"ఓరోరీ ఇంద్రుడా, సోమ పాన మత్తులో ఉండినావా, ఏమి నీ ఖండ కావరము ? "
ఇట్లాంటి సంభాషణలు మన పాత తెలుగు పౌరాణికాల లో గానీండీ, తెలుగు సినిమా ల లో గానీండి మనం చదివి లేక విని ఉండవచ్చు.
మన
e లోకం లో మనకు సురాపానం గావించే అవకాశాలలో మొట్ట మొదటిది వ్యాఖ్యలు. అవి ఇచ్చు కిక్కు వేరే ఏదీ e-మాధ్యములో ఇవ్వదని నేను కీబోర్డుపధం గా చెప్పగలను!
ఆ మధ్య హారం , హా, రమ్, హారం ఒక మధు శాల లాంటి దని కూడా ఎవరో జిలేబి అట వారు రాసినది చదివినట్టు నాకు గుర్తు!
ఇక రెండవది - టపా. మనసుకు నచ్చిన టపా, ఆ టపా లో మంచి కంటెంటు ఉన్న టపా మరో సురా పానం లాంటిది.
జిహ్వ కొద్దీ రుచీ, మూడు కొద్దీ టపా లైకింగు !
శ్రీ రామ రాజ్యం వస్తే, వెంటనే దానిని చాకి రేవు బండ మీద ఎంత ఎక్కువగా బాదితే , మన టపా ఎంత వ్యత్యాసం గా ఉంటె అంత మంచిది.
ఇదే విధం గా మన డైలీ లైఫు లో జరిగే విషయాల గురించి రాసే టపాల కోవలో , హాట్ హాట్ రాజకీయం, అన్నా హజారే ఉన్నావరిదం కి సంబంధించి మనం చూపించే లెగ్ కికిన్గులు ఇవన్నీ 'when its hot its really cool' లాంటివి అన్నమాట !
మరికొన్ని టపాలు , వంటలకి సంబందించింది. ఇవి చాలా కారణాల వల్ల చాలా పాపులర్ ! ఐటీ రంగం లో ని 'బేచలర్ కిచెన్' టార్గెట్ ఇవి. కాబట్టి మరీ ఘాటుగా , సూపెర్ సేవీ గా రంజు గా కొన సాగుతాయి.
ఇక జ్యోతిష్యం - హాట్ హాట్ టాపిక్! నేను గమనిన్చినదాంట్లో , జ్యోతిష్యం మీద టపా పడితే ( అమెరికా ఎప్పుడు మునుగును- జ్యోతిష్యం ఏమి చెబుతోందీ - ఇట్లాంటి టైటిల్ (తిట్లు) సూపెర్ డూపర్ - అల్ టైం 'ఎక్కువ ' చదివిన' టపాల కోవకి వస్తుంది. !
మరి సాఫ్ట్ వేర్ సాములు రాసే - సెటైర్ అది మరో స్టైల్ . కొంత అర్థం చేసుకోవాలంటే వారి Knowledge is Power and Money' కాన్సెప్ట్ కొంత తెలిసుండాలి.
ఇక హాస్యం గురించి చెప్పనే అక్కర్లేదనుకుంటా. మనిషికి ఆహ్లాదం ముఖ్యం కాబట్టి ఈ టాపిక్కు ఎవెర్ హాట్!
వీటన్నిటికీ , ఆవల, కొన్ని బ్లాగులు , నిశ్శబ్దం గా తమ మానాన తాము రాసుకొంటూ పోతూంటాయి. అంత అలజడి, కామెంటుల పరమాన్నాలు, వీటి లో వుండవు. కాని వాటి కని వేచి వుండే కనులు ఎన్నో !
వాటికి వున్న విలువలు - కాల గతిలో నిలిచి పోయేవి. బ్లాగు లోకాలు గాయబ్ అయినా , అవి తమ కాళ్ళ మీద నిలబడ గలిగినవి !
అట్లాంటి నాకు తెలిసిన ఒక 'సోమ పానీయం '
శ్రీ సుబ్బా రావు గారి బ్లాగు !
శ్రీ సూక్తం లో- వైనతేయ సోమం పిబ, అని అన్నట్టు,
సోమ పానీయం గా వారి బ్లాగుని పరిచయం చెయ్యడానికి కారణం నాకు తెలిసిన ఈ '
సురా'బ్లాగీయం ' -
సుబ్బా రావు గారి బ్లాగు నాకు చాల నచ్చడం !
ఎందుకు నచ్చడం ?
ఒక ప్రత్యేక శైలి వీరిది - నాలుగు పదాల నాలుగు పంక్తులతో , జీవితాన్ని ప్రతిష్టాపించడం వీరికే చెల్లు.
చిన్ని చిన్ని పదాలతో , చిన్ని పదబంధాలతో, తేట తెలుగు లో తేనీయలు జాలువారించడం అంత సులభం గాదు !
బ్రహ్మాండమైన సంక్లిష్ట పదాలతో భావాన్ని రాయడం ఒక ఎత్తైతే, అదే భావాన్ని సున్నితం గా, సింపుల్ గా చెప్పడం వెయ్యి ఎత్తులకి సరి సమానం అని నా విశ్వాసం. అలా సింపుల్ గా చెప్పే కెపాసిటీ ఏ కొద్ది మందికో ఉంటుంది. అలాంటి వారిలో రావు గారు సుప్రసిద్ధులని పిస్తుంది. వీలు చేసుకుని ఓ సారి దర్శించండి !
'బ్లాగ్ మైత్రేయ - సోమం పిబ' !
చీర్స్
జిలేబి.