బ్లాగు సన్యాసం కథ భాగం రెండు ఇక్కడ
బ్లాగు సన్యాసం - ఆఖరి భాగం !
ఆ కోమలాంగి ట్వీటరీ దేవి స్వామి వారి సన్నిధి కి వెళ్ళే దారిలో మరో ఇద్దరు ముగ్గురు 'స్వామీ' సోదరీ సోదరులను పరిచయం చేసింది జిలేబి కి ...
వీరు పరివ్రాజ జీమైలానందా వారు- మన ఆశ్రమ ఉత్తర ప్రత్యుత్తరా లన్నీ వీరే చూస్తూ ఉంటారు
ఈవిడ అక్షరాముద్రితమాయి, మన ఆశ్రమ కంటెంట్ మేనేజ్ మెంట్ స్పెషలిస్ట్
ఈ 'యంగ్' అశ్రమ వాసిని ఇవ్వాళే స్వామీ వారు ఈవిడకి దీక్ష ఇచ్చేరు "సమ సంఘ గాలాక్షీ పంచముఖీదేవి మాయి !"
అబ్బా స్వామీ ముఖ పుస్తకానందా వారికి ఎంత 'జ్ఞాన మో '! ఆ ట్వీ ట రీ దేవి నిజ్జంగా బుగ్గన వేలు పెట్టు కోవడం ఒక్కటే తక్కువ మరి !
జిలేబి అదిరి పడింది. తాను పొరబాటున మళ్ళీ అంతర్జాలం లో కి వచ్చేసిందా ? అన్నీ మరీ తెలిసిన పేర్ల లాగే ఉన్నాయే మరి ?
ఆ ఈ హిమాలయాల్లో అస్సలు సెల్ ఫోన్ పని చేయని ప్రాంతాల్లో అంతర్జాలం ఎట్లా ఉంటుంది ? తనది భ్రమ ! అంతా విష్ణు మాయ ఈ పేర్లన్నీ తనకు తెలిసినవి లా ఉండడం కూడా మాయే !
తను ఈ మాయాజాలం నించి బయట పడ డానికే గదా హిమాలయానికి ఈ ఆశ్రమానికి వచ్చింది !?
మాడరన్ డెన్ ధ్యాన గుహ లో స్వామీ ముఖ పుస్తకానందా వారు తన 'wall' మీద కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని చిరునవ్వులు చిందిస్తూ చిద్వాలసంగా కూర్చుని ఉన్నారు
'ఆహా స్వామి వారి ముఖం ఎంత 'తేట తెల్ల' గా ఉన్నది జిలేబి అబ్బుర పడింది . కొద్దిగా మరింత గమనికగా గమనిస్తే ఫేషియల్ చేసుకుని ఉన్నారేమో అని పించింది
మరీ మేకప్ వేసుకుని ఏమైనా ఉన్నారా ? అబ్బే అంతా విష్ణు మాయ ! అసలు తన బుర్ర సరి లేదు జిలేబి తన్ను తానె నిందించు కుంది చ చ కైలాసం వచ్చిన తన జిలేబి బుద్ధులు పోలే మరి అనుకుంటూ !
స్వామీ ము.పు ఆనందా వారు చిరు నవ్వు నవ్వేరు ! - జిలేబీ మీరు ఇక్కడి వస్తారని నాకు తెలుసు ! చెప్పెరాయన .
వామ్మో ! ఈ స్వామీ మరీ త్రికాలవేది లా ఉన్నాడే ! తన పేరు కూడా ఈయనికి తెలుసు !
'మీరు ఇక్కడి కి రావడం అంతా 'పరదేవత' ఇచ్చ !' స్వామీ వారు చెప్పేరు ' నిన్నే మా కేంపస్ నించి ఒక ఎనభై ఏళ్ల అమెరికన్ భక్తుడు - బ్లాగా నందా అమెరికా వెళ్లి పోయేడు తనకు 'ఫాదర్ లేండ్' చూడా లని ఉందని '
అప్పుడే అమ్మ చెప్పింది --> నో ప్రాబ్లెం ముఖ్ పుస్తక్ బేటా - ఒక old lady జిలేబి రేపే నీ చెంతకు వచ్చును ' అని !
జిలేబి ఈ త్రికాల వేదాన్ని విని సంతోష పడ్డది గాని --> తన్ని old lady అనడం నచ్చలే !
ప్చ్ ప్చ్ ఇట్లా ఓల్డ్ అయిపోతూ ఉంటే ఎట్లా !
స్వామీ వారు ట్వీ ట రీ దేవిని దగ్గరకి పిలిచి చెప్పేడు - 'ఈ జిలేబి వారికి మన ఆశ్రమాన్ని చూపించి ఆ పై ఆ బ్లాగు రూములో సెటిల్ అయి పొమ్మని చెప్పు --> నిన్నటి నించి అస్సలు మన ఆశ్రమ బ్లాగు అప్డేట్ లేకుండా పోయింది --> ఇది మరీ అర్జెంట్ ' అన్నాడు .
ఆ దేవి తిరిగి వస్తూం టే మళ్ళీ పిలిచి ఏదో గుస గుసలాడేడు -- అవి గుస గుసలా లేక ముద్దు ముచ్చట్లా అని జిలేబి కి సందేహం వచ్చినా ఛీ ఛీ ఇవన్నీ విష్ణు మాయ అంశాలే అనుకుంది .
జిలేబి కి వయసు ఎక్కువైనా ఇంకా చెవులు పాము చెవులే --> స్వామీ వారి చుంబన మాటలు విన బడ్దేయి -->
'ట్వీటర్ దేవి--> ఈవిణ్ణి ఆ బ్లాగు రూమ్ నించి బయటకు రానీ కుండా చూసుకో ! మన ఆశ్రమం 'వృద్ధాశ్రమం ' అని పేరు వచ్చే బోతుంది I dont want that to happen --> we are youngish you know!" అన్నాడు !
జిలేబి అదిరి పడింది --> స్వామీ వారితో ఏదో చెప్ప బోయింది --> స్వామీ వారు చేయి గుమ్మం వైపు చూపిస్తూ --> యు ఆర్ డిశ్ మిస్డ్ అన్నాడు --> తన అపెల్ 'లేపతాపమును ' ఓపెన్ చేస్తూ !
హా హత విధీ అని జిలేబి మూర్చ పోయి ' Oh My God' ఇక్కడ కూడా అమ్తర్జాలమే నా !' అని ఎలుగెత్తి పైనున్న భగవంతుణ్ణి పిలిచింది
పై నించి ఆకాశ వాణి సమాధానం వచ్చింది -
" God 'is' no more willing to answer distress calls - you can send your issues by mail only send to God@gmail .com - When He has time he will reply, now shut your mouth and go back to open your mail Aashram updates blog"
*********
జిలేబి మంచం పై నించి దబ్బున నేల మీద పడింది !
జిలేబి జిలేబి ఏమయ్యింది ! అయ్యరు గారు జిలేబి ని తట్టి లేపేరు ! 'ఏమన్నా పీడ కల కన్నావా జిలేబి ?' అయ్యరు పృచ్చ !
చీర్స్
జిలేబి
(సరదా సరదా గా ... ఈ మధ్య కష్టే ఫలే వారు బ్లాగు వదిలి సన్యాసం పుచ్సుకుంటా - సెల్ నెట్ లేని ప్రదేశాలకి వెళ్లి పోతా నన్నారు ! ఆలోచిస్తే ఈ మధ్య ఏ స్వాములోరైనా ఈ ఆశ్రమ మైనా అస్సలు 'నెటిజెన్' కాకుండా ఉన్నదా అన్న సందేహం వచ్చింది -- ఆలోచిస్తా ఉంటే ఈ కల వచ్చింది -
ఈ టపా బ్లాగు సన్యాసం పుచ్చుకోవాలని అనుకున్న మన శర్మగారికి మరి పుచ్చు కోవాలని అనుకుంటున్న మరెవైరనా 'బ్లాగోదరీ' బ్లాగోదరులకు ' అంకితం !!)