Tuesday, January 3, 2012

"లింక్ లీక్స్"- రాధా ఎంత పని చేసావు !!!


"ఏమోయ్ రాధా , మా బులుసు గారి, మరిన్ని బ్లాగువాళ్ళ కథల్  వేసుకున్నావ్ ! మరి నా టపా ఒక్కటి కూడా ప్రచురించ లేదే ?"

మా మనవడు రాధ ని నిలదీసి ఇవ్వాళ అడిగాను. అడగటమే కాదు కడిగేసాను కూడా.

"ఇదిగో , బామ్మ, ఆల్రెడీ ప్రాబ్లెం లో వున్నాను, మధ్య లో నీ సోదేమిటి ?" అన్నాడు మా రాధ.

"ఆయ్ అంత మంది బ్లాగర్ల లిస్టు ఇచ్చాను నీకు వాళ్లదంతా  టపాలు సర్ప్రైస్ గ పబ్లిష్ చెయ్య వోయ్ అని - కొత్త సంవత్సరం లో వాళ్ళంతా సంతోష పడతారు అని . దాంతో బాటే నాదీ పబ్లిష్ చేస్తావనుకున్నానోయ్ మనవడా " అన్నా ఉన్న చనువుతో .

"అన్నావు, మరి ఆ లిస్టు లో నీ బ్లాగు ఎందుకు చేర్చ లేదు నువ్వు  ?" చికాకుగా ముఖం పెట్టాడు వాడు, "తప్పు నాది కాదు, ఆ లిష్టు ది "

"చెప్పాగా, నీకు తెలిసిన ముసలవ్వనేగా నా టపా ప్రింటు చేస్తే నీ కేం పొయ్యేది ?" అడిగాను డిమాండు చేసి.

"ఇదిగో బామ్మా,  అసలే ప్రాబ్లెం లో వున్నా, మరీ చీకాకు పెట్టకు " చెప్పాడు రాధ.

"ఏమిటోయ్ నీకొచ్చిన తంటా" ?

"వాళ్ళందరూ ధ్వజం ఎత్తారు నా మీద "

"ఎవరూ?"

"వాళ్ళే"

"ఏమని "

"ఇలా మాకంతా చెప్పా పెట్టకుండా ఎట్లా నువ్వు ప్రచురిస్తావోయ్ మా టపా లని అని "

"చెప్పొచ్చు గా జిలేబి చెప్పింది ఆవిడ భరోసాతోనే చేసానని "

"ఆ మాటా చెప్పా"

"ఏమన్నా రేమిటి ?"

"జిలేబి ఎం చెబ్తే అదే చేస్తా వా ? అయితే జిలేబి టపా ఎందుకు వెయ్యలేదు అని క్రాస్స్ ఎగ్జాం చేసారు "

"ఓహ్ మై గాడ్, మరి నువ్వేం చెప్పావ్"

"ఎం చెప్పమంటా వే, అసలు బుర్ర పనిచెయ్యడం లేదు "

"ఏదో ఒకటి చెప్పి నీ తంటాలు నువ్వు పడు. కాదూ, కూడదనుకుంటే , చెప్పేయి అందరకీ క్షమాపణలు "

"అంతే అంటావా ?"

"అంతే "

"నా తరపున నువ్వే చెప్పెయ్య రాదటే బామ్మా  "

"ఎం నే నెందుకు  చెప్పాలి అంట ?"

"నువ్వే కదా ఆ లిష్టు ఇచ్చింది - అందుకే "

"ఆశ దోస, అప్పలం వడ !  నేనెందుకు చెప్పాలోయ్,  అధమ పక్షం నా టపా పెట్టి వుంటే, పోనీ లే మనవాడే కదా అని కొంత సిఫారిసు చేసే దాన్ని, కాకుంటే నీ తరపున క్షమాపణలు అడిగే దాన్ని"  

"మళ్ళీ మొదటికే వచ్చావ్ ?"

"చెప్పు క్షమాపణలు దాని కి ముందు " అన్నా. "నా టపా ఎందుకు పెట్టలేదు ? "

"నీ టపా లో హెడింగ్ లో ఎం పెట్టావ్ ?"
"When its Hot its Really Cool "


"అది తెలిసిందే లే ఆ తరువాత ?"
"Copyright © 2008-2020. All rights reserved"

"సో, ?"

"సో , బామ్మా - నువ్వెంత హాట్ వైనా ట్వెంటీ ట్వెంటీ నీతో ఆడలేనే "

"ఓహ్ మై గాడ్, పోనీ వాళ్ళందరికీ పారితోషికం ఇస్తావా లేదా ? "

"తప్ప కుండా ఉంటుందే బామ్మా "

"మరి దాన్తోటే వాళ్ళు నీ మీద మా రాజీ అడ్వొకేటు గారిని కేసు పెట్టమంటే ?"

"ఓహ్ మై గాడ్ "


అడ్వొకేటు రాజీ గారు, మీకు కొత్త సంవత్సరం కి సరి  కొత్త కేసు వచ్చేసింది. ఆల్ ది బెస్ట్


చీర్స్
జిలేబి.

Sunday, January 1, 2012

Full Long குழல் - నూతన సంవత్సర శుభాకాంక్షలు ! - ಎರಡು पूर्णं ഒന്ന് दो !!

Full Long குழல் 

 నూతన సంవత్సర శుభాకాంక్షలు ! 

 ಎರಡು पूर्णं ഒന്ന് दो

బ్లాగ్ భాన్ధవులందరికీ
ఈ నూతన సంవత్సరం మీకు సర్వదా అన్ని శుభములను కలుగ చేయాలని కోరుతూ !

 యు ట్యూబ్ బ్లాగ్ 'శివాజీ  ' శ్రీ ఎందుకో ఏమో గారు

మీరు Full Long குழல் కి ఇచ్చిన న్యూ ఇయర్ గిఫ్ట్ మార్వేల్లాస్. ! నమో నమః !! 

ஒரே கிலி கிலி ப்பா இருககும்கோ!
நன்றி 'நீடோடி வாழ்க ! 'வளர்முடன்' !

?! గారు ఇచ్చిన గిఫ్టు ఇక్కడ చూడవచ్చు.



శ్రీ కృష్ణం వందే జగద్గురుం

జిలేబి.

Saturday, December 31, 2011

సంవత్సరం 2011 నేను చదివిన చదువుతున్న పుస్తకాలు

అదేమిటో నండీ , ఈ పుస్తకాలు ఏమి చదివామో ఒక సారి సమీక్ష చేసుకోవాలి అనుకున్నాను. అనుకున్నదే తడవుగా సరే ఈ రెండు వేల పద కొండు లో ఏమేమి చదివామబ్బా అని ఆలోచిస్తే ఈ ఒకటో రెండో పుస్తకం తప్పించి పూర్తి గా ఏదీ చదవలేదు.

పుస్తకాలు చదవడమన్నది నా వరకైతే ఒక పారలెల్ ప్రాసెస్సింగ్. ఎ ఒక్క పుస్తకాన్ని పూర్తిగా వెంటనే చదివిన పాపం పుణ్యం కట్టు కోలేదంటే మీరు నమ్మాలి. ఎందుకంటే మనం చదివే దానికి 'సోమ్బెరు' లన్న మాట. 'కప్పు ' దాటు , చాటు వారలం. ఒక పుస్తకం కొంత బోర్ గా వుంది అనుకుంటే దాన్ని వదలి వేరే పుస్తకాని కి వెళ్ళడం , అది బోర్ అనుకుంటే మరో దానికి వెళ్ళడం, ఆ పై మొదటి పుస్తకాని కి రావడం, మొత్తం మీద నా వరకైతే రెఫ్రెషింగ్ సబ్జెక్ట్. (ఈ ట్రెండ్ మీరు ఈ బ్లాగు టపాల లో కూడా గమనించి వుంటారు. - లేదే అంటారా - అబ్బా, మీరు గమనించారండీ, కాని కాస్త చెప్పడానికి మోహ మాట పడి వుంటారు అంతే సుమా!). సో, దీన్ని బట్టి నా రాశీ మీకు తెలిసి ఉంటుందను కుంటాను. (వ్రాత రాశి కాదు మరి అంటారా అది వేరే విషయం !)


ఈ చదివిన దానిలో కొన్ని ఈ-పుస్తకాలు  కూడా. ( వేదం కూడా - రిగ్వేదం స్పెసిఫిక్ గా - ఓ మారు పూర్తిగా తిరగేసానంటే మీరు నమ్మాలి - ఈ ఈ పుస్తకం సాంస్క్రిట్ డాక్యుమెంట్స్ డాట్ ఆర్గ్ లో వుంది ). సంస్కృతం అంత గా తెలీదు కాబట్టి ( తెలుగు తెలిసిన వాళ్లకి సంస్కృతం అంత గా కష్టం కాదనుకోండీ, అయినా, అప్పుడప్పుడు చాలా సందేహాలు వచ్చేస్తోంటాయి, ఉదాహరణకి నాసదీయ సూక్తం చదివేటప్పుడు - దీని కి నా పరిధిలో లో ఎక్కడో ఈ బ్లాగులో నే ఓ భావాను వాదం కూడా రాసాను - ఈ వేదం విషయం స్పెసిఫిక్ గా ఎందుకు రాసానో మీరు ఇప్పటికే గ్రహించేసి వుంటారు ) !

సో, ఆ పుస్తకాల ఫోటో లు ఇక్కడ పెడుతున్నాను. ఇవన్నీ ఇంకా పారల్లెల్ గా నే 'చల్' తూ వున్నాయి. ఇందులో ఒకటి కూడా  తెలుగు పుస్తకాలూ లేవేమిటండీ అంటారా ? నాకు తెలుగు రాయటం మాత్రమే వచ్చు, చదవటం రాదు, ప్రొబ్లెం !  అంతే గాక మేము 'తెల్గూ' వాళ్ళం, తెల్గు మాట్లాడం, చదవం మరీ. జేకే. !!




 






ప్రస్తుతానికి, అంటే ఈ టపా రాసే నాటికి 'చల్తూ' ఉన్న గాడీ ఇది. !!



ఇలా కొన్ని. మరి కొన్ని కూడా వున్నాయి. కాని మరీ బోర్ కొట్టేస్తుందేమో ? అందువల్ల ఇప్పటికి ఇక్కడే ఆపేస్తాను.

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో

చీర్స్
జిలేబి.

Friday, December 30, 2011

మా వేదం లో అన్నీ ఉన్నాయిష !

గూగుల్ వాడు "ఆడు సెన్సులు " పెట్టన్గానే జనాలు గూగుల్ మీద రిసెర్చ్ చేసి టాప్ కీ ఎడ్ వార్డ్ ల జాబితాలు మీకు కావాలా ? మమ్మల్ని సంప్రదించండి అనగానే జిలేబీలకి ఆశ పడిన ఒక జిలేబి ఈ "ఆడు సెన్సులు " అనగా ఏమి అని 'క్యూరియాసిటీ 'క్యాటును' కాటు వేసిందన్న చందాన కొంత సమయం వెచ్చించి ఆ పై ఇందులో 'ఆడడానికి ఎ సేన్సూ లేదు ' అనుకుని ' అందని ద్రాక్ష పండు పుల్లన ' అనుకుందట.


అట్లాంటి 'ఆడు సెన్సులు' గల 'ఆడు కీ వార్డ్ లు మన బ్లాగ్ లోకం ఈ మధ్య కాలం లో


౧. వేదం


ఈ పదం వేయంగానే మన 'సెన్సులు' ఆడు ను. ఈ ఎడ్ వార్డ్(కాకుంటే హేవార్డు ) చూడంగానే మన 'అంగుళీ యములు నాట్యము ఆడును.


మన వేదం లో అన్నీ ఉన్నాయిష !

౨. .ఈ పదం నేను చెప్పను. చాలా controversial !


హమ్మయ్య భంసు ! నేను కూడా ఒక స్టార్ టపా కి అర్హురాలినై పోయాను !

ఈ బ్లాగ్గర్ వాడు కామెంటులు సెలెక్టివ్ టపా కి disable ఆప్షన్ పెట్టలేదేమిటీ ?


చీర్స్
జిలేబి.

Thursday, December 29, 2011

బుజ్జి పండు తెలుగు చదువు - 9 - (భామా విజయం - 4 )

"సో యువర్ ఆనర్," అడ్వొకేటు రాజీ గారు గొంతు సవరించుకున్నారు.

తిరుప్పావై మొదటి పాశురం వారికి గుర్తుకొచ్చింది.

"నన్దగోపన్ కుమరన్
ఏరార్ న్ద కణ్ణి యశోదై యిళంశింగమ్
కార్మేనిచ్చజ్ఞ్గణ్ కదిర్మదియం బోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పరైతరువాన్
పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్."


నందునిఅనుంగుబిడ్డ, నీలమేఘశ్యాముడు, పద్మనేత్రుడు యశోదముద్దుపట్టి, బాల కిశోరం చెప్పిన గీత కి ఈవాళ ఇక్కడ బహిష్కారమా కాదా అన్న వీరి కేసుకి శ్రీ కృష్ణుడు తనని ప్రెసెంట్ చేయమనడం తన పూర్వ జన్మ సుకృతం !

శ్రీ కృష్ణుల వారు చిద్విలాసం గా రాజీ గారిని గమనిస్తున్నారు. ఈ అమ్మాయిని తను అడ్వొకేటు గా ఉండమనడం ఈ అమ్మాయికి సొబగైన వ్యవసాయం ఐనది. తన భగవద్గీత ని క్షుణ్ణం గా  ఇంకో మారు చదివి మరీ ఇక్కడి కి వచ్చింది -

ఈ కేసు దెబ్బతో చదివని వాడు గూడా జాడ్యం వదిలించుకుని తా జెప్పిన గీతలో ఏముందో అన్న క్యూరియాసిటీ తో చదువు తాడేమో రాబోయే కాలం లో. 

అయినా ఆ కాలం లో అర్జునుడే చాలా కష్ట పడ్డాడు తాను చెప్పిన గీత ని అర్థం చేసుకోలేక.

కాలం మారింది. మనిషి కూడా చాల విజ్ఞాన వంతుడయ్యాడు. కాబట్టి ఒక వేళ క్షుణ్ణం గా చదివితే ఈ కాలం లో అర్థం చేసుకుంటాడేమో ! చూద్దాం ఈ రాజీ ఏమని వాదిస్తుందో ? కేసు గెలిస్తే ఏమి ఓడితే ఏమి ? తాను చెప్పాల్సింది చెప్పేసాడు. "Whether some body takes it or not its their Karma!"

రాజీ 'ఘనమైన కోర్టు వాళ్ళని చూసింది.

"యువర్ ఆనర్, మా శ్రీ కృష్ణుల వారు చెప్పిన గీతలో ఒక వాక్యం ఇక్కడ కోట్ చేస్తాను వినండి.

"You only control your action. Not the results. So be not motivated by results, nor be attached to inaction"

కోర్టు లో ని జడ్జి గారి కి తల గిర్రున తిరిగింది. ఇట్లాంటి సిద్ధాంతం ఎప్పుడూ విని ఉండలేదు ఆయన. ఆలోచించాడు. ఈ వాక్యం తన పుస్తకం లో రాసుకుని వంద సార్లు చదివిన తనకి అర్థం కాలేదు. తను లా చదివే టప్పుడు తన గురువు గారు చెప్పిన లాయరు సూక్తం గుర్తుకొచ్చింది ఆయనకీ. లా అన్నది లాయర్ ల కి మాత్రమె అర్థం అవ్వాలి. జన సాధారణానికి అర్థం కాకూడదు. అప్పుడే అది లా అనబడును - అదీ ఆయన నేర్చుకున్న ప్రధమ సూక్తం. ఆ ప్రకారం చూస్తె ఈ గీత తనకే అర్థం కాలేదు ఇన్ని మార్లు తిరగేసినా - కాబట్టి ఇది భారద్దేశం లో లా పుస్తకం అయివుండవచ్చు.
"Law has given me this Judge post! To which ever country this belongs, I donot care, but I need to respect Law"

అని ఆ జడ్జీ వారు ఒక నిర్ణయానికి వచ్చి " ఈ గీత లో బహిష్కారం చెయ్య వలసినది ఏదీ నాకున్నట్లు కనిపించడం లేదు. మీదు మిక్కిలి ఈ పుస్తకాన్ని వెంటనే పెర్ఫెక్ట్  గా మన దేశ భాషలో తర్జుమా చేసుకుని లా చదివే వాళ్లకి పుస్తక పాటం గా కూడా పెట్టుకునేలా చెయ్యాలి " అని ఓ జడ్జిమెంటు బర బర గీకి ఆయన ఎంచక్కా పోయారు.

శ్రీ కృష్ణు ల వారు ఈ మారు ముక్కు మీద వేలు పెట్టు కున్నారు. ఔరా, ఈ కాలపు రాధికలు మరీ ఘటికులే ! ఒక్క వాక్యం తో ఈ జడ్జీ గారిని బోల్తా కొట్టిన్చారే సుమీ అని !

రాజి శ్రీ కృష్ణుల వారికి నమోవాకాలు అర్పించింది.

"స్వామీ"
"ఏమీ "
నా మనసులో వున్నది మీకు తెలియదా "
"అమ్మాయ్ మనసులో వున్నది తెలియక పోతే నీ కృష్ణున్ని నేను కాను"
"తెలిసినా నా కోర్కెను తీర్చేరేమీ "

"ఇదో అమ్మాయ్ రాజీ, నువ్వు ఈ కోర్టు కేసు గెలిచావు. నీ కోరిక బుజ్జి పండుని జర్మనీ లో కలవాలి. అంతే కదా"

"స్వామీ వారు చిద్విలాసులు. మనసులో మాటని వెంటనే కనిబెడతారు "

శ్రీ కృష్ణుల వారు చక్రం తిప్పారు. రాజీ గారు అక్కణ్ణించి మాయమయ్యారు. !

******

మ్యూనిచ్ కొనిగ్ స్త్రాస్సే నెంబర్ పదకొండో ఇంటి ముందు ఆగిన బీ ఎం డబ్ల్యూ కారు నించి బులుసు గారు, బుజ్జి పండు, మధురా దిగారు.

మధురా ఇంటి కీ ఓపెన్ చేసి "హాయ్ " అన్న గొంతు వినబడటం తో తిరిగి చూసారు. బులుసు గారు, బుజ్జి పండూ కూడా తల తిప్పి చూసారు.

వెనక రాజీ గారు - ప్రత్యక్షం గా కాన వచ్చారు. !

"ఓహ్ రాజీ గారు, వాట్ ఏ సర్ప్రైజ్! "

బులుసు గారికి తల తిరిగింది ! ఇదేమిటి ఈవిడ గారు ఎక్కణ్ణించి ఇక్కడికి వచ్చారు అని

" ఏమండీ రాజీ గారు చాల సర్ప్రైజ్ "

"అంతా శ్రీ కృష్ణుల వారి చలవ మాష్టారు "

బులుసు గారికి ఈ శ్రీ కృష్ణు ల వారు మరీ అగాతా క్రిస్టీ సస్పెన్స్ బుక్ లా అయిపోయ్యారు !

(ఇంకా ఉంది)

Wednesday, December 28, 2011

ஒரு புல்லாங்குழல் அடுப்பூதுகிறது

ஒரு புல்லாங்குழல் அடுப்பூதுகிறது

அடுப்பு ஊதினால் நெருப்பு  வரும்

நெருப்பு வந்தால் கண் எரியும்

கண் எரிந்தால் கண்ணீர் வரும்

கண்ணீர் வந்தால் மனது இளமை யாகும்

ஒரு புல்லாங்குழல்  'புல்' அரிக்கிறது !

சீரஸ்
ஜிலேபி.

Tuesday, December 27, 2011

బుజ్జి పండు తెలుగు చదువు - 8 - (భామా విజయం - 3 )


"ఏమమ్మా మధురా !  మీ దేశం లో జనాలు మాట్లాడనే మాట్లాడరా?! ఇంత నిశ్శబ్దం గా వున్నావు "

అంటూ వందా యాభై కిలోమీటర్ల పైబడ్డ వేగం తో వెళుతున్న
 'నిశ్శబ్దమైన ' కారు లో బులుసు గారు మొదటి మారు నోరు విప్పారు ఆ సైలెన్స్ కి భయపడి.

శ్రీ కృష్ణుల వారికి నమో నమః నమో నమః అంటూ కోటి మొక్కులు తెలియ చేసుకుంటున్న మధుర ఉలిక్కి పడింది.

జర్మనీ దేశం లో హటాత్తు గా ఎవరైనా తప్పి పలకరిస్తే వచ్చే మొదటి రిఎక్షన్ అది.


"అమ్మాయ్ , నీ అనుమతి లేకుండా ఈ బుజ్జి పండు ని కూడా నాతో వచ్చేయమని లాక్కోచ్చేసాను. తనకి అమెరికన్ పాస్పోర్ట్ వుండటం తో ఎగ్జిట్ కి ఎ ప్రాబ్లం లేకుండా పోయింది. నీకేమీ సమస్య లేదు కదా ?" అడిగారు బులుసు గారు.

రోగి కోరిన మందే వైద్యుడిస్తే ఎవరన్నా వద్దంటారా ?

"మాష్టారు ! మీరు బుజ్జి పండుని బయటకు తీసుకు రావడానికి కారణం బుజ్జి పండు అమెరికన్ పాస్స్పోర్ట్ కానే కాదు ! " చెప్పింది మధుర రియర్ వ్యూ మిర్రర్ లో చూస్తూ.

"మరి?"

"మా శ్రీ కృష్ణుల వారే ! " తన్మయత్వం తో కనులు మూసుకుంటూ చెప్పింది. వెనక వొస్తున్న కారు వాడు 'పాం' అంటూ సైడు తీసుకుని ఓ సీరియస్ ముఖం పెట్టి వెళ్ళాడు.

" శ్రీ కృష్ణుల వారంటే ఎవరు మధురా ? నీకు తెలిసన కస్టమ్స్ ఆఫీసరా ?" ఇండియా లో లాగా ఇక్కడ కూడా సిఫారుస్లు చెల్లుతాఎమో అని సందేహం గా అడిగారు బులుసు వారు.

"కాదండీ సాక్షాత్తు శ్రీ కృష్ణుల వారే ! రాధికా కృష్ణుల వారే "

మధుర జవాబు విని బులుసు గారు సీరియస్ గా చూసారు ఈ మారు మధుర వైపు. ఈ అమ్మాయి కి బ్లాగుల్లోనే శ్రీ కృష్ణుల వారి పైత్యం అనుకుంటే నిజంగానే శ్రీ కృష్ణులవారి వల్ల బుజ్జి పండు ఎగ్జిట్ అయ్యాడు అంటూ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్దేమిటి ?  అని కొంత సందేహం గా చూసారు మధుర వైపు వారు.

"బుజ్జీ , నీ పాస్స్పోర్ట్ అమెరికన్ పాస్? " మధుర నవ్వుతూ అడిగింది.

మధుర పక్క సీట్ లోనే కూర్చుని జర్మనీ ఆటోబాన్ ని శ్రద్ధ గా గమనిస్తున్న బుజ్జి పండు తలని అడ్డం గా ఊపి, "కాదండీ ఫ్రౌ మధుర గారు , నాది ఇండియన్ పాస్స్పోర్టే నండీ " అన్నాడు !

ఈ మారు ఆశ్చర్య పోవడం బులుసు గారి వంతయ్యంది. అక్కడ ఇంటర్నేషనల్ ఎగ్జిట్ లో ఆ పాస్స్పోర్ట్ ఆఫీసరు అమెరికన్ పాస్స్పోర్ట్ ఉందనే కదా బుజ్జి పండుని ఎగ్జిట్ కానిచ్చాడు అని బుర్ర గోక్కున్నారు వారు.

జరిగినది మొత్తం టూకీ గా మధుర చెప్పింది బులుసు గారికి. శ్రీ కృష్ణులవారి వల్లే  బుజ్జి  ఎగ్జిట్ కానివ్వటం జరిగిందని.

"ఈ కాలం పిల్లలు ప్రాక్టికల్ జోక్ వెయ్యడం లో సిద్ధహస్తులు " అనుకుని వారు "బుజ్జీ నీ పాస్పోర్ట్ చూపించు" అన్నారు సందేహం తో బుజ్జి పండు వైపు చూస్తూ.

బుజ్జి పండు పాస్స్ పోర్ట్ చూపించాడు.  అది వారికి అక్షరాల అమెరికన్ పాస్స్పోర్ట్  లానే వుంది, పక్షి రాజు అలంకృతమై !

" మాష్టారు మీరు నమ్మరు కదా ? "

"నమ్మక పొవట మన్న ప్రశ్నే లేదు అంత ఖచ్చితం గా పక్షి రాజు కనబడు తూంటేను !"

"పోనీ మీ కాళ్ళ వైపో మారు చూడండీ "

"అదేమిటో నమ్మాయ్, ఇండియా లాగా ఫ్రీ గా చెప్పులతో వచ్చేసాను ఇక్కడి చలికి కాళ్ళు తిమ్మి రెక్కుతున్నాయి " తన కాలి వైపు చూస్తూ అన్నారు బులుసు వారు.

బులుసు వారు కాళ్ళ వైపు చూసి ముక్కు పై వేలేసుకుని తన కాళ్ళకి అంత మాంచి బూట్లు వేసుకుని ఈ పెద్దాయన చెప్పులు అంటారేమిటీ అని ఆశ్చర్య పోయింది మదుర ఈ మారు.

"అదేమిటండీ బులుసు వారు, అంత తళ తళ లాడే బూట్లేసుకుని చెప్పులు అంటారేమిటీ ?"

"దునియా పాగల్ హాయ్ , యా ఫిర్ మై దీవానా " అన్న పాత పాట గుర్తుకొచ్చింది వారికి. !!

బుజ్జి పండు బ్లాక్ పాస్ పోర్ట్ నించి మూడు సింహాలు ముసి ముసి గా నవ్వు కున్నేయి అశోకుని కాలం ముందు నించే భారత దేశం లో శ్రీ కృష్ణుల వారి మాయలు చూసిన సింహాలు అవి మరి !

కారు మ్యూనిక్ నగరం కొనిగ్ స్త్రాస్సే  పద కొండు నెంబర్ ఇంటి ముందు స్లో గా పార్కింగ్ స్లాట్ లో కొచ్చింది ఆటో బాన్ నించి మాయమై ఈ మారు!

(ఇంకా వుంది)

Monday, December 26, 2011

ఫ్లాష్ ఫ్లాష్ - స్వామి భాస్కర చేతానంద స్వామీ వారు భారద్దేశం రాక !

ఫ్లాష్ ఫ్లాష్ -
స్వామి భాస్కర చేతానంద స్వామీ
వారు భారద్దేశం రాక !

హారం లో
వ్యాఖ్యలు
బ్లాగర్  వి బ్లాకు
అయిపోయినాయి !

స్వామి వారు భారద్దేశం లో కనిపించిన
వెంటనే రిమాండు (అప్పు తచ్చు) కి పంపవలె

ఇట్లు
పోలీసు శాఖ !

చీర్స్

జిలేబి.

Sunday, December 25, 2011

Jesus జిలేబీయం

Just be
in
love &
ever
be
in Him!


క్రిస్స్మస్సు శుభాకాంక్షలతో

జిలేబి.

Saturday, December 24, 2011

బుజ్జి పండు తెలుగు చదువు - 7 - (భామా విజయం - 2 )

మ్యూనిక్  మహానగరం.

ఓ అమ్మాయి చూడడానికి ఇండియన్ లా వుంది. 

చలి విపరతీం గా ఉండటం తో మెడ చుట్టూ మఫ్లర్ , తలకి స్కార్ఫ్. 

రిసెర్చ్ సెంటర్ నించి బయటకు  వచ్చి రిస్ట్ వాచ్ లో టైం చూసుకుని తన కారు ఎక్కి డాష్ బోర్డ్ పై వున్న శ్రీ కృష్ణ స్వాముల వారి ఫోటో కి ఓ నమస్కారం సమర్పించుకుని కార్ ని ఫ్రాంక్ఫర్ట్ నగరం వైపు కి వెళ్ళడానికి ఉత్తరం వైపు తిప్పి ఆటో బాన్ ఎ నైన్ ఎగ్జిట్ వైపు సాగించింది.

శ్రీ కృష్ణ స్వాముల వారి పై అమితానురాగాలతో రీసెర్చ్ చేసే మన మధురవాణి గారు ఈవిడే నని నేను వేరు గా చెప్పనక్కర్లేదనుకుంటా !

దాదాపు నాలుగు వందల కిమీ పై చిలుకు ప్రయాణం. ఓ మోస్తరు నాలుగు గంటలలో ఫ్రాన్క్ఫర్టు చేరుకోవచ్చని తీరిగ్గా ఆలోచనలో పడింది మధుర.

బుజ్జి పండుని కిడ్ నాప్ చెయ్యాలి అనుకున్నది గాని, ఎలా చెయ్యాలో తెలియకుండా పోయింది. ఆ ఐడియా వచ్చినప్పటి నించి మధుర శ్రీ కృష్ణుల వారిని పిలుస్తోన్నే వుంది. స్వామీ నీవే ఏదైనా ఉపాయం చూడు అని.

ఎందుకో ఎప్పట్లా ఈ మారు స్వామి వారు పలకడం లేదు. వున్నారో లేదో అన్న సందేహం కూడా వస్తోంది తనకి. ఎప్పుడు పిలిచినా వెంటనే పలికే కన్నయ్య ఈ మారు ఎందుకో ఏమో తెలీదు అస్సలు పత్తా లేకుండా పోయాడు.

ప్రయాణం లో అలుపు తెలీకుండా 'ఘంటసాలవారి అష్టపది వింటూ 'తవ విరహే కేశవా ' కృష్ణా రాధికా కృష్ణా రాధికా అంటూ ఆటో బాన్  మీద రెండువందల కిలో మీటర్ వేగాన్ని కారు కి అందనిచ్చింది మధుర వాణి, కృష్ణా ఏమైనా ఉపాయం చెప్పవూ అంటూ.

ఊహూ, శ్రీకృష్ణుడు అస్సలు పత్తా లేదు.

హే కృష్ణా ముకుందా మురా ఆ ఆ రే .... అంటూ ఈ మారు ఘంటసాల వారి గొంతు ఆకాశాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తే , తాను ఆటో బాన్ మీద వెళ్తున్నాన్నదాన్ని మరిచి హే కృష్ణా అంటూ స్టీరింగ్ పై నించి రెండు  చేతులూ వదలిసింది మధుర వాణి!

రష్యా లో కోర్టు కేసులో హాజరవుతూన్న శ్రీ కృష్ణుల వారు ఉలిక్కి పడి అక్కడ్నించి తటాలు న మాయ మయ్యారు, తన అడ్వొకేట్ అయిన రాజి కి మాట మాత్రం కూడా చెప్పకుండా , అడ్వొకేటు రాజి గారు కృష్ణా , వెళ్ళకు ఆగు, కేసు ఫైనల్ హియరింగ్ జరుగుతోంది అని గాబారా పడుతూ చెబ్తూంటే వినిపించుకుంటేనా స్వామీ వారు!

***

'అమ్మాయ్ , అమ్మాయ్ మధురా - నువ్వు ఆటో బాన్ లో వున్నావ్ , ఇట్లాంటి చేష్టలు ప్రాణ హానికరం' అంటూ సున్నితం గా సుతారమైన గొంతు ఈ మారు బాక్ సీట్ నించి విన రావడం తో ఉలిక్కి పడి ఈ లోకం లో కి వచ్చి మధుర రియర్ వ్యూ మిర్రర్ లో ఎవరా అని చూసింది.

నెమలి పించం , లలాట ఫలకే కస్తూరి తిలకం  అంత దాకా శ్రీ కృష్ణుల వారిలా వున్న ఆ ఆకారం ... ఆ పై వేషం వేరుగా వుండి, కొటూ , సూటూ,  కంఠం లో ముక్తా వళీ లా టై  పడమటి కేళీ విలాసం లా గున్నాడా పెద్ద మనిషి. !

' స్వామీ ! ఇదేమి కొత్త వేషం ఈ మారు ? ' స్వామిని గాంచిన మహదానందం తో అడిగింది మధుర.

'ఏమని చెప్పనమ్మాయ్ మధురా!  నేనెప్పుడో చాలా కాలం క్రితం మా అర్జునినికి గీత చెప్పాను. అది నా తలరాత లా అయిపోయింది.

 రష్యా లో గీత కి చరమ గీతం పాడాలని కొందరు కోర్టు కి ఎక్కారట.

మా అర్జునుడు ఒకటే గొడవ, బావా నీవే వచ్చి దానికి వకాల్తా తీసుకోవాలి ! నీ గీతను నువ్వే కాపాడుకోవాలి అని వాడు చేతులెత్తేసాడు.

పోనీలే అని రష్యా కోర్టు కెళ్ళి అక్కడి తతం గం లో తలమునకలై వుంటే నీ 'గజేంద్ర' పిలుపు ఆర్తనాదం వినిపించి, ఆ కోర్టు కేసు వాళ్ళ తలరాతకి వదిలేసి, అలాగే వచ్చేసాను !

అబ్బ ఒక్కటే చలి ప్రదేశం అమ్మాయ్ ఈ రష్యా దేశం ! అంటూ కోటు ని మరీ దగ్గిరగా కప్పుకున్నారు శ్రీ కృష్ణ స్వాములవారు - "ఇంతకీ  ఎందుకు నన్ను పిలిచినట్టు ?"  అని అడుగుతూ.

'స్వామీ ! బుజ్జి పండు ఫ్రాంక్ఫర్ట్ ఇంటర్నేషనల్ ఏరియా లో వున్నాడు. అతన్ని ఎలా బయటకి రప్పించి నేను మ్యూనిచ్ తీసుకెళ్లాలో నాకు తెలియటం లేదు. నీవే నాకు మార్గం చూపెట్టాలి ' అని మొర పెట్టుకున్నది మధుర, మొత్తం కథని టూకీ గా వారికి చెప్పి.

'ఓస్, అమ్మాయ్, ఈ మాత్రం దానికి నేనెందుకు. ? నా  ప్రియ బాంధవుడు బులుసు అక్కడే కదా వున్నాడు. ఆతడే చూసుకుంటాడు సుమా , వుండు ' అంటూ చేతిని తన హృదయం మీదికి పోనిచ్చారు శ్రీ కృష్ణుల వారు.

ఇక వస్తానమ్మాయ్! నీ కారు ఏర్పోర్ట్ చేరుతోంది, చూడూ, అక్కడ గెట్ ఎ ఒన్ దగ్గిర బులుసు వారు పక్కనే బుజ్జి పండు వున్నారు గమనించు . ఇక నే మళ్ళీ రష్యా వెళ్తా ' అని కృష్ణ స్వాములవారు అంతర్ధానమయ్యారు !

ఆటో బాన్ నించి సుమారు మూడు వందల కిమీ దూరం లో వున్న ఏర్పోర్ట్  ముందర ఆగింది ఈ మారు మధుర వాణి కారు "augenblick" సమయం లో !  అంతా శ్రీ కృష్ణుల వారి మాయ  ! గెట్ ఎ ఒన్ దగ్గిర బులుసు గారు, పక్కనే బుజ్జి పండు కనపడ్డారు మధుర వాణికి!

"Vielen Dank Krishna" అంటూ మధుర వాణి సంతోషం తో అమందానందకళిత హృదయారవిందురాలై కారు దిగి, బులుసు వారికెదురేగి 'నమస్తే' మాష్టారు ' అంటూ  చెప్పి, బుజ్జి పండు వైపు తిరిగి 'హాయ్ బుజ్జి పండు' అంది మధుర.

బుజ్జి పండు బులుసు వారి వైపు తిరిగి ఎవరన్నట్టు చూసాడు ఈ మారు.

'మై డియర్ బాయ్,  మీట్ 'ఊ , ఊహూ మధుర' అని బుజ్జి పండు కి పరిచయం చేసారు మధురని బులుసు వారు.

'ఓమ్ నమో మాతా నమో నమః' అనబోయి బుజ్జి పండు తాను జర్మేని లో వున్నానని గుర్తుకొచ్చి, "Wie gehts frau madhura " అన్నాడు.

"Good Dank! und du"  మధుర చెప్పింది బుజ్జి పండు జర్మన్  ఆక్సేంట్ కి అబ్బురపడి.

"Vielen good, Dank! ' బుజ్జి పండు చెప్పాడు నవ్వుతూ - "మా స్కూల్లో జర్మన్ సెకండ్ లేన్గ్వేజీ నాకు ". ఆతని హరీ పాటర్ కళ్ళద్దాలలోంచి చమక్కుమని ఒక మెరుపు మెరిసి తెల్లటి తివాచీలా వున్న మంచు పై రిఫ్లెక్ట్ అయింది.

"Alles klaar, das ist schon" అంటూ మధుర సంతోష పడి వారిద్దర్నీ అక్కడి దగ్గిరే వున్న స్టార్ బక్స్ కి తీసుకెళ్ళింది కొంత రెఫ్రెష్ అవడానికి.

కొంత సేపటి తరువాయి, ఆ ముగ్గురు వున్న మధుర కారు మ్యూనిక్ వైపు పరుగులేట్టింది. . బులుసు కాలికి నిగ నిగ లాడే కొత్త బూట్లు ఆ కారు కలర్ కి కామ్పీట్ చేశాయి ఈ మారు !

(ఇంకా ఉంది)