"ఏమమ్మా మధురా ! మీ దేశం లో జనాలు మాట్లాడనే మాట్లాడరా?! ఇంత నిశ్శబ్దం గా వున్నావు "
అంటూ వందా యాభై కిలోమీటర్ల పైబడ్డ వేగం తో వెళుతున్న
'నిశ్శబ్దమైన ' కారు లో బులుసు గారు మొదటి మారు నోరు విప్పారు ఆ సైలెన్స్ కి భయపడి.
శ్రీ కృష్ణుల వారికి నమో నమః నమో నమః అంటూ కోటి మొక్కులు తెలియ చేసుకుంటున్న మధుర ఉలిక్కి పడింది.
జర్మనీ దేశం లో హటాత్తు గా ఎవరైనా తప్పి పలకరిస్తే వచ్చే మొదటి రిఎక్షన్ అది.
"అమ్మాయ్ , నీ అనుమతి లేకుండా ఈ బుజ్జి పండు ని కూడా నాతో వచ్చేయమని లాక్కోచ్చేసాను. తనకి అమెరికన్ పాస్పోర్ట్ వుండటం తో ఎగ్జిట్ కి ఎ ప్రాబ్లం లేకుండా పోయింది. నీకేమీ సమస్య లేదు కదా ?" అడిగారు బులుసు గారు.
రోగి కోరిన మందే వైద్యుడిస్తే ఎవరన్నా వద్దంటారా ?
"మాష్టారు ! మీరు బుజ్జి పండుని బయటకు తీసుకు రావడానికి కారణం బుజ్జి పండు అమెరికన్ పాస్స్పోర్ట్ కానే కాదు ! " చెప్పింది మధుర రియర్ వ్యూ మిర్రర్ లో చూస్తూ.
"మరి?"
"మా శ్రీ కృష్ణుల వారే ! " తన్మయత్వం తో కనులు మూసుకుంటూ చెప్పింది. వెనక వొస్తున్న కారు వాడు 'పాం' అంటూ సైడు తీసుకుని ఓ సీరియస్ ముఖం పెట్టి వెళ్ళాడు.
" శ్రీ కృష్ణుల వారంటే ఎవరు మధురా ? నీకు తెలిసన కస్టమ్స్ ఆఫీసరా ?" ఇండియా లో లాగా ఇక్కడ కూడా సిఫారుస్లు చెల్లుతాఎమో అని సందేహం గా అడిగారు బులుసు వారు.
"కాదండీ సాక్షాత్తు శ్రీ కృష్ణుల వారే ! రాధికా కృష్ణుల వారే "
మధుర జవాబు విని బులుసు గారు సీరియస్ గా చూసారు ఈ మారు మధుర వైపు. ఈ అమ్మాయి కి బ్లాగుల్లోనే శ్రీ కృష్ణుల వారి పైత్యం అనుకుంటే నిజంగానే శ్రీ కృష్ణులవారి వల్ల బుజ్జి పండు ఎగ్జిట్ అయ్యాడు అంటూ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్దేమిటి ? అని కొంత సందేహం గా చూసారు మధుర వైపు వారు.
"బుజ్జీ , నీ పాస్స్పోర్ట్ అమెరికన్ పాస్? " మధుర నవ్వుతూ అడిగింది.
మధుర పక్క సీట్ లోనే కూర్చుని జర్మనీ ఆటోబాన్ ని శ్రద్ధ గా గమనిస్తున్న బుజ్జి పండు తలని అడ్డం గా ఊపి, "కాదండీ ఫ్రౌ మధుర గారు , నాది ఇండియన్ పాస్స్పోర్టే నండీ " అన్నాడు !
ఈ మారు ఆశ్చర్య పోవడం బులుసు గారి వంతయ్యంది. అక్కడ ఇంటర్నేషనల్ ఎగ్జిట్ లో ఆ పాస్స్పోర్ట్ ఆఫీసరు అమెరికన్ పాస్స్పోర్ట్ ఉందనే కదా బుజ్జి పండుని ఎగ్జిట్ కానిచ్చాడు అని బుర్ర గోక్కున్నారు వారు.
జరిగినది మొత్తం టూకీ గా మధుర చెప్పింది బులుసు గారికి. శ్రీ కృష్ణులవారి వల్లే బుజ్జి ఎగ్జిట్ కానివ్వటం జరిగిందని.
"ఈ కాలం పిల్లలు ప్రాక్టికల్ జోక్ వెయ్యడం లో సిద్ధహస్తులు " అనుకుని వారు "బుజ్జీ నీ పాస్పోర్ట్ చూపించు" అన్నారు సందేహం తో బుజ్జి పండు వైపు చూస్తూ.
బుజ్జి పండు పాస్స్ పోర్ట్ చూపించాడు. అది వారికి అక్షరాల అమెరికన్ పాస్స్పోర్ట్ లానే వుంది, పక్షి రాజు అలంకృతమై !
" మాష్టారు మీరు నమ్మరు కదా ? "
"నమ్మక పొవట మన్న ప్రశ్నే లేదు అంత ఖచ్చితం గా పక్షి రాజు కనబడు తూంటేను !"
"పోనీ మీ కాళ్ళ వైపో మారు చూడండీ "
"అదేమిటో నమ్మాయ్, ఇండియా లాగా ఫ్రీ గా చెప్పులతో వచ్చేసాను ఇక్కడి చలికి కాళ్ళు తిమ్మి రెక్కుతున్నాయి " తన కాలి వైపు చూస్తూ అన్నారు బులుసు వారు.
బులుసు వారు కాళ్ళ వైపు చూసి ముక్కు పై వేలేసుకుని తన కాళ్ళకి అంత మాంచి బూట్లు వేసుకుని ఈ పెద్దాయన చెప్పులు అంటారేమిటీ అని ఆశ్చర్య పోయింది మదుర ఈ మారు.
"అదేమిటండీ బులుసు వారు, అంత తళ తళ లాడే బూట్లేసుకుని చెప్పులు అంటారేమిటీ ?"
"దునియా పాగల్ హాయ్ , యా ఫిర్ మై దీవానా " అన్న పాత పాట గుర్తుకొచ్చింది వారికి. !!
బుజ్జి పండు బ్లాక్ పాస్ పోర్ట్ నించి మూడు సింహాలు ముసి ముసి గా నవ్వు కున్నేయి అశోకుని కాలం ముందు నించే భారత దేశం లో శ్రీ కృష్ణుల వారి మాయలు చూసిన సింహాలు అవి మరి !
కారు మ్యూనిక్ నగరం కొనిగ్ స్త్రాస్సే పద కొండు నెంబర్ ఇంటి ముందు స్లో గా పార్కింగ్ స్లాట్ లో కొచ్చింది ఆటో బాన్ నించి మాయమై ఈ మారు!
(ఇంకా వుంది)
బులుసుగారినే ఆశ్చర్య పడేలా మధుర చేసిన మాయఏమి?నిజముగా విష్ణుమాయా
ReplyDeleteదునియా పాగల్ హాయ్ , యా ఫిర్ మై దీవానా!!
ReplyDeleteసబ్ కుచ్ లుటాకె హోష్ మె ఆయేతొ క్యాకియా ....
ReplyDelete.........
దిన్ మె అగర్ షరాబ్ ఆగ్ జలాదియా తో క్యా కియా ....
కూడా గుర్తు కు వచ్చి ఉండాలి బులుసు గారికి.
మీ కృష్ణుడికి ఆ కోటు జేబులో ఓ మిలియన్ యూరో లు కూడా కుక్కమని చెప్పండి pl.
@కష్టే ఫలే మాష్టారు,
ReplyDeleteబులుసు గారినే మాయ జేసిన మధుర మాయ శ్రీ కృష్ణ మాయ!
సుభ గారు,
ReplyDeleteరెండున్నూ! ఒక దానికి ఒకటి పోటీ పడుతోందన్న మాట
@బులుసు గారు,
ReplyDeleteశ్రీకృష్ణుల వారే పక్క గ వుండగా, మిల్లియన్ యూరో లేమి ఖర్మ, బొక్కసం అంతా మీదే !
చీర్స్
జిలేబి.
ఈ భాగం చదవకుండానే ముందుభాగం లో కమెంటేసాను.... అయితే ఆ చెప్పుల/బూట్ల రహస్యం ఇక్కడ దాగుంది అన్నమాట....
ReplyDelete