పూర్వ కాలం లో నారదుల వారు త్రిలోక సంచారం చేస్తూ ఒక లోక సమాచారాన్ని వేరొక లోకం లోకి మార్చి, తార్చి, వార్చి కొండొకచో మసాలా దట్టించి, నశ్యం పట్టించి, కలహ భోజనము చేసేవారని చదివినప్పుడు నాకు చాలా హాశ్చర్య మని పించేది.
జిలేబీ, ఒక లోకం లో నే మన వల్ల అలా ఇలా సంచారం చెయ్యడం కనా కష్టం గా ఉందే, ఈ నారదుల వారు, మన ప్రియతమ గురువులు ఈలా త్రిలోకాలు ఎలా సంచారం చేస్తారబ్బా అని తెగ సందేహం వచ్చేది.
నా ఆ ఆలకింపులను మన్నించి ఆ సామి నా కు ఈ జన్మ లోనే ఈ విషయాన్ని అర్థం చేసు కోవడానికి ఒక సదవకాశం ఈ 'e' లోకం లో ఇచ్చాడు !
అదేమిటంటారా , ఈ బ్లాగు లోకం లో వచ్చినప్పుడు అలా అప్పుడు అప్పుడు రాసే వారము. ఆ పై మా మన మోహనుల వారు, జిలేబీ, నువ్వు వనారణ్యాలని ఏలింది చాలు గాని, నీకు రిటైర్మెంటు ఇచ్చితి మీ బో అని ఇంటికి తరిమేక, అప్పటి దాకా హై వోల్టేజీ లో పనిచేసిన జిలేబీ, లో వోల్టేజీ కి వచ్చింది.,
మా జంబూనాధన్ కృష్ణ స్వామీ అయ్యరు గారు కూడా, ప్లేటు ఫిరాయించి, జిలేబీ, నీకు ఉన్న ఉద్యోగం అయిపోయే, కాబట్టి మళ్ళీ కిచను నువ్వే చూసుకో అని వారూ వంట గదికి పదవీ విరమణ చేసేరు.
వంట గది లో నే లాపు టాపు పెట్టి, ఆవ్వాల్టి వంట లకి అవ్వాళే రెసిపీ లు ఇంటర్నట్ లో కనిబెట్టి దానితో బాటు టపాలు బర బర గీకేసి, కామెంటు కారాలు మిరియాలు రుబ్బి వంట చేసేది జిలేబీ.,
హాశ్చర్యం గా అప్పుడప్పుడు బ్లాగు లోకం లో సీనియర్స్ మేము అలాగా గూగుల్ బజ్జు లో ఈ లా బజ్జామండీ అని అంటే curiosity killed the cat చందాన అప్పుడే తెలుసుకున్నా బ్లాగు లోకం గాక మరో బజ్జు లోకం కూడా వున్నదని అందులో కూడా ఇక్కడి వాళ్ళు అక్కడ, అక్కడి వాళ్ళు ఇక్కడ సంచారం చేస్తూ ఉంటారని.
హవ్వా, ఈ మల్టీ లోక సంచార పాసిబిలిటి ఉండటమన్నది మన పురాణ కాలం లోనే వుందబ్బా అని నేను తెగ మురిసి పోయాను.
ఆ పై బజ్జు లు మూట కట్టి నాయని జన సందోహం బ్లాగు లోకం లోకి వచ్చారు కొంత కాలం బాటు.
ఆ తరువాయి మరో లోకం ఇప్పుడు పాపులర్ అయి పోయినట్టుంది! అదియే గూగల్ ప్లస్సాయనమః !
ఈ లోకం లో చాలా వేడిగా, వాడిగా గబ గబ కామెంటు చెండులు చేతులు మారుతున్నాయని జిలేబీ లు చుడుతున్నారని, చప్పట్లు గల గలా పారుతున్నా యని అప్పుడప్పుడు ఆ లోక సంచార వాసులు ఈ బ్లాగ్ లోకం లో తెలియ చేస్తూ, కాకుంటే వాటి గురించి ఉత్సుకతని ని కలిగిస్తున్నారు !
సో, త్రిలోక సంచార వాసులారా ( భూలోక, బ్లాగ్ లోక, ప్లస్ లోక,...) మనమందరమూ, పురాణ కాలం లో తెలిపిన మల్టీ లోక సంచారాన్ని మన జీవన కాలం లో అనుభవైక వేద్యం గా చవి చూస్తున్నామని దీని వల్ల గ్రహించ వలె !
అన్నీ మన పురాణాల్లోనే ఉన్నాయష !
చీర్స్
జిలేబి.

హ..హ..హ....మీరు సూపర్ అసలు .
ReplyDelete:):):)
ReplyDelete:) :) :)))))))))
ReplyDelete:))))))))))
ReplyDeletesuper...cheers jilebi...
ReplyDeleteభలేగా చెప్పారు జిలేబి గారూ....
ReplyDeleteమీరు కేకండీ.. ఈ మారు జిలేబీ మాత్రం భలే స్పెషల్ :):):)
ReplyDelete:) suparandee
ReplyDeleteహహహ్హహ...భలే రాసారు!
ReplyDeleteబలే అవిడియా వచ్చిందే మీకూ..మనం ఎలాంటివాళ్ళమంటే మరో నాలుగులోకాలు కల్పించినా శ్రమ అనక తిరిగే జీవులం. ఎటొచ్చీ నారదులవారి కలహభోజన లక్షణం మటుకు లేనందుకు సంతోషిద్దాం..
ReplyDeleteమీరీటపాతో ముల్లోకాల్లోనూ పసందైన జిలేబీలు చుట్టేశారుగా. :):):)
ReplyDelete:)
ReplyDelete@లలిత గారు,
ReplyDeleteమీకు సూపరై నచ్చినందులకు మరీ ఆనందం !
@రెండు చుక్కలూ, మల్టీ బ్రాకెట్టు త్రిలోక సంచార వాసులారా ,
మీ పూరణలు అన్నీ అలరించు చున్నవి.
నెనరస్య నెనరః జిలేబీ నామ్యా నెనరః !!
చీర్స్
జిలేబి.
@ఎస్, జే,
ReplyDelete@ఆవుల వేంకట సుబ్బారెడ్డి గారు,
@సుభగారు,
ధన్యవాదాలు మీకందరికీ !!
@ఆసౌ గారు,
ధన్యవాదాలు. బహుకాల దర్శనం !
చీర్స్
జిలేబి.
@సాయికుమార్ గారు,
ReplyDeleteనెనర్లు.
జిలేబి.
@శ్రీ లలిత గారు,
అంతే అంతే ! ఆ హా, త్రిలోక సంచారం !
జిలేబి.
@జ్యోతిర్మయీ గారు,
నెనర్లు మీ అభిమానానికి !
జిలేబి
@లాస్య రామకృష్ణ గారు,
మీరూ రెండు చుక్కలు ఒక బ్రాకెట్టు ఆటకి వచ్చేసారూ!!
కామెంటిన అందరికీ ధన్యవాదాలు.
చెప్ప వచ్చిందేమిటంటే, పురాణాలు ఒట్టి కాల్పనికాలు అంటారు కదా ! ఆ లా కాకుండా ఈ లా కూడా చూడొచ్చన్నమాట ! అదీ! మన అనుభవం లో జరిగే సంఘటనలు కొంత ఆలోచించి చూస్తె వాటికి, పురాణాలలో కొన్ని సారూప్యతలు కనిపించటం విశేషం !
చర్విత చరణం అన్నట్టు మానవుని మనుగడ ఒక 'సైన్ వేవ్' అనిపిస్తుంది!!
చీర్స్
జిలేబి