మత్తకోకిల మత్తకోకిల మత్తకోకిలయే సుమా
మెత్తగానిట మెత్తగానిట మేలురీతిని గాంచితిన్
పొత్తమేలర పొద్దుగూకుల పొత్తుగానుర మంచిదే
చిత్తరీతిని రాయరాయగ చేర్పుగూర్తురు కోవిదుల్ !
మత్తకోకిల మత్తకోకిల మత్తకోకిలయే సుమా
చీర్స్
జిలేబి
పొత్తమేలర పొద్దుగూకుల పొత్తుగానుర మంచిదే
చిత్తరీతిని రాయరాయగ చేర్పుగూర్తురు కోవిదుల్ !
మత్తకోకిల మత్తకోకిల మత్తకోకిలయే సుమా
చీర్స్
జిలేబి
ReplyDeleteపాయసమ్మును తీయగానటు పాయబారుచు గానవే
సోయగమ్ముల శబ్దమెల్లను సోకులాడుచు వచ్చునే
వేయవేయను వేణి యుల్లము వేడిగానుచు దోచునే
వాయుభుక్నకులమ్ము రీతిని వాదులాటలు మానవే :)
జిలేబి
ReplyDeleteసేరిగాడిటువచ్చు తీరుగ సేద్యముల్గన రయ్యనన్,
దోరగించి శుభాంగి చూడక దోచుకొమ్మ జిలేబి, నే
డే రసమ్ము లతాంగి గాంచెను రెండుకాయల కూడికై
బీరతీగకుఁగాచె మెండుగ బెండకాయలు చూడుమా !
జిలేబి
ReplyDeleteదేవభాషను నేర్వగోరెను జేసుదాసుడు గానవే
భావగీతము రాగతాళము పక్కపక్కల బోవునే
చేవజేర్చును మేలుగూర్చును చెంతజేరగ వెంటనే
జావళింపుల జాజిమల్లియ జక్కగానిట నేర్వవే !
జిలేబి
ReplyDeleteషావుకారు గుమాస్తగానటు సాగరమ్మున దేలితీ
జీవితమ్మున నేర్చుకొంటిని జీవగర్రల నెన్నియో
రావుగార్లట సాహచర్యము రాటుదేల్చగ, భోగినీ
భావమెల్లెడ మేలుజేయు సుభాషితమ్ముల గాంచితీ !
జిలేబి
ReplyDeleteరెండువందల మత్తకోకిల రేసుగానుచు జేయవే
బండిబాటన చక్కగానగ భావమెల్లను గూర్చవే
గుండెమాటున దాయగానవి గూడిరావలె నేయిట
న్నండదండగ గావుమమ్మిట నందయంతివి గావవే !
జిలేబి
ReplyDeleteశిల్పిగోరెను స్కార్ఫు మోడిని చింతలేకయు పంపెనౌ
సెల్ఫితీసెను యమ్మణీ తన ట్విట్టరందున ట్వీటులౌ
కుల్ఫిగానటు లైకులెల్లరు గుండుగుండుగ జేసిరౌ
వేల్పుగానటు యాదియోగియు వేణువాదుడు మోడియౌ
జిలేబి
ReplyDeleteజీవభాషను ముచ్చటించుచు జీరబోయెను గాదుటే
యావటంబగు రీతిగాంచుచు యాసలన్నియు నేర్చనే
మావగారటు మేలుజూచిరి మంచియత్తయు గాదుటే
మావితానము కార్యమొప్పగ మాకులంబులు యడ్డహో !
జిలేబి
ReplyDeleteబండిబాటన పాట చూడగ భక్కు భక్కు మనేనుగా
గుండెనిండిన యేకగీతము డ్యూయెటాయె భళాభళా !
పిండివేయగ రొట్టెదేలెను బీటుగానుచు మేళమూ
గుండుగుండుగ మత్తగీతము గూడ్సుబండిగ వచ్చెనౌ :)
జిలేబి
పిండి రొట్టయ్యిందంటారు!
Deleteబండి గూడ్సయ్యిందంటారు!
ఈ గండు మేళం బీటెంటబ్బా!!!
(దయతో బుర్ర గోక్కునే ఇమోజీ
ఎక్కడ దొరుకునో చెప్పగలరు...)
:)
ReplyDeleteసోమవారము యట్టెబోయెను సోకులమ్మియు జూడగా
రామబాణము సాగిపోయెను రాశికన్నియ లాటగా
జామురేతిరి జాజిమల్లియ జాగురూకత కోరెనౌ
సాములోరికి సాగరానికి సాహసమ్మటు వచ్చెనౌ :)
జిలేబి
ReplyDeleteచెప్పలేముగదా!జిలేబి కచేరి బెట్టుచు గిచ్చునో !
గుప్పుగుప్పని గుండుమామియు గుచ్చునోమరి పద్యమున్
డప్పుడప్పుల గొట్టితానిట డాముడామని బేల్చునో!
చప్పుడేమియు జేయకుండగ చల్లగాను పరారహో !
జిలేబి
ReplyDeleteగొంతునచ్చగ మాటలాడెను గోడులన్నియు ఊసులౌ !
చెంతబోవగ తానుగాంచెను చెంగుచెంగని కౌముదిన్
కొంతగాదుర నెంతయేనియు కోమలమ్ములు లేనిదౌ
వింతగానుడు జంటగట్టెను వీరిగాడికి బామ్మయౌ !
ReplyDeleteజోగిజోగియు పొత్తుగాంచిరి జోరుగానొక బ్లాగులో
వేగవేగముగా యనామక వేడిగానొక వ్యాఖ్యనౌ
సాగదీసెను దిక్కుమాలిన సామెతన్నట వేయుచున్
పారుడొచ్చిరి పట్టిగొట్టిరి పళ్ళుబోయె యనామకా :)
జిలేబి
ReplyDeleteగోగుపువ్వుల కొంటెచూపుల గోవమీఱెడి కోటరీ!
మేఘమాలిక తాకగానట మేనిజల్లన మారెనౌ
సాగరమ్మున సాగిపోవుచు సాధనమ్మును జేయుచున్
రాగయుక్తపు పద్మమాలిక రాగమాలిక గూర్చెనౌ :)
జిలేబి
ReplyDeleteతే, టమాటను తెమ్మనిచ్చట తేరగానిక రాగనౌ
ఘాటుఘాటుగ చారుకాచగ కమ్మగాను రుచించుచున్
మేటిగానగు వత్తురిచ్చట మెచ్చరెల్లరు నిన్నహో
బాటబోవుచు జూడగానిట బాగుగాను జిలేబినిన్ !
జిలేబి
ReplyDeleteమంచిలౌక్యులు శర్మగారును మాటయాయువు సత్యమే
యంచునాడెను విన్నకోటకు యర్థమాయెను సామెతై
కొంచమేనియు బుట్టలోబడ కుండబోయెను గాదుటే
పంచచేరుచు నేర్వగానగు పాఠమెల్ల జిలేబి బో :)
జిలేబి
Delete*మాటకాయువు
ReplyDeleteపొర్లుదండము గుజ్జువేలుపు బొజ్జదేవ వినాయకా !
యర్లమర్లన చేరినానిట యయ్యవార్ల సమూహమున్
సర్లిగానగ గావుమమ్ముల చక్కగానగ పద్యముల్
యిర్లగొంగడి కంటెముందర యిచ్చగానగ వత్తు నే :)
జిలేబి
ReplyDeleteబ్యాంకువైపున చూడబోకుర ఫైనులంచును వేతురౌ
సుంకమెల్లను గట్టిగానటు సుర్రుసుర్రన వచ్చునౌ
యంకతంత్రము యేమితెల్వని యంపబంపుల బిల్లుల
న్నింకజూచిన గుండెజల్లను నింగిముట్టును బ్లడ్ప్రెషర్ :)
జిలేబ్
This comment has been removed by the author.
DeleteWhatsApp లో తిరుగుతున్న ఓ కార్టూన్ (హిందీలో ఉంది):-
Deleteबैंक में पडे़ पैसे
को याद भी किया
तो स्मरण टैक्स
लगेगा ।
స్వేచ్ఛానువాదం :-
బ్యాంక్ లో ఉన్న నీ డబ్బు గురించి తలుచుకున్నావంటే కూడా "స్మరణ రుసుము" పడుతుంది.
😀😀😀😀 హాస్యంలా అనిపిస్తోంది కానీ దురదృష్టకర ధోరణి. పబ్లిక్ రంగంలో కూడా కార్పొరేట్ ఆలోచనా విధానమా? 😡. పాత "తోడికోడళ్ళు" సినిమాలో "టౌను పక్కకెళ్ళద్దురో డింగరీ" పాట అలవరసలో "బ్యాంక్ పక్కకెళ్ళద్దురో డింగరీ" అని పాట కట్టుకోవాలేమో! (nmrao bandi గారేమన్నా ప్రయత్నించగలరేమో? 🙂
Deleteయస్య స్మరణ మాత్రేన జనమ్ ధనమ్నాత్ విముచ్యతే :)
జిలేబి
లెస్స పలికితిరి 👌.
Deleteగురువు గారూ మీరలా అన్నాకా ...
Deleteఇదిగో ... ఇలా ...
http://nmraobandi.blogspot.in/2017/03/bank-charges.html
:)
పని తప్పక జరగడానికి ఎవరి మీద భరోసా పెట్టుకోవాలో తెలుసండి - ఉద్యోగంలో నేర్చుకున్నాం 🙂. అయితే మీరు ఇంత వేగంగా డెలివరీ ఇవ్వడం మరింత సంతోషం. పాట చూశాను, చాలా బాగా కుదిరింది 👍. మాట నిలబెట్టినందుకు డబల్ థాంక్స్ 🙏.
Delete__/\__ ...
Delete
ReplyDeletehttps://youtu.be/lizzQ2v_V3o
అబ్బురమ్ముగ యోరుగల్లున నామ్రపాలి జిలేబి మా
సుబ్బులక్ష్మి కలెక్టరమ్మగ శోభగాంచెను జూడ నో
రబ్బ చప్పున గుర్తుకొచ్చెను రాహుకాలము బోయెనౌ
పబ్బ మీ దినమమ్మ మేలగు పల్లవోష్ఠుల కెల్లనున్ !
జిలేబి
"సుబ్బులక్ష్మి" కి ఇంకా కుర్రతనం వదిలినట్లు లేదు 🙂.
Deleteమీకు 'వేడి టీ' దొరికినట్లు లేదే పాపం ! 😉
ReplyDelete
Deleteవిన్నకోట వారు
నేటికి హాట్ హాట్ జిలేబి యే :)
త్వరలోనే హాట్ హాట్ చాయ్ పే చర్చా ;)
జిలేబి
చాయ్ పే చర్చా
Deleteయా
కాఫీ పే కామెంటా
యా
జిలేబీ పే ఝగడా
యా
ఇట్లు,
బాగ్ పే బెకబెకానంద.
ReplyDeleteసూర్యయంత్రము వేసిరచ్చట స్తోత్రమెల్లను జెప్పుచు
న్నార్యులెల్లరు గూడిరచ్చట నాదగానము జేయ నా
చార్యులెల్లరు చాలచక్కగ సామవేదము జెప్పగన్
కార్యకర్తలు జూడముచ్చట గట్టి భాగ్యము గాంచిరౌ !
జిలేబి
ReplyDeleteవేడివేడిగ టీనిగానక వేగమెల్లను బోయెనౌ
మోడియిచ్చును కిక్కుజేర్చుచు ముందురోజుల గాననౌ
జోడుగాంచిన జోడుకుంకలు జోకరవ్వగ బోదురో
జాడుఝాటిగ జామ్నగర్నకు జక్కబోయని ద్రోలురో !
జిలేబి
ReplyDeleteచాయి తాగుచు చక్కగానటు చర్చజేయుచు తూగగన్
మాయతో సిరిలేనివాసుడు మామిగానగ వచ్చెనౌ
సోయగమ్ము జిలేబిలూరెడి సుబ్బులక్ష్మియు గాంచెనౌ
వాయువేగము గానుతానటు వృత్తమొక్కటి బేర్చెనౌ :)
జిలేబి
ReplyDeleteప్రశ్న చిన్నది మా జవాబగు పద్దుపొత్తము మిత్రమా
పృశ్నికాంతుల నేర్వమేలగు పట్టుబట్టుచు పొద్దుల
న్నస్నసాయము గాంచిమీరటు నాడిమంత్ర నిగూఢమున్
పృశ్నులచ్చట గూడివత్తురు పాఠమెల్లను నేర్పగన్ !
జిలేబి
ReplyDeleteస్మార్టుఫోనవుతాను నేనిక సాహచర్యము జేయగన్
హార్టులేకను బోయిరమ్మయు నాన్నలున్ను జిలేబులై
పార్టుపార్టుగ వాట్సపుల్లన బాతఖానియు జేయుచు
న్నర్టిగానుచు జీవితమ్మున నచ్చికమ్ములు గానుచున్ !
జిలేబి
ReplyDeleteపంగనామము దీక్షగానటు భక్తులయ్యిరి నేటికిన్
బెంగతీరగ రాష్ట్రమందున బెష్టుగాన రిజల్టులన్
చొంగగార్చుచు టీవిముందర చోద్యమెల్లను జూడగన్
యంగలార్చుచు హోళిహోళి సయాటగానగ వీరులౌ :)
జిలేబి
ReplyDeleteబ్రహ్మచారుల కాలమొచ్చెను భారతమ్మున సోదరా
జహ్మముత్తర దేశమందున చక్కగానటు దోచె తా
జిహ్మగమ్ముగ మేలుగావగ చిత్రమైయటు గాంచనే
యహ్మదీయులు తస్మదీయులు యస్మదీయ జిలేబులై !
జిలేబి
ReplyDeleteమొల్లవాసన లేనిపువ్వగు మొత్తనేలన కోరికల్ ?
కొల్లగొట్టను లేదుకోరగ కోకబట్టెను గాదుటే ?
చల్లకొచ్చిటు ముంతకేలన చాకచక్యము కోమలీ
మల్లయుద్ధము లేల నో మరి మల్లెపువ్వుల కిచ్చటన్ :)
జిలేబి
ReplyDeleteరుబ్బురోలును జూచి చక్కగ రుబ్బగాను జిలేబి యై
సుబ్బులక్ష్మికి పద్యమొక్కటి సుందరమ్ముగ వచ్చెనౌ
యబ్బురమ్ముగ నుండగన్నట యయ్యవారలు మెచ్చిరౌ
మబ్బువీడగ ముద్దుగుమ్మయు మత్తులోనటు తూగెనే :)
జిలేబి
సుబ్బు శాస్త్రియు సుబ్బలక్ష్మియు చూడనొక్కర సూర్యుడా ?
Deleteమబ్బు దొల్గగ మాయ వీడగ మాకు సత్యము విప్పరా
అబ్బ యీ మిడిమేళ మేమని అయ్యలందరు గిచ్చరా
రుబ్బురోలును పొత్రమూ మరి రోకలీ యొకటే గదా .
This comment has been removed by the author.
Deleteసుబ్బరముగ పదాలల్లు గురువర్యుని కాయె
Deleteనబ్బురము! కలిగె నొక మాయా సందేహము
సుబ్బూ! యన పువ్వుబోడియా! మగ'బా(లా)డి'యా!
నిబ్బరముగ నొక యొజ్జ చెప్పరె! ఆ సిగ్గరి మొగ లక్ష్మియో! ఆడు శాస్త్రియో!?
:) jf ...
This comment has been removed by the author.
Deleteగటగటా చెంబెడు నీళ్ల త్రాగి చల్లగాను అ
Deleteకటా పతా దెల్వక లేఖ బట్టుక అల్లిబిల్లి గాను
అటూ ఇటు దిరిగితి చూపుల 'మెల్ల' తోను
ఇట తోచదాయె! పత్రము మగోనికో! మగనాలికో!?
ReplyDeleteసబ్బులేల సుమా, ముఖంబున చక్కగా పసుపున్ సదా
రుబ్బవమ్మ జిలేబి గట్టిగ రూపుమారు లతాంగికి
న్నిబ్బరమ్ముగ గానవచ్చును నిమ్మళంబగు మేనియు
న్నబ్బురమ్ము సువాసనల్గొను నమ్మవమ్మ మృణాలినీ !
జిలేబి
ReplyDeleteరాసలీలల మత్తుదేలగ రండుగోపిక లార మీ
యాసతీరన చిన్నికన్నడు యావదాస్తిగ వచ్చి తా
నూసులాడుచు దోచుచుండె వినూత్నరీతిని యోగమా
యాసఖుండిట ముక్తికాంతల యన్నివేళల గావగన్ !
జిలేబి
ReplyDeleteభక్తిమార్గపు మత్తులోనటు భామలెల్లరు తూగిరీ
ముక్తిగోరుచు ముద్దుగుమ్మలు మోసగాళ్ళను నాడిరీ
రక్తికోరుచు సాములోళ్లటు రాసలీలల దేలిరీ
యుక్తిబోవ జిలేబులందరు ఓటికుండల బోలిరీ !
జిలేబి
ReplyDeleteనేతిగిన్నెల పక్కబెట్టుచు నేపరాలును మోపకే
కోతిమూకలు చట్టువచ్చును కొట్టగానిటు కాదుటే
జాతివైరము గాదె యెల్ల బజారు మాయ జిలేబి, యీ
రీతియగ్గిని పెట్టమాకు మరింతగానిట నారదీ :)
జిలేబి
ReplyDeleteస్పాము పెట్టెను చూడవే మన సారు గారి క మింట్లనౌ
జాము రేతిరి వేయగానటు చక్కగా ప్రచురించవే !
నోము నోచిరి బ్లాగువద్దని నోటిమాటల రాయలే !
రీమురీముల వ్యాఖ్య లేళ్ళను రీతిగానటు ద్రోలురే :)
జిలేబి
ReplyDeleteనానిగారు జిలేబివారిని నమ్మ సారని బిల్వగన్
పూనికొచ్చె లతాంగి మేనికి పుట్టుకొచ్చెను సూటిగన్
బోణిజేయన మత్తకోకిల పొద్దుకాడికి నేటికిన్
మేనితూగగ రాగమాలిక మేల్మి గాననిటన్ భళా !
జిలేబి
ReplyDeleteబెంగళూరు జిలేబులూరగ భేషుగానటు డాన్సులన్
కొంగుచూపుచు కోడెనాగుగ కోరిగిచ్చుచు పాటలన్
చెంగుచెంగన చేరవచ్చుచు చేతికందక బోవుచున్
శృంగభంగము జేయమాకె విశృంఖలంబుగ కాటుచున్ :)
జిలేబి
ReplyDeleteబెండగిల్లిరి యేరులెండగ బిక్కుబిక్కని బోవుచున్
దండకోలను గట్టిగూనుచు దమ్ముబోవగ కూలికై
కుండపోతగ వర్ష మీయర కోర్కె తీర్చి యపాంపతీ
బండగైన మనస్సు విచ్చన భాగ్యరేఖల ఛత్రమై !
జిలేబి
ఆశ్చర్యం, ఉదయం నుండీ "కష్టేఫలే శర్మ" గారి దర్శనం లేదు ��.
ReplyDelete
ReplyDeleteకష్టేఫలే గురువట
న్నిష్టగ వత్తురు వుదయము నేడాశ్చర్యం!
పోష్టులు గూడన్లేవూ
గెష్టగు మనవిన్నకోట గిరగిర తిరిగెన్
జిలేబి
ReplyDeleteజీవితమ్మున ధూమపానము జేయకుండ జిలేబులై
కావితాలుపు జీవిమల్లెన కాలవాహిని బోవగన్
జోవపాటల జోరుగానుచు చొప్పదంటుల ప్రశ్నలన్
గావుగావుయ నంగ వేయుచు గాడిదప్పుదురిచ్చటన్ :)
జిలేబి
ReplyDeleteనీలివార్తల గాలిమాటల నేమనిష్ఠలు లేదుగా
వాలి బోకుము జూడగా మరి వాటినక్కడ నీవట
న్నాలులేదుర చూలులేదుర నమ్మబోకుర సోమరిన్
గోలుగోలున గోకుచుందురు గోడమాటు జిలేబు లౌ :)
జిలేబి
ReplyDeleteదీపంబునకన్యాయం
బోపను ! తప్పక జిలేబి పొద్దుట వేతు
న్నోపిక గాంచి మరియొక ట
పా పాడెద రా మనామ పదకవితలనౌ !
జిలేబి
ReplyDeleteఓయమ్మ జిలేబీ ! మీ
రా యతి గణ పద్యముల విడచుచు పలుకరో !
ఓయమ్మ !మీదు సదభి
ప్రాయము లటు మాకు తెలియ రావడి యయ్యెన్ :)
జిలేబి
ReplyDeleteకుట్రలేమియు లేదు రాజ చకోరి మాటల రాణియౌ
వట్రువందున చిక్కెతానట వాడిమీరగ బోవుచున్
తొట్రగిల్లుచు తమ్మికంటిని తోమగన్నిటు వచ్చితిన్
చట్రమొక్కటి తిప్పి జూచితి జాబిలమ్మను గాననౌ :)
జిలేబి
ReplyDeleteఝంపెతాళము వేయగానటు జాగుచున్నది తూగెనే
ముంపుజేయుచు యింటిచుట్టున ముచ్చటాడుచు పాడెనౌ
అంబలమ్ముల బుజ్జిజింకకు యమ్మనిద్రన నేర్పెనౌ
బింబమొక్కటి తానుగాంచె కభీకభీయ ఖయాలలన్ :)
జిలేబి
ReplyDeleteఅప్పుజేయుచు పెళ్ళిజేయగ యప్పణమ్ముగ టాక్సులన్
నొప్పిగల్గున వైద్యశాలకు నొక్కమాటున దస్కముల్
చెప్పగానటు మంచిమాటల చేర్చియిత్తురు కిక్కులన్
దొబ్బిరమ్మ జిలేబిమీరగ దొమ్మిజేయుచు దేశమున్ !
జిలేబి
ReplyDeleteగాలిలోనటు కాపురమ్ముల కావుకావని జేసిరీ
మేలుగాన సిటీల నాడిరి మెచ్చులాడన జీవితం
గాలిబోవగ లైఫులోనటు కావుకావని ఏడ్పులన్
జోలబట్టి విదేశమేగిరి జోరుగానగ జీవనం !
జిలేబి
ReplyDeleteనాటి యుద్ధము లోడిజూసిరి నాడిబట్టుచు యొజ్జలౌ !
నేటి కాలము జూడగానిట నేర్పుగాంచెను దేశముల్
నోటి మాటల రాయడాతడు నొక్కిజూడ నమేరికా
వేటగాళ్ళటు బోవుచుండిరి వేగమైన జిలేబులై !
జిలేబి
ReplyDeleteభవ్యమైనటి వృత్తిలోనటు బాగుజేసిరి రోగులన్
దివ్యమైనటి తేజపుంజము తీరుగానగ నేర్పుతో
నవ్యరీతిని పోరుజేసిరి నాడుచున్నటు దస్కముల్
సవ్యమార్గము గాంచమేలగు చక్కగాను జిలేబులై
జిలేబి
ReplyDeleteమూడుకందము లారువృత్తము ముద్దుగానుచు జేయవే
జీడిపప్పుల పాకమెల్లడ జివ్వు జివ్వున లాగుచున్
వేడిగాల్పుల ద్రోలుచున్నటు వేగ వేగము గానముల్
పాడవమ్మ జిలేబి పద్యము పారవశ్యము గానగన్ :)
జిలేబి
ReplyDeleteపద్యరూపము జేయగానటు పారుడయ్యె జిలేబి యై
విద్యలన్నియు నేర్చి "అన్నును" విశ్వమెల్లన గాంచగ
న్నాద్యుపాంతము జూచి చట్టని నాట్యమాడుచు పద్య నై
వేద్యమున్ సమగూర్చె యొజ్జ నివేదనన్ "అ" వ ధానియై!
జిలేబి
ReplyDeleteగండుతుమ్మెద ఫేసుబుక్కుల గాన, కోయిల ట్వీటులన్
మెండుగాంచన వేరుబోయిన మేటిలోకము గాదయా
నిండుకుండల ఓటికుండల నీటిమాటల కాలమౌ
కుండమార్పిడి యన్నయేమిటి గూడుగట్టవలెన్ టపా!
జిలేబి
ReplyDeleteభోగభూమియు యోగమార్గము బోవ మేలనె యోగియౌ !
శ్రీగురో!యని కాళ్ళు గానన చిన్నవారలు వేచిరౌ
జోగితో మజ గానరండిటు చోక్షమౌనిక మేధయౌ
సాగిపోదము రాజమార్గము సన్నిధానము గాననౌ !
జిలేబి
ReplyDeleteకారుతాళము దారి తప్పగ కర్ణమందు పిశాచి తా
జోరుగానటు కుండలిన్ గని జోకులేయుచు చెప్పెనౌ !
హోరశాస్త్రము జూడగా పులిహోరజేయన నేర్తురౌ
ఔర! పోరి! సెబాసు గుండుగు రౌర! జొప్పె జిలేబులన్ :)
జిలేబి
ReplyDeleteవాలెగాలిన చెట్టు, బోయెను వారిమామిడి యింటనౌ !
రాలుగాయిని జూడ పారుడు రాజ్ఞిగారిని పృచ్చగన్
గోలుమాలుగ భారతమ్మును కోవతీయన గాథనౌ
రాలుగాయిగ ధార్తరాష్ట్రుని రాటుదేలుల గాంచెనౌ !
జిలేబి
ReplyDeleteబుగ్గకార్లకు మంగళమ్ములు బోరుబోరున యేడుపుల్
తగ్గునోమరి ట్రాఫికెల్లెడ తప్పిదమ్ములు బోవగన్
సిగ్గులాడుచు పక్కదారుల సీనియర్లటు బోదురో
పగ్గమేయిది రాష్ట్రనేతల పాటిగానగ జోతలై !
జిలేబి
ReplyDeleteమీటపాలటు ఫేసుబుక్కున మిక్కుటంబుగ గోలుమాల్
కేటుగాళ్లటు కొల్లగొట్టిరి కెవ్వుకేకల జేయుచున్
పోటుసుందరి శ్వేతపూజల బొట్టుకాటుక పెట్టెనౌ
చాటుమాటుగ చేవబోవగ జాణ కాపియు జేసెనౌ !
జిలేబి
ReplyDeleteసౌరసెల్లుల గూర్చిరచ్చట సాండువిచ్చుగ జామును
న్నౌర ! మేధన గుజ్జుగాన దనాదనాయెను నైపుణీ !
సారమున్నటి కుర్రకుంకలు "సౌర" భమ్ముల జేర్చిరౌ
భారతీయుల బుర్రయేనయ బామురవ్వతు బుర్రయౌ !
జిలేబి
ReplyDeleteరేసిజమ్మును చూసెనౌ భళి రేంజుదాటిన దేశమున్
వాసిలేనిటి గొప్పమాటలు వట్టిపోయిన స్వాములౌ
గోసిపాతల లాండు కోసము గోడగట్టిన చేష్టలౌ
బేసులేనటి సాములోర్లయ బేయసర్ యన మాతలౌ!
జిలేబి
ReplyDeleteఊయలాటల కొన్నిపొత్తము లూగగానటు మత్తులో
సాయమాహ్నపు వేళలోన సుసారముల్నట దేలుచున్
స్వీయగాధల లోలలాడగ వేసవిన్నటు ద్రోలుచున్
సోయగమ్ముల మాచనార్యుని శోభలన్నియు గానవే !
జిలేబి
ReplyDeleteమెత్తవారిని చూడగానటు మేలు మేలున దెబ్బలన్
మొత్తబుద్ధియగున్ జిలేబియ మోకరిల్లన జేయనౌ !
కత్తలానిని తొక్కజూడగ కైపుగాంచుదురెల్లరున్
చిత్తజల్లుగ లోకపోకడ చింకలీకము వోలెనౌ !
జిలేబి
ReplyDeleteమేటిబాహుబలీయమైనటి మేటరున్నటి పద్ధతిన్
తాటిచెట్టును గట్టిలాగగ తాడు ద్రెంచెను రాకెటౌ
సూటిగానటు రావడిన్ భళి సూత్రమై సడి జేయుచున్
కోటగట్టిరి గాధలన్నట కోట్ల దస్కము లాభమౌ :)
జిలేబి
ReplyDeleteతాతయైనను జేమ్సుబాండును తావుచెప్పెదనానిమ
స్సౌత గానను యన్యగామిగ సాముజేసిన గూడనౌ
పాతకాలపు తెక్నికుల్గల పట్టుగాంచిన పారుడన్
కూతకొచ్చినకోడివోలెను కొత్తవాడిని సుమ్మనౌ :)
జిలేబి
ReplyDeleteనోటుబుక్కున గీతగీసెను నోడ వచ్చిరి యెల్లరున్
నీటుగానటు నీలియార్ముడు నీరజారిని జేరగన్
తాటికల్లును త్రావినాడు సుతారమైయటు బోవనౌ !
మాటువేసి జిలేబివచ్చెను మత్త కోకిల గానమై !
జిలేబి
ReplyDeleteఓటికుండయనంచు బాధన నోకలించగ నేలనౌ
మాటరాదని మందబుద్ధియ మాయకుండన నేలనౌ
రాటనమ్మున వృత్తమైనటి రాలుగాయివి కాదుగా
వేటగాడివి గాదు చూడగ వేషగాడివి గాదుగా !
జిలేబి
ReplyDeleteచాలా రోజుల తరువాయి మత్తకోకిల కి గిట్టుబాటు ధర పలికింది :)
అగ్గిపుల్లను గీసినామరి యేమికాదు జిలేబి, హా !
బొగ్గులాడదు నా కడాన సుబోధినీ మరి తెల్సుకో !
ముగ్గుపెట్టినపిండి గాదు సమున్నతమ్మగు బుద్దుడన్ !
జగ్గుజగ్గున రాసెదన్నిక జావళీకథ లెల్లనౌ :)
ReplyDeleteఆరుకోతులు పోరుజేసెను యావురావురటంచునౌ!
మేరుపర్వత విజ్ఞులచ్చట మేలుమేలనగూడిరీ !
హోరుహోరన స్వేచ్ఛగానట సోయగమ్ముల తూలిరీ
ఔర! చేరె జిలేబులూరగ అయ్యవారలు గూడనౌ :)
జిలేబి
ReplyDeleteకూనలమ్మను బోల్చెరచ్చట కోటరాయలు ఔనటే !
మానసమ్మున తూగులాడుచు మాటకారులు ఔనటే!
పానకమ్మున తేలియాడెను పారుడచ్చట ఔనటే!
మీనమేషములెక్కబెట్టుచు మింటిసుందరి వచ్చెనే:)
జిలేబి
ReplyDeleteరంగురంగుల లోకమందున రాజ్ఞులిచ్చట గాలివా
టంగ కొండల రాయు చెంతన టంకరించుచు భాసిలన్
చెంగుచెంగున చేవగూర్చుచు చెట్టుపుట్టలు శోభిలన్
రింగురింగుల భావనమ్ములు లివ్వులివ్వున వీచెనే !
ఇంతకీ త్వామనురజామి అంటే ఏమిటి ?
జిలేబి
ReplyDeleteచాన్నాళ్ళ తరువాయి మత్తకోకిల
జాగుచేయక ఆంజనేయుడు జానకిన్గనె గాదుటే !
మాకులెల్లను బీకెనచ్చట మారుతయ్యగ గాదటే !
బీకుబీకని రాక్షసుల్ మరి బిర్రుబిర్రని కూలిరే !
తోకరాయుని భక్తిగానుమ తోకచిచ్చుల బేర్చెనే !
జిలేబి
ReplyDeleteపాదయాత్రలు ఓట్లనివ్వవు పారబోయకు డబ్బులన్
పేదవాళ్ళకు పంచిపెట్టుము భేషుగా జనులెల్లరున్
మీదయన్ బతి కామటంచన మించునయ్యరొ కీర్తియున్
సోదిజెప్పెను బాగుగానటు సోకులమ్మియు గానుమా :)
జిలేబి
ReplyDeleteపత్తి చేలల చూసినాడను భారమయ్యెను గుండెయున్
మొత్తుచుండెను రైతులెల్లను మోసమైన ప్రభుత్వమౌ
సత్తెకాలపు రాజశేఖరు సాక్షి పల్కితి, మిమ్ములన్
క్రొత్తతీరుల కాచెదన్ సరి ఓటులన్మరి వేయుడౌ !
జిలేబి
ReplyDeleteపాదయాత్రల చేయుచుంటిని పల్సుగాంచి జిలేబులన్
వీధులెల్లన పంచిబెట్టుచు వేగిరమ్ముగ నేనిటన్
పేదవాళ్ళకు నాన్నగారటు పెన్నిధుల్ సమ గూర్చిరే !
మీదయన్ ప్రభుతన్ చలాకియు మీరగానటు చేసెదన్ !
జిలేబి
ReplyDeleteపాకశాస్త్రము తేల్చిచెప్పిరి పావనమ్ముగ యమ్మియే
కోకయన్నను చైలమన్నను కొంచమైనను వూహలే !
రాకరాకను వచ్చినారిట రాణివారలు గాదటే
మేకతోకకు మేకతోకయు మేకతోకయు గాదుటే :)
జిలేబి
ReplyDeleteరాసి పెంచిరి వాసి లేదయె రావుగారటు చూడుడీ !
మూసగా పద మెల్ల గుచ్చగ ముగ్ధ పద్యమనేరుగా!
గోసు గోసుల ప్రాస లెల్లను గోల గోలగ వేసిరే!
కాసువీసపు వార లెల్లరు కంద పద్యము గట్టిరే !
జిలేబి
ReplyDeleteచేతికందుచు చిక్కినట్లచు చేరువయ్యెను చంద్రుడే!
రాతిరయ్యెను రత్నమాలిక రాగమాలిక సాగెనే
చేతనత్వము చక్కగానటు చేవగూర్చుచు వెల్గెనే
బాతళించు జిలేబియమ్మయు భావగీతము వ్రాసెనే :)
జిలేబి
ReplyDeleteపట్టినారట పట్టణమ్మున పారణమ్ముల మాలికన్
పెట్టినారిట సంకురాతిరి పేర్మిగానయ వైవియార్ !
చుట్టినారిట రాజువారలు సోయగమ్ముల పద్యమున్!
పట్టుమామి జిలేబి వారు జపమ్ము జేసిరి కోకిలన్ :)
జిలేబి
ReplyDeleteపాటినోటన తెల్గునీల్గెను పారుడచ్చట చెప్పెనే !
మాటకైనను తెల్గుబల్కక ఆంధ్రులిచ్చట జోగగన్
కోటగట్టెను పద్యమాలల గోకిచూడగ పూజ్యమే
పాటగా అరవంపు మామియు పద్యమొక్కటి జేర్చెనే :)
జిలేబి
ReplyDeleteదారితప్పగ నాగరీకులు దారివెంబడి బోవుచు
న్నారసింహులు వ్యాఖ్య జేయగ నారదాయ జిలేబియున్
వారబోవక పద్యమొక్కటి వార్చెగాదయ మేలుగన్
జోరుగానటు చెండు లన్ కయిజోదుగన్ సరి గూర్చుచున్!
జిలేబి
ReplyDeleteపెళ్ళిచేయగ జూచిరచ్చట పిల్లలెల్లను శంకతో
పెళ్ళికాకయు పిచ్చిబట్టగ పీకలోతుల కష్టముల్
మళ్లుమాన్యము లన్నిబోవును మాకుకోడలు గావలెన్
ఒళ్ళుచేగగ పిల్లగాడికి రోకలొక్కటె దక్కు బో !
జిలేబి
ReplyDeleteజ్ఞాపకమ్ములు ధూళిలా సయి సన్నసన్నగ రాలెనే
వ్యాపకమ్ములు జీవితమ్మున వాంఛితమ్ముగ బోయెనే
తాపమిచ్చెడి తారతమ్యత తాటలన్ మరి గూల్చెనే
శాపమివ్వకు సామిరంగడ సాధనల్ మరి జేసెదన్
జిలేబి
ReplyDeleteకుర్రడాక్టరు చేర్చెనచ్చట కూటిదిక్కుకు శాంతమున్
వెర్రులెత్తిరి పెద్దడాక్టరు బేరమెల్లను బోవగన్!
అర్రువంచిరి ఊరివారలు అయ్యవారికి జై యనన్
బర్రెగొడ్డుగ మారిరచ్చట బారుతీరుచు ముందరన్ !
జిలేబి
ReplyDeleteమాయజాలపు మార్కెటింగులు మస్తుగన్ మరి జేయుచున్
కాయకష్టము లేకయున్ మజ కాసులన్ తెగ జేర్చిరే
సాయమిచ్చిరి సాబులందరు జాలమయ్యెను వైద్యమే
ఆయువుల్ మరి బోవుచుండె గదా సి! వైద్యుల ధర్మమై
జిలేబి
ReplyDeleteనీలిసంద్రము పొంగిపిల్చెను నీటుగానటు చూడగన్
చాలచక్కగ కౌగలిన్ మరి చందమామయు వచ్చెనే
గోలగోలగ గాలి గూడను గోముగానటు గోకెనే
జోలపాడెను మామదిన్ సయి జోరుగానటు తూగుచున్
జిలేబి
ReplyDeleteదిష్టిగుమ్మడి కాయగట్టితి దీటుగానిట చూడుడీ
తిష్టవేయుననానిమస్సుల తిక్కదిప్పను వేగమై
ముష్టిఘాతపు పద్యపీడన మొండికొర్రల ద్రోలగన్
పుష్టిచేరన జీవితమ్మున పుంఖితమ్మగు కైపులన్ :)
జిలేబి
ReplyDeleteపాకనేయగ చక్కగాంచిరి పారుడున్నట గాదుటే
మా కనుల్ సయి జూడగానటు మత్తకోకిల పారెనే
కోకటించుచు పద్యమొక్కటి గూర్చుమమ్మ జిలేబియా
కాకవెల్గుని చిత్రమయ్యది గానరావగ మాన్యులున్ !
జిలేబి
ReplyDeleteఏరుపారుచు సుందరమ్ముగ నేతమెత్తెను పల్లెయు
న్నూరుపైసల నాణ్యమైన వినూత్నపంటల రీతులన్
మారుబల్కక దేవళమ్మున మద్దతిచ్చెడు సేవలన్
సారగంధపు ఛాయలన్ మనసారబిల్చు సపర్యలన్!
జిలేబి
ReplyDeleteపక్క మీదట దొర్లుచుండగ పాటపాడుచు భామయున్
మిక్కుటమ్ముగ పేర్మిగాన సమీరమైన సుమమ్ములన్
చక్కగా మది తూగుచుండగ చాటుమాటుగ జూడ నా
యక్కరో, యిటు రాగదే యని యాలిఁ బిల్చెను భర్తయే
జిలేబి
ReplyDeleteగదిలో పెనిమిటి గానరాలె !
చక్కనమ్మలు ద్రోయుచుండిరి చాటువుల్ మజ బల్కిరే!
యక్కరో! యిటురాగదేయని యాలి బిల్చెను, భర్తయే
పక్కనన్ గది లోనగానక; భారమయ్యె మనస్సటన్
బిక్కచచ్చెను సిగ్గుతో సయి భీతిగానటు జూచుచున్!
జిలేబి
ReplyDeleteమాయ చేసిరి నిందవేసిరి మామపై మరులొల్కుచున్
ఛాయయై వెనుకాడుచుండిరి ఛాయగా మురిపించిరే
గాయమయ్యెను మత్తుగానటు గాయినీ మధుశాలినీ
సాయమీయగ రావె మాలిని శాయశక్తుల పద్మవై :)
జిలేబి
ReplyDeleteఎంతగట్టిగ చేయనోయిక యెవ్వరిన్ మరి జాలరా !
కొంతగైనను చెప్పవమ్మ పకోడి టీల వయాళులన్
సంతసమ్మును గాంచి టిక్కెటు సాయమైనను చేతురే
బంతిపువ్వుల యింతిగా సయి పార్లమెంటుకు బోయెదన్ :)
జిలేబి
ReplyDeleteనిశ్చితార్థము జేయకోరిరి నీటు కాసులు బారెనే
పశ్చిమార్థపు మాఱకమ్ములు ఫాషనాయెను జూడగా
వృశ్చికమ్ముల రీతిగానటు వృద్ధిపేరిట చీకిరే
నిశ్చయమ్ముగ ద్రోలవేయగ నిర్ణయమ్ముల జేయరే!
జిలేబి
ReplyDeleteఏమయ్యా మోడీ ఏ తుగ్లకు ఫౌండేషన్ అన్నపేరుకో బబ్లూఖాన్ ఫౌండేషన్ కో యిచ్చి వుంటే పెజ కాంగిరేసు ఇంత కస్సు బుస్సనేదా ? ప్చ్ !
ఎర్రకోటను తీర్చిదిద్దన నెందుకిచ్చిరి డాల్మియా
కర్ర నైదన కోట్లకున్ భళి కాంగిరేసులు బుస్సనే
నర్ర భారతు అన్నపేరుకు నప్పజెప్పుదురే! యహో
బుర్రలేదు గవర్నమెంటుకు భూరిగానటు కేకలే :)
జిలేబి
ReplyDeleteఇచ్చి చూడుము బుంగమూతిని నిచ్చకత్తె జిలేబియా
గుచ్చిగుచ్చుచు చూడమాకుము గోలలేలనె జాబిలీ
మెచ్చు కొంటిని నీదుబుగ్గల మెత్తమెత్తగ నుండెనే
రచ్చజేతము రావెభామిని రాసలీలల దేలుచున్ :)
జిలేబి
ReplyDeleteకోతి చేతికి చిక్కె నయ్యరొ కొత్తగానొక జఘ్నియే
రౌతు గుర్రము నెక్కగానటు రయ్యరయ్యని బోవునే
వ్రాత గాడి కదేదియైనను వాటమై మరి వచ్చునే
నేతనేయుచు చక్కగానటు నెమ్మిజేర్చుచు వ్రాయగన్
జిలేబి
ReplyDeleteపాతఫేనుకు కొత్త ఆయిలు పారులే భళి వేయగా
మేతగాంచి జిలేబి మామియు మెచ్చుకోలుల జేర్చగా
జోతజేర్చుచు విన్నకోటయు జోరుగానటు వచ్చి మీ
పాతపాటకు యర్థమేమది బారుబారది యేలనో
మాత! మాకు రవంత తెల్పు సుమా యటంచును కోరిరే
జిలేబి
కోరాం మరి. కానీ మీ దగ్గర నుండి వివరణ రావట్లేదే? 😡
Delete