Tuesday, January 3, 2012

"లింక్ లీక్స్"- రాధా ఎంత పని చేసావు !!!


"ఏమోయ్ రాధా , మా బులుసు గారి, మరిన్ని బ్లాగువాళ్ళ కథల్  వేసుకున్నావ్ ! మరి నా టపా ఒక్కటి కూడా ప్రచురించ లేదే ?"

మా మనవడు రాధ ని నిలదీసి ఇవ్వాళ అడిగాను. అడగటమే కాదు కడిగేసాను కూడా.

"ఇదిగో , బామ్మ, ఆల్రెడీ ప్రాబ్లెం లో వున్నాను, మధ్య లో నీ సోదేమిటి ?" అన్నాడు మా రాధ.

"ఆయ్ అంత మంది బ్లాగర్ల లిస్టు ఇచ్చాను నీకు వాళ్లదంతా  టపాలు సర్ప్రైస్ గ పబ్లిష్ చెయ్య వోయ్ అని - కొత్త సంవత్సరం లో వాళ్ళంతా సంతోష పడతారు అని . దాంతో బాటే నాదీ పబ్లిష్ చేస్తావనుకున్నానోయ్ మనవడా " అన్నా ఉన్న చనువుతో .

"అన్నావు, మరి ఆ లిస్టు లో నీ బ్లాగు ఎందుకు చేర్చ లేదు నువ్వు  ?" చికాకుగా ముఖం పెట్టాడు వాడు, "తప్పు నాది కాదు, ఆ లిష్టు ది "

"చెప్పాగా, నీకు తెలిసిన ముసలవ్వనేగా నా టపా ప్రింటు చేస్తే నీ కేం పొయ్యేది ?" అడిగాను డిమాండు చేసి.

"ఇదిగో బామ్మా,  అసలే ప్రాబ్లెం లో వున్నా, మరీ చీకాకు పెట్టకు " చెప్పాడు రాధ.

"ఏమిటోయ్ నీకొచ్చిన తంటా" ?

"వాళ్ళందరూ ధ్వజం ఎత్తారు నా మీద "

"ఎవరూ?"

"వాళ్ళే"

"ఏమని "

"ఇలా మాకంతా చెప్పా పెట్టకుండా ఎట్లా నువ్వు ప్రచురిస్తావోయ్ మా టపా లని అని "

"చెప్పొచ్చు గా జిలేబి చెప్పింది ఆవిడ భరోసాతోనే చేసానని "

"ఆ మాటా చెప్పా"

"ఏమన్నా రేమిటి ?"

"జిలేబి ఎం చెబ్తే అదే చేస్తా వా ? అయితే జిలేబి టపా ఎందుకు వెయ్యలేదు అని క్రాస్స్ ఎగ్జాం చేసారు "

"ఓహ్ మై గాడ్, మరి నువ్వేం చెప్పావ్"

"ఎం చెప్పమంటా వే, అసలు బుర్ర పనిచెయ్యడం లేదు "

"ఏదో ఒకటి చెప్పి నీ తంటాలు నువ్వు పడు. కాదూ, కూడదనుకుంటే , చెప్పేయి అందరకీ క్షమాపణలు "

"అంతే అంటావా ?"

"అంతే "

"నా తరపున నువ్వే చెప్పెయ్య రాదటే బామ్మా  "

"ఎం నే నెందుకు  చెప్పాలి అంట ?"

"నువ్వే కదా ఆ లిష్టు ఇచ్చింది - అందుకే "

"ఆశ దోస, అప్పలం వడ !  నేనెందుకు చెప్పాలోయ్,  అధమ పక్షం నా టపా పెట్టి వుంటే, పోనీ లే మనవాడే కదా అని కొంత సిఫారిసు చేసే దాన్ని, కాకుంటే నీ తరపున క్షమాపణలు అడిగే దాన్ని"  

"మళ్ళీ మొదటికే వచ్చావ్ ?"

"చెప్పు క్షమాపణలు దాని కి ముందు " అన్నా. "నా టపా ఎందుకు పెట్టలేదు ? "

"నీ టపా లో హెడింగ్ లో ఎం పెట్టావ్ ?"
"When its Hot its Really Cool "


"అది తెలిసిందే లే ఆ తరువాత ?"
"Copyright © 2008-2020. All rights reserved"

"సో, ?"

"సో , బామ్మా - నువ్వెంత హాట్ వైనా ట్వెంటీ ట్వెంటీ నీతో ఆడలేనే "

"ఓహ్ మై గాడ్, పోనీ వాళ్ళందరికీ పారితోషికం ఇస్తావా లేదా ? "

"తప్ప కుండా ఉంటుందే బామ్మా "

"మరి దాన్తోటే వాళ్ళు నీ మీద మా రాజీ అడ్వొకేటు గారిని కేసు పెట్టమంటే ?"

"ఓహ్ మై గాడ్ "


అడ్వొకేటు రాజీ గారు, మీకు కొత్త సంవత్సరం కి సరి  కొత్త కేసు వచ్చేసింది. ఆల్ ది బెస్ట్


చీర్స్
జిలేబి.

11 comments:

  1. థాంక్యూ జిలేబీ గారు...
    అయినా కేసు పెట్టటం అవసరం అంటారా??
    వాళ్ళు చేసింది మంచి పనే కదండీ..
    పైసా ఖర్చు లేకుండా,నూతన సంవత్సరం కానుకగా
    వాళ్ళ బ్లాగులకి అంత ప్రచారం ఇవ్వటం కంటే
    గొప్ప పారితొషికం ఏముంటుంది

    :)

    ReplyDelete
  2. దీని భావమేమి తిరుమలేశ....కాపీ రైట్ పెట్టుకోమనా? లేక ప్రచురిస్తే సంతోషడమనా? ప్రచురించిన విషయం మనకెలా తెలుస్తుంది? ఏమిటో అంతా విష్ణుమాయ.....

    ReplyDelete
  3. బామ్మ గారు.. లింక్ మీరే ఇచ్చారా? అద్భుతం అండీ.. అందుకే మిమ్మల్ని మీరే మర్చిపోయారు కాబోల్సు. . మీ రాధా.. ఇచ్చినవాళ్ళ పేరు మర్చిపోవడం సహజమే కదా!క్షమాపణలు అవసరమే.. బ్లాగ్ ల్లోకి జొరబడి..రహస్యంగా ఉన్న అసలు పేర్లుని వెల్లడించారు. అలాగే పారితోషికం ఇచ్చినంత మాత్రాన,పత్రికల్లో ప్రచురించి ప్రాచుర్యం లభించినంత మాత్రాన వాళ్ళ తప్పుని క్షమించడం ఎలాగబ్బా? పరిహారం గా.. ఇంకోసారి అనుమతి తీసుకుని వేయమనండి.

    ReplyDelete
  4. రాజి గారు,

    మీ షుగర్ కోటింగు కామెంటు తో మొత్తం మీద ఇది వీగి పోయే కేసని చెప్పక నే చెబుతున్నట్టూన్నారు !



    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  5. అంతా విష్ణు మాయ జ్యొతిర్మయీ గారు,

    నాకున్నూ అర్థం కావటం లేదు. ఈ జిలేబి గారు ఊరికే ఆర్కే గప్సా కొడుతున్నారేమొనని నా సందెహం కూడాన్ను !


    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  6. వనజ వనమాలి గారు,

    అయ్య బాబొయ్, ఇది మేటరు లేకుండా టపా రాయటం ఎలా అని రాసాను చూడండీ, ఆ కోవలొనిది ! గురువు గారి టపా చదివి, ఆ కాపీ రైటు, కేసు లాంటివి బిల్డ్ అప్ అంతే ! ఆ పై రాజీ గారు కూడా ఇది వీగిపోయే కేసని పైన గుంభన గా చెప్పేసారు మరి !

    ఆ రాధే తెలిస్తే ఈ బ్లాగులు గట్రా ఎందుకండీ ! శుభ్రం గా వీలు చేరు లో కూర్చుని నేనూ ఓ వంద మందిని ఇంటెర్వ్యూ గట్రా చేసెసి వుందును కదా !

    నెనర్లు



    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  7. @ఎందుకో ఏమొ గారు,

    :)

    :):)

    :):):)

    :):):):)

    :):):):):)


    ప్రశ్నా పత్రము లీకు ఐనది. గోప్యముగా వుంచండి.!

    ప్రశ్న:

    రెండు చుక్కలు ఒక బ్రాకెట్టు చొప్పున ఒక లైను లొ వున్నవి. అలా అవి ఒక్కొక్క మెట్టే ఎక్కి ఐదు మెట్లెక్కిన మొత్తము ఎన్ని చుక్కలు బ్రాకెట్లు వుండును.


    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  8. vishnu maaya kaadanadi antaa jilebi maayaa

    ReplyDelete
  9. "మా మనవడు రాధ ని నిలదీసి ఇవ్వాళ అడిగాను. అడగటమే కాదు కడిగేసాను కూడా. "

    అద్గదీ అలా గడ్డి పెట్టండి బామ్మగారూ (ఈ ఒక్కసారికీ జిలేబీ గారు అనలేను ఏమనుకోకండి :)) వెధవాయికి. లేకపోతే బ్లాగులంటే పబ్లిక్ పాపర్టీ అనుకుంటాడా శుంఠ. అయినా మీ మెతకదనం చూసేగా మీరిచ్చిన లిస్టు పబ్లిష్ చేసి మీది మాత్రం వదిలేశాడు, మీరు ఇలా మెతకగా ఉంటె లాభం లేదు బామ్మగారూ. పోనీ చేస్తే చేశాడు కనీసం వాళ్ళకైనా ఓ ముక్క చెప్పాడా? పోనీ ఏదో వాళ్లకి ప్రచారం కల్పించాడు అని మీబోటి వాళ్ళు సర్దుకు పోయినా కలం పేర్లు వదిలేసి అసలు పేర్లు బయట పెట్టడం ఏంటండీ అప్రాచ్యపు కుంక. సపోజ్ ఇప్పుడు మీరే ఉన్నారు, ఆంధ్ర దేశంలో ఏ తండ్రైనా తన పిల్లలకి జిలేబి, చేగోడీ, జంతిక ముక్క అని పేరు పెడతాడటండీ? ఏదో మీది తీయని మనసు కాబట్టి "జిలేబీ" అనే పేరుతొ రాస్తున్నారు. మేమూ అంతే తీయగా మీ పోస్టులు చదివి పాకంతో సహా ఆస్వాదిస్తున్నాం. ఇప్పుడు ఉన్నపళంగా మిమ్మల్ని అడక్కుండా అసలు పేరు బయట పెడితే మీకెలా ఉంటుంది చెప్పండి. అది కూడా అర్థం చేసుకోలేదు ఈ వెధవ పీనుగ. మీరు ఇలా జాలిపడి ఊరుకుంటే లాభం లేదు బామ్మగారూ ఈ వెధవ చేత పదమూడో ఎక్కం అప్పజేప్పించుకుని, ఓ రెండు మూడు గంటలు గోడ కుర్చీ వేయించండి. మళ్ళీ ఇలాంటి తప్పులు చేయడు తింగరి సన్నాసి.

    (మనలో మనమాట జిలేబీ గారూ బాగా చెప్పానా? :)) )

    ReplyDelete
  10. @శంకర్ ఎస్ గారు,

    మంచి మాట సెల విచ్చారు !

    'జీరింగ్లీ'
    జిలేబి.

    ReplyDelete