Tuesday, March 13, 2012

జ్యోతిష్యం ఒక సైన్స్ అండ్ మేథమేటిక్స్

సైన్సు అన్న పదం ఇరవై శతాబ్దం లో కాకుంటే పంతొమ్మిదవ శతాబ్దం లో వచ్చిన పదం.
అంతకు మునుపు ఫిలోసోఫి.

ఉదాహరణకి - న్యూటన్ పుస్తకం ప్రిన్సిపెల్స్ అఫ్ నేచురల్ ఫిలోసఫి.

ఫిలోసఫి అర్థం తీసుకుంటే- అది లవ్ ఫర్ సం థింగ్.

ఈ అర్థం లో తీసుకుంటే జ్యోతిష్యం ఒక ఫిలోసఫి. సైన్సు. దీన్ని చదివిన వాళ్ళు, చదవడానికి ఉత్సుకత చూపే వాళ్ళు ఓ పాటి జిజ్ఞాస తో - దాని మీద "వ్యామోహం" తో కాకుంటే- సందేహం తో ప్రారంభించి ఓ లాంటి పరిణితి వచ్చిన తరువాయీ దాని వెనుక ఉన్న నిగూఢ అర్థాలని వెలికి తీయడం లో తమ ఇంట్యూషన్ ని వాడడం గమనించ వచ్చు.

జ్యోతిష్యం బాగా తెలిసిన వాళ్ళు - వాళ్ళకే సందేహం వస్తే- జవాబు వెంటనే చెప్పక , కొంత సమయం తీసుకుని వారి కాన్షేన్స్ అనుమతిస్తే - కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పడం సాధారణం గా గమనించ వచ్చు.

అంటే ఈ జ్యోతిష్యం దాని గణాంక పరిధిని దాటి - తార్కికానికి ఆవల - "దృష్టి" ని సారించి అంటే
డిఫరెంట్ డిమెన్ షన్ లో వెళ్లి కొన్నిటికి సమాధానం చెబుతుంది.

సైన్సు పోకడ ని గమనిస్తే - ఈ కాలపు రెండు శతాబ్దాలలో - చాలా మార్పులతో వేగం గా పరిణితి చెందుతూ వస్తోంది. తాము గ్రహాలని చెప్పిన వె  ఇప్పుడు గ్రహం కాదని అంగీకరించడం దాక అంటే వారి "జ్ఞానం' పెరిగే కొద్దీ మన "విజ్ఞానం" కూడా పెరుగుతోందని అనుకోవచ్చు. (కాకుంటే - "అజ్ఞానం" తరుగుతోందని అని కూడా అనుకోవచ్చు)

కొన్ని శుష్క వాదనలతో సూర్యుడు గ్రహమా అని జ్యోతిష్యం ని ప్రశ్నించే "హేతవాదులని" మనం చూడడం కద్దు.
జ్యోతిష్యం డెవలప్ అయిన కాలానికి వాళ్ళు - దాన్ని గ్రహం గా సంబోధించ వచ్చు అనుకోవచ్చు గదా? మనం విజ్ఞానవంతులం అట్లా అనుకుంటే  మన హేతువాదానికి ధోకా వస్తుంది కాబట్టి మనం ప్రశ్నించాల్సినదే !

క్వాంటం థియరీ పరిణితి చూస్తె- నాటి క్వాంటం మెకానిక్స్ మోడల్ నించి మొదలయ్యి -ఇపుడు క్వాంటం ఫిజిక్స్ మరియు ఆధ్యాత్మికం దాక దాని ప్రతిపాదనలు వ్యాపించి ఉన్నది. (ఈ రెండు వేల ఐదు లో అనుకుంటా ను వచ్చిన  What the bleep do we know మూవీ జనావళికి క్వాంటం ఫిజిక్స్ ని పరిచయం చేసే హాలీవుడ్ చిన్ని ప్రయత్నం).


దీనికి మూల కారణం దాని మీద - ఆ సబ్జెక్ట్ మీద పరిశోధనలు మిక్కిలి గా జరగడమే కారణం. క్వాంటం థియరీ మొదలైన కాలానికి అది సో కాల్డ్ సుడో సైన్సు. ఆ కాలం లో దాన్ని సో కాల్డ్ వైజ్ఞానికుల లోకం లో నే సమర్థించిన వాళ్ళు చాల కొద్ది మంది మాత్రమె.

ఈ నేపధ్యం లో జ్యోతిష్యం తానున్న ఇప్పటి దయనీమయిన పరిస్థితి నించి బయట పడాలంటే -దాని మీద విలక్షణమైన , విశిష్టమైన , నిశితమైన పరిశోధనలు జరగాలి. అప్పుడే దాని వికాసం మనం చూడవచ్చు.

చిన్న ఉదాహరణ - జ్యోతిష్యం లో ని గళ్ళకి అధిపతి గా సూర్యుని నించి మొదల్లయీ శని గ్రహం దాక ఇప్పడు సైన్సు చెప్పే ఆర్డర్ లో  నే ఉండటం కాకతాళీయమా , లేక - వారి కాలానికి వారికి కలిగిన మేధస్సు పరిణితి యా?

జ్యోతిష్యానికంటూ - ఒక నియమం, గణితం ఉన్నది. ఆ గణితం ఒక పార్టు. దాని వెనుక దాని అనాలిసిస్ మరో పార్టు. దాని అన్వయం మరో పార్టు. ఈ అనాలిసిస్ ఎక్కడో బురడా కొట్టి కాల గతి లో వక్ర గతి పట్టి నట్టు ఉంది.

మరో ఉదాహరణ- స్టాక్ మార్కెట్ లో " Derivatives" "futures and options" ఎ ఉద్దేశం లేక ఎ మోడల్ తో future ని "predict" చేస్తూన్నారు? బ్లాక్ షోలే మోడల్ అనండి, వేరే మోడల్ అనండి, కాకుంటి probability theory అనండి - దానికంటూ ఒక అర్థం వాళ్ళు చెప్పుకున్నారు. ఓ మోడల్ కాకుంటే "predictability" ఆపాదించుకున్నారు.

రేపటికి ఏమవుతుందో తెలియని దానికి, ఒక మాడల్ తయారు చేసుకుని ఒక సమీకరణం ప్రతిపాదించడం (ఈ సమీకరణం మన కాలం లోనే ప్రశ్న గా నిలబడడం ఇక్కడ విశేషం) మన కాలానికి మనకు చెందిన మేధో పరిణితి. !


అట్లాగే జ్యోతిష్యానికి కూడా ఒక వ్యాఖ్యానం ఉంది కదా? ఈ జ్యోతిష్యం సైన్సు గా విలక్షణం గా పరిణితి చెందాల వద్దా అన్నది మానవ మేధస్సు మీద ఆధార పడి ఉన్నది. ఎ కొద్దిపాటి ఇచ్చుకత, ఆసక్తి ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకొని పరిశోధనలు చెయ్యడమో మాత్రం సరిపోదు. ఇది ఒక యజ్ఞం కాకుంటే ట్రెండ్ కావాలి.

అప్పుడే ఈ సైన్సు కాకుంటే ఫిలాసఫీ కూడా పరిణితి చెంది మన మేధస్సు కి దీటు గా వెలుగొందుతుంది. అప్పుడే దాని వికాసం. కాని ఇందులో ఓ తిరకాసు ఉంది. ఏమిటంటే - ఇందులో ఎలాంటి ధనలాభాలు లేవు.

సో, ఎంతమంది దీనికి టేకర్స్ ఉంటారు? చాల తక్కువ మంది మాత్రమె. అదే దీని ప్రస్తుత పరిస్థితి కి కారణం కూడానేమో ? ఆ కాలం లో రాజులు పోషించారు. ఈ విజ్ఞానం వికసించింది.

ఈ కాలం లో మన గవర్న మెంట్లు, వాటికి దీన్ని పోషించే కాకుంటే వికసింప చేసే ఆసక్తి ఉన్నదా అన్నది సందేహమే.  అదే  అమెరిక వాడు కొద్ది పాటి పరిశోధనలతో(వాడు చెయ్యాలంటే, దీంట్లో వాడికి ఏదైనా లాభం కనిపించాలి !- అది వేరే విషయం!)  - పేటెంట్ చేసాడంటే - వెంటనే - బాస్మతి మాది అన్నట్టు కేసు వెయ్యడానికి వేనుకయ్యం మనం !

కా బట్టి వేచి చూడాల్సిందే !

కాకుంటే- ప్రశ్నా శాస్త్రం క్రింద మనం  ప్రశ్న వేసుకోవచ్చు!

సమాధానం చెప్పగలిగే వాళ్ళు - ( ఈ టపా పోస్ట్ చెయ్యబడ్డ సమయమో- లేక మీరు ఈ టపాని చదివిన సమయో - కాకుంటే - మీరే ఓ ప్రశ్నా సమయాన్ని ఎంచుకోనో, స్థలం బ్లాగ్ లోకం లో మీ బ్లాగ్ అనుకునో!) భాష్యం చెప్పగలరేమో చూడండి!

ప్రశ్న - "జ్యోతిష్యం మరింత పరిణితి చెందుతుందా ? అవదా?


చీర్స్
జిలేబి.
(జిలేబీ why dont you have consisntency?)

Sunday, March 11, 2012

జ్యోతిష్యం ఒక నమ్మక వాహిని

నమ్మకం అన్నదానికి అర్థం - తార్కికానికి  ఆవల ఒక దాన్ని విశ్వసించడం అనుకో వచ్చు.

ఈ డెఫినిషన్ కింద ఆలోచిస్తే - జ్యోతిష్యం నమ్మే కొద్దీ దాని ప్రభావం మన జీవితాలలో పెరగడం దీన్ని నమ్మే వాళ్ళలో చాల మంది గమనించడం జరగడం సర్వ సాధారణం. - ఇందులో తల మునకలైన వాళ్లకి - ప్రతి విషయం జ్యోతిష్యం అలా చెప్పినందు వల్ల  ఇలా జరగడం అయ్యిందన్న మాట అని సరిపెట్టుకోవడం కాకుంటే దానికి పరిష్కారం చూడాలనుకోవడం లాంటి మరిన్ని "బై ప్రొడుక్ట్స్ " కింద వెళ్ళిపోవడం గమనించ వచ్చు.

సో, దీన్ని పాటిస్తే - ఓ మోస్తరు - అందులో నే మన జీవితం నిబిడీ కృతం అయినట్టు అని పిస్తుంది.

ఉదాహరణకి ప్రతి పనిని మంచి గంటలో నే చెయ్యాలనుకుని - రాహు కాలం అనో కాకుంటే యమ గండం అనో - ఏదో ఒక గుళిక అనో ఎన్నో సార్లు చెయ్యాల్సిన మంచి పని ని కూడా వాయిదా పద్దతుల మీద సాగించే సాదా సీదా జనసాంద్రత మనం గమనించ వచ్చు.

సో, ఒక నమ్మకం మరో నమ్మకానికి - ఆ పై అది మరో నమ్మకానికి - ఇలా విచక్షణా రహితం గా - ఓ లాంటి పరమ పద సోపానం లో పామునోట పడ్డట్టు ఈ ఊబిలో చిక్కు పోతూ - మానవుని కర్మ సిద్ధాంతాన్ని, సంకల్ప బలాన్ని  - మరిచి పోయే టంత గా  "కిక్కు" ఇవ్వ గలడం ఈ జ్యోతిష్యం యొక్క weakness అని చెప్పుకోవచ్చు కూడా.

వాహిని - ఒక ప్రవాహం. అందులో కొట్టుకుపోవచ్చు. ఈతాడ వచ్చు. జలకాలా వాడచ్చు. ఎంత కావాలంటే అన్ని నీళ్ళు ఉపయోగించ వచ్చు. కొంత ఆలోచిస్తే - ఈ జ్యోతిష్యం కూడా ఒక నమ్మక వాహిని అనిపిస్తుంది 

దాన్ని ఎలా ఉపయోగించు కుంటామో అన్న దాన్ని బట్టి- మన ఇచ్ఛా శక్తి కూడా అభివృద్ధి చెందడానికి దోహద కారిగా నా కాకుంటే - మన మూఢ నమ్మకాలకి సోపానం గానా- అన్న దాని బట్టి ఈ శాస్త్రం ఉపయోగం ఉందా లేదా  అనిపిస్తుంది.

మరో విధం గా ఆలోచిస్తే- దీన్ని గురించి - ఈ శాస్త్రం గురించి తెలియక పోతే , పట్టింపులు లేక పోతే - "Ignorance is Bliss"!


చీర్స్
జిలేబి.
(జిలేబీ what are you trying to convey?)

Saturday, March 10, 2012

మధురాపురి నిలయే మణి వలయే - జిలేబీయం



మధురాపురి  నిలయే మణి వలయే - జిలేబీయం




చీర్స్
జిలేబీయం !

Friday, March 9, 2012

జ్యోతిష్యం నమ్మకమా లేక సాయిన్సా లేక కళా?

నమ్మకం
సాయిన్సు
కళ
ఈ మూడు మూడు విధాలు
నమ్మితే సాయిన్సు అక్కరలే
సాయిన్సు అనుకుంటే - నమ్మకాల పని లేదు
కళ - మనోల్లాసం
ఇంతకీ ఈ అంతు పట్టని జ్యోతిష్యం లెక్కల గారిడీయా లేక సాయిన్సా లేక కళా లేక నమ్మకమా?


చేసుకున్న వారికి చేసుకున్నన్త !
నమ్మకం ఉంటె ఫలితం !
శాంతి అన్నిటికి ఉండనే ఉంది !
ఉపశాంతి కూడా ఉంది !
కిటుకు ఎక్కడ ఉంది?
మన ఆలోచనా విధానం లో నా?
కర్మ సిద్ధాంతం లో నా?

లేక - ఈ మధ్య బడా బడా దేశాలు - చేసే తుక్కు టమారం చెత్త చెదారం డంప్ చేస్తున్నట్టు
పాతకాలం లో అర కొర - లెక్కల జ్యోతిష్యం - మన దేశం లో ఇంకా అలాగే నిలిచి పోయిందా?

ఈ జ్యోతిష్యం కూడా బతుకుతోందా కాలం తీరి - దాని కథా కమామీషు ఎవరికీ అర్థం కాక ఏదో నేనూ జాదూగర్ లా ఉన్నా  అన్నట్టు పడి ఉందా మన దేశం లో?

చర్వితచర్వణం!


జిలేబి.

Thursday, March 8, 2012

మహిళా దినోత్సవం !

ల్లి, కొప్పులో,

హిరణ్మయి నడకలో, కా

ళం పగ పడితే,

వణీ లలామ ,

దిక్సూచి కుటుంబానికి,మ

నోహరి మనోహరునికి , వా

త్సల్యమయీ

వందనం !


మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో -

చీర్స్
జిలేబి.

Tuesday, March 6, 2012

జిలేబీ శతకం - 5

శ్రీ శ్యామలీయం వారికి శుభాకాంక్షలతో
జిలేబీ శతకం
శతక కర్త - శ్రీ తాడిగడప శ్యామల రావు గారు
బ్లాగ్ లోకం లో వీరు 'శ్యామలీయ' మై
బుజ్జి పండు తెలుగు చదువు లో దర్శన మిచ్చి న వారు

గమనిక: ఈ రచన సర్వ హక్కులు శ్రీ తాడిగడప శ్యామల రావు గారివి.
జిలేబీ టపా , కామెంటు చెండులు వీటికి ఉత్ప్రేరకాలు మాత్రమే!
ఇవి శ్రీ శ్యామలీయం గారు శ్రీ కష్టే ఫలే శర్మ గారి బ్లాగులోనూ,
మరి ఇతర బ్లాగుల్లోనూ కామెంటు రూపేణా ఇచ్చినవి.

***

రాబోవు కాలం

కం. మునువచ్చు చెవుల కన్నను
వెనుకనె పొడచుకొని వచ్చి పెరిగెడు కొమ్ముల్
మొనదేరి ధృడత నుండవె
మనుమలకే తెలివి హెచ్చు మహిని జిలేబీ


ఉపవాసం

కం. ఆరోగ్య మనుమతించిన
మేరకు నుపవాసదీక్ష మిగులహితంబౌ
తీరికగా నొక దినమున
శ్రీరమణుని గొలువనగును చేరి జిలేబీ.


'దండ' నాధా!

కం. దండను వేసిన చేతులు
దండంబును బెట్టినట్టి తరుణి కరంబుల్
ధండమ్మని చండికవలె
దండంబును తప్పకుండ దాల్చు జిలేబీ

దీవెనలు

కం. చాలవె యితిహాసంబులు
చాలదె మరి భాగవతము జదువగ హితమై
చాలదె పెద్దల దీవన
మేళులు చేకూర్చ మనకు వేగ జిలేబీ

జిలేబీ తెలుగు వ్యాఖ్య !

కం. నలభై పంక్తుల వ్యాసము
సులువుగ నా కర్థమాయె శోధించెడు నా
తల కెక్కక పొగరణచెను
కలనం తమ వ్యాఖ్య తెలుగు ఘనత జిలేబీ.


'టీతింగు' ట్వీటింగు !

కం. తాతకు కలిగే నకటా
టీతింగ్ ప్రోబ్లమ్స్ కొత్త త్రీజీ ఫోన్తో
యాతన పెట్టే టచ్ స్క్రీన్
చేతికి కళ్ళకును పనులు చెప్పె జిలేబీ.

కం. చిన్నప్పుడు పలకయె గద
యున్నది యని తాత మరచి యుండగ నకటా
నాన్నకు హైఫై పలకను
కొన్నాడు ప్రేమమీర కొడుకు జిలేబీ


బాపురే లవకుశ శ్రీ రామ రాజ్యం !

కం. చూడకనే పొగడుటయును
చూడకనే తెగడు టనెడు చోద్యములనగా
నేడుకదా కనిపించెను
వాడలవాడలను బాపు వలన జిలేబీ

కం. నాజూకుగ నను దిట్టిన
నా జుట్టును బట్టుకొన్న నచ్చని దానిన్
తేజోమయమని పొగడుట
నా జన్మకు వీలుపడదు నమ్ము జిలేబీ

కం. నా కేమో లవకుశ యును
మీకు శ్రీరామరాజ్యమే హితమగుచో
నా కెనిమిది వందలు పొదు
పై కనుబడు చుండె నేటి వరకు జిలేబీ
 
 
యా దేవీ సర్వ భూతేషు

కం. అమ్మాయి కథను చదివితి
నమ్మ దయాగుణము దలచి యానందముచే
చిమ్మెను కన్నుల నీరును
నిమ్మహి భగవతికి సాటి యెవరు జిలేబీ.

కం. ముత్తాతగారి ముచ్చట
లిత్తెరగున చదువుచుండ నెటనో మరి నా
చిత్తంబున విభ్రమమగు
నుత్తమమీ సౌఖ్యమనగ నొప్పి జిలేబీ.

కం. ముని మనుమరాలి ముచ్చట
మునుకొని యా మూగతల్లి ముచ్చటగా తం
డ్రిని తాతను ముత్త్తాతను చే
సిన ముచ్చట సంతసింప జేసె జిలేబీ.

కం. సంతోషంబుల నెరుగుట
సంతోషము నాకు నిట్టి సంతోషంబుల్
వింతలె యీ జన్మంబున
నింతకు ముందెరిగి యుందు నేమొ జిలేబీ.

కం. అందరు సంతోషంబున
నుందురు గా కెల్లవేళ నుల్లాసముగన్
చిందులు వేయగ శ్రీలా
నందముగా నందరిండ్ల ననెద జిలేబీ.


కాఫీ కాలం

కం. శివ శివ యనుచును కాఫీ
నెవరైనను చేయునెడల నీశ్వరకృపచే
నవలీలగ నమృతంబగు
చవితో లోకంబు లేల జాలు జిలేబీ.

కం. నీరసపడితే మంచి హు
షారిచ్చే పొగలసెగల చక్కని కాఫీ
సారందీయగ హాయిగ
ఊరికి పను లప్పగించు చుండు జిలేబీ


శతకం లెక్కలు

కం. ఇన్నని నియమము గలదా
యెన్నైనను వ్రాయవచ్చు నేదో శతకం
బన్నప్పు డధిక మైనను
మన్ననలో మార్పురాదు మహిని జిలేబీ


వినమ్రత

కం. బందమొ ముందరి కాళ్ళకు
నందముగా భావమమర నగు పరికరమో
ఛందం బనునది దేవుం
డందించిన శక్త్తి కొలది యగును జిలేబీ.

కం. ఛందములాడించునొ నను
ఛందంబుల తోడ నాడ జాలుదునో నే
నందముగా వ్రాయుదునో
యిందుకు కొరగానొ దేవు డెరుగు జిలేబీ

టపాకీకారణం
జిలేబి

Monday, March 5, 2012

జిలేబీ శతకం - 5

జిలేబీ శతకం
శతక కర్త - శ్రీ తాడిగడప శ్యామల రావు గారు
బ్లాగ్ లోకం లో వీరు 'శ్యామలీయ' మై
బుజ్జి పండు తెలుగు చదువు లో దర్శన మిచ్చి న వారు

గమనిక: ఈ రచన సర్వ హక్కులు శ్రీ తాడిగడప శ్యామల రావు గారివి.
జిలేబీ టపా , కామెంటు చెండులు వీటికి ఉత్ప్రేరకాలు మాత్రమే!
ఇవి శ్రీ శ్యామలీయం గారు శ్రీ కష్టే ఫలే శర్మ గారి బ్లాగులోనూ,
మరి ఇతర బ్లాగుల్లోనూ కామెంటు రూపేణా ఇచ్చినవి.

***

రాబోవు కాలం

కం. మునువచ్చు చెవుల కన్నను
వెనుకనె పొడచుకొని వచ్చి పెరిగెడు కొమ్ముల్
మొనదేరి ధృడత నుండవె
మనుమలకే తెలివి హెచ్చు మహిని జిలేబీ


ఉపవాసం

కం. ఆరోగ్య మనుమతించిన
 మేరకు నుపవాసదీక్ష మిగులహితంబౌ
 తీరికగా నొక దినమున
 శ్రీరమణుని గొలువనగును చేరి జిలేబీ.


'దండ' నాధా!

కం. దండను వేసిన చేతులు
దండంబును బెట్టినట్టి తరుణి కరంబుల్
ధండమ్మని చండికవలె
దండంబును తప్పకుండ దాల్చు జిలేబీ

దీవెనలు

కం. చాలవె యితిహాసంబులు
 చాలదె మరి భాగవతము జదువగ హితమై
 చాలదె పెద్దల దీవన
 మేళులు చేకూర్చ మనకు వేగ జిలేబీ

జిలేబీ తెలుగు వ్యాఖ్య !

కం. నలభై పంక్తుల వ్యాసము
సులువుగ నా కర్థమాయె శోధించెడు నా
తల కెక్కక పొగరణచెను
కలనం తమ వ్యాఖ్య తెలుగు ఘనత జిలేబీ.


'టీతింగు' ట్వీటింగు !

కం. తాతకు కలిగే నకటా
టీతింగ్ ప్రోబ్లమ్స్ కొత్త త్రీజీ ఫోన్తో
యాతన పెట్టే టచ్ స్క్రీన్
చేతికి కళ్ళకును పనులు చెప్పె జిలేబీ.

కం. చిన్నప్పుడు పలకయె గద
 యున్నది యని తాత మరచి యుండగ నకటా
 నాన్నకు హైఫై పలకను
 కొన్నాడు ప్రేమమీర కొడుకు జిలేబీ


బాపురే లవకుశ శ్రీ రామ రాజ్యం !

కం. చూడకనే పొగడుటయును
చూడకనే తెగడు టనెడు చోద్యములనగా
నేడుకదా కనిపించెను
వాడలవాడలను బాపు వలన జిలేబీ

కం. నాజూకుగ నను దిట్టిన
నా జుట్టును బట్టుకొన్న నచ్చని దానిన్
తేజోమయమని పొగడుట
నా జన్మకు వీలుపడదు నమ్ము జిలేబీ

కం. నా కేమో లవకుశ యును
మీకు శ్రీరామరాజ్యమే హితమగుచో
నా కెనిమిది వందలు పొదు
పై కనుబడు చుండె నేటి వరకు జిలేబీ
యా దేవీ సర్వ భూతేషు

కం. అమ్మాయి కథను చదివితి
 నమ్మ దయాగుణము దలచి యానందముచే
 చిమ్మెను కన్నుల నీరును
 నిమ్మహి భగవతికి సాటి యెవరు జిలేబీ.

కం. ముత్తాతగారి ముచ్చట
 లిత్తెరగున చదువుచుండ నెటనో మరి నా
 చిత్తంబున విభ్రమమగు
 నుత్తమమీ సౌఖ్యమనగ నొప్పి జిలేబీ.

కం. ముని మనుమరాలి ముచ్చట
 మునుకొని యా మూగతల్లి ముచ్చటగా తం
 డ్రిని తాతను ముత్త్తాతను చే
 సిన ముచ్చట సంతసింప జేసె జిలేబీ.

కం. సంతోషంబుల నెరుగుట
 సంతోషము నాకు నిట్టి సంతోషంబుల్
 వింతలె యీ జన్మంబున
 నింతకు ముందెరిగి యుందు నేమొ జిలేబీ.

కం. అందరు సంతోషంబున
 నుందురు గా కెల్లవేళ నుల్లాసముగన్
 చిందులు వేయగ శ్రీలా
 నందముగా నందరిండ్ల ననెద జిలేబీ.


కాఫీ కాలం

కం. శివ శివ యనుచును కాఫీ
నెవరైనను చేయునెడల నీశ్వరకృపచే
నవలీలగ నమృతంబగు
చవితో లోకంబు లేల జాలు జిలేబీ.

కం. నీరసపడితే మంచి హు
షారిచ్చే పొగలసెగల చక్కని కాఫీ
సారందీయగ హాయిగ
ఊరికి పను లప్పగించు చుండు జిలేబీ


శతకం లెక్కలు

కం. ఇన్నని నియమము గలదా
యెన్నైనను వ్రాయవచ్చు నేదో శతకం
బన్నప్పు డధిక మైనను
మన్ననలో మార్పురాదు మహిని జిలేబీ.



టపాకీకారణం
జిలేబి

కొసమెరుపు  జిలేబీయాలు !

శ్రీ కంది శంకరయ్య గారి జిలేబీయం

పతియె బ్లాగులోకమ్మున గతి తెలియక
మునిగియుండ జిలేబియై ముద్దు లొలుక
కొంటె కామెంట్లతో సదా వెంట నంటి
పతిని హింసించు కాంతయే పరమ సాధ్వి
.

పురాణ పండ వారి జిలేబీయం

అందమైన సంగతులను
కందములుగ పద్యం కట్టి
నందున వానిని శతక
మందుము ముదమున జిలేబీ

ఇతివృత్తములు భిన్నములు
నాతినలరించు విషయములు
యే తీరున దృశ్యీకరించుట
కత్తిపీటకేల దురద జిలేబీ

శ్రీ లక్కాకుల వారి జిలేబీయం

కాదు పద్యమ్ము వ్రాయుటే ఘనత - కవికి
భావ పటిమయే ప్రతిభకు పట్టు గొమ్మ
శ్రీ జిలేబికి కారాదు చేవ లేని
ఛందముల చట్రముల్ భావ బంధనములు




బ్లాగ్ లోక కవీశ్వరులకు ప్రణామములతో

జిలేబి.

Sunday, March 4, 2012

పడమటి సంధ్యా రాగం !

చ్చని చేలు

మరుక నాదం

గువల మురిపాలు

టింగు రంగా బడి పిల్లలు

సందె వేళ గూటి దీపాలు

ధ్యాన మైన కను దోయి

రామచిలుకల  కిల కిలలు   

గంటా రావముల గుడి గంటలు



జిలేబి.
(ప్చ్, పడమటి సంధ్యా రాగంలో అన్నీ హుష్ కాకీ)

Friday, March 2, 2012

గూగల్ ప్లస్ లోకము వెర్సెస్ బ్లాగు లోకము !

పూర్వ కాలం లో నారదుల వారు త్రిలోక సంచారం చేస్తూ ఒక లోక సమాచారాన్ని వేరొక లోకం లోకి మార్చి, తార్చి, వార్చి కొండొకచో మసాలా దట్టించి, నశ్యం పట్టించి, కలహ భోజనము చేసేవారని చదివినప్పుడు నాకు చాలా హాశ్చర్య మని పించేది.

జిలేబీ, ఒక లోకం లో నే మన వల్ల అలా ఇలా సంచారం చెయ్యడం కనా కష్టం గా ఉందే, ఈ నారదుల వారు, మన ప్రియతమ గురువులు ఈలా త్రిలోకాలు ఎలా సంచారం చేస్తారబ్బా అని తెగ సందేహం వచ్చేది.

నా ఆ ఆలకింపులను మన్నించి ఆ సామి నా కు ఈ జన్మ లోనే ఈ విషయాన్ని అర్థం చేసు కోవడానికి ఒక సదవకాశం ఈ 'e' లోకం లో ఇచ్చాడు !

అదేమిటంటారా , ఈ బ్లాగు లోకం లో వచ్చినప్పుడు అలా అప్పుడు అప్పుడు రాసే వారము. ఆ పై మా మన మోహనుల వారు, జిలేబీ, నువ్వు వనారణ్యాలని ఏలింది చాలు గాని, నీకు రిటైర్మెంటు ఇచ్చితి మీ బో అని ఇంటికి తరిమేక, అప్పటి దాకా హై వోల్టేజీ లో పనిచేసిన జిలేబీ, లో వోల్టేజీ కి వచ్చింది.,

మా జంబూనాధన్ కృష్ణ స్వామీ అయ్యరు గారు కూడా, ప్లేటు ఫిరాయించి, జిలేబీ, నీకు ఉన్న ఉద్యోగం అయిపోయే, కాబట్టి మళ్ళీ కిచను నువ్వే చూసుకో అని వారూ వంట గదికి పదవీ విరమణ చేసేరు.

వంట గది లో నే  లాపు టాపు పెట్టి, ఆవ్వాల్టి వంట లకి అవ్వాళే రెసిపీ లు ఇంటర్నట్ లో కనిబెట్టి దానితో బాటు టపాలు బర బర గీకేసి, కామెంటు కారాలు మిరియాలు రుబ్బి వంట చేసేది జిలేబీ.,

హాశ్చర్యం గా అప్పుడప్పుడు బ్లాగు లోకం లో సీనియర్స్ మేము అలాగా గూగుల్ బజ్జు లో ఈ లా బజ్జామండీ అని అంటే curiosity killed the cat చందాన అప్పుడే తెలుసుకున్నా బ్లాగు లోకం గాక మరో బజ్జు లోకం కూడా వున్నదని అందులో కూడా ఇక్కడి వాళ్ళు అక్కడ, అక్కడి వాళ్ళు ఇక్కడ సంచారం చేస్తూ ఉంటారని.

హవ్వా, ఈ మల్టీ లోక సంచార పాసిబిలిటి ఉండటమన్నది మన పురాణ కాలం లోనే వుందబ్బా అని నేను తెగ మురిసి పోయాను.

ఆ పై బజ్జు లు మూట కట్టి నాయని జన సందోహం బ్లాగు లోకం లోకి వచ్చారు కొంత కాలం బాటు.

ఆ తరువాయి మరో లోకం ఇప్పుడు పాపులర్ అయి పోయినట్టుంది! అదియే గూగల్ ప్లస్సాయనమః !

ఈ లోకం లో చాలా వేడిగా, వాడిగా గబ గబ కామెంటు చెండులు చేతులు మారుతున్నాయని జిలేబీ లు చుడుతున్నారని, చప్పట్లు గల గలా పారుతున్నా యని అప్పుడప్పుడు ఆ లోక సంచార వాసులు ఈ బ్లాగ్ లోకం లో తెలియ చేస్తూ, కాకుంటే వాటి గురించి ఉత్సుకతని ని కలిగిస్తున్నారు !

 సో, త్రిలోక సంచార వాసులారా ( భూలోక, బ్లాగ్ లోక, ప్లస్ లోక,...) మనమందరమూ,  పురాణ కాలం లో తెలిపిన మల్టీ లోక సంచారాన్ని మన జీవన కాలం లో అనుభవైక వేద్యం గా చవి చూస్తున్నామని దీని వల్ల గ్రహించ వలె !

అన్నీ మన పురాణాల్లోనే ఉన్నాయష !

చీర్స్
జిలేబి.

Thursday, March 1, 2012

ఆచంగ గారి ప్రశ్నలు - జిలేబీ జవాబులు !

ఆచంగ గారి ప్రశ్నలు - జిలేబీ జవాబులు !

1. మగాడు ఉద్యోగం చెయ్యకుండా ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటే ఆడువారికి సమ్మతమేనా?

తెగేసి నో. మా రాజ్యం లో tresspassers are liable to be prosecuted !

కాదూ, కూడదు, చెయ్యాలని ఆరాట పడితే సమ్మతం. Not instead of ఉద్యోగం but together with outside ఉద్యోగం ఇంట్లో పిల్ల లని చూసుకునే సద్యోగం కూడాను. (ఒకటి చేస్తే ఇంకోటి ఫ్రీ అన్న మాట !)

2. ఆడపిల్లలే అనే కారణం చేత స్కూల్లో తన్నులనుండి ఆఫీసుల్లో బాస్ తిట్లవరకూ మినహాయింపులు పొందటం లేదా? మగవారికలాంటి అవకాశమే ఉండదు. అతను పోరాడాల్సిందే.

అబ్బాయ్, చేసుకున్న వారికి చేసుకున్నంత! ఆ మినహాయింపులు మా జన్మహక్కు! ఆలాంటి అవకాశం అందరికీ రాదు. Its reserved for 50 percent category only! ఈ రీజేర్వషన్ కావాలని ఆశ పడితే మా  కొండ దేవరని చాలా తీవ్రం గా ప్రార్థించ వలె మరు జన్మ లో నైనా ఆడ జన్మ గా పుట్టించు స్వామీ అని. ఫో, నీ తంటాలు పడు అని మా కొండ దేవర ఒకింత కరుణ చూపితే, గీపితే, ఆ పై ఆడ జన్మ లభ్యమై తే, ఈ సౌకర్యాలు తో బాటు కొన్ని కష్ట నష్టాలు ఫ్రీ గా వచ్చును! వాటిని భరించ వలసి ఉండును!!!

3. తలకిందులుగా తపస్సు చేసినా మగాడు బిడ్డని కనలేడు. అలాంటప్పుడు మగాడే స్త్రీ రక్షణ, పోషణ బాధ్యతలు తీసుకున్నప్పుడు ఆడువారు పిల్లల పెంపకం చూసుకోవటానికి వచ్చిన బాధేమిటి?

నిన్ననే రాసాను - ఈ తలకిందులుగా తపస్సు చేసినా మగాడు బిడ్డని కనలేడు విషయం పై:
స్త్రీ వాది సంఘం జరిపిన కలియుగ
'పుత్రికామేష్టి' యాగ విచిత్రము జూతము రారె!
ఈ యాగ మహత్వము వశమున
భార్యకు మీసముల్ మొలిచె, బాపురె భర్తకు గర్భమాయెనే!

ఆయ్, మగాడే స్త్రీ రక్షణ , బాధ్యతలు తీసుకోవాలి. మేము మా జంబు వారిని కాఫీ ఆర్డర్ ఇచ్చి బుట్ట బొమ్మ గా కూర్చుంటాము! అంతే. మా టేబల్ కి కాఫీ  రావలె. ఆడు వారు పిల్ల ల పెంపకం అనగా, అయ్యవారు, పిల్లలని బాగుగా తయారు చేసి , జిలేబీ, అబ్బాయి , అమ్మాయి రెడీ అనగా వెంట నే వారిని షికారు కి తీసుకుని వెళ్లి , 'వారిని చూడండి , ఎంత ముద్దుగా పిల్లలని రెడీ చేసి షికారు కి తీసుకెళ్తున్నారో !' అని క్రెడిట్ కొట్టెయ్యడం మా గట్టి దనం!

4. ఒక ఆడది ఏడాదికి పాతిక లక్షలు సంపాదించగలిగినప్పుడు, యాభై లక్షలు సంపాదించే ప్రేమించనివాడిని చేసుకోవటమెందుకు? పనీపాటా లేకుండా  ప్రేమించటమే పనిగా పెట్టుకున్నవాడినికి ఒకణ్ణి చేసుకోవచ్చుగా?

అబ్బాయి, పాత కాలం లో వున్నట్టున్నావ్. డబ్బెవరికి చేదు పిచ్చోడా అని జంధ్యాల గారి చిత్రం లో అనుకుంటా ఒక పాట వుంది. కావున... పాతిక లక్షలు వున్నా యాభై పై కన్నులు వెయ్యడం (eye throwing) అనునది ఆడువారి సహజ నైజం ! ఒక కిలో బంగారం కన్నా రెండు కిలోల బంగారం ఎక్కువ అన్నది చాలా సింపల్ మాథ మే ట్రిక్ !!

5. సాధించి చట్లో పెడుతున్నది అత్తా-ఆడపడుచులైనప్పుడు దానికి మగాడిని పూర్తిగా బాధ్యుడిని చెయ్యటం ఎంతవరకూ సబబు? అత్తలు, ఆడపడుచులూ ఆడువారేకదా!

మానేజ్మెంటు  ఫండా ప్రకారం ప్రతి వ్రతం తప్పిన ప్రాజెక్టు కి ఒక scapegoat (తెలుగు లో బకరా అందురు) ఉండవలె. ఆ ప్రకారంబు గా...,

7. మగాడి తన్నుల గురించి మాత్రమే మాట్లాడేటప్పుడు ఆడువారి సణుగుడు గురించి అసలు బయటకు రాదెందుకు? (సుప్రీం కోర్టు ఆడువారి సణుగుడుని మానసిక హింసగానే పరిగణించాలని తీర్పు చెప్పింది).

సణుగుడు సైలంటు రెవల్యూషన్! తన్నులు పోలీసు జులుం. రెండిటి కి వున్న వ్యత్యాసం అది ! మీడియా  వాడికి మసాలా కావాలి. సైలెంటు వాడికి నప్పుదు!

చీర్స్
జిలేబి.