Wednesday, September 6, 2017

ఒక అద్భుతమైన ఆలోచన !


 
ఒక అద్భుతమైన ఆలోచన !
 
ఒక
అద్భుతమైన
ఆలోచన
వచన కవిత లో
వయ్యారాలు పోతా వుంటే ,
ఛందం లో చచ్చి సగమై
బిక్క మొగమేసి
నిలబడుతోంది !
 
 
శుభోదయం
జిలేబి

10 comments:



  1. ఉన్నది చెబితే బామ్మ కే యెసరు బెట్టెను గదా ,మనవ(వా)డు :)

    ఓ లక్కు పేట రౌడీ!
    యేలన్నీ బామ్మ మీద యీ చుర చురల
    య్యా! లుక్కే కానని పా
    తాళమ్మున తొక్కివేయ తగునా మీకున్ !

    జిలేబి

    ReplyDelete
  2. న-మస్కా-రం: https://pannaari.blogspot.com/2017/09/blog-post_63.html

    ReplyDelete


  3. అబ్బీ జిలేబి పన్నా
    రబ్బీ ! రుబ్బితివిగాద రవమై నీవున్ !
    అబ్బోడా! సెగ పెరుగన్
    సుబ్బాయమ్మక్షతలివి సొగసుగ పన్నన్ !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలెబీ గారూ! నాకు ఇంగ్లీసు రాదు. కొంచెం తెలుగులో చెప్పండి

      Delete

    2. మీ పోకడ చూస్తా వుంటే హరిబాబు గారి తెలుగు తప్ప మీకేదీ అర్థమవకుండా పోయేటట్లున్నదిస్మీ :)


      జిలేబి


      Delete
    3. అవును!ఆయనకి బ్లూవేల్ కన్న నా బ్లాగే మత్తెక్కిస్తా వుందిస్మీ:-)

      Delete

  4. మాలిక వారికి,

    నా బ్లాగు అధః పాతాళము లోనికి తొక్కి వేయ బడి స్టికీ గా అయిపోయినది మాలిక "అగ్గి గేటు" లోన .


    దయచేసి చూసి సరిచేయగలరు


    ఇట్లు
    కన్నీళ్ల పర్యంతము గా
    జిలేబి బామ్మ



    ఇట్లు

    జిలేబి

    ReplyDelete
  5. http://ekalingam.blogspot.com/2016/07/2.html

    ReplyDelete

  6. అయ్యా ఏకలింగము గారు

    ఈ మధ్య తరచు గా ఒక బ్లాగు అట్లా టాప్ గా కనబడతూంటే ఓహో ఏకలింగము నిదురోయెను కామోసనుకొని తలుపు కొట్టితిని అరరె ఈ విషయము ఏకలింగము వారు గమనించుట లేదుగదా అనుకొనుచు

    అది మొత్తము గానే నన్నే కొట్టునని నేను వూహించ జాలక పోతిని !

    నాయనా ! తరుణోపాయము చూడుడు

    ఇట్లు
    జిలేబామ్మ

    ReplyDelete

  7. ధన్యవాదాలండీ శ్రీనివాస్ గారు

    లక్కుపేట రౌడీ సెలవా ?

    జిలేబి

    ReplyDelete