మాయన్ క్యాలెండరు గురించి జరుగుతున్న పరిశోధనలు గురించి మీలో చాలామంది చదివే ఉంటారు.
దీనికి సంబంధించి కొంత చదివాక సరే - మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏమైనా ప్లానెటేరి పొసిషన్స్ కనిపిస్తున్నాయా అని ఆ రోజు కి అంటే డిసెంబర్ ఇరవై ఒకటి , రెండు వేల పన్నెండు కి చక్రం గీస్తే నాకైతే ఎలాంటి విశేషాలు కనిపించలేదు చార్ట్ లో.
సరే - ఇంత గగ్గోలు అవుతోంది కదా - ఈ మాయన్ కాలెండర్ సబ్జెక్టు అని కొంత ముందు వెళ్లి డిసెంబర్ పన్నెండో తేది ,(కాకుంటే పదమూడో తేది ) రెండు వేల పన్నెండు కి చార్ట్ చూస్తె - ఓ పాటి విలక్షణమైన జ్యోతిష చార్ట్ కనిపించింది. అంటే - రెండు ప్లానెట్ లు తప్పించి, ( మంగళ, శని గ్రహాలూ తప్పించి మిగిలిన వన్ని కల గట్టుకుని ఎదురెదురు గా కనిపించడం, ఆ పై డిసెంబర్ పదమూడో తేది అమావాస్య కూడా కావడం లాంటివి నాకు తట్టిన విశేషాలు. మీకు జ్యోతిష్య శాస్త్రం తెలిసి ఉంటె మరీ మీరు పరిశోధించి ఉండ వచ్చు.
అంతె కాకుండా - పదమూడో తేది అమావాస్య కాబట్టి - డిసెంబర్ ఇరవై ఒకట వ తేది నవమి.
త్రేతాయుగ కర్త శ్రీ రాముని జననం నవమి లో.
ద్వాపర యుగ కర్త శ్రీకృష్ణుడి జననం అష్టమి లో.
కలి యుగ కర్త ( ఎవరు? ) తెలియదు, నాకైతే - కలి ప్రభావం అనుకుంటే - శ్రీ కృష్ణ పరమాత్ములవారు ఈ కలి యుగానికి కూడా అవతార పురుషుడు గా అనుకోవచ్చు. (వచ్చే అవతారం దాక, లాస్ట్ అవతార పురుషుడు ఇన్-చార్జ్ అన్న మాట!)
సో, ఈ రీతిలో ఆలోచిస్తే - సప్తమి రోజున ఏదైనా విశేషం ఉండవచ్చా?
అంటే ఈ డిసెంబర్ పన్నెండు నించి ఇరవై ఒకటి లోగా ఏదో విశేషం జరగవచ్చు అని ఊహించవచ్చా?
ఈ టపా ముఖ్యోద్దేశం మీకు తెలిసిన ఏదైనా పాయింటులు వుంటే వాటి గురించి రాయగలరు.
ఈ శీర్షిక పై మొదటి సారి నేను రాసినప్పుడు, సందీప్ అనే బ్లాగరు, పంచవటి అన్న గ్రూప్ కి ఈ మేటర్ ని పంపిస్తానని అందులో నిష్ణాతులు ఏదన్నా చెబ్తారేమో చూస్తామని అన్నారు. కాని ఆ తరువాత ఆ సందీప్ అన బడే ఆసామి దీని ని పంచవటి కి రెఫెర్ చేసారా, దాని పర్యవసానాలు నాకు తెలీదు. వారి నించి ఎట్లాంటి స్పందనా రాలేదు. శ్రీ తెలుగు యోగి శర్మ గారి ప్రకారం ఈ తేదీలలో ఎట్లాంటి విశేషాలు లేవు. (నా కు తెలిసి వారు రాసిన టపాలని బట్టి, - వేరుగా పంచవటి లో వేరే ఏమైనా సవివరం గా చర్చించి వుంటే నాకు తెలియదు)
ఆ పంచవటి వారు గాని, వేరే వారేమైనా దీని ని పరిశోధించి వుంటే వివరాలు తెలుప గలిగితే మరీ సంతోషం !
సర్వే జనాః సుఖినో భవంతు ! సమస్త మంగళాని భవంతు. !!
చీర్స్
జిలేబి