బుజ్జి పండు తన తల్లి గారైన శర్కరీ జ్యోతిర్ 'మాయీ' వద్ద వారు నేర్పిన తెలుగుని నేర్చుకుంటూ తెలుగు కాంతుల విరజిమ్ముతూ తెలుగు బిడ్డగా అమెరికా దేశమునందు పెరుగు చున్నాడు.
ఆ తల్లికి, తన తనయుడు మరి ఇతర తెలుగు గురువుల వద్ద తెలుగు ని నేర్చుకోవలె అనెడి కోరిక గలిగెను. తాను ఎంత నేర్పినను , సరియైన గురువు చెంత నేర్చిన విద్యయే కదా విరాజిల్లు అని ఆ తల్లి తలబోసి
'పుత్రా, బుజ్జి పండూ, నీవు నా దగ్గిర నేర్చిన తెలుగు ని ఇంకను అభివృద్ధి చేసుకొనుటకై నేను నిన్ను మరి కొందరు మన 'తెలుగు బ్లాగ్ గురువుల చెంత గురుకుల వాసము చేయుటకు పంపవలెనని నిశ్చయించితి అని ఆ మాత పలుకగా,
తనయుడు బుజ్జి పండు 'మాతా, నీ వాక్కు నాకు శిరోదార్యము. వెంటనే సెలవీయుడు , నేను మొదట ఏ e-గురువుల వారి వద్ద వాసము చేయవలె నని అడుగగా
ఆ మాత కడుంగడు ముదావహము తో
'పుత్రా బుజ్జి పండూ, నాకొక్క దినము అవకాశము నిమ్ము, నీకు ఆ గురువుల పేరు తెలిపెదను ' అని బహు సంతోషానంద భరితు రాలై 'పుత్రోత్సాహముతో' ఆ నాటి కార్యక్రమములను ముగించుటకు సంసిద్దురాలాయెను.
పుత్రుడు బుజ్జి పండు తాను నేర్చుకోబోవు తెలుగు ను దృశ్య కావ్యముగా జూచుచు నిదురయందు జారుకొనెను.
(సశేషం)