Friday, March 2, 2012

గూగల్ ప్లస్ లోకము వెర్సెస్ బ్లాగు లోకము !

పూర్వ కాలం లో నారదుల వారు త్రిలోక సంచారం చేస్తూ ఒక లోక సమాచారాన్ని వేరొక లోకం లోకి మార్చి, తార్చి, వార్చి కొండొకచో మసాలా దట్టించి, నశ్యం పట్టించి, కలహ భోజనము చేసేవారని చదివినప్పుడు నాకు చాలా హాశ్చర్య మని పించేది.

జిలేబీ, ఒక లోకం లో నే మన వల్ల అలా ఇలా సంచారం చెయ్యడం కనా కష్టం గా ఉందే, ఈ నారదుల వారు, మన ప్రియతమ గురువులు ఈలా త్రిలోకాలు ఎలా సంచారం చేస్తారబ్బా అని తెగ సందేహం వచ్చేది.

నా ఆ ఆలకింపులను మన్నించి ఆ సామి నా కు ఈ జన్మ లోనే ఈ విషయాన్ని అర్థం చేసు కోవడానికి ఒక సదవకాశం ఈ 'e' లోకం లో ఇచ్చాడు !

అదేమిటంటారా , ఈ బ్లాగు లోకం లో వచ్చినప్పుడు అలా అప్పుడు అప్పుడు రాసే వారము. ఆ పై మా మన మోహనుల వారు, జిలేబీ, నువ్వు వనారణ్యాలని ఏలింది చాలు గాని, నీకు రిటైర్మెంటు ఇచ్చితి మీ బో అని ఇంటికి తరిమేక, అప్పటి దాకా హై వోల్టేజీ లో పనిచేసిన జిలేబీ, లో వోల్టేజీ కి వచ్చింది.,

మా జంబూనాధన్ కృష్ణ స్వామీ అయ్యరు గారు కూడా, ప్లేటు ఫిరాయించి, జిలేబీ, నీకు ఉన్న ఉద్యోగం అయిపోయే, కాబట్టి మళ్ళీ కిచను నువ్వే చూసుకో అని వారూ వంట గదికి పదవీ విరమణ చేసేరు.

వంట గది లో నే  లాపు టాపు పెట్టి, ఆవ్వాల్టి వంట లకి అవ్వాళే రెసిపీ లు ఇంటర్నట్ లో కనిబెట్టి దానితో బాటు టపాలు బర బర గీకేసి, కామెంటు కారాలు మిరియాలు రుబ్బి వంట చేసేది జిలేబీ.,

హాశ్చర్యం గా అప్పుడప్పుడు బ్లాగు లోకం లో సీనియర్స్ మేము అలాగా గూగుల్ బజ్జు లో ఈ లా బజ్జామండీ అని అంటే curiosity killed the cat చందాన అప్పుడే తెలుసుకున్నా బ్లాగు లోకం గాక మరో బజ్జు లోకం కూడా వున్నదని అందులో కూడా ఇక్కడి వాళ్ళు అక్కడ, అక్కడి వాళ్ళు ఇక్కడ సంచారం చేస్తూ ఉంటారని.

హవ్వా, ఈ మల్టీ లోక సంచార పాసిబిలిటి ఉండటమన్నది మన పురాణ కాలం లోనే వుందబ్బా అని నేను తెగ మురిసి పోయాను.

ఆ పై బజ్జు లు మూట కట్టి నాయని జన సందోహం బ్లాగు లోకం లోకి వచ్చారు కొంత కాలం బాటు.

ఆ తరువాయి మరో లోకం ఇప్పుడు పాపులర్ అయి పోయినట్టుంది! అదియే గూగల్ ప్లస్సాయనమః !

ఈ లోకం లో చాలా వేడిగా, వాడిగా గబ గబ కామెంటు చెండులు చేతులు మారుతున్నాయని జిలేబీ లు చుడుతున్నారని, చప్పట్లు గల గలా పారుతున్నా యని అప్పుడప్పుడు ఆ లోక సంచార వాసులు ఈ బ్లాగ్ లోకం లో తెలియ చేస్తూ, కాకుంటే వాటి గురించి ఉత్సుకతని ని కలిగిస్తున్నారు !

 సో, త్రిలోక సంచార వాసులారా ( భూలోక, బ్లాగ్ లోక, ప్లస్ లోక,...) మనమందరమూ,  పురాణ కాలం లో తెలిపిన మల్టీ లోక సంచారాన్ని మన జీవన కాలం లో అనుభవైక వేద్యం గా చవి చూస్తున్నామని దీని వల్ల గ్రహించ వలె !

అన్నీ మన పురాణాల్లోనే ఉన్నాయష !

చీర్స్
జిలేబి.

Thursday, March 1, 2012

ఆచంగ గారి ప్రశ్నలు - జిలేబీ జవాబులు !

ఆచంగ గారి ప్రశ్నలు - జిలేబీ జవాబులు !

1. మగాడు ఉద్యోగం చెయ్యకుండా ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటే ఆడువారికి సమ్మతమేనా?

తెగేసి నో. మా రాజ్యం లో tresspassers are liable to be prosecuted !

కాదూ, కూడదు, చెయ్యాలని ఆరాట పడితే సమ్మతం. Not instead of ఉద్యోగం but together with outside ఉద్యోగం ఇంట్లో పిల్ల లని చూసుకునే సద్యోగం కూడాను. (ఒకటి చేస్తే ఇంకోటి ఫ్రీ అన్న మాట !)

2. ఆడపిల్లలే అనే కారణం చేత స్కూల్లో తన్నులనుండి ఆఫీసుల్లో బాస్ తిట్లవరకూ మినహాయింపులు పొందటం లేదా? మగవారికలాంటి అవకాశమే ఉండదు. అతను పోరాడాల్సిందే.

అబ్బాయ్, చేసుకున్న వారికి చేసుకున్నంత! ఆ మినహాయింపులు మా జన్మహక్కు! ఆలాంటి అవకాశం అందరికీ రాదు. Its reserved for 50 percent category only! ఈ రీజేర్వషన్ కావాలని ఆశ పడితే మా  కొండ దేవరని చాలా తీవ్రం గా ప్రార్థించ వలె మరు జన్మ లో నైనా ఆడ జన్మ గా పుట్టించు స్వామీ అని. ఫో, నీ తంటాలు పడు అని మా కొండ దేవర ఒకింత కరుణ చూపితే, గీపితే, ఆ పై ఆడ జన్మ లభ్యమై తే, ఈ సౌకర్యాలు తో బాటు కొన్ని కష్ట నష్టాలు ఫ్రీ గా వచ్చును! వాటిని భరించ వలసి ఉండును!!!

3. తలకిందులుగా తపస్సు చేసినా మగాడు బిడ్డని కనలేడు. అలాంటప్పుడు మగాడే స్త్రీ రక్షణ, పోషణ బాధ్యతలు తీసుకున్నప్పుడు ఆడువారు పిల్లల పెంపకం చూసుకోవటానికి వచ్చిన బాధేమిటి?

నిన్ననే రాసాను - ఈ తలకిందులుగా తపస్సు చేసినా మగాడు బిడ్డని కనలేడు విషయం పై:
స్త్రీ వాది సంఘం జరిపిన కలియుగ
'పుత్రికామేష్టి' యాగ విచిత్రము జూతము రారె!
ఈ యాగ మహత్వము వశమున
భార్యకు మీసముల్ మొలిచె, బాపురె భర్తకు గర్భమాయెనే!

ఆయ్, మగాడే స్త్రీ రక్షణ , బాధ్యతలు తీసుకోవాలి. మేము మా జంబు వారిని కాఫీ ఆర్డర్ ఇచ్చి బుట్ట బొమ్మ గా కూర్చుంటాము! అంతే. మా టేబల్ కి కాఫీ  రావలె. ఆడు వారు పిల్ల ల పెంపకం అనగా, అయ్యవారు, పిల్లలని బాగుగా తయారు చేసి , జిలేబీ, అబ్బాయి , అమ్మాయి రెడీ అనగా వెంట నే వారిని షికారు కి తీసుకుని వెళ్లి , 'వారిని చూడండి , ఎంత ముద్దుగా పిల్లలని రెడీ చేసి షికారు కి తీసుకెళ్తున్నారో !' అని క్రెడిట్ కొట్టెయ్యడం మా గట్టి దనం!

4. ఒక ఆడది ఏడాదికి పాతిక లక్షలు సంపాదించగలిగినప్పుడు, యాభై లక్షలు సంపాదించే ప్రేమించనివాడిని చేసుకోవటమెందుకు? పనీపాటా లేకుండా  ప్రేమించటమే పనిగా పెట్టుకున్నవాడినికి ఒకణ్ణి చేసుకోవచ్చుగా?

అబ్బాయి, పాత కాలం లో వున్నట్టున్నావ్. డబ్బెవరికి చేదు పిచ్చోడా అని జంధ్యాల గారి చిత్రం లో అనుకుంటా ఒక పాట వుంది. కావున... పాతిక లక్షలు వున్నా యాభై పై కన్నులు వెయ్యడం (eye throwing) అనునది ఆడువారి సహజ నైజం ! ఒక కిలో బంగారం కన్నా రెండు కిలోల బంగారం ఎక్కువ అన్నది చాలా సింపల్ మాథ మే ట్రిక్ !!

5. సాధించి చట్లో పెడుతున్నది అత్తా-ఆడపడుచులైనప్పుడు దానికి మగాడిని పూర్తిగా బాధ్యుడిని చెయ్యటం ఎంతవరకూ సబబు? అత్తలు, ఆడపడుచులూ ఆడువారేకదా!

మానేజ్మెంటు  ఫండా ప్రకారం ప్రతి వ్రతం తప్పిన ప్రాజెక్టు కి ఒక scapegoat (తెలుగు లో బకరా అందురు) ఉండవలె. ఆ ప్రకారంబు గా...,

7. మగాడి తన్నుల గురించి మాత్రమే మాట్లాడేటప్పుడు ఆడువారి సణుగుడు గురించి అసలు బయటకు రాదెందుకు? (సుప్రీం కోర్టు ఆడువారి సణుగుడుని మానసిక హింసగానే పరిగణించాలని తీర్పు చెప్పింది).

సణుగుడు సైలంటు రెవల్యూషన్! తన్నులు పోలీసు జులుం. రెండిటి కి వున్న వ్యత్యాసం అది ! మీడియా  వాడికి మసాలా కావాలి. సైలెంటు వాడికి నప్పుదు!

చీర్స్
జిలేబి.

Monday, February 27, 2012

ఎందుకో ఏమో గారికి విన్నపాలు !!!

ఎందుకో ఏమో గారూ..

విన్నపాలు విన వలెను వింత వింతలు !

బ్లాగ్ లోకపు 'యుట్యూబ్ శివాజీ " గారు విన్నపం విన వలె.

శ్రీ శ్యామలీయం వారు జిలేబీ శతకాన్ని 'బ్లాగీకరణం' కానిస్తున్న సంగతి మీకు తెలిసినదే.

వారు ఇప్పటి దాక రాసిన ఎనభై కందములు నాలుగు టపాలు గా వచ్చినాయి. 

ఐదవ విడత గా ఇప్పటి దాకా పదిహేను కందములు అయ్యాయి. ఇక అతి త్వరలో వారి శతకం పూర్తి కావస్తోంది.

ఈ సందర్భం గా మీతో వినతి ఏమనగా ... మీరు దయ చేసి, మీ 'వీడియో ' ఆడియో ' తెకినీకులు ఉపయోగించి , ఈ శతకాన్ని 'యుట్యూబ్ వీడియో గా మార్చి వారికి బహుకరించ వలె నని చిరు విన్నపం !

ఇప్పటి దాకా వచ్చిన నాలుగు విడతల టపాలని వీలు చేసుకుని మీరు తయారీ గావించ గలరు. రాబోయే ఐదవ విడత తో చేర్చి ఉగాది కి ఈ  'వీడియో రూపక జిలేబీ శతకం' వారికి మీరు చిరు కానుకగా ఇవ్వవలె నని ప్రార్థన!

ఇట్లు
మీ
చీర్స్
జిలేబి.
(రోజూ ఎవరో ఒక్కరికి పని పెట్టకుంటే నీకు పొద్దే గడవదా జిలేబీ?)  

Sunday, February 26, 2012

బుజ్జి పండు తెలుగు చదువు - 13 - భాస్కర విజయం - 1

यहाँ हाट हाट जिलेबी मिलेगी


ఆల్ఫ్ పర్వత శ్రేణులలో హిమవత్పర్వతం లా ధవళ కాంతులతో విరజిల్లుతోన్న యంగ్ ఫ్రౌ పర్వత పరిసర ప్రాంతలో
ఒక ఇండియన్ హోటలు బయట పెద్ద బోర్డు పెట్ట బడి ఉంది.

డిసెంబరు నెల చలి వణికిస్తోంది. చలికాలం కావడం తో ఇండియా నించి ఊడి పడే స్విస్సు యాత్రికులు అస్సలు ఎవ్వరూ లేరు.

కౌంటరు ముందు కూర్చుని చలికి వణుకుతూ శివ శివా అని స్మరణ చేస్తున్న జమ్బూనాధాన్ కృష్ణ స్వామీ   అయ్యరు ట్రింగ్ ట్రింగ్ అంటూ పాత కాలపు ఫోను రింగు అవటం తో ఫోను రిసీవరు తీసి 'హలో' అన్నారు.

ఆ వైపు వున్న ఆసామి 'నేను హంగేరీ నించి మాట్లాడుతున్నా. జిలేబీ గారున్నారండీ ' అన్నాడు వచ్చీ రాని హిందీ అక్సెంటు లో.


"జిలేబీ నీ కోసం ఎవరో ఫోన్ హంగేరి నించి " అని జంబూ వారూ లోపలి కేక పెట్టి మళ్ళీ శివ శివా అంటూ నామ జపం లో పడ్డారు.

అప్పటి దాకా ఆ రోజు వెయ్యాల్సిన జిలేబీలకి పిండి కార్య క్రమం లో వున్న , కస్సు బస్సు మంటున్న జిలేబీ , హమ్మయ్య ఈ పిండి రుబ్బే కార్యక్రమం కట్ట  బెట్టి ఫోన్ లో టైం పాస్స్ చెయ్యొచ్చు అని సంతోష పడి పోయి, "ఇదిగో అయ్యరు వాళ్ - ఈ పిండి కార్యక్రమం చూడండీ " అని వారికి పని పురమాయించి ఫోన్ దగ్గరికి వెళ్ళింది జిలేబీ.

అయ్యరు గారు, శివ శివ అంటూ  "ఈ జిలేబీ తో వచ్చిన చిక్కే ఇది, ఫోన్ వచ్చిమ్దనో, అదనో ఇదనో  ఏదో  ఒక నెపం తో మనకి పని పెట్ట కుండా వుండదు సుమా " అని గొణుక్కుంటూ సణుక్కుంటూ పిండి కార్యక్రమాన్ని చూడడానికి లోనికి వెళ్ళారు.

జిలేబీ ఫోన్ దగ్గరికి వచ్చి తీరిగ్గా ఓ గంట సేపు మాట్లాడింది. ఆవిడ గంట సేపు మాట్లాడిన సమాచారం ఏమిటంటే -

ఈ హంగేరీ ఆసామీ ఆయుర్వేద ఇన్స్టిట్యుట్  నడుపుతున్న హంగేరీ ఆసామి. ఈతను అప్పుడెప్పుడో యంగ్ ఫ్రౌ మౌంటైన్ కి వచ్చిన సమయం లో  ఈ ఇండియన్ హోటలు కి వచ్చినాడు. జిలేబీ తో పరిచయం అప్పుడే. ఈ మధ్య ఆ హంగేరీ ఆసామీ ఆయుర్వేదా రిసెర్చ్ చేస్తూ 'పరహిత వైద్యం ' గురించి చదివాడట చూచాయిగా. అందుకని తన కేమైనా దీని గురించి తెలుసా , ఆ విషయమై ఎవరైనా హంగేరీ వచ్చి లెక్చర్ ఇవ్వగలరా అని కనుక్కోవడానికి ఫోను చేసాడు.

జిలేబీ మరీ ఖుషీ అయి పోయింది. తనకు తెలియని విషయం అని ఏదైనా ఈ లోకం లో ఉందా ? ఆయ్ అని 'ఓ బ్రహ్మాండం గా తెలుసు, ఓ పెద్దాయన పరహిత వైద్యం  గురించి రాసారు. శర్మ గారని. వారిని పిలుద్దాం ' అని హంగేరీ వాడికి , కష్టే ఫలే శర్మ అనబడు మాచన వఝుల వేంకట దీక్షితులు గారైన చిర్రావూరి భాస్కర శర్మ గారికి మధ్య అటు వైపు ఒక ఫోను, ఇటు వైపు ఒక ఫోను మాట్లాడి, మొత్తం మీద శర్మ గారు హంగేరీ వచ్చేటట్టు ఒప్పించి 'హుష్' ఎంత కష్ట పడి పోయాను సుమా అని నీరస పడి పోయి, హైరాన్ పడి, మళ్ళీ ఒక మారు 'అయ్యరువాళ్' ఒక మంచి కాఫీ పట్టుకు రండీ అని జంబూ అయ్యరు గారిని పనికి పురమాయించింది జిలేబీ.

'ఈ జిలేబీ కి అందరికీ పని కట్ట బెట్ట కుంటే పొద్దే గడవదు సుమా ' అని మళ్ళీ గొణుక్కుంటూ అయ్యరు గారు ఫిల్టరు కాఫీ ప్రయత్నం లో పడ్డారీ మారు.


(ఇంకా ఉంది)

Friday, February 24, 2012

'రచన' శాయి గారి కి విన్నపాలు (బాపురే రమణీయం !)

అయ్యా రచన శాయి గారు,

మొదట గా , ముళ్ళపూడి వారికి నమస్సులు. ఆ పై బాపు గారి కి జేజేలు. ఆ పై శ్రీ రామ రాజ్యం తీసి సాధించి శతమానం భవమై భవ్యమైన శ్రీ సాయి బాబా గారికి అభినందనలు.

ఆ పై మీరు శ్రీ రామ రాజ్యం చిత్ర ముళ్ళపూడి వారి కథన  కౌశల్యాన్ని, వారి వర్ధంతి సందర్భం గా , శ్రీ రామరాజ్యం శత 'షాట్' దినోత్శవాలని పురస్కరించుకుని , పుస్తక రూపేణా తీసుకు వస్తున్నారని మా మనసులో మాట సుజాత గారు టపాకట్టి మమ్ముల నందరిని ఆనంద డోలాయమానం లో స్వాప్న జగత్తులో కి తీసుకు పోయారు , ఆ పుస్తకం ఖరీదు గురించిన వివరణ తక్కువగా ఇచ్చి!

ఆ పై మేము ( నేను కూడా ఓ మోస్తరు గెస్సు చేసి) గెస్సు చేసి వంద రూపాయలనించి ఐదు వందల దాకా ఉండ వచ్చని ఊహల కోతలు (కోటలు) కట్టినాము !

ఆ పై తెలియ వచ్చినది ఏమనగా ఆ పుస్తక ధర ఎనిమిది వందల రూపాయల్ పై 'సిల్కు ' అని !

అయ్యా,

బ్లాగ్ లోకం లో ఎ చిత్రం పై కూడా కట్టనన్ని టపాలు శ్రీ రామ రాజ్యం పై కట్టినాము. బాగుంది అని భేషో అని, 'నయన తారా నందం , బాపురే రమణీయం శ్రీ రామ రాజ్యం అని వందల పేజీ ల కొలది రి వ్యూ లు రాసినాము.

చిత్రం చెత్త అని అన్న వాళ్ళ జుట్టు పట్టుకుని కామెంట్లతో కొట్లాడినాము. బాగుంది అన్న వాళ్ళ తో జగడం పెట్టుకుని ఎం బాగు ఎం బాగు అని లెఫ్టు సెంటరు రైటు గా చిత్రం గురించి సమీక్షలు రాసినాము. !

ఇట్లా ఎన్నో విధాలు గా ఈ చిత్రం గురించి బ్లాగ్ చిత్రాలు తీసినాము.

కావున అయ్యా మీరు, దయ తలచి, ఈ బ్లాగ్ లోకం లో ఈ చిత్రం గురించి బ్లాగు  కట్టి టపా లు  పెట్టి  కామెంటు చెండ్ల తో కొట్టిన వాళ్లందరికీ డిస్కౌంటు యాభై శాతం ఇవ్వ వలె నని ఇదే జిలేబీ విన్నపము ! 

(జిలేబీ కీ వంద శాతం డిస్కౌంటు ఇవ్వ వలె - ఎందు కంటే జిలేబీ రెండు మార్లు టపా పెట్టె ! అదిన్నూ చిత్రం చూడ కుండానే !)


విన్నపాలు విన వలెను వింత వింత లు !
ఫాన్ బ్లాగు టపా రాసిన వారికి డిస్కౌంటు ఈయవయ్యా !!!

ముళ్ళ పూడి వారిని పై లోకం అట్టే పెట్టుకుని తమ హాస్య సరదాలని తీర్చేసుకుంటున్న త్రిమూర్తుల్లారా , వెంటనే ముళ్ళ పూడి వారిని భువికి వదలండి !!! 

నయనతారానందం బాపురే రమణీయం శ్రీ రామరాజ్యానికి శత వందనాలతో !

యనతారానందం

భూనభో బాలకృష్ణ నాగేశ్వరుల

తో బాపు రమణీయ

వ్య దృశ్య కావ్యం

వ్య ఇళయ హంగేరీయం, జొన్నవిత్తుల

విరచిత గీతాలాస్యం, సాయి సినీ లోక భవి

ష్యత్తు వెలుగుల లో ప్ర

తిష్టాపితం
రచన శాయి ముళ్ళపూడి పుస్తకం
బాపు రే రమణీయం - శ్రీ రామ రాజ్యం !

చీర్స్
జిలేబి.

Thursday, February 23, 2012

కడలి !

మ్మని కవనం చూ

చక్కటి 'చిత్ర '

లిఖిత టపాలు

'సుభా' స్ తలపుల వాకిలి శభాష్ !


చీర్స్
జిలేబి.

Wednesday, February 22, 2012

తెలుగు పాటలు !

తెలవారేను జిలుగు వె

లుగు పాటల తో

గుభాళించే పాత కొత్త

పాటల మేళవింపు - బ్లాగు బా

విహారీ - ఆగవోయి , తెలుగు పాట

లు బ్లాగు చూడవోయీ

మది పులకించేను నీదేనోయి !


చీర్స్
జిలేబి.

Tuesday, February 21, 2012

శర్మ కాలక్షేపం కబుర్లు


ర వేగ టపా తో జీవిత మ

ర్మ ముల నెల్ల

కాస్త విలక్షణం గా,

తీఫా చమక్కులతో  

క్షేత్రధారి క్షేత్రాన్ని అందరితో

పంచు కుంటూ

డు రమ్యం గా

బుద్ధి నొసంగె చిన్ని చిన్ని కబు

ర్లు పదుగురు మెచ్చిన

బ్లాగు బాగు బాగు



చీర్స్
జిలేబి. 

Saturday, February 18, 2012

జిలేబీ శతకం - 4

జిలేబీ శతకం
శతక కర్త - శ్రీ తాడిగడప శ్యామల రావు గారు
బ్లాగ్ లోకం లో వీరు 'శ్యామలీయ' మై
బుజ్జి పండు తెలుగు చదువు లో దర్శన మిచ్చి న వారు

గమనిక: ఈ రచన సర్వ హక్కులు శ్రీ తాడిగడప శ్యామల రావు గారివి.
జిలేబీ టపా , కామెంటు చెండులు వీటికి ఉత్ప్రేరకాలు మాత్రమే!
ఇవి శ్రీ శ్యామలీయం గారు శ్రీ కష్టే ఫలే శర్మ గారి బ్లాగులోనూ,
మరి ఇతర బ్లాగుల్లోనూ కామెంటు రూపేణా ఇచ్చినవి.

***
పరహిత వైద్యం

కం. తరచుగ బహుదేహంబుల
తిరుగెడునది తానె యనుచు తెలిసి తగుగతిన్
పరిచర్య చేయునదియే
పరహితమన నెగడు చుండు వసుధ జిలేబీ
కం. కాలగతి చెందువిద్యల
కాలము పునరుధ్ధరించగల తరుణములున్
కాలస్వరూపుడగు హరి
లీలలచే నిలను పొటమరించు జిలేబీ

రాబోవు కాలం

కం. మునువచ్చు చెవుల కన్నను
వెనుకనె పొడచుకొని వచ్చి పెరిగెడు కొమ్ముల్
మొనదేరి ధృడత నుండవె
మనుమలకే తెలివి హెచ్చు మహిని జిలేబీ

చేతులు కాలాక

కం. చేతికి సెగ సోకినచో
 మూతికి మహబాగ గోరు ముద్దలు దొరకెన్
 తాతకు నాతికి నిద్దరి
 కీ తీరున సంబరములు హెచ్చె జిలేబీ

కం. జరిగిన జ్వరమంతటి సుఖ
 మరుదని చెప్పుదురు గాదె అటులే ముద్దల్
 సరదాగ నోటికందుట
 మరి యెందరి భాగ్య మన్న మాట జిలేబీ

కం. ఇది చాలా బాగున్నది
 బ్రదుకున నిటుంవంటి తీపి ప్రతివారికి నం
 దదు నిక్కంబుగ భళిరే
 ముదిమికి ముచ్చట్లు లావు పుడమి జిలేబీ

కం. తప్పులు సైరించెడు సతు
 లెప్పుడు పడుచుందు రిడుము లీ విధముగనే
 తప్పున్న దిద్దకుండిన
 తిప్పలు పెట్టుటయె మగల తీరు జిలేబీ

ప్రేమిస్తున్నా

కం. ప్రేముడి యెంతయు గొప్పది
 కామంబును ప్రేమయొకటి గావను నెరుకన్
 సేమంబుగాంచు టొప్పును
 ధీమంతుండుండు దీని తెలిసి జిలేబీ

కం. అన్నన్నా దిన మొక్కటి
 యున్నదనన్ ప్రేమికులకు యుర్విని ఘనమై
 మున్నూరరువది నాలుగు
 చిన్నదనము బొందు నేమి చేతు జిలేబీ

కం. ఆదిన మీదన మని యే
 డాదిని గల దినములన్ని యటునిటు పంచన్
 మీదెరుగు తలపు జేయగ
 నే దినమును మిగుల లేదు నిజము జిలేబీ

సన్యాసి బుట్టలో పడ్డాడు

నచ్చిన సుందరి యెందుకు
వచ్చెడు నొక బుట్టలోన వయ్యారముగా
తెచ్చిన యా బుట్టనె విభు
ముచ్చట చెఱ గొనగ గాక పోదు జిలేబీ

అందాల బుట్ట లోపలి
సుందరవదనారవింద సుదతీమణి చే
యందుకొనిన సన్యాసియె
వందేళ్ళకు బంది యనగ వచ్చు జిలేబీ

సన్నాసిని చేసెడునో
సన్నాసిని చూసి కన్య సరదా పడునో
సన్నాసియగుట తథ్యం
బన్నన్నా పురుషు డాలి బంటు జిలేబీ

నల్లని కురులు 

వెల్లుల్లి తలకు పూసిన
నెల్లరు దూరంబు జరుగ నిక కేశములా
తెల్లనివో నల్లనివో
అల్లరి యిక లేదు గనుక హాయి జిలేబీ


 మధురాధిపతే అఖిలం మధురం 


కం. మధురాధిపతి స్పెషల్గా
మధురం బతివలకు నైన మాసంగతియో
మధురాధిపతి యఖిలజన
మధురాకృతి నేను వినక మాన జిలేబీ.

ఎంతెంత దూరం

కం. కామెంట్లైతే శతకం
 మీ మాటల గారడీలు మెప్పించెను నే
 నేమో శతకానికి ఇం
 కేమాత్రందూరముంటినిపుడు జిలేబీ?


బంగరు మాటల మూట

కం. ఈ రసన యెంత చెడ్డది
 నోరదుపున నున్నవాడు నూటికొకండుం
 ధారుణి నుండునొ యుండడొ
 తీరుగ నటులుంట యోగి తీరు జిలేబీ


కం. మాటాడుట చక్కని కళ
 మాటాడక యుండు నేర్పు మరియుం ఘనమై
 కోటికి నొకనికి గల్గెడు
 ఓటివి తక్కొరులనోళు లుర్వి జిలేబీ



ఇల్లాలి అవధానం

కం. ఇల్లెంత పదిలమగునో
 యెల్లరు నెరుగుదురుగాని యెందరి కెరుకా
 యిల్లాలి చలువ చేతనె
 యిల్లన గల దనుచు వారి కిలను జిలేబీ

కం. పిల్లలు పెద్దసమస్యలు
 కొల్ల నిషేధాక్షరులను కూర్చెదరత్తల్
 చెల్లించుచు నప్రస్తుత
 మెల్లప్పుడు పలుకు భర్త ఇలను జిలేబీ

కం. అవధాని పడెడు కష్టము
 లవి యణగును ఝాములోన నందరు పొగడన్
 భుని నిల్లాండ్రకు నిత్యం
 బవధానమె మెప్పు కాన బడదు జిలేబీ


టపాకీకరణం
జిలేబి.

కొస మెరుపు  
శ్రీ గోలీ వారి జిలేబీయం !

కలడని చెప్పెను పోతన
'కలడు కలండనెడి వాడు' కావ్యము నందున్
కలడని చెప్పెను పో, తన
కళలొలికెడు బ్లాగులోన కాదె జిలేబీ!

Friday, February 17, 2012

Carnatic Music Idol 2012

Carnatic Music Idol 2012 !

ప్రతి సంవత్సరం జయా టీవీ వారు
Carnatic Music Idol
కార్యక్రమాన్ని జరుపుతున్నారు
ఈ మధ్య ఒక మూడు నాలుగు సంవత్సరాలు గా!

నిరుడు సంవత్సరం Carnatic Music Idol USA కూడా దిగ్విజయం గా జరిపారు.

ఇప్పుడు once again Carnatic Music Idol 2012 వస్తోంది.
ఇది తమిళ చేనల్ వారి చలువ .
A fantastic program to watch how children are faring so great in the program !
Enjoy.
One episode below link I have provided. Rest of them you can find in the same group!



cheers
zilebi.