Wednesday, September 18, 2013

విముక్త ధర్మాః చపలాః స్త్రీయాః !

"వైదేహీ, జనకాత్మజే, స్త్రీలు స్వభావ రీత్యా విముక్త ధర్మ రీత్యా చపలులు, భేదాన్ని కలిగించే వాళ్ళు - ఇట్లాంటి పరుష వాక్యాలు నీ వద్ద నించి నేను వినలేను "

చెప్పింది లక్ష్మణుడు - ఉద్దేశించింది సీతమ్మ తల్లిని .

అరణ్య కాండ లో జింక రూపం లో ఉన్న మారీచుడు 'హా సీతా' అంటే , అది తన భర్త రాములవారిదే ననుకుని, లక్ష్మణుని రాములవారిని కాపాడ డానికి వెళ్ళమంటే, లక్ష్మణుండు ససేమిరా కుదరదం టాడు - ఆ ఆర్త నాదం రామునిది కాదు - ఆ మాయావి రాక్షసులది - నిన్ను కాపాడ మని రాములవారి ఆజ్ఞ - ఇక్కడి నించి కదలను గాక కదలను అంటే-

అమ్మవారు "సంరక్త లోచను" రాలై లక్ష్మణుని పరుష వాక్యాలతో అంటుంది -

'లక్ష్మణా, నువ్వు నన్ను పొంద డానికే రాముని వెంట గోముఖ వ్యాఘ్రం వలె పొంచి పొంచి వచ్చావు ఈ కాననానికి" అని .

అంతటి తో ఊరుకున్నదా  ?

"ఇది నువ్వూ , భరతుడు కలిసి ఆడుతున్న నాటకం కూడా అయివుండ వచ్చు. భరతుడు అర్ధం (రాజ్యం) , నువ్వు మరొక అర్ధమైన నన్ను నా పతి నించి వేరు జేయాలని అనుకున్నారు' అంటుంది పరుషం గా  .

"నా పై కోరికతో నువ్వు  రాముడు ఎట్లా పోయినా ఏమైనా కానీ అని ఆతన్ని కాపాడ డానికి  వెళ్ళ నంటు న్నావు "

लोभात् तु मत् कृतम् नूनम् न अनुगच्छसि राघवम् |
व्यसनम् ते प्रियम् मन्ये स्नेहो भ्रातरि न अस्ति ते || ३-४५-७

ఇట్లా పరుష మాటలు మాట్లాడి (వాల్మీకి అంటాడు 'సంరక్త లోచనా ! అని ) అన్న మరో క్షణం లో నే కళ్ళ నీళ్ళు జల జలా రాలి పోతున్నాయి - భీత హరిణి ! - బాష్ప శోక సమన్విత !

మరో క్షణం లో లక్ష్మణుని - अनार्य करुणारंभ नृशंस कुल पांसन అంటూ మరో మారు జాడించడం మొద లెడు తుంది !

ఈ అరణ్య కాండ లో ఈ ఒక్క సర్గ లో నే వాల్మీకి  స్త్రీ ఒక వివశ స్థితి లో ఎట్లా ఎట్లా మాట్లాడ గలదు - ఏమేమి అనుకో గలదు - ఏవిధ మైనట్టి 'reaction' చూపించ గలదు అన్నదాన్ని  ప్రముఖం గా చూపించడం జరుగుతుంది.

యథొ కర్మః తథొ ఫలః  అన్నదానికి ఈ సంఘటన ఒక నిదర్శనం అవుతుందేమో మరి.

ఇట్లాంటి పరుష వాక్యాలని సీతమ్మ లక్ష్మణుడి తో అనటం - అదిన్నూ తన భర్త తమ్ముడు, పుత్ర సమానుడు ఐన వాడి తో అనటం - దీని పరిణామం - యుద్ధ కాండ లో - రాముల వారితో అట్లాంటి పరుష వాక్యాలు పలికించ డానికి కారణ భూతమయ్యిందేమో మరి కూడా అనిపిస్తుంది .

మళ్ళీ అంటుంది సీతమ్మ లక్ష్మణుడి తో -- గోదాట్లో దూకైనా , అగ్నిలో దూకైనా చస్తా గాని, రాముల వారు లేని జీవితాన్ని నేను చూడ లేను - మరొక్కరి తో ఉండ లేను అని - गोदावरीम् प्रवेक्ष्यामि हीना रामेण लक्ष्मण ! అంటుంది

(రామాయణం లో ఈ అరణ్య కాండ తనకు అన్నిటి కన్నా నచ్చిన కాండ అని చెప్పు కున్నారు - శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రు ల వారు - ఎందుకంటే - ఇందులో గోదావరి మాట ఉన్నదంట ! కాండం పర్యంతం ఆంధ్ర దేశం ఉన్నదంట !-  అందుకనేమో 'గోదాట్లో దూకి చస్తా ' అన్న పదం ఆంధ్ర దేశం లో ప్రాశస్త్య మైన పదమయి పోయింది మన  'ఆండోళ్ళ కి ' , సీతమ్మ వారి స్టైల్ లో !- అబ్బా, ఈ గోదావరి తీరం వాళ్ళు రామాయణం లో కూడా గోదారి తెడ్డు వెయ్యకుండా ఉండరు సుమీ !!!))

प्रवेक्ष्यामि हुताशनम् |! - అగ్గి లో బుగ్గై పోతా నంటుంది మళ్ళీ .

దీని పర్యవసానం - యుద్ధ కాండ లో అగ్ని ప్రవేశ ఘట్టం !

మరి ఈ అగ్ని ప్రవేశానికి కారణం సీతమ్మ తన గురించి చెప్పిన శోకా తప్త మాటలే తధాస్తు దేవతలయ్యే యా ?

పరుష వాక్యాలను విన్న లక్ష్మణుడు తన రెండు చెవుల మద్య కాల్చిన బాణం  తో పొడిచినట్టు ఉన్నది అని మళ్ళీ ఇట్లా అంటాడు - "ఇట్లాంటి ధిక్కారా లతో నిన్ను నువ్వే శపించు కుంటున్నావు వైదేహీ అని" - धिक् त्वाम् अद्य प्रणश्यन्तीम् !

(పానకం లో పుడక !
నిన్నటి గజేంద్ర హస్తాభిహతేవ వల్లరి కి లేటెస్ట్ ఉదాహరణం - నీనా దావులూరి - అమ్మాయి మిస్ అమెరికా అయితే - సోషియల్ మీడియా మొత్తం రేసిస్ట్ కామెంట్ల తో - సూటి పోటి మాటల తో - మిస్ ఇండియా కూడా ఈవిడ కి అయ్యే సత్తా లేదు - మరి మిస్ అమెరికానా లాంటి కామెంట్ల తో ! భరితం - ఇది కాదా  మరి గజేంద్ర హస్తాభి హతేవ వల్లరి?)

న తు అహం రాఘవాత్ అన్యం కదాపి (పదాపి!) పురుషం స్ప్రుశే !

न तु अहम् राघवात् अन्यम् कदाअपि (पदापि !) पुरुषम् स्पृशे!?

శుభోదయం
జిలేబి
(ఏమోయ్ జిలేబి, రామాయణం మీద పడ్డావు?- వెనక నించి అయ్యరు గారి పృచ్చ!)

9 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. రామాయణ భారతాల్లో వెతుకుతూ పోతే చాలా కనపడతాయి, ఇప్పటి కాల్హ ధర్మంతో అప్పటివాటి మంచి చెడ్డలెంచడం సబబు కాదు. ఈ పని చాలా కాలంనుంచీ జరుగుతోంది. నిషేధించేవారు లేరు కదా!

    ReplyDelete

  4. సీతాదేవికి కాపలాగా ఉండమని లక్ష్మణుడికి చెప్పి వెళ్ళాడు రాముడు.

    జింక రూపం లో ఉన్న మారీచుడు 'హా సీతా' అంటే , అది తన భర్త రాములవారిదే ననుకుని, సీతాదేవి రామునికి సహాయం చేయటం కోసం లక్ష్మణుడిని వెళ్ళమంటుంది.

    అయితే సీతకు కాపలాగా ఉండమని చెప్పి వెళ్ళిన రాముని మాటను కాదని లక్ష్మణుడు వెళ్ళలేడు. లక్ష్మణుడు వెళ్ళకపోతే సీతాపహరణం కష్టం. ఇవన్నీ ఆలోచించి సీతాదేవి నోటివెంట అటువంటి పరుషమైన వాక్యాలను దేవతలే పలికించారేమో ?

    అయితే సీతమ్మ నోటివెంట అటువంటి పరుషవాక్యాలను పలికించటం కూడా ఇష్టం లేక అప్పుడు చాయాసీత నోటివెంట దేవతలు ఆ పరుషవాక్యాలు పలికించి ఉండవచ్చని కూడా మనము అనుకోవచ్చు.

    సీతాదేవి అలా పరుషంగా పలకటం జరగక పోతే రాముని మాటను ప్రక్కనపెట్టి లక్ష్మణుడు బయలుదేరేవాడు కాదు.

    ఇవన్నీ ఇలా జరగటానికి పూర్వాపరాలు చాలా ఉన్నాయి. అన్నింటినీ కలిపి గమనించినప్పుడు ఎన్నో విషయాలు తెలుస్తాయి.

    ReplyDelete
  5. రామాయణాన్ని కేవలం దైవిక గ్రంధంగా అనుకుంటే ఇక అందులో ప్రశ్నించుకోడానికేమీ లేదు. "ప్రభు కీ లీలా ప్రభు హీ జానే" అని సరిపెట్టేసుకోవచ్చు. అలా కాక ఒక మామూలు గ్రంథం లా చదివినా చాలా సంఘటనలు మన నిత్యజీవితానికి దగ్గరగా ఉంటాయి. ఎంత తెలివైనవారైనా ఒక్కోసారి సహనం కోల్పోయినందువల్లో అభద్రతాభావం వల్లో నోరు జారుతారు. ఇక్కడ సీతాదేవి పాత్రలో మనకి కినిపించేది ఇదే. అయితే ఒకసారి నోరుజారిన తరువాత జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అలా నోరు జారినందుకు సీతాదేవి కూడా పశ్చాత్తాపపడుతుంది సుందరకాండలో. ఇక్కడ లక్ష్మణుని పాత్రలో ఉన్న ప్రత్యేకత కూడా గమనించదగ్గది. అవతలి వ్యక్తి మాటలు బాధ కలిగించినా సహనం పాటించాడు. ఇదే మనలాంటోల్లైతే (పోనీ మిమ్మల్ని కలుపుకోను, నాలాంటోల్లైతే!) "హత్తేరి.. ఇంతమాటంటావా?" అని రివర్సులో గొడవపడేవాల్లు. కాని లక్ష్మణుడు వెల్తూ వెల్తూ కూడా ఇంటి చుట్టూ రక్షణ వలయం కల్పించి మరీ వెల్లాడు. తన బాధ్యతను చివరివరకూ నిర్వర్తించాడు.

    ReplyDelete
  6. తరువాతి రామాయణ టపా విద్ధి మాం పంచాస్యాం పన్నగీమివ పైన ఉంటుందేమో...

    ReplyDelete
  7. జిలేబి గారూ,
    యేమిటి వరసగా రామాయణాన్ని యెత్తుకున్నారు. మీరు వూహించిన విధంగానే నేనూ వూహించాను. సీతాదేవి లక్ష్మణుడ్ని తూలనాడటానికీ రాముడు సీతకి ఆశ్రయించటానికి చెప్పిన లిస్టు లక్ష్మణుడితో మొదలవ్వటానికీ ఉన్న సంబంధం అదే!
    రామాయణం అనేది జరిగిందా లేక కేవలం కల్పితమైనదా అనేదానిలో మీకేమైనా అనుమానాలు ఉంటే వాటిని వొదులుకోండి. అది కేవలం కల్పనే. కాకపొతే అవతారికలో వాల్మీకి చెప్పుకున్నాడు, యేమని? ఈ ప్రపంచంలో నదీ నదాలు పారుతున్నంత వరకూ గిరి శిఖరాలు స్ఠిరంగా ఉన్నంత వరకూ నా రామకధ నిలిచి ఉంటుందని. అంత ధైర్యంగా తన కృషిని గురిచి తనే చెప్పుకున్న మరో కవి యెవరైనా ఉన్నారా?

    ఆ ధీమాకి కారణం యేమితో తెలుసా? తన రచనలో తను చేసిన చమత్కారాల మీద నమ్మకం ఉండి, యే కాలంలోనైనా మనుషులకి కావల్సిందేమిటో తెలుసుకోగలిగిన కవికి ఉండే ఆత్మ విశ్వాసం అది.మిగతా భాషల్లో లేనిది రామాయణానికి సంబంధించి తెలుగులో ఒక విలువైన పుస్తకం ఉంది.అంతరార్ధ రామాయణం అని వేదులు సూర్యనారాయన శర్మ గారు రాశారు.దాని ప్రకారం మనిషి మనీషిగా మారే అధ్యాత్మిక ప్రయాణాన్ని వాల్మీకి ఒక కధగా మలిచాడు.పాత్రలకీ స్థలాలకీ వాడిన పేర్లనీ వర్ణనల్నీ డీకోడ్ చేసి చూపించారు శర్మ గారు.

    రామ అంటే రమింప జేయు వాడు అని అర్ధం. సీత అంటే అసీద్(యేదైతే ఉన్నదో అది) అనే అర్ధం తీసుకుంతే సీత రాముడికి విధేయంగా ఉన్న భార్యగా కాకుండా సీతయే ఉన్నత స్థానం లో భగవత్ స్వరూపంగానూ రాముడు ఆ భగవత్ శక్తిలో లీనమవ్వాలని యోగ సాధన చేసే సాధకుడి గానూ కనపడతారు.

    శివ ధనుర్భంగం తో సీతను పెళ్ళాడటమనేది ఓంకార సాధన ఫలించి దైవాన్ని మొదటి సారి దర్శించడానికి సంకేతం.శ్రీ రామ వనవాసానికి కారణం దసరధుడు, కైక. కైక పేరుకి సర్మ గారిచ్చిన కోడ్ గుర్తు లేదు కానీ దశరధ అనే పేరుకి అన్ని వైపులకీ ఆతురంగా పరిగెట్టే మనస్సు ప్రతీక. కైక బహుశా అహంకారానికి ప్రతీక అనుకుంటాను. వీటివల్ల యోదులకి శక్యం కాని అయోధ్య అనే ఉన్నతమైన యోగ సాఫల్యత నించి దూరంగా వెళ్ళి అక్కడ మళ్ళీ పంచ వికారాలూ విషయ వాసనలూ దశగ్రీవుడి(నీచమైన కోరికలకి గొంతు పెద్దది కదా) లాగా వొచ్చి సాధకుడ్ని దైవం నించి వేరు చెయ్యదానికి సీతాపహరణం ప్రతీక.

    ఒకసారి సాధించినా దూరమైన దైవ సంప్రాప్తిని తిరిగి సాధించాలంటే సద్గురువు చాలా అవసరం. ఆ సద్గురువు స్థానం లఓ వాల్మీకి వాక్య కోవిద, వాక్య విశారద అని చాలసార్లు కితాబు లిచ్చిన హనుమంతుల వారు వస్తాడు.ఆ విశేషణా లన్నీ సద్గురువుకే వర్తిస్తాయి. రాముడు ఆంజనేయుడ్ని నాకు చేసిన ఈ సాయానికి నీకు ఇంతకన్నా ఇచ్చుకోలేనని ఆలిగనం చేసుకుంటాదు. ఇది గురువుకు శిష్యుడు చేసే మనోగతమైన విధేయతకి ప్రతీక.

    ఇప్పుడు పైన ఉన్న బొమ్మకి సంబంధించిన విషయానికి వస్తాను.అలా సద్గురువు సాయంతో రెండవ సారి తిరిగి దగ్గిరకి తెచ్చుకున్నప్పుడు భక్తుడికి తన దైవం మీద పూర్తి అధికారమూ, తన గురించి తెలిసీ తనని కష్తపెత్తినదుకు కోపమూ ప్రదర్శించే సన్నివేశానికి ప్రతీక. రామదాసు "యెవడబ్బ సొమ్మని" అంటూ తిట్టినా ఆ తర్వాత "అబ్బా దెబ్బల బాధ కోర్వ లేకుంటి" నన్నా తనకన్న అధికుదైన దైవం మీద వాళ్ళు సాధించుకున్న చనువు లాంటి అధికారమే కారణం.

    లౌకికమైన అర్ధంలో చూస్తే సీత చేసిన ఒక దారుణమైన తప్పుకి వేసిన శిక్ష. వానరులు సీత నగల్ని తెచ్చి చూపించినప్పుడు రాముడు లక్ష్మణుడ్ని గుర్తుపట్టమన్నప్పుడు నాకు కాలి అందెలు మాత్రమే గుర్తున్నాయి(అంతకంటే పైకి ఆమెని చూదలేదు అని) అంటాడు. కానీ సీత మారీచుడు అరిచిన అరుపులకి కంగారు లోనే కావచ్చు గానీ వెళ్ళనంటున్న వాణ్ణి నువ్వు నన్ను మోహించావు. తను లేకపోతే నన్ను చేపట్టాలని చూస్తున్నావు అంటుంది. రామయణంలో ఉన్న మిగతా నీతుల కన్నా ఇది చాలా గొప్ప నీతి. అన్ని రకాల పాపాల్లోనూ తప్పు చెయ్యని వాణ్ణి తప్పు చేసాడు అనడం నిష్కృతి లేని దోషం.

    ReplyDelete

  8. ..జింక రూపం లో ఉన్న మారీచుడు 'హా సీతా' అంటే , అది తన భర్త రాములవారిదే ననుకుని,...అని, జిలేబి గారు టపాలో వ్రాసిన వాక్యములో భాగాన్ని నేను నా వ్యాఖ్య లో వాడాను.
    అందుకు జిలేబీ గారు తప్పుగా అనుకోరని భావిస్తున్నాను. వారికి కృతజ్ఞతలు.
    ..

    ReplyDelete
    Replies
    1. సూర్య గారు అన్నట్లు, లక్ష్మణుడు తన బాధ్యతను చివరివరకూ నిర్వర్తించారన్నది నూటికి నూరుపాళ్ళూ నిజం.

      నిజమే, పురాణేతిహాసాలు కేవలం దైవిక గ్రంధాలు మాత్రమే కాదు . వీటిలోని చాలా సంఘటనలు మన నిత్యజీవితానికి దగ్గరగా ఉంటాయి. ఈ సంఘటనలను గమనించి ప్రజలు తమ జీవితాలలో ఎలా ప్రవర్తించాలో..ఎలా ప్రవర్తించకూడదో... తెలుసుకుని జాగ్రత్తగా ఉండవచ్చు.
      ......................

      ఇంకా, పురాణేతిహాసాలు ఎన్నో విషయాలను ప్రజలకు తెలియజేసే అద్భుతమైనవి, అమూల్యమైనవి. వీటి ద్వారా లోకంలోని ప్రజలకు ఎన్నో విషయాలను తెలియజేయాలన్నది పెద్దల అభిప్రాయం .
      దురదృష్టం ఏమిటంటే , కొందరు వీటిని సరిగ్గా అర్ధం చేసుకోవటం లేదు.

      ఇలా విమర్శించేవారు తెలుసుకోవలసింది ఏమిటంటే, పురాణేతిహాసాలలోని పాత్రల ద్వారా ... లోకంలోని ప్రజలు ఎలా ప్రవర్తించాలో ... ఎలా ప్రవర్తించకూడదో...ఎలా ప్రవర్తిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో వంటి విషయాలను పెద్దలు తెలియజేశారు.

      మనం గమనించవలసిన విషయం ఇంకో ఏమిటంటే, ఎంత గొప్పవారైనా సరే, పొరపాట్లు చేస్తే దానికి తగ్గ ఫలితాన్ని అనుభవించే అవకాశం ఉందని పురాణేతిహాసాల ద్వారా తెలుస్తుంది.

      ఈ పాత్రల ద్వారా మనము ఎన్నో విషయాలను నేర్చుకోవాలి కానీ, ఆ దేవతలు అలా ప్రవర్తించారేమిటి ? అని తప్పుపట్టటం సరైనది కాదు.

      దేవతలు మనకోసం మానవులుగా జన్మించి , తమ జీవిత పాత్రల ద్వారా మనకు ఎన్నో విషయాలను తెలియజేశారు. ఇక్కడ మనం చూడవలసింది వారి పాత్రలనే గానీ, పాత్రధారులను కాదు.

      లోకంలోని ప్రజలకు ధర్మాధర్మాలను తెలియజేయటానికి దేవతలు పాత్రధారులయ్యారు అంతే.

      Delete