నక్షత్రమాలికల మధ్య నడక !
నడుస్తున్నా.
ఆకాశంలోని నక్షత్రాలు
దిగి వచ్చేస్తోన్నాయి
అరె ! ఇంత దగ్గిరా !
అరె అరె అరె !
నా పక్కే ఉన్నాయ్ అన్నీ !
మధ్య లో నే నడుస్తున్నా !
మధ్య లో నే నడుస్తున్నా !
అరె ఇంత మధ్య !
అరె అరె అరె !
ఓహ్! నక్షత్రాలే అన్నీ
అన్నీ నాలా ఉన్నాయే !
నేనెక్కడ ?
అరె ఇంత లోనేనా !
అరె అరె అరె !
కల చెదిరింది
నక్షత్రాలూ మాయం
నేనూ మటు మాయం !
అరె అంతలోనే ?
అరె అరె అరె!
శుభోదయం
జిలేబి
ఈవిడ జిలేబీనే అంటారా !?
ReplyDeleteఈవిడ జిలేబీ అయితే ఇలా
అందరికీ ఇంత సులభంగా
అర్ధమయ్యేట్లుగా వ్రాయడమా !?
ఈవిణ్ణిలా వదిలేయకండ్రా -
ఎవరికైనా చూపించండ్రా ...
ప్లీజ్ ...
:) jk
'నేనూ మటు మాయం !' ...
Deleteమరో మాట చెప్పండి.
ప్లీజ్ ...
మరో మారు చెప్పండి ...
ప్లీజ్ ...
శుభోదయం ...
అందరికీ ...
:) jf
బండివారు
Deleteఏదో భయంగా భయంగా ఉంది
Deleteభలే వారండి
నేనిది చాలా సంక్లిష్టంగా రాసానని అనుకుంటా వుంటే మీరేమో వీజీ గా ఉందనేసారే :)
@ కష్టే ఫలే గారు
భయము వలదు అన్నియు కుంభికా కోకిలమే :)
జిలేబి
గురువు గారు,
Deleteనేను కూడా బిక్కు బిక్కే ...
ఆవిడేదో భక్కు భక్కు మంటున్నారు కూడా!
:)
నేల విడిచి నింగి నేలగా కోరికల్
ReplyDeleteచాల గలవు , గాని , తేలి పోయి
చుక్కల గమి నడుమ చుక్కగా భాసిల్ల
కలలు గనుట గాక , వలను పడున ?
Deleteరాజారావు గారు
ధన్యవాదములు "వలను" పడును :)
జిలేబి