేబీ !
జిలేబి
ReplyDeleteబిరబిర కందంబైనన్
భరనభ భరవగ జిలేబి బంధంబైన
న్నరయగ జిలేబికి జిలే
బి రసంబటు సాటిగాద బిరబిర బరుకున్ :)
జిలేబి
ReplyDeleteసరసీ ! లవకుశు లెవరే ?
మరి యిస్లామీయులకటు మాన్యుండెవరే ?
మరియమ్మ తనయు డెవరే ?
అరయఁగ రాముని కుమారు, లల్లా, క్రీస్తుల్ !
జిలేబి
ReplyDeleteకందంబాటవెలది సీ
సం దరిమిల తేటగీతి చంపక మాలన్
మందారదామ యుత్పల
ఛందస్సులరయ భళిభళి ఛందమ్ సాఫ్ట్వేర్ :)
జిలేబి
ReplyDeleteఉప్పని పోసిరి నేలన
కప్పము గట్టమని నాడు గాంధీ వలన
న్నప్పనముగ వచ్చినది గ
దప్ప! మనకు పనికిరాని దాయె జిలేబీ !
జిలేబి
ReplyDeleteతన కవచకుండ లమ్ముల
తృణముగ తృటి నిమిషమందు దానము జేసె
న్పణముగ శక్తిని యొక మా
రు నరుడు యుపయోగముగొనె రుండిక నందున్ !
జిలేబి
ReplyDeleteతల్లీ ! వందన మనిరీ
యుల్లము నెరయగ జిలేబి యున్నతి నిమ్మా
జల్లన మనవలెను ధరణి
చల్లని నీ దయ కరుణయు జలజల పారన్ !
జిలేబి
ReplyDeleteసతిలేనివాడసలు గతి,
మతిలేని నరుండు, మిగుల మన్నన నొందున్
సతతము సతి సేవలనన్
జతి తప్పక పతి జిలేబి చరియింపగనన్ !
జిలేబి
ReplyDeleteపులితోలు కప్పు కొనుమా
జిలేబి యోగమును జేయ, చీనీయుడు మ
న్నలనొందు రీతి గానన్
బలమున్న నరులది గాద పృథ్వియు జూడన్ :)
జిలేబి
ReplyDeleteదండిభట్ల విశ్వనాథ శాస్త్రి :)
ఔరా ఏమి గోదావరి కథ :)
దంచవే మాయమ్మ జిలేబి ధనియాలనౌ :)
శ్రీదండిభట్ల వారట!
వేదము నెల్లయలసెనట ! హిట్లరు గానన్
తాదరి జేర్చెనట! జిలే
బీ!దంచిరిగద కథలను బింకెము గూడన్ :)
జిలేబి
ReplyDeleteవిమలాత్మ! విష్ణు వేల
న్న, మీన రూపంబు దాల్చె? నమనము ! వివరిం
పుము! మానవులవలెన్ జన
న మరణ చక్రముల నాడనేలనతండున్ ?
జలేబి
ReplyDeleteతాదూర సందు లేదో
యీ దుంపతెగన రిటైర్డు యిమ్మహనీయు
ల్లాదరణ జేతు నెట్లన్
సాదరము సలాము జేయి సారుల కిటనౌ :)
జిలేబి
ReplyDeleteమా గొంగటి యయ్యను గన
లే! కొన్నిదినములు గాను లీవున బోయె
న్నో ? కథలు జెప్పెదననియె
సౌకర్యంబెపుడు గాను సూక్తుల జెప్పన్ ?
జిలేబి
ReplyDeleteకమలమ్మదియె జిలేబీ !
సమూల ముగ యుత్తరాది సాధించెన్బో !
సమరానికి తెరపడె, యిక
సమస్యలు తొలగి శుభములు సాధ్యంబగునో ?
జిలేబి
ReplyDeleteఒకటికి రెండును మూడిం
టికి నాల్గైదులను కలిపిరిట స్యూసుకథ
ల్కిక బుజ్జిజింకలాదర
ణ కలుగ జేసిరి గదా మన లలిత బాలా !
జిలేబి
ReplyDeleteవాళ్ళకు వాళ్ళే యట మా
టల్లా డుకొనిరి జిలేబి! టంకము గానన్
గల్లా లోడబ్బుల్లే !
మల్లాటల్లే ల బండి మల్కలు వేస్టౌ :)
జిలేబి
మరదే మల్ల ఇమానం మల్కల్కి జర పైసలివ్వరా ఏంది
Deleteజరంత సోచ్ కే నౌక్రీ దేనే కా దిమాక్ జ్యాదా పెట్టుండ్రి
ౙరబ్ మాన్పనీకి జరాసా మంచిగ మక్తాయించండ్రి
గరీబోల్లంటే మరంత సిన్న సూపు పనికిరాదే తల్లి!
:)
ReplyDeleteక్లిష్టపరిస్థితు లన సం
క్లిష్టము గానన్ జిలేబి కిందా మీదన్
స్పష్టము గావలె నిక ని
ర్దుష్టముగ కిరాతకులకు రొంజుల వేతల్ !
జిలేబి
ReplyDeleteకొంటె జిలేబీ గారూ
తంటా లేనండి, మాకితాబునటు డిలీ
ట్లంటూ కొట్టగ తగునా !
వుంటా! వుజ్జోగ మాట హుష్ యన వలదోయ్ :)
జిలేబి
ReplyDeleteలాస్టండ్ ఫైనల్ కాల్ బీ
ఫాస్టండ్ బోర్డ్ దట్ విమాన ! ఫెయరండ్ లవ్లీ
గో స్టాండ్ యిన్ క్యూ మేమ్ సాబ్
జస్టనదర్ యిన్, జిలేబి జస్ట్ టేకింగాఫ్ :)
జిలేబి
అమ్మవారు,
Deleteతమరు కనపడి ఇరవైనాలుగు గంటలు సమయం దాటింది. కుశలమే కదా!
మేమెవరం రావటం లేదు! మా కోసం ఏర్పాట్లేం చేసుకునే ప్రయత్నంలో 'పడి' పోకండీ :)
Deleteధన్యవాదాలండీ కష్టే ఫలేవారు
ప్రాణం పైకి పోయి యెట్లాగో మళ్ళీ వచ్చేసిందండీ
జిలేబి
< "ప్రాణం పైకి పోయి యెట్లాగో మళ్ళీ వచ్చేసిందండీ "
Delete-------------------
ఆరోగ్యపరంగానా లేక మేం ఉద్యోగాలు అడిగినందుకా (/jk)🙂?
ఏమైనప్పటికీ, సీరియస్ లీ, ఇప్పుడు అన్ని విధాలా పూర్తి స్వస్ధత చేకూరిందని ఆశిస్తాను.
Wish you a healthy and happy time 🌷.
జిలేబి గారు: మీరులేక నిండుకున్న సందడి మళ్లీ మీ రాకతో బ్లాగులెల్ల నిండుకొంది.
Deleteశ్లేషించారా? :)
Deleteలేదు లేదు - శ్లాఘించాను :)
Delete
ReplyDeleteరేటింగిస్తే పుణ్యము
మా టెంకణ యంతరంగ మాలిక గనుడోయ్
మేటరు తట్టగ బెడితి
న్నీటీ కప్పుల జిలేబి నీరాజనమౌ !
జిలేబి
ReplyDeleteవిందారగించి హృద్యపు
కందము వ్రాయంగలేని కవి పూజ్యుఁ డగు
న్నందరి లోన జిలేబీ ?
ఛందస్సుల మత్తునందు జవ్వాడవలెన్ :)
జిలేబి
ReplyDeleteబుజ్జాయియంద ములనన్
సజ్జను "ఱావు" వరులిచట చక్కగ గానన్
బొజ్జున్న జిలేబి చిలిపి
కజ్జా లాడుచు చకచక కందంబాయెన్ :)
జిలేబి
ReplyDeleteనీ తాళి యేల మగడా
మాతరు ణులకున్ జిలేబి మగువలకును సె
ల్ఫీ తెచ్చును లైకులలున్
యేతా వాతా పెనిమిటి యేబ్రాసియె బో :)
జిలేబి
ReplyDeleteభారీ కట్నము లివ్వగ
కారా గారపు జిలేబి కన్యా మణికిన్
బేరము కుదురగ భారత
నారికి తన పుట్టినిల్లు నరకమ్ము గదా!
జిలేబి
ReplyDeleteలలనామణులటు సెల్ఫీ
లలో కబుర్లాడు ముద్దు లలరెడు రీతి
న్నలవోక గనుచు పెండ్లి క
లల దేలు రమణుని జూడు లావణ్యవతీ :)
జిలేబి
ReplyDeleteమీ నోటి వాక్కుల మహిమ
నౌ నాకు గలుగును చాన్సు నమనము లయ్యా
యేనాటి కైన నయ్యెద
నేను సినీ కవి జిలేబి నెచ్చెలి గానన్ :)
జిలేబి
ReplyDeleteకర్ణుని కర్కశునిగనన్
స్వర్ణకిరణమణి పలుకుల సత్యము జేసెన్
వర్ణములనేక మగు ! పరి
పూర్ణుండగు మనుజు డెవడు భువిని జిలేబీ !
జిలేబి
ReplyDeleteఎందుకురా నీ చదువులు ?
డెందము లలరెడి సమయము రేసుల బోయెన్
గంధము లేనటి పుష్పము
చందంబాయెను బతుకులు చదువుల ఘాటున్ !
జిలేబి
ReplyDeleteమన బహు పరాకు గారం
డి! నాట్యము లలర డిలీటు రివ్వున జేయన్
మన బండి చక్రము గిరగి
రనుచు తిరిగెనుగద! మాకు రావడి యికనౌ :)
జిలేబి
ReplyDeleteనెనరులు లల్లీ ! వారికి
మనకాలపు కతల చూడ మరపు మరలిబో
వన భావి కాల వూసుల
గనవచ్చిక్కడ జిలేబి కమ్మని మెమరీస్ :)
జిలేబి
ReplyDeleteకళ్ళెము వేయ కుదురునా
పెళ్ళాములకున్, పెనిమిటి బెంబే లెత్తన్
బిళ్ళంకులతో చప్పున
గొళ్ళెము వేతురు జిలేబి గొమ్మలు గాదే :)
జిలేబి
ReplyDeleteఅతుకుల గతుకుల మార్గము
బతుకును నేర్చె మన యొజ్జ పారుండతడౌ !
వెతలను జీవన సమరపు
కతలను వింజోవిగాను కవగూర్చెనటన్ !
జిలేబి
ReplyDeleteశ్లేషల తో శ్లాఘముతో
మాచన వర్యులు, లతాంగి మాలలితమ్మా
భాషా ప్రావీణ్యములన్
భేషుగ వర్ధిల్లుగాక బేల జిలేబీ :)
జిలేబి
ReplyDeleteతండ్రి యానతి తలదాల్చి తనయు డచట
యడవుల వెడల జనులటు యతని జూడ
తరలి వచ్చె! సమాజపు తలపు లందు
భరతుడంపె రాముని వన వాసమునకు
జిలేబి
ReplyDeleteఅందల మెక్కగ యోగీ
సందేహము లేదు రాజసానికి యోగం
బందు గలదని తెలుగు యో
గేంద్రులచట గాంచె బో జిలేబి రహస్యం :)
జిలేబి
ReplyDeleteతాత, మనవరాళ్ళను పొగి
డే తీరునుగంటి రాజ ! డెందంబరయ
న్నాదగు రీతిన్ కందము
బాదితి వారిద్దరును సెబాషు జిలేబీ :)
జిలేబి
ReplyDeleteశ్రోతక్షకుల" కథలనటు
మా తల తిరుగంగ వారు మార్సు కథలనున్
గోతులు తవ్వని యిండ్లన్
జ్యోతిష్యపు తీరులున్ను జోడించిరి బో :)
జిలేబి
ReplyDeleteతాత! జిలేబీ లలిత య
నాతవరము బండి రావు ! నాళ్ళు గడవ
న్నీతలమున జీవితమును
సాతము గా గడిపిన జన సాంద్రత పెరిగెన్ :)
ಜಿಲೇಬಿ
ReplyDeleteప్రొద్దు గుంకగ చీకటి పొడమ గను, య
వని, "తమీసమ్మునంటి" తాబలికెనిట్లు,
చందమామ రావమ్మ! సజావు గాను
వెలుతురును గొని రావమ్మ వెమ్ము బోవ !
జిలేబి
ReplyDeleteఓర్నాయనో ! జిలేబుల
ధర్నా చూడండ్రి ! చూపు తచ్చా డగనన్
మర్నా డేపో లీసుల
చర్నా కోల చమడాలు చక్కగ వొలుచున్ :)
జిలేబి
ReplyDeleteపాటల లింకుల వీరుడు
మాటల రాయుడు జిలేబి మన నరసింహ
న్నా! టాముటాము వేసిరి
నాటి తరపు గానములకు నమనము లిమ్మా :)
జిలేబి
ReplyDeleteకాకలు తీరిన శైలజ
కాకర మీదునిటు ఖండికను సొంపుగన
న్నాకంద పద్య సొబగున్
దా కవనమొనరిచిరిటగదా భేషుగనన్ !
జిలేబి
ReplyDeleteతల తాకట్టిడగ, మనమ
టు లేఖినిని బట్టి రాయ టుప్పు మనుచు బే
ల్చు లఫంగా వెధవలుగల
రిలలో జర భద్రమగు పటిమవలయు సుమీ !
జిలేబి
ReplyDeleteమీ జ్ఞాపకశక్తి యధిక
మౌ! జ్ఞానంబున్నధికము మరి మీ యత్నం
బూ ! జ్ఞాపికగా పొత్తము
మీ జ్ఞాతవ్యంబవవలె మింగిడి వోలెన్ !
జిలేబి
ReplyDeleteమారా మారీ జేయుచు
నారాయణ యనిన నరుడు నరకము జెందు
న్నోరీ మనుజుండా ! నీ
హోరాహోరీ యిజముల హోరన విడుమోయ్ !
జిలేబి
ReplyDeleteపేరోలగంబు గాంచును
"నారాయణ!" యనిన నరుఁడు, నరకముఁ జెందున్
వేరొక నామజపంబును
ధారణ జేయన్ జిలేబి ధర్మము గనుమా !
జిలేబి
ReplyDeleteఓ రమణీ ! "నలుగురితో
నారాయణ" యనిన నరుఁడు నరకముఁ జెందున్
పారా హుషారు బిడ్డా !
గోరీలను గట్టవలదు కోట్లన కోట్లన్ !
జిలేబి
ReplyDeleteశరణు శరణు యనుచు సాహసమునుజేయ
మరణమందు తోడు మాధవునకు
తప్పక గలుగు మరి తరియించుటయు తధ్య
ము! కడదాక మునుగు ముత్యముగన !
జిలేబి
ReplyDeleteఅందమైన యమ్మణి నడయాడ గాను
కనులు కనులు కలువగాను కలవరింత
మదిని తాకగ యెద పొంగి మల్లె విరియ
మంచుమల యింద్రనీలమై మండుచుండె
జిలేబి
ReplyDeleteఅమృతపానమ్ముచే సుర లసురులైరి,
కుంభ వృష్టిని కురిపించి కుటిలురవగ
చిన్ని బాలుడు కన్నయ్య చిటికె లోన
కొండ నెత్తి, జిలేబి, గోకులము గాచె !
జిలేబి
ReplyDeleteమాట లేల రమణి మదిలోన గుబులేల
గూడు మిథ్య చిలుక గోడు మిథ్య
రామ రామ యనగ రమ్యమగును గాద
తత్వ మేల యమ్మ తమ్మికంటి !
జిలేబి
ReplyDeleteస్వామిని యనుంగు శిష్యుడు
మామికి యేమాయెనో సుమా యని చెప్పెన్,
కోమా లో దేలుచు తా
తోమిన పలుకులివియేను తుంటరి గానన్ :)
జిలేబి
ReplyDeleteహరిబాబు ఖురాను చదివి
పరిపరి విధముల జిలేబి పరిశోధించెన్
గిరికీల నాత్మయును నస
మిరి మరు జన్మన యమీతుమీ దేల్తుననెన్ :)
జిలేబి
ReplyDeleteలంక లోనయుండిరివారు లబ్జు గాను
రావణ విభీషణులు; రఘురాము సుతులు
లవకుశులు ముని వాటికల తిరిగిరి గ
దా జిలేబి కథ యిదియె తమ్మికంటి !
జిలేబి
ReplyDeleteఅదిగో సూచనలు జిలే
బి దినమమావాస్య జూడ బిక్కున సిక్కిం!
విదురుడు తెలుంగు యోగియు
సదనంబందున ఫలితము సారింపనులే !
జిలేబి
ReplyDeleteఅక్షర మాలిక న గురుడు
సాక్షాత్కారము గనెనటు సాంబయ్యను పిం
గాక్షుని జిలేబి గాన
న్నక్షతుడా ధూర్జటి, నయనాధుండచటన్ !
జిలేబి
ReplyDeleteచప్పట్లు మీకు ఱావు
ల్లప్పనముగనన్ జిలేబి లలితమ్మిచ్చె
న్నప్పా కవివర్యా ! మీ
జబ్బలకిక వచ్చెనోయి జమ్మని బలముల్ :)
జిలేబి
జబ్బలు చరచెదనిక!
Deleteఅబ్బో మనకే మనమిక!
డబ్బా కానే కాదిది ఒక!
అబ్బ జిలేబీకే ఇదెరుక!
:)
ReplyDeleteజబ్బలు చరిచి జిలేబీ
పబ్బము గడిపెదను మీదు పాటల బండి
న్నబ్బురముగా నడిపెదన్
యిబ్బడి ముబ్బడిగ గాన యికమీదటనౌ !
జిలేబి
ReplyDeleteఈ కన్నడ సేవ జిలే
బీ కేల సుమా ! తెనుంగు బీటలు దీయన్ ?
ಏಕೇ ರೇ ಮಾರಾಯಾ :)
పాకం పప్పు ? మన యాంధ్ర భాషన కెలుకన్ :)
జిలేబి
"ಸಿರಿಗನ್ನಡಂ ಗೆಲ್ಗೆ " అంటుంటారు కన్నడిగులు.
Delete
ReplyDeleteమాలిక బిగుసుకు నేనూ
రాలే మాలక్కుపేట రౌడీ యింకన్
వేళాయెనురా స్వామీ
జాలము చూడుము జిలేబి జల్దుకొనంగన్ :)
జిలేబి
ReplyDeleteస్వాగతము హేవిళంబీ !
స్వాగతము! మనోజ్జ్వలమగు సంవత్సరమై
భోగమ్ముల నిమ్మ యుగా
దీ! గమ్మత్తుగను పేరు దివ్య జిలేబీ !
జిలేబి
ReplyDeleteఓహేవళంబి ! మా గో
జీ హృదయపు హేమలంబ ! జిరజిర రమణీ !
ఓహేవిళంబి ! యెల్లరు
బాహమి సహృదయతగల్గ భాసిల్లు భళీ !
జిలేబి
ReplyDeleteరాజన్న చెప్పెను జి లే
బీ జవ గొను హేవిళంబి ! బిరబిర గానన్
గోజీ న హేమలంబగ
రాజస మొప్పగ గనపడి రాణించితివీ !
జిలేబి
ReplyDeleteశ్రీ హేమలంబ ! రావ
మ్మా! హే మమయంబుగాను మాదరి జేర
న్నాహ! సమ హేవిళంబీ,
సాహాయ్యము వలయునమ్మ చల్లగ నుండన్ !
జిలేబి
ReplyDeleteజ్యోతిష విన్నాణమసలు
లోతైన విషయము బోవె లోలాక్షి జిలే
బీ! తీగలు లాగన కా
లాతీత సమస్యలు మరలా బయలుపడున్ :)
జిలేబి
ReplyDeleteమోగమోటమి లేనివాడను మోజులేదమెరికా పైనన్
రోగిగానుర భారతీయుడ రూక్షితించితిని మేల్గానన్
భోగభాగ్యపు దారికాదిది బుద్ధిగాంచెదను నాలోనన్
యోగసాధన జేయబోయెద యోగియై యమెరికాలోనన్ :)
జిలేబి
ReplyDeleteతామసినిగాను తాపసి
నౌ మేల్గాంచన జిలేబి నాకు యమెరికా
యే మోక్షమార్గము సుమా
నా మనసే యోగపట్టె నాదారి యదే !
జిలేబి
ReplyDeleteపొత్తము లను గూర్చెదనట
చిత్తము మేల్గాన తంత్ర సిద్ధిని గనన
త్యుత్తమ దేశమమెరికా
విత్తములను గోరి గాదు వెడలుట నచటన్
జిలేబి
ReplyDeleteఎవరెట్లు బిల్వ నేమి ప
రివారము శుభముల గాంచి రీతిగ నెలయ
న్నవనిని వలయు జిలేబీ,
యవసర మా మన కిట పద యాసల్లూసుల్ :)
జిలేబి
ReplyDeleteశోధిని నిదురను వీడెను
రాధంతము వలె జిలేబి రావము జేసెన్
గాదెని కమింట్ల గిరగిర
మోదము గాన ప్రచురించె మొత్తము గానన్ :)
జిలేబి
మాలికా సరియయ్యె రామాహరే
శోధిని స్ట్రక్కాయె కృష్ణా హరే :)
ReplyDeleteఅరుబది యేండ్లన పెనుమా
ర్పు రుజువులను చూడుమోయి రూఢిగ మనవా
రు రచించిన శాస్త్రములె
ల్ల రహస్యములను జిలేబి లబ్జుగ తెలుపున్ :)
జిలేబి
ReplyDeleteరాజిల్లు రెల్లరు సదా
గోజీల జననముగాన గువ్వల చెన్నా :)
పూజకు నోచిన పుష్పము
సాజము గానన్ జిలేబి సారము గలదౌ :)
జిలేబి
ReplyDeleteనవరాగంబొలికింపగ
కవితా మధురిమలనెల్ల గావించెడి యా
కవనంబలర రమణి, కే
శవసందర్శనము పుణ్యసంపద లిచ్చున్ !
జిలేబి
ReplyDeleteపెద్దోళ్ళందరూ మా వారే మా జిల్లా వారే మా గోజీ వారే మా గోదావరి వారే !
హంసవరమాది శంకరు
వంశస్థుల నెలవట వినవమ్మ జిలేబీ !
వంశోద్ధారకులందరు
సంశయము వలదిక గోద సరసన వారే !
జిలేబి
ఎందుక్కాకూడదండి (గో.జి. అయినా కాకపోయినా తెలుగువారవడం అన్నది) ?
Deleteచాణక్యుడి పూర్వీకులు కూడా తెలుగువారేనని చాలా ..... ఏళ్ల క్రితం ఎక్కడో కాగితం పుస్తకంలో (ఆన్ లైన్ లో / సోషల్ మీడియాలో కాదని నా భావం) చదివినట్లు జ్ఞాపకం. వివరాలు గుర్తు రావడంలేదు. ఇప్పుడు వెదికినా సరైన రిఫరెన్సులు / లింకులు దొరకలేదు (అందువల్లే "కష్టేఫలే శర్మ" గారి బ్లాగ్ లో నా కామెంటులో ఈ మాట జేర్చలేదు). కల్లూరి భాస్కరం గారి లాంటి వారేమైనా చెప్పగలరేమో?
Deleteవిన్నకోట వారు
అబ్బే తెలుగు వారవటం వేరు మా గోజీ వారవటం వేరు :)
గోజీకి సాటి గోజీ
యే జిగిబిగి కోనసీమ యే నరసింహ
న్నా జగతికి మూలంబౌ
మా జబ్బల బలపు సాటి మా జబ్బలహో :)
జిలేబి
ReplyDeleteగోదావరి తీరంబున
సాదా సీదా జిలేబి సామర్థ్యము గాం
చే! ద్రావిననీళ్ళ గరిమ
మేధా దేవిగ ప్రతిభను మేలుగ జేర్చెన్ :)
జిలేబి
ReplyDeleteవినమన వింటిని కవనము
తనయుడె తల గొఱిగి నాడు తండ్రికి సుమ్మీ
వినినను తెలియను లేదౌ
మునుపెన్నడు గూడ నేను మోమిడి లేదౌ :)
జిలేబి
ReplyDeleteత్రిమతాచార్యులు మనవా
రు మన తెలుగవారటోయి రూఢిగ గనుమా
మమతల నెలవై వెలిగిరి
నమనము లిడుమా జిలేబి నమ్మిక వలయున్
జిలేబి
ReplyDeleteమనయమ్మగొప్ప యదియే !
వినవమ్మ జిలేబి యొజ్జ వివరించెనటన్
ఘనమై నచరిత్ర మనది
వినయంబు వివేకమొప్పె విస్మయ రీతిన్ !
జిలేబి
ReplyDeleteపాదాభిమానులచట
న్నాదము జేసిరి జిలేబి నాట్యము లాడె
న్బో ! దారిన్గనిరి సుమా
పాద కుసుమముల కురంగ పసిమిని గూడన్ :)
జిలేబి
ReplyDeleteజొప్పిరి కథల జిలేబి
న్జొప్పిరి కవితల జిలేబి జువ్వాటలన
న్జొప్పిరి వాత్స్యాయనులున్
జొప్పిరి మధురిమ జిలేబి జొప్ప జిలేబీ !
జిలేబి
ReplyDeleteలేతకుసుమంబుల కట
న్జోతల జేయుచు జిలేబి జొప్పిరి జూడ
న్గోతుల ద్రోయన కాలొక
టే తరుణులకు సరి బోవు టెక్కుగ విసురన్ :)
జిలేబి
ఇది కరక్ట్ 👌.
Delete
ReplyDeleteఅచ్చొచ్చిన చిచ్చర పిడు
గిచ్చెను నిచ్చెన జిలేబి గీకుడు కొరతై
మెచ్చుచు బొచ్చెను జాపగ
యిచ్చగ గుచ్చు తనువూగ యిరుసును తూగన్ :)
జిలేబి
ReplyDeleteలేత తమలపాకులవలె
పాదము నాజూకు గాను పారాడగన
న్నాతరపు పెళ్ళి పుస్తక
చిత్రము జ్ఞప్తికి జిలేబి చిక్కెను గదవే :)
జిలేబి
ReplyDeleteసరికాదు సుమా యరువుల
పరపతి బెంచన్ జిలేబి, పారుడు పలికె
న్నరువివ్వడు పొత్తంబుల
మరియెవరేమని తలచిన మాచన వర్యుల్ !
జిలేబి
ReplyDeleteపాపం దుర్యోధనుడట
నీ పాలిటి పెన్నిధిగను నిన్ను గలువ తా
రాపథ వీధిని వీడుచు
రాపాడంగను జిలేబి రావచ్చుసుమా !
జిలేబి
ReplyDeleteఔరాయను కలహమ్ములు,
నారాయణ నామజపము నారద తీరుల్
పారాహుషారు పద్యము
హోరా హోరీ జిలేబి హోహో లున్నూ!
జిలేబి
ReplyDeleteనర్సమ్మాయి యనామకి
మెర్సీ చలువగ జిలేబి మేల్మిని గాంచెన్
పుర్సతు లేదు కొమరునికి
బర్సీ యైన గలదో ? సుభానల్లా! భో !
జిలేబి
ReplyDeleteఈ సన్మానంబు జిలే
బీ శ్రీమాన్ వారికి తగు భేషుగ గురువా !
మీ సహృదయతకు నెనరులు
మూసన పద్యంబులెల్ల మొత్తెద నికనౌ :)
జిలేబి
ReplyDeleteఎల్లారీశ్వరికిన్ భళి
జిల్లనుచున్జ్యోతిలక్ష్మి చీర్సుల కున్ తా
నుల్లా సంబగు ఫ్యానో ?
సల్లాపంబులన జేర్చె చక్కటి పాటల్ :)
జిలేబి
ReplyDeleteఔరా బాహుబలి! తెలుగు
వారి తెలుంగుకు జిలేబి వలె దోచెన్బో !
పోరాడవలె తెలుగుతే
జోరవములు పలుకులెల్ల జొటజొట గానన్ :)
జిలేబి
ReplyDeleteఅంబరం బొక చిత్రగీతంబు;
రవియు దీపపు శెమ్మె, లోకంబు తెరపటంబు;
నీడబొమ్మలు మనుజులు;
నిఖిలమునకుఁ గాలచక్రంబు నిర్ణేత; గతి యనాది
(పానశాల - దువ్వూరి రామిరెడ్డి)
ReplyDeleteతెలుగున్నేర్వ జిలేబి బ
డి లక్షణంబగు స్థలంబు ఢింబకులకటన్
విలవిల లాడుచు నేర్తురు
కళలను శివగామి చలువ కట్టప్పన్నా !
జిలేబి
ReplyDeleteఎవరేమనుకున్నా యి
వ్వ వలదు పొత్తము జిలేబి, వనితా విత్తం
బు విడువగ మరి తిరిగి రా
దు విదురుని పలుకుల వినవె ధుమధుమ వలదే :)
జిలేబి
ReplyDeleteనోటిని కట్టేసుకునెన్
మాటల కెవ్వరు జిలేబి మన్నన నివ్వన్
ఝాటీ ద్రిప్పుచు నేర్ప
న్నేటి జనులు విందురో? మనీషా ! గురువా !
జిలేబి
ReplyDeleteలావొక్కింతయు లేదు ల !
లావే యీశ్వల! ములాలి! లక్షించు హలీ!
లావా ! మలి లావా! యీ
శా! వాగీశా ! లిలేలి సాలము గానన్ !
లిలేలి
ReplyDeleteఅంబరమణిచంద్రులనట
యంబరమున గాంచి యొజ్జ యన్త్రణ గానన్
తుంబుర జిలేబి చక్క క
దంబము వలె వచ్చెనమ్మ దవగాలి గనన్ :)
జిలేబి
ReplyDeleteసిగరెట్టు కాల్చడములో
తగలేసిన వారికిగద దాని మజా బా
గుగ తెలియున్ లలితమ్మా !
బుగబుగ తాగెనట యొజ్జ పొగబండి వలెన్ :)
జిలేబి
ReplyDeleteభగభగ మండుచు రావే
పొగమాటు గనన్ జిలేబి బొమ్మా బామ్మా !
రగులన కలహము నారద
బిగువును జేర్చుము సరసర బిరబిర నీవే !
జిలేబి
ReplyDeleteహరిబాబు నీవు మారుట
జర మంచిది యనెనుగాద సాక్ష్యం బిడ్డా,
పరమత శోధన యేలర
పరధర్మంబు విడుమోయి పద్ధతి కాదోయ్ !
జిలేబి
ReplyDeleteవలయునా స్వామి తిరుపతి వలెను గొలగ
మూరు ! కొండదేవర తాను మూగ బోవ
కోరికల దీర్చుగొనుచుండె కొంకిగాను
బేర సారము లాడెడు బింకు బంట్లు !
జిలేబి
ReplyDeleteతొల్లి విల్లును విరిచి తానెల్లరకును
తల్లిఁ బెండ్లాడి రాముఁ డుదాత్తుఁ డయ్యె
తండ్రి యానగ యడవుల ధరణిజయును
తమ్ము డా లక్ష్మణుండు జతగన నేగె !
జిలేబి
ReplyDeleteతమిళం లో యేమరుపా
టు మాటలను రాసుకొనిరి టుంటుకము గద
న్న మన తెలుగన్న టుప్పను
చు మన జిలేబమ్మ తెలుగు చుట్టిరి చుట్టల్ :)
జిలేబి
ReplyDeleteతెలుగోళ్ళు వెర్రి గొర్రెలు
పలుకరు తప్పైన మాట, పదవే పాటల్
కెలుకన జిలేబి చుట్టల
తెలుగొచ్చిన చాలు గాద తెగులే టెల్గూ :)
జిలేబి
ReplyDeleteరాజన్నకు తెలియనిదుం
దా! జాగ్రత్త సుమ ! యరువు దానెరుగున్ మే
లౌ జనవాళి పలుకు యెరు
వూ చక్క తెలియు గురునికి వూకొని వినవే :)
జిలేబి
ReplyDeleteఏమరు పాటున రాసె
న్నో మరి జాగ్రత్త లేక నోమాటనెనో !
ఓమారిటుగాను ఫణీం
ద్రా! మా వైవీ వెదికె గదా తెలుగున్బో :)
ಜಿಲೇಬಿ
ReplyDeleteఇంది జిలేబీ ! మాక
య్యింది గదా శాస్తి ! మిస్సయితినే! దొర్లిం
దండీ బండి టముకు వే
యండిక యెల్లరికి పద్య యమకము వదులన్ :)
జిలేబి
ReplyDeleteమీ దివ్యదృష్టి గానన్
మాదో సందేహము వినుమమ్మ జిలేబీ !
మీ దేమియద్భుతమన
న్నేదో ప్రాస యతులనుచు నే గూర్చినవీ (అంతే :))
జిలేబి
ReplyDeleteకన్నడ సంతక మేల! వి
నన్నత్యుత్సుకతయమ్మ, నమనంబౌ! యే
మన్నా 'బహాస' కస్తూ
రిన్నీ మీరు కవితల్ సరికడచి నారో ?
జిలేబి
ReplyDeleteవాక్కున గుణము లేకున్న వాదు లాడి
తమ పరపతి వీడుచు సామ్యతను విడుచుచు
పరిపరి విధముల తమకింపగ, జిలేబి,
నీచదశ నంది సజ్జనుల్ నీల్గుచుంద్రు
జిలేబి
ReplyDeleteఆ రాతిరియంతయు తా
నారాటంబుగ జిలేబి, నాసిక తిముర
న్బోరక్తపిపాసియగుచు
ధీరత నొక దోమ, తుమ్మె దిక్కరు లడలన్
జిలేబి
ReplyDeleteఆ తమిళతంబి భాషా
చాతుర్యమటన్ జిలేబి చా, చా, లేదే
యీ తెలుగువారలకిటన్
కైతయు లేదు గన ముష్టి కథయొక టెన్బో :)
జిలేబి
ReplyDeleteరాజు తెలుగు రాయలుగన్
రాజయ్యెనుగాద! యోరి, రాజుగ కాలే
డా జక్కగ బాహుబలియు ?
కైజారు కథల జిలేబి కాకవెలుంగౌ ?
జిలేబి
ReplyDeleteయాంకరు యాంకరిణులటన్
వంకర టింకర తెలుగున వాగిన వారిన్
కింకరు డైకట్టప్పా
జంకించు సుమా చబుకును చట్టువిసురుచున్ :)
జిలేబి
అవును జిలేబి గారూ, అదే సరైన మార్గం అనిపిస్తోంది ఆ హింస నుంచి విముక్తికి ☝️.
ReplyDelete
Deleteవనితా రమణీ! పితరుడు
జనకుండని, పెండ్లియాడె జానకి రాము
న్నని తెలుసుకొనగ సుమతీ,
ఘనమై పూరణ కుదిరెను గదవె జిలేబీ !
జిలేబి
ReplyDeleteఊర్మిళ మరదలు కదవె యుక్త మగుచు
రామునకు; సహోదరి గదా రమణి సీత
తనకు ; లక్ష్మణునికి భార్య తరుణి గాద;
యేల సందేహము జిలేబి యెరుకపట్టు !
జిలేబి
ReplyDeleteఓ మా రామా! రఘు రా
జా! మా కౌముది శుభాంగి జానకి రామా !
శ్రీమాణిక్యంబైనటి
రామా ! సీతమ్మతోడ రక్షణ నిడుమా!
జిలేబి
ReplyDeleteమీ తాతగారి యాశీ
ర్వాదమ్ములు మాకు వచ్చె వరమై నిచటన్,
మీ దయతో మాచన వ
ర్యా! తాతయ్య! యనపర్తి రాత్రిద్విషుడా !
జిలేబి
ReplyDeleteచేరితి డెట్రాయిట్టు
న్నారాధన యీకువ గని నన్నాదరణ
న్మీర గనిరక్కడి జనులు
కోరితి నీశ్వర మము దయ గొని గావ వలెన్ !
జిలేబి
జిలేబి గారూ, మీరు డెట్రాయిట్ వెళ్ళారా !? నాకు బాగా దగ్గర వ్యక్తి ఆ ఊళ్ళోనే ఉంటున్నాడు. కాస్త ముందు తెలిసెనా ..........!
Deleteఓ, మీ టపాల, వ్యాఖ్యల టైం స్టాంప్ చూస్తుంటే మీరు అమెరికాలో లేరని తెలుస్తోంది. అయితే వేరెవరో డెట్రాయట్ వెడితే వారిమీద మీరు పద్యం కట్టారన్నమాట.
Deleteదీనికి మరో పద్యం అల్లుతారా 😳? మామూలుగా చెప్పండి ప్లీజ్. ఇపుడేగా పెద్దావిడ తెలుగుతూలిక మాలతి గారు కూడా మీ పద్యవ్యాఖ్యల గురించి వ్యాఖ్యానించారు 🙂
Deleteజాసూసీ జేయ జిలే
బీ! సాక్ష్యంబులగుపించె బేర్చిరి పద్యం
బా సోదరుల టపాకు ! ని
వాసము డెట్రాయిటనుట వారికి చెల్లున్ :)
జిలేబి
టైమ్ స్టాంపులు బలేవారే! జిలేబమ్మకి ఏదైనా సాధ్యమే! పరకాయ ప్రవేశంతో సహా! ఏకాంకికలో ద్విపాత్రాభినయంతో సహా :)
Deleteజిలేబమ్మ వచనంలో మాటాడి ఏళ్ళయిందిగా :) ఇలాగే కొనసాగనివ్వండి లేకపోతే మరే ముసలం రాగలదో :)
Deleteఏదై నా సాధ్యంబౌ
మా తల్లి జిలేబికి గద ! మాయల తమిళ
మ్మౌ ! తవికల వలదనిన
న్బో తమ్మి , మరే ముసలము నోర్వ వలయునో :)
జిలేబి
http://www.teluguyogi.net/2017/04/1.html?m=1
DeleteRef: Detroit 👆
ఓహో అదా సంగతి ! ఆ బ్లాగర్ గారు వెడితే జిలేబి గారు పద్యం కట్టారా? ఇంకా మన జిలేబి గారే వెడుతున్నారేమో, ఆ ఊరిలోనే ఉంటున్న మా సోదరుడికి చెబుదామనుకున్నాను.
Deleteమిస్టరీ విడగొట్టిన లలితమ్మకు థాంక్స్.
ReplyDeleteమీరటు రెండో కృష్ణుడి
లా రూపంబెత్తగ మజ, లావరి తనము
న్నారూఢము! టీ వీ, సిని
మా రంగులసిరి పరిశ్రమకు గొళ్ళెము బో :)
జిలేబి
ReplyDeleteలక్ష్మీ ! యూర్మిళయే గద
లక్ష్మణ సతియౌ ! సుమిత్ర లక్షణము గన
న్లక్ష్మీ , దశరథు సతియౌ !
సూక్ష్మము గనవమ్మ లక్ష్మి సుందర వదనా !
జిలేబి
ReplyDeleteఆరరె ! రప ! రపరంబై
నోరార రరర రరాట నొక్కిల గాన
న్బోరరె! రప ! నరసింహ
న్నౌ, రర ! రప! రెపరెప ! యని నారు జిలేబీ :)
జిలేబి
విన్నకోట నోట జారిన
Deleteఒకమాట తేటగీతిగ
మారి జొట జొట పారె మా
లిక నిట స్వీటుజూసు వోలె
ఇలాంటి పద్యం ఒకటి పూర్వ కృష్ణదేవరాయల సభలో విన్నట్టు జ్ఞాపకం. అందులోనూ 'ర 'కారాలు ఎక్కువ. రామనవమినాడు అంతా 'రా'మమయం .
Deleteవిన్నకోట నోట జారిన
Deleteఒకమాట తేటగీతిగ
మారి జొట జొట పారె మా
లిక నిట స్వీటుజూసు వోలె
హేవిటీ YVR గారూ, మీరూ పద్యాలల్లుతారా!? ☺
Deleteరామాయణమంతా విని...అన్నట్టుంది మీ మాట :)
Delete
ReplyDeleteలక్ష్మి యన సీత; యూర్మిళ
లక్ష్మణ సతియౌ; సుమిత్ర లక్షణము గనన్
సూక్ష్మము చెప్పెదను దశర
థ క్ష్మాపతి కొకతె ముగురు దారలలోనన్!
శ్రీ కంది శంకరయ్య
ReplyDeleteమా కంది వారి సాటిగ
మా కందమటు జమగట్ట మాతరమగునా!
శ్రీ కంది శంకరయ్యా !
మీ కవనమునకు జిలేబి మీరగ జోతల్ :)
జిలేబి
ReplyDeleteకేకూ కేండిల్సుల జత
నౌ కీర్తించితిమి రామ నయగారముగన్
మీ కరుణ జూపు మయ్యా
మా కెల్లరకున్నిట భళి మాయమ్మ జతన్ !
గ్రీటింగ్సు నూతన వధూవరుల కు
జిలేబి
ReplyDeleteహా ! తామరకంటీ ! శ్రీ
సీతా, రామునికిఁ గీడుఁ జేయందగు నే
నౌ ? తమరి మీద కోరిక
నౌ ? తప్పగు మాట! రామునానతి తల్లీ !
జిలేబి
ReplyDeleteపదముల విడదీతయు లే
క దబదబ యనెడి పలుకుల కష్టము జూడన్
విదురుల చర్చలు భేషౌ !
కుదురుగ బేర్చవలెనమ్మ కూర్పు జిలేబీ !
జిలేబి
ReplyDeleteమీ కీబోర్డున పొరపా
టే కందంబాయె సూవె ! టేకిట్ యీజీ !
మాకన్న మీరు మేలౌ
మీ కటు యోపిక గలదు సుమీ వ్యాఖ్యలిడన్ !
జిలేబి
ReplyDeleteవచనము లోమా ట్లాడి ప
లుచవడి వత్సరములాయె లుక్కు జిలేబీ !
గజిబిజి కందములే పలు
కు చిలుకలకొలికియ గోల గోలల గోలా :)
జిలేబి
మీ పద్యాల జిలేబి పాక రసముల్ మేల్మేలు , బ్లాగ్లోకముల్
Deleteచూపుల్ ద్రిప్పక త్రాగు చుండిరి , మరీ చోద్యంబుగా నిష్టమై ,
ఆపొద్దండి , గణింప నింక వచనం బామోదమే గాదు , మేం
మీ ఫాన్సండి , తదన్య కుట్రలివి , మామీ ! సత్యముల్ దెల్వుమా !
అమ్మవారు వచనంలో మాటాడితే ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని భయమండి! అందుకే అమ్మవారికో వినతి చేసుకున్నాం, పొరపాటున వచనం లో మాటాడద్దూ అని :) ఇందులో కుట్ర కోణం అసలు లేదండీ :)
Delete
Deleteకుట్రలేమియు లేదు రాజ చకోరి మాటల రాణియౌ
వట్రువందున చిక్కెతానట వాడిమీరగ బోవుచున్
తొట్రగిల్లుచు తమ్మికంటిని తోమగన్నిటు వచ్చితిన్
చట్రమొక్కటి తిప్పి జూచితి జాబిలమ్మను గాననౌ :)
జిలేబి
ReplyDeleteతమిళం మామి జిలేబి క
ట మన తెలుగు పోష్టరులెటు టక్కని దొరకున్!
జమజట్టిగాద నెట్టున
తమకము తీర తిరుగాడు తరుణియు గూడన్ :)
జిలేబి
ReplyDeleteకాదేదీ పద్యంబవ
మా తమిళం మామికి గద మాచన వర్యా !
తా తరము జూడ పదముల
ఖాతరు జేయుచు గబగబ కందము వచ్చెన్ :)
జిలేబి
ReplyDeleteడామిట్ ! వైవీ యార్ గా
రూ ! మీరూ పద్యములట రుబ్బితిరన్నా !
హేమిటి యీ లీలగదా!
మామి జిలేబి భళి యేమి మాయను జేసెన్ :)
జిలేబి
ఆ లీల చేసినది విన్నకోటవారి కీ బోర్డులో చేరిన రాముడు. ఆ లీల ఎక్స్ ప్లెయిన్ చెయ్యాలంటే ఒక పోస్ట్ రాయాల్సినంత గొప్పది.
ReplyDelete
ReplyDeleteనా కీబోర్డ్ విన్యాసంలో పుట్టుకొచ్చిన 'రరరప' ఏదో షమ్మీ కపూర్ శైలిలోనో, కిషోర్ కుమార్ శైలిలోనో కుదురుకుందిలే అనుకున్నాను. దాని సంగతెలా ఉన్నా అది పద్యాలకు, పోస్ట్ లకు కూడా దారితీస్తోందన్నమాట, భేష్ భేష్.
ReplyDeleteఅబ్బబ్బే !టీ వీ ? తెలు
గబ్బబ్బే ? చూ డనండి ! గట్టిగ బందౌ :)
తబ్బిబ్బయ్యా నొకసా
రబ్బబ్బో యే మి బాధ రానాయన్నో :)
జిలేబి
ReplyDeleteతాతా! సిరివెన్నెలతో
ఓతూరటు వారిని గన యొప్పించండీ
మా తకతక పా టలతో
మాతానకము తెలుసుకొన మాటాడెదనౌ :)
జిలేబి
ReplyDeleteఆలా జరిగే దానికి
వీలుందా ! యెందుకో కవి హృదయమవునం
దీ! లావగుతీరు జిలే
బీ లెక్కలు దేలు సూవె బెహతరు గానన్ !
జిలేబి
ReplyDeleteఆ శివుని కూల ద్రోసె
న్నా సుకుమారమగు పుష్ప నాళీకమ్ముల్
ద్రోసెనుగ మంద మారుత
మా సాయం సమయమందు క్ష్మాభృత్తునటన్ !
జిలేబి
ReplyDeleteభుజుడా యంబరమందు జ
గజగా మెరయుచు తమోరి కాష్టంబవగన్
గిజగిజ లాడయ డవి,యట
గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్
*ఖరము= వేడిమి (అని ఆంధ్ర భారతి అర్థం :)
జిలేబి
నిజముగ నిష్ఠూరమగు,బు
Deleteధ జన ఖర గములు తెలుంగు ధారుణి మీదన్
డజనులు డజనులుగ గజము
గజము నకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్ .
ReplyDeleteకందంబులతో మత్తే
భం,తగణ నగణ జిలేబి బింబంబులతో
డెందంబున శార్దూలపు
యందంబుల మత్తకోకిలవలె తిరుగవే !
జిలేబి
కొన్నిట ప్రాసలు లేవని
Deleteకొన్నిట యతు లేవి యని వికుంఠిత దృష్టిన్
మన్నింతుర ? బుధులు ! తవరి
నన్నా ! ' తుదకు పిసలయ్యె ' నగుబాటు కదా !
Deleteప్రాస యతులు మన కేల
న్నా! సరసపు పలుకుల మజ, నలుగురి తోనన్
కూసింత చతికిలబడుచు
యాసల సయ్యాటలన పయనమును జేయన్ :)
జిలేబి
ReplyDeleteకొట్టారా కందంబున
కట్టమ్మీ ! మజ! జిలేబి కందం క్వీనూ :)
మిట్టాయి లటన్ సరిబో
దెట్టెట్టా కోమలి వలదె వెతల కవితల్ :)
జిలేబి
ReplyDeleteచట్టని మోడీ వారటు
గిట్టని వారికి సవాలు గింగిర్లిడుచున్
కట్టన డిజిటల్ రాస్తా,
పట్టాలే లేక రైలు పరుగిడసాగెన్ :)
జిలేబి
ReplyDeleteఅది కందంబో కాదో
మది మది నాకు తెలియదు సుమా! మీరో,ఆ
ముదిర జిలేబీ గారో
సదనంబందు మరి చెప్ప సరియగు రంగా :)
జిలేబి