శంకరాభరణం మాష్టారు ఒకే ఒక వాక్యం ఇస్తారు పూరించుడీ, అని. వెంటనే టప టపా కామెంటు తారు బ్లాగ్ బంధువులు. అమ్మో వారి ఒక్క లైను కి అంత వెయుటు ఉందే అని ఆశ్చర్య పోతాను.
మా జ్యోతక్క గారు చాలా నిశితం గా ఆలోచించి , ఒక టపా రాసారంటే దానికి ఒక నిర్దుష్టమైన దారి, గురి, ఉంటుంది. బాణం ఎక్కుపెట్టడం లో కానివ్వండి , చదువరులని ఆలోచింప చెయ్యడం లో కాని ఒక రాచ బాట వారిది.
మరి ఎందుకో ఏమో గారి బ్లాగు కన్నా వారి కామెంటు లే నాకు కనబడుతుంటాయి. అంటే వారు రాయరని కాదు. మరీ భారీ వీడియో లతో ఉన్న వారి బ్లాగు నాకు ఎప్పుడూ ఓపెన్ కాదు. సరే అని ఓ మారు ఓ యుగం ప్రయత్నించి అయ్యా ఎందుకో ఏమో గారు మీ బ్లాగు ప్రాబ్లం ఏమైనా ఉందా చూస్తారా అని కామెంటు పెడతామని ఓపిక గా కామెంటు పెట్టా, కామెంటు పడిందో లేదో కాని నా కంపుటరు హాంగ్ అయి పోయింది. !
మా భారారే గారేమో మరీ విచిత్రం- అప్పుడప్పడు ఆంగ్లం లో రాస్తారు. స్వామీ ఇది ఆంగ్లమా లేక గ్రీకు అండు లేటినా అన్న సందేహం నాకొస్తుంది. వారు మొదట్లో మంచి మంచి కవితలల్లే వారు. ఆ తరువాతే మయ్యిందో నాకు తెలియదు, వారి బ్లాగు సింపుల్ టెంప్లేట్ మారి కొత్త టెంప్లేట్ (ఇప్పుడున్న టెంప్లేట్) వచ్చేక చాల చాలా భారీ విషయాలు (మచ్చుకి సిగరెట్టూ గురించి ఒక రిసెర్చ్ ఆర్టికల్ ) రాయడం మొదలెట్టారు.
మా బులుసు మాస్టారు గురించి చెప్పాల్సిన పనే లేదు. వారు మూడు నెలలకో మారు రాస్తే గొప్ప టపా. అయిన వారు రాసి అలా టపా వదిలారంటే ఇక హారం కానివ్వండి, సంకలిని గానివ్వండి హోరు మని కామెంటు ల తో వరద ప్రవాహం , ఒక ప్రళయం వచ్చేసిందా అన్నట్టు ఓహో ఆహో అని హోరెత్తి పోతూన్టూంది. (ఈ మధ్యేమో వారు బ్లాగు లోకాని కి గుడ్ బై చెబ్తానని అక్కడెక్కడో బజ్జు లోకం లో చెప్పారని వినికిడి. వారు అలా చెప్పారో లేదో, ఆ గూగుల్ వాడికి భయమేసి బజ్జులని మూసేస్తానని వాక్రుచ్చేడు.- బులుసు గారు బజ్జులలో రాయటం మొదలెడితే గూగుల్ కి కామెంటులు మేనేజ్ మెంటు కష్టం అయిపోతుందేమో అన్న గూగుల్ వారి భయం వారిది - ఎం చేద్దాం - ఓ 'భామా' ఎఫ్ఫెక్టు మరి )
మరి మన బాతాఖాని లక్ష్మీ ఫణి మాస్టారు/మాస్టారిణి వారు అల్లాటప్ప గా ఎ మేటరు పై అయినా అలా అలవోక గా రాసేస్తారు. ఒక్కో మారు రెండు లేక మూడు టాపిక్కులని కలగలిపి ఓ టపా రాసి పడేస్తారు. అది వారికే చెల్లు. కాదేది వారి టపా కే అనర్హమేమో అని పిస్తుంది.
శర్మ గారు, కాలక్షేఫం కబుర్లు అంటారు గాని అవి నూటికి నూరు శాతం కాలక్షేపం కబురులు కావే కావు. ఓ జీవితాన్ని కాచి వడబోసి సత్యాలని చెళ్ళుమని మనకోసం ఇస్తుంటారు. కాని మొహమాటం కొద్దీ - ఇవి కాలక్షేపం కబుర్లు మాత్రమె సుమా అని (మనం జీవిత సత్యాలు అంటే చదవం గదా - భారీ వ్యాసం అంటే కష్టం మరి - అందుకే వారు కాలక్షేఫం కబుర్లతో చిన్న గా హోమియో పతీ డోసులలో ఇచ్చేస్తో వుంటారు ) !
ఇక వారెవరో మధుర వాణీ గారని , జర్మేనీ దేశం లో ఉన్నారట ! ఉన్నారన్న మాటే గాని జర్మేనీ కబుర్లకన్న స్వచ్చమైన తెలుగు కబుర్లే ఎక్కువ చెబుతూంటారు. ఏమండీ అంటే, అప్పుడప్పుడు జర్మేనీ అందాలని ఫోటో పట్టి పెట్తోస్తాంటారు !
మరొకరెవరో కృష్ణ ప్రియ గారట, డైరీ అని రాస్తూ , ఓ విశిష్టమైన శైలి తో కథల పరంపరలు రాస్తూంటారు. అమ్మో వీరికి ఎన్ని విషయాలు తెలుసంటారు జీవిత గమనాల గురించి . ఈ మధ్య ఓ సిక్స్ ఫేసస్ అఫ్ ఎ మాన్ అని - స్టీఫన్ కోవే ని మించి న నైంత్ ఫేక్టర్ అఫ్ హ్యూమన్ రిలేషన్షిప్ గురించి వాడెవడో ఓ అరవబ్బ్బాయి ఆరుముగం అట , ఆతన్ని సంపూర్ణం గా అనలైజే చేసి రాసేస్తూన్నారు.
మరి నాగ మురళీ గారని, అలా ఓ చేత్తో కాళిదాసుని, మరో చేత్తో వాల్మీకిని , సంస్కృతాన్ని వడబోసి ఓ సంస్కృత కాలేజీ తెలుగు లో నడిపెస్తూంటారు! వామ్మో వీరికెంత జ్ఞానం అని నేను ఆశ్చర్య పోవడం కద్దు కూడాను. !
ఇలా చెప్పుకుంటూ పొతే , అసలు విషం మరిచి పోయేట్టు ఉన్నాను. అసలు మేటరు లేకుండా టపా రాయడం ఎలా అని కదా ఈ టపా తిట్లు సారీ టైటిల్ మరి ? ఈ టైటిల్ మాట ఎందు కొచ్చిందంటే,
ఎవరో జిలేబి అంట, రోజు టపా టపా రాస్తూంది. మేటరు ఉందొ లేదో తనకే తెలీదు. అసలు ఆడవారో మగ వారో వీరు అని మరీ కన్ఫుషన్- నాకు తెలిసి జిలేబి అని ఎవరికైనా పేరు ఉంటుందా ? సందేహమే నా కైతే ! - ఆడవాళ్ళు సందేహం సినానిమాస్ గదండీ మరీ ?
ఈ మధ్య ఓ లబ లబ కూడా లబ లబ లాడి పోయాడు - ఈ జిలేబి ఎవరబ్బా అని ముక్కు మీద వేలేసుకుని వెళ్లి వెళ్లి భారారే గారినే (వారే కదా 'హారం' అధినేత గారు ) అడిగేసాడు. ఆ భారారే గారు కూడా ఖంగు తిని ఆ జిలేబి సుద్ధ వేష్టండి అన్నారని గ్రేప్ వెయిన్ స్టొరీ ఒక టి విన్నాను ) . అంతే గాక వారెవరో మరో వరూధిని గారట, మాంచి సిరి సిరి మువ్వలతో సరిగమలు పలికిస్తూ చాలా సునాయాసం గా రాసేస్తూ వుంటారు - వారి కే ఈ జిలేబి కీ మధ్య ఒక పెద్ద కన్ఫుషన్, ఈ బ్లాగర్లు కూడా ఒక్కో మారు వారే వీరేమో, వీరే వారేమో అని జిలేబి అనవలసిన చోట వరూధిని గారు అని, వరూధిని అన వలసిన చోట జిలేబి అని మరో కన్ఫుషన్ క్రియేట్ చేసేస్తూంటారు ! నాకు మరీ పెద్ద డౌటు ఇద్దరూ ఒకరేమో అని కూడా.
ఆ మధ్య ఆవిడ , కంటెంటు లేని టపా కనులకి కనపడదని ఓ బ్లాగ్ సామెతల లిస్టు కూడా ఇచ్చింది.
ఈ విషయమై ఆలోచిస్తూంటే , ఇంతకీ టపా టైటెల్ ఏమిటన్నాను? అబ్బా నా మతి మరుపు కాకి ఎత్తుకుపోనూ, ఈ జిలేబి ఎవరబ్బా ?
చీర్స్
జిలేబి
ఇంతకీ జిలేబీ అమ్మాయా/అబ్బాయా?
ReplyDeleteజిలేబీ కి వరూదిని ఎమౌతుంది/ఎమౌతాడు?
నా సందేహం తీర్చగలరు
భాస్కర్ గారిదే నా సందేహమూనూ..
ReplyDeleteహహహ బాగుందండీ! భలే వ్రాసేసారే జిలేబి తిన్నంత తియ్యగా!
ReplyDeleteఈ మధ్య ఓ లబ లబ కూడా లబ లబ లాడి పోయాడు... హ హ హ..అసలు వీళ్ళెవరికీ తెలీదండీ పాపం.మరి నీకు తెలుసేమిటీ అనుకుంటున్నారా? అందుకే కదా అలా అన్నాను. అంటే తెలుసన్న మాట చెప్పేయ్ మరీ అంటారా? అబ్బా జిలేబీ గారే చెప్పట్లేదు..ఇంక నేనెందుకు చెప్తాను. ఎంత ఆశోనండీ మీ అందరికీ;)
ReplyDeleteజిలేభాజ్ఞానం 2011
ReplyDeleteకంటికింపుగ కనపడిన బ్లాగు
రాతలేవి అయిన
రస సమ్యముగ ఉండును
వంటకం పేరు మారు పేరగును
స్నేహితులను సంపాదించెను
లబలబ అను శత్రువులుండెను
ప్రవరాఖ్యుడు వరూదిని
చేతిలో ఉండిన జిలేబీని
మెచ్చుకొనెను
చలా........................గొప్పగా.....................చెప్పేరు.మనసు మూగపోయింది.
ReplyDeleteఅయ్యా భాస్కర్,
ReplyDeleteనాదీ అదే ప్రశ్నే. నా ప్రశ్నని మళ్ళీ నాకే అడిగితె నేనేమి సమాధానము చెప్పవలె ? నెనర్లు. ఈ భాస్కర్ భారారే ఒకరేనా కాకుంటే వేరు వేరు వేరా ? మళ్ళీ మరో సందేహం ! సందేహం ముందు పుట్టి ఆడవాళ్ళూ పుట్టారని....
చీర్స్
జిలేబి
జ్యోతిర్మయీ జీ,
ReplyDeleteమీకు చాలా నిజములు తెలియును. కాబట్టి మీరు సందేహం పడ రాదు. శర్కరి లేనిదే జిలేబి చెయ్యడం కుదురునా చెప్పుమా జిలేబి. !
చీర్స్
జిలేబి.
@రసజ్ఞ గారు,
ReplyDeleteజిలేబి రసములు తియ్యన్దనాలని ఆస్వాదిన్చినండులకు రసజ్ఞోమయ శుభోదయం !
చీర్స్
జిలేబి.
సుభా గారు,
ReplyDeleteఉష్! మీకూ మాకూ మధ్య నిశ్శబ్దం! మీ బొమ్మలో కోచ్చెను మార్కు అలానే ఉంచండి ! కోచ్చెను మార్కు ఎప్పుడు అందమే!
చీర్స్
జిలేబి.
లబ లబ,
ReplyDeleteస్వాగతం ! సుస్వాగతం ! మొత్తం మీద జిలేబి ని కనుగోనేసారు ! హేవ్ మోర్ ఫన్ అండ్ ఎంజాయ్! నెనర్లు ఆ చిన్ని బుల్లి కవిత జిలేబీయం గావిన్చినందులకు! లబ లబలాస్యం అందులో తొణికిసలాడుచుండగా శత్రువన్న ఆ మధ్య పదం అప్పు తచ్చువనుకుంటా ! అది చతురుడు ఉండెను అని మీరు రాసి ఉండవచ్చు బ్లాగరుడు దానిని తప్పుగా లేఖించి ఉండవచ్చు.
నెనర్లు !
చీర్స్
జిలేబి.
blogger sarma gaaru,
ReplyDeleteనెనర్లు ! మీరు కాలక్షేపం కబుర్లు శర్మ గారు కాదు కదా ! వారు వర్డ్ లో ప్రెస్ అయి పోయారు మీరు బ్లాగర్ లో బందీలై పోయారు !
నెనర్లు !
చీర్స్
జిలేబి.
నాకు తెలుసా? జిలేబి గారూ ఈ పూట నుండి నేను మా చుట్టుపక్కలవారిని అనుమానంగా చూడాలి వారు జిలేబియా కాదా అని, దీని కంటే నా సందేహమే బావుంది. అన్నట్టు నేను చక్కెరను కాదండోయ్..వేరొకరిని.
ReplyDeleteఅది సరే.. ఇంతకీ ఆర్ముగం తో బులుసు వారి భేటీ అన్నారు..ఏమైంది?
ReplyDelete@జ్యోతిర్మయీ,శర్కరీ ,
ReplyDeleteహతోస్మీ! మరో పెద్ద కన్ఫ్యూషన్! నేనీ ఆట ఆడలేనండీ బాబూ! శర్కరి చక్కర కాదంటే జిలేబి లో తియ్యదనం లేదన్న మాటే !
నెనర్లు.
చీర్స్
జిలేబి.
@కృష్ణ ప్రియాజీ,
ReplyDeleteనా పని ఆ ఫ్లాష్ వార్త పబ్లిష్ చెయ్యటం తో అయిపొయింది. ఇక బులుసు గారి తో ఆర్ముగం భేటీ కృష్ణ ప్రియ గారు బులుసు గారు తేల్చుకోవాల్సిందే! కాకుంటే వారికి పారీస్ కార్నేర్ (మా మద్రాసులో పారీసు గురించే కదా మీరు చెబ్తూంట ఆర్ముగం కేర్ ఆఫ్ అడ్రస్సు? ) మీట్ చెయ్యడాని కి శరవణ భవన లో ఇడ్లీ సాంబార్ కి ఆర్డర్ చెయ్యగలను. ఇంకా కావాలంటే మాంచి నర్సూస్ కాఫీ ఇప్పించాగలను. ఆరుముగం కి తెలుగు తెలీక, బులుసు గారి కి అరవం తెలీక, కష్టపడతారంటే , ఓ దుబాషీ గా వ్యవహరించాగలను ! మిగిలిన భేటీ కి కావలసిన సరంజామా వారూ మీరు సమకూర్చుకోవలె ! వేదిక నా ఓ ఫన్ ఆర్ట్ విత్ జేకే సుమా !
నెనర్లు.
చీర్స్
జిలేబి.
nenmi comment cheyyanu....naa peru leduga!!!! ante nenu aligaanu ani ardham chesukovali...
ReplyDelete>>> ఓ ఫన్ ఆర్ట్ విత్ జేకే- మేటరు లేకుండా టపా రాయడం ఎలా ?
ReplyDeleteఈ సందేహం మీకు రావడమేమిటా అని నాకో సందేహం..... దహా
కృష్ణప్రియ గారు ఎప్పుడు పిలుస్తారా అని సూటుకేసు సర్దుకొని, కాళ్ళకి చెప్పులు, కంటికి జోడు కళ్ళద్దాలు తగిలించుకొని కూర్చున్నాను. ఆర్ముగం గారు యూరప్ వెళ్లారట. నన్ను అక్కడికి ఎప్పుడు పంపిస్తారా ఈవిడ అని ఎదురు చూపులు చూస్తున్నాను.
బ్లాగు సన్యాసం తీసుకోలేదు ఇంకా. విరామం మాత్రమే. ఏ ఓ 'భామా' ఎఫెక్టూ లేదు.
ధన్యవాదాలు నన్ను గుర్తు చేసుకున్నందుకు...... దహా
శ్రీ రామ చంద్రా !!
ReplyDeleteమీకు నా blog విషయం లో అలంటి అనుభవం ఎదురవ్వటం నిజంగా నేకు బాధాకరం
ఆయనా నాయందు దయ ఉంచి ఓపికగా comment కు యత్నించిన
మీ (హృదయ) ఔన్నత్యం నాకు ఆనందాన్ని కలిగించినది.
నాకు ఈ blogging కొత్త!!
కేవలము ఒక నెల నుంచే నాకు ఇది అలవాటు అయినది.
"పమపదసోపనం" అనేది ఎందుకో?ఏమో! కి చెందినదే ...!!
ఇక నా blog ను దయ చేసి దర్శించి దానిని పునీతునిగా చేయగలరు
http://haaram.com/AuthorPosts.aspx?FeedID=18320&ln=te
పై link ద్వారా నా blog ని haaram లో చూడగలరు
10000 stats వచ్చాక పాత పోస్ట్లు తీసివేద్దామని నిర్ణయించు కోవడమైనది
ఇప్పుడు అది దాటింది so
మీరు చెప్పిన problem ని గతం లో కొందరు నాకు సూచన చేసారు
కనుక light weight display కి సన్నాహాలు జరుతున్నాయ్ !!
కనుక మీరు నాకోసం
http://haaram.com/AuthorPosts.aspx?FeedID=18320&ln=te
ద్వారా అయినా నా blog contents పై తమరి అమూల్య అభిప్రాయాన్ని తెలుప గలరు
మీ వ్యాఖ్యలను అనుసరిస్తూనే కతిమా బ్లాగ్లను కూడా చూస్తుంటాను
(హారం) సాయంతో ...
తెలుగు భావాల్లో పుణ్యం గురించి మీరు చేసిన solid కామెంట్ కి స్పందించే అంత matter రాసాను
మొత్తానికి మీతో direct గా comment చేయటం హ్యాపీగా ఉన్నది
ఇక ఈ post లో ప్రస్తావించిన విధం గా zilebi gender ఏమిటి అనే ప్రశ్న నాకు తలేత్తినది కానీ
దానికి ప్రాధాన్యత నివ్వలేదు
రుచి బాగున్నది కనుక అస్వాదన కొరకే అనుకున్నాను !!
ఆనందిస్తున్నాను !!
thanks
?!
రాఫ్సన్ మహాశయా,
ReplyDeleteఅలుగకుమా , సఖా, చేలా, అలుక మానుమా ! ఇది ఒక ఫన్ ఆర్ట్ మాత్రమే సుమా!
నెనర్లు కామెంటి నందులకు !
@బులుసు సుబ్రహ్మణ్యం గారికి
ReplyDeleteమీరు బ్లాగ్ లోకమునుండి విరమణ చేయబోనని కీబోర్డుపధముగా నొక్కి వక్కాణించి నందులకు కడుంగడు ముదావాహము తెలియజేసుకోనుచుంటిని.
మీరు పాదరక్షలతో ఆరుముగము కోసము వైటు చెయ్యడం కృష్ణ ప్రియ గారికి తెలిసినట్టు లేదు అనుకుంటాను. ఇప్పుడు వారికి తెలిసి వచ్చినది గావున వారు శీఘ్రమే మీకు ఐరోపా నగరమునకు టిక్కట్టు గైకొన దరని ఆశించవచ్చు నని అనుకొందును. కృష్ణ ప్రియ గారు గమనించవలె.
ఇట్లు
కడుంగడు మేటరు లేని మేముసాహేబు జిలేబి.
@ఎందుకో? ఏమో!
ReplyDeleteఒక కోచ్చెను మార్కు, ఒక ఆశ్చర్య మార్కు 'బ్లాగు మార్కులకు' నమోన్నమః ! నా బ్లాగు దర్శించి నందులకు మీకు 'భే' తాళ ములతో నెనర్లు. మీ బ్లాగు దర్శన భాగ్యము హారము ద్వారా లింకులందించి నందులకు నెనర్లు. తెలుగు భావాల పుణ్యమును మీరు మూట గట్టుకున్నందులకు కూడా నెనర్లు.
చీర్స్
జిలేబి.
హు ...రెండు లైన్లతో నా అలకదీక్షను భగ్నం చేసేసారుగా ......నేనేమో అన్న హజారే కాదు గా అందుకే అలుసు..హు ...అందరు ఇంతే!! చిన్న పిల్లాడిని చేసి ఆడుకుంటున్నారు .....
ReplyDeleteసరేలెండి మీ టపా బాగుంది..చాలా?? హ్యాపీ నా???
నిజంగా బాగుందండి జిలేభి ఉరుఫ్ వరుధుని గారు.
మీ శ్రేయోభిలాషి
RAAFSUN